ఉపవాసం అంటే ఆహారం తీసుకోకపోవడం. అయితే చాలా మంది కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో ఉపవాసం చేస్తుంటారు. పండుగల, పర్వదిన సమయంలో ఉపవాసం చేస్తుంటారు. ప్రస్తుతం చాలామంది ఆరోగ్య ప్రయోజనాల కోసం ఉపవాసం చేస్తున్నారు.
అసలు ఉపవాసం చేసినపుడు మన శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. ఫాస్టింగ్ లో ఎన్ని రకాలున్నాయి. ఫాస్టింగ్ ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తుంది. ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు. ఫాస్టింగ్ వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఉపవాసం చేయడం వల్ల శరీరాన్ని సమతుల్యం చేయడానికి దోహదపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతే కాదు ఫాస్టింగ్ ఇన్సులిన్ ఉత్పత్తిని కంట్రోల్ చేస్తుంది. మనం ఆహారం తీసుకున్న ప్రతీ సారీ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. ఇన్సులిన్ తీసుకున్న ఆహారంలో నుండి రిలీజ్ అయిన చక్కెరలను 2 రకాలుగా శరీరంలో నిల్వ చేయడానికి సహకరిస్తుంది. శరీర అవసరాలకు సరిపోయిన తరువాత మిగిలిన చక్కెరలను ‘గ్లైకోజెన్’ గా కాలేయంలో, శరీర కండరాల్లో నిల్వ చేస్తుంది. అయితే దీనికి ఒక లిమిట్ అనేది ఉంది. దానికి మించి గ్లైకోజెన్ గా మార్చలేదు.
పరిమితిని దాటిన గ్లూకోజ్ ను గ్లైకోజెన్ లా కాకుండా కొవ్వు రూపంలో లివర్ లో నిల్వ చేస్తుంది. అంతే ఇక కొవ్వు పెరుగుతున్న కొద్దీ వివిధ శరీర భాగాలలో నిల్వ చేయబడుతుంది. ఫాస్టింగ్ చేసినపుడు ఆహారం తీసుకోము కాబట్టి శరీరంలో నిల్వ చేయబడిన కొవ్వుని వాడుకుని శక్తి విడుదల అవుతుంది.
ఉపవాసంలో మూడు రకాలు ఉన్నాయి..
1. 5:2 ఆహారం అంటే ఈ ఉపవాసం చేసేవారు వారానికి 5 రోజులు ఆహారం తీసుకుంటారు. మిగతా 2 రోజులు ఫాస్టింగ్ చేస్తారు.
2. 16:8 ఫాస్టింగ్ ఈ పద్ధతిలో ఒకేరోజులో 8 గంటలలోపు ఆహారం తీసుకుని, మిగతా 16 గంటల పాటు ఉపవాసం ఉండాలి. దీనిని ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారు.
3. 18:6 ఫాస్టింగ్ ఈ పద్ధతిలో 6 గంటలలోపు ఆహారం తీసుకుని, 18 గంటలు ఫాస్టింగ్ చేస్తారు.
ఆరోగ్య ప్రయోజనాలు:
- ఉపవాసం చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావని, లైఫ్‌స్పాన్ పెరుగుతుందని ఓ పరిశోదనంలో వెల్లడించింది.
- బరువు తగ్గించే ప్రక్రియను పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఉపవాసం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుందని బరువు తగ్గుతారు.
- మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచి, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఉపవాసం చేస్తే హైపర్‌టెన్షన్ నియంత్రణలో ఉంటుంది. ట్రైగ్లిజరైడస్ స్థాయులు తగ్గి, గుండెకు మేలు చేస్తాయి.
- ఉపవాసం వల్ల శరీరంలోని ఇన్సులిన్ ను గ్రహించే స్వభావం మెరుగవుతుందని, రక్తంలో గ్లూకోజ్ నిల్వల పై నియంత్రణ పెరిగి, టైప్ టూ డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
- ఉపవాసం చేయడం వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది.
- ఉపవాసం చేయడం వల్ల శరీరంలోని కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతుంది. దానివల్ల క్యాన్సర్ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది.
- ఉపవాసం ఉన్నవారిలో రక్తపోటు స్థాయిలు తగ్గుతాయి. ఎందుకంటే ఫాస్టింగ్ పారాసింపథెటిక్ కార్యకలాపాలను పెంచుతుందని పతద్వారా రక్తపోటును తగ్గించడంలో సాయపడుతుంది.
- ఫాస్టింగ్ వల్ల శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.
- శరీరంలోని విషపదార్థాలు తొలగించబడుతాయి.
ఫాస్టింగ్ ఎవరు చేయకూడదు.. - ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నవారు.
- గర్భవతి లేదా పాలిచ్చే తల్లులు.
