ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బేబి. ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ వసూళ్లను సాధించి, రికార్డ్స్ ను సృష్టించింది. ఇక ఈ మూవీలో నటించిన నటీనటులకు మంచి గురింపు లభించింది. అయితే మూవీ చివరలో హీరోయిన్ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు. మరి అతను ఎవరో ఇప్పుడు చూద్దాం..
బేబీ మూవీకి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చింది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉండి, ఎన్నో సినిమాలలో నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో వచ్చిన నటీనటులు చాలామంది ఉన్నారు. వారి గురించి మూవీ రిలీజ్ అయిన సమయంలో వైరల్ కూడా అయ్యారు. కానీ మూవీ క్లైమాక్స్ లో వైష్ణవి చైతన్య పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు అనేది మాత్రం చాలా రోజుల వరకు తెలియలేదు. ఆ పెళ్లికొడుకు సెకన్లపాటే కనిపించినా బాగా వైరల్ అయ్యాడు.
ఆ అభాగ్యుడు ఎవరు? అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వచ్చాయి. అయితే బేబిని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరో ఫైనల్‌గా తెలిసింది. ఆ నటుడి పేరు మల్లిడి కృష్ణ. తన నేటివ్ తూర్పు గోదావరి జిల్లా. అతను ఎవరో కాదు. బింబిసార మూవీ డైరెక్టర్ వశిష్ట సోదరుడు.
బేబీ అతని మొదటి సినిమా కాదు. ఎన్నో సినిమాలలో నటించాడు. మల్లిడి కృష్ణ కలర్ ఫోటో మూవీలో హీరో సుహాస్ కి సీనియర్ గా నటించాడు. కానీ అంతగా గుర్తింపు రాలేదు. డైరెక్టర్ సాయి రాజేష్ బేబీ మూవీలో హీరోయిన్ ను పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఇచ్చాడంట. సెకన్ల పాటు మాత్రమే కనిపించినా మల్లిడి కృష్ణకు మంచి గుర్తింపు వచ్చింది.

తక్కువ కాలంలోనే సిటీలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ డ్ర-గ్స్ వ్యవహారంలో పోలీసులకు దొరకడంతో స్థానికంగా కలకలం రేపింది. పద్నాలుగు లక్షలు విలువ చేసే డ్ర-గ్స్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వరలక్ష్మి టిఫిన్స్ ఓనర్ ప్రభాకర రెడ్డినే కాకుండా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రెడ్డి గురించిన విషయాలు వైరల్ గా మారాయి. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రభాకర్ రెడ్డి టెన్త్ క్లాస్ లోనే చదువు ఆపేశాడు. ఆ తరువాత 4 చక్రాల బండి పైన రోడ్డు పక్కన టిపిన్స్ సెంటర్ మొదలు పెట్టాడు.
బాగా నడవడంతో తన వ్యాపారాన్ని విస్తరించాడు. ఆ తరువాత 2017లో ప్రకాశం జిల్లా నుండి వ్యాపారం చేయడం కోసం హైదరాబాద్‌కు షిఫ్ట్ అయ్యాడు. గచ్చిబౌలి లోని డీఎల్ఎఫ్లో వరలక్ష్మి టిఫిన్స్ పేరుతోనే చిన్నగా టిఫిన్ సెంటర్ మొదలుపెట్టాడు. అక్కడి టిఫిన్స్ రుచి, క్వాలిటీ బాగుండటంతో పెద్ద సంఖ్యలో జనాలు వచ్చేవారు. అలా వరలక్ష్మి టిఫిన్స్ ఫేమస్ కావడంతో ఇక్కడి టిఫిన్ కోసం జనాలు క్యూ కట్టేవారు. లాభాలు పెరగడంతో, పలు చోట్ల బ్రాంచీలను మొదలు పెట్టాడు.
వరలక్ష్మి టిఫిన్స్ ప్రస్తుతం సిటీలో 10 బ్రాంచీలు ఉన్నాయి. ఫుడ్ యాప్స్ లో కూడా వరలక్ష్మి టిఫిన్స్ కు మంచి రేటింగ్ ఉంది. ప్రతి సెంటర్ నుండి నిత్యం లక్షల్లో ఆదాయం వస్తున్నట్టు తెలుస్తోంది. అలా ప్రభాకర్ రెడ్డి సామాన్యుడి నుండి రోజుకు లక్షకు పైగా సంపాదించే రేంజ్ కి ఎదిగాడు. ఆదాయం బాగా రావడంతో మెల్లగా జల్సాలకు, పబ్ లకు, పార్టీలకు అలవాటుపడ్డాడు. ఆ క్రమంలోనే డ్ర-గ్స్‌కు, ఇతర వ్యసనాలకు బానిస అయిన ప్రభాకర్ రెడ్డి, పగలంతా వరలక్ష్మి టిఫిన్స్, రాత్రి అయితే డ్ర-గ్స్ దందా చేసేవాడు. ఈ క్రమంలోనే తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు.
విజయలక్ష్మి చెన్నై లో జన్మించింది. ఆమె బెంగళూరులో చదువుకుంది. 1997లో ‘నాగమండలం’ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్‌కు జంటగా నటించింది. తొలి మూవీతోనే ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకుంది. ఆ తర్వాత వరుస చిత్రాలలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా మారారు. తమిళంలో కూడా పలు సినిమాలలో విజయలక్ష్మి నటించింది. తెలుగులో హనుమాన్ జంక్షన్ మరియు పృథ్వి నారాయణలో నటించారు. ఒక మలయాళ మూవీలో మోహన్‌లాల్‌తో కలిసి నటించింది. ఆమె కెరీర్లో సుమారు 40 చిత్రాలలో నటించింది.
పలువురు స్టార్ హీరోల పక్కన హిరోయిన్ గా నటించిన విజయలక్ష్మి, తమిళ నటుడు, దర్శకుడు మరియు నామ్ తమిళర్ కట్చి పార్టీ అధినేత అయిన సీమాన్ పై ఫిబ్రవరి 2020లో తీవ్రమైన ఆరోపణలు చేశారు. అతను తనను వివాహం చేసుకుంటానని చెప్పి, మోసం చేశాడని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఆ తరువాత సీమాన్ వేధింపులు భరించలేక 2020 లో బలవన్మరణానికి కూడా పాల్పడింది. ఈ క్రమంలోనే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలతో విజయలక్ష్మి కష్టాలు పడుతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవలే విజయలక్ష్మి మరోసారి సీమాన్ పై ఆరోపణలు చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకుని, ఏడు సార్లు సీమన్ బలవంతంగా అబార్షన్ చేయించినట్టు విజయలక్ష్మి ఆరోపించింది. అది మాత్రమే కాకుండా తన నగలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. న్యాయం చేయమని అడిగితే చంపేస్తానని వార్నింగ్ ఇచ్చారని సీమన్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకుని, సీమాన్‌ను విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు.





ఇంకా ఆ సమయంలో శ్రీకాంత్ అసోసియేట్ కిషోర్ వేరే యాక్టర్ ఎందుకు.. నువ్వే ఈ పాత్ర చేయవచ్చు కదా అని అన్నాడు. అయిన శ్రీకాంత్ ఒప్పుకోలేదు. కానీ కిషోర్ బలవంతం చేయగా చివరికి శ్రీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.


నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ మూవీ నిరాశపరిచింది. తరువాత తనకు ప్రేమమ్ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సినిమాను ప్రకటించారు. నిర్మాత
సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ పాత్రలో నాగ ఛైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. 2018లో గుజరాత్ విరావల్ నుండి చేపల కోసం వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో పాక్ చెరనుండి ఆ మత్స్యకారులు బయటబడ్డారు. ప్రస్తుతం ఆ స్టోరీని ఆధారంగా తీసుకునే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో కె మత్స్యలేశంకు చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు ఒకరు. గుజరాత్ నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన రామరావు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి, పాకిస్థాన్ లో రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడి నుండి ఎలా బయటికి వచ్చాడు అనే కథ ఆధారంగానే చందూ మొండేటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్ళి, మత్స్యకారులతో మూవీ యూనిట్ చర్చించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన కన్నడ సినిమా సప్త సాగరదాచె ఎల్లో. ఈ మూవీ అందమైన ఎమోషనల్ ప్రేమకథ అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే, మను (రక్షిత్ శెట్టి) శేఖర్ గౌడ (అవినాష్) అనే బడా వ్యాపారవేత్త దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మను లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) గాయని కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న మను, ప్రియలు వివాహం చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే ప్రియకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.
మను ఓనర్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు శేఖర్ గౌడ పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, త్వరగా జైలు నుంచి విడిపిస్తానని మనుకి హామీ ఇవ్వడంతో, మను యాక్సిడెంట్ తానే చేసినట్టుగా ఒప్పుకుని జైలుకు వెళతాడు. ప్రియ ఎంత వారించినా వినకుండా, వచ్చిన డబ్బుతో తమకోసం ఇల్లు కట్టుకోవచ్చని ప్రియకు చెప్పి జైలుకు వెళ్తాడు. కానీ అతను జైలుకి వెళ్ళాక బెయిల్ దొరకకపోగా, గుండెపోటుతో శేఖర్ గౌడ మరణిస్తాడు.
మను బయటికి వచ్చాడా? మనును జైలు నుంచి విడిపించడానికి ప్రియ ఏం చేసింది? జైలులో మనుపై సోమ గ్యాంగ్ పగను ఎందుకు పెంచుకుంది? అసలు మను జైలు నుండి బయటికి వచ్చాడా? లేదా అనేది మిగిలిన కథ. మూవీ జైలు నేపథ్యంలో సాగుతుంది. చేయని నేరానికి జైలుకి వెళ్ళిన యువకుడు దాని నుండి బయటపడటం కోసమే కాకుండా తన ప్రేయసిని కలవడానికి పడే బాధను దర్శకుడు హృద్యంగా తెరపై చూపించారు.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ వికెట్ తీసిన తరువాత పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓ రేంజ్ లో ఓవరాక్షన్ చేశాడు. అతను చేసిన ఓవరాక్షన్‌కి విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇవ్వాలని ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులందరు కోరుకున్నారు. వారి కోరికను నేరవేర్చదానికి కింగ్ కోహ్లీనే కాకుండా భారత జట్టు అంతా మూకుమ్మడిగా పాక్ బౌలర్లకు మరియు బ్యాటర్లకు ఇచ్చిపడేసారు.
ఓపెనర్లుగా గ్రౌండ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు అర్థసెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్, కేఎల్ రాహుల్ 111 నాటౌట్ గా నిలిచి, పాక్ బౌలర్లను ఆడుకున్నారు. షాహీన్ అఫ్రిదీ,హరీస్ రౌఫ్, నసీమ్ షా, షబాద్ ఖాన్, ఫహీమ్ అశ్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ చేసిన ఓవర్లలో పరుగుల వర్షం కురిపించి, వన్డేల్లో పాకిస్తాన్ ఎప్పుడూ చేధించని లక్ష్యాన్ని పాక్ ముందు పెట్టారు.
పాకిస్థాన్ బ్యాటర్లకు కూడా భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నేపాల్ పై 151 రన్స్ చేసిన బాబర్ అజామ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన ఫఖార్ జమాన్ చేసిన 27 రన్స్ పాకిస్థాన్ బ్యాటర్లు చేసిన అత్యధిక స్కోర్ అంటే భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. కుల్దీప్ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మ్యాచ్ లో ఓవరాక్షన్ చేసిన పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్ తో ఆడుకుంటున్నారు.