కరోనా కరోనా ప్రజెంట్ ఎక్కడ చూసిన ఇదే చర్చ. ఏ నోట విన్నా ఇదే మాట . సామాన్యుల నుంచి సెలబ్రిటీస్ వరకు అందరికి కరోనా భయం పట్టుకుంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ మిగతా ప్రపంచ దేశాలకు పాకింది. నిన్న మొన్నటి వరకు మనకూ అదే టెన్షన్ , కాకపోతే మన దగ్గర పాజిటివ్ కేసులు లేవు అనే సరికి కొంచెం ఊపిరి పీల్చుకున్నారు.తాజాగా యాక్షన్ హీరో జాకీజన్ కరోనా బారినపడ్డారిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దీనిపై స్వయంగా జాకీచానే వివరణ ఇచ్చారు.

కరోనా కేవలం మనుషులనే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తోంది. సినీ పరిశ్రమపై కూడా ఈ వైరస్ ఎఫెక్ట్ పడింది. ఇప్పటికే మన దగ్గర సినిమా హాళ్లని కొద్ది రోజులు మూసివేయాలని సినీపెద్దలు నిర్ణయం తీసుకున్నట్టు ఒక వార్త వాట్సప్‌లో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం ఏది నిజమో? ఏది అబద్దమో తెలుసుకోలేకపోతున్నారు మామూలు జనం. జాకీచాన్ కరోనా అనే పుకారు ఫస్ట్ హంకాంగ్‌లో మొదలైంది . ఇంకేం మన సోషల్ మీడియా ఉంది కదా, వద్దు బాబోయ్ అన్నా కూడా వైరల్ చేసి పడేస్తుంది. అలా వైరల్ చేసిన వార్తల్లో ఇదొకటి.

జాకీ చాన్ అంటే ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు. ఇంకేముంది వైరలైన కొద్ది గంటల్లోనే తమ అభిమాన స్టార్ త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున పరామర్శలు వెల్లువెత్తాయి. గెట్ వెల్ సూన్ అంటూ ప్రపంచం నలుమూలల నుండి సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు.

చివరకు ఈ విషయం జాకీ చాన్ వరకు వెళ్లింది. తాను బాగానే ఉన్నాను కదా..ఈ పుకారు ఎలా పుట్టింది ? అంటూ ఆలోచించారు. ఇది ఇలాగే వదిలేస్తే బాగుండదని, చివరకు ఆయన రెస్పాండ్ అయ్యారు. తాను బాగానే ఉన్నానని, తనకు కరోనా వైరస్ సోకినట్లుగా వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ ప్రకటించారు.

రామ్ చరణ్, మనోజ్, అల్లు అర్జున్, అల్లరి నరేష్ ఇలా అందర్నీ చిన్నప్పటి నుంచి చూశానని, వారంతా తనతో ఎంతో ప్రేమగా ఉంటారని చెప్పింది. ఝుమ్మంది నాదం సినిమా సమయంలో మమ్మీ అంటూ మనోజ్ గట్టిగా అరిచాడని తెలిపింది. మేజర్ చంద్రకాంత్ సమయం నుంచి మనోజ్ తనను మమ్మీ అనే పిలుస్తాడని చెప్పుకొచ్చింది. మేజర్ చంద్రకాంత్ సినిమాలో మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు . అదే చిత్రంలో సుధ మోహన్ బాబు అక్కగా నటించారు.
చిరంజీవితో సుధ ప్రయాణం గ్యాంగ్ లీడర్ సినిమా కంటే ముందు నుండి ఉంది . ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో అనేక సినిమాల్లో సుధ నటించారు. వాటిల్లో ఆమెలో సుధ పోషించిన పాత్రకి అభినందించకుండా ఉండలేం, కోడల్ని హింసిస్తున్న భర్త కోటాశ్రీనివాసరావుని చంపే సీన్లో సుధలోని మరోయాంగిల్ నటన చూడొచ్చు. అప్పటి వరకు సౌమ్యమైన పాత్రలు పోషించిన సుధ , ఆ పాత్రతో తనలోని రౌద్రాన్ని చూడొచ్చు.



























“క్యారవాన్ల వల్ల షూటింగ్ దినాలు పెరిగిపోయాయి . వీటికోసం నిర్మాతలు కోట్లల్లో ఖర్చుపెడుతున్నారు.నటీనటులు ఈ పద్ధతి మార్చుకోవాలని , తాను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని, అంతేకానీ సీన్ అయిపోగానే అందులోకి వెళ్లిపోవడంలాంటివి చేయను” అని చిరంజీవి కామెంట్స్ చేశారు .”చిరంజీవిగారు చెప్పింది నూటికి నూరు పాళ్లు నిజం” అని నటి కవిత సీరియస్ గా స్పందించారు .