- 65 ఏళ్ల వయసు పైబడిన వారు.
- చిన్నపిల్లలు
- తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు.
- మందులు వాడేవారు.Also Read: జీడిపప్పు ఎవరు తినచ్చు? ఎవరు తినకూడదు? షుగర్, హార్ట్ ప్రాబ్లెమ్ ఉంటే తినకూడదా..?

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫిషియల్ గా ‘దేవర’ టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూసినప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు. టైటిల్ చాలా బాగుందని, తారక్ కి సెట్ అవుతుందని ఆనందపడుతున్నారు. అయితే ఈ మూవీ స్టోరీ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం ఈ చిత్రంలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. అయితే ఈ చిత్రంలో యంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ నిడివి తక్కువగా ఉంటుందంట. ఆ పాత్ర తండ్రి పేరే దేవర ( ఎన్టీఆర్) అని తెలుస్తోంది.
ఇక సినిమా కథ మొత్తం దేవర పాత్ర చుట్టూ తిరుగుతుందని, మూవీలో ఎక్కువ భాగం దేవరనే ఉంటాడంట. అయితే ఈ చిత్రంలో జాహ్నవి కపూర్ తండ్రి దేవర పక్కన హీరోయిన్ గా నటిస్తుందా? లేదా యంగ్ ఎన్టీఆర్ కి హీరోయిన్ గా నటిస్తుందా అనేది తెలీదు. జాహ్నవి కపూర్ ఒకవేళ యంగ్ ఎన్టీఆర్ కి జంటగా చేస్తే, సినిమాలో జాన్వీ కపూర్ తక్కువ టైం ఉంటే మూవీకి మైనస్ ఏమైనా అవుతుందా అని నెటిజనులు అనుకుంటున్నారు. ఎన్టీఆర్ రోల్ ఈ మూవీలో డబల్ అయితే జాన్వీ కపూర్ ఏ పాత్రకి హీరోయిన్ గా చేస్తుందనేది తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఆతృత పడుతున్నారు.
ఇదిలా ఉండగా కొరటాల శివ దేవర పాత్రను అద్భుతంగా షూట్ చేస్తున్నాడట. సముద్రం ఒడ్డున జీవించేవారికి అండగా ఉండి, ధైర్యాన్ని ఇచ్చే పాత్ర దేవర అని టాక్. పోస్టర్ లో కనిపిస్తున్న ఎన్టీఆర్ ఫోజు ఇంటర్వెల్ బ్యాంగ్ అని అంటున్నారు. ఇక ఈ మూవీలో మొదట్లో యంగ్ ఎన్టీఆర్ కనిస్తారని, ఆ తర్వాత తండ్రి ‘దేవర’ క్యారెక్టర్ ను పరిచయం చేస్తాడట. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలలో విలన్స్ సముద్రం తీరాన ఉన్న పేదవారిని హింసిస్తుంటారట.
ఆ సమయంలో దేవర పాత్ర ఎంట్రీ ఇచ్చి, అందరిని తరిమి తరిమి చంపుతాడంట. అలా చంపే క్రమంలో దేవర పై రక్తం పడుతుందని, రక్తంతో అలాగే నిలబడి ఉన్న స్టిల్ తోనే విరామం వస్తుందని నెటిజనులు ఎవరికి నచ్చిన కథను వాళ్ళు చెప్తున్నారు. ఈ మూవీ ఒక రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.
భైరవకోన ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని కొత్తపల్లి అనే గ్రామానికి సమీపంగా వుంది. కొత్తపల్లి నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పుణ్య క్షేత్రం కలదు.చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రవేత్తల ప్రకారం, భైరవకోన ఆలయ చరిత్ర 7వ శతాబ్దానికి చెందినది. ఆలయానికి సంబంధించిన స్థల పురాణం ఏమిటంటే, ఒకప్పుడు కాల భైరవుడు ఈ ప్రాంతాన్ని పాలించాడని అందువల్లనే దీనికి భైరవకోన ఆలయం అని పేరు వచ్చిందని అంటారు. కాల భైరవుడు ఈ ప్రదేశానికి కాపలాగా ఉంటాడని చెబుతారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారిగా పురాతన హిందూ దేవాలయాలు కనుగొన్నది భైరవకోనలోనే. ఇక్కడ 8 హైందవ దేవాలయాలున్నాయి. పల్లవరాజులు ఈ శివాలయాలను అద్భుతంగా నిర్మించారు. కొండల్ని గుహాలయాలుగా మలచటం పల్లవరాజుల కాలంలోని గొప్ప కళ. ఇక ఈ గుహల గోడల పైన పల్లవుల కాలంలోని అనేక శిల్పకళలను చూడవచ్చును. వీటిని పల్లవ శిల్పులు అయిన దేరుకంతి, