పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు… దానికి అసలు కారణం ఇదే.!

పక్షులు కరెంటు తీగపై కూర్చున్నా ఏమీ కాదు… దానికి అసలు కారణం ఇదే.!

by Megha Varna

Ads

మనం తరచూ కరెంటు వైర్ల మీద కూర్చునే కాకులు, పిట్టల్ని చూస్తుంటం వీటికి షాక్ కొట్టదా? అనిపిస్తుంటుంది మనలో చాలా మందికి ఈ ప్రశ్న ఎవరికైనా పెద్దవారికి వేస్తే వారు చెప్పే సమాధానం మనకు తృప్తినివ్వదు. కరెంటు వైర్ల మీద కూర్చునే పక్షులకి షాక్ కొట్టదు! అందుకు రెండు కారణాలున్నాయి. అవేంటంటే….సాధారణంగా మన ఇంటికి వచ్చే కరెంట్ తీగలు 4 ఉంటాయి. అందులో 3 తీగల్ని ఫేజులు అని, ఒకదాన్ని న్యూట్రల్‌ అనీ అంటారు. ఒక ఫేజు తీగకు, మరో ఫేజు తీగకు మధ్య, ఒక ఫేజు తీగకు, న్యూట్రల్‌ తీగకు మధ్య విద్యుత్‌ పొటన్షియల్‌ ఉంటుంది.

Video Advertisement

ఒక వ్యక్తిలోగానీ, వస్తువులో కానీ, జంతువులోగానీ విద్యుత్‌ ప్రవహించాలంటే దానికి అటూ ఇటూ విద్యుత్‌ పొటెన్షియల్‌ తేడా ఉండాలి. అంటే ఒక వ్యక్తికి షాక్‌ కొట్టాలంటే ఏకకాలంలో కనీసం రెండు తీగలతో అనుసంధానం ఉండాలి. అప్పుడు అధిక పొటెన్షియల్‌ ఉన్న తీగలోకి, అల్ప పొటెన్షియల్‌ ఉన్న తీగ నుంచి ఎలక్ట్రాన్లు ఆ వ్యక్తి ద్వారా ప్రయాణిస్తాయి.

ఇలా ఎలక్ట్రాన్లు శరీరంలో ప్రవహిస్తేనే ప్రమాదం. మనుషులు కూడా కేవలం ఒకే తీగను పట్టుకుని వేలాడితే ఏమీ కాదు. నేలను చెప్పుల్లేకుండా తాకితేనో, లేదా రెండు వైర్లను ఏకకాలంలో తగిలితేనో ప్రమాదం. పక్షుల విషయానికి వస్తే అవి ఒకే సమయంలో 2 తీగలపై వాలవు. కాబట్టి వాటి దేహం ద్వారా విద్యుత్‌ ప్రవహించదు. పొరపాటున అది అటొక కాలు, ఇటొక కాలు ఒకేసారి పెడితే షాకుకి గురవుతుంది. ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ.

 


End of Article

You may also like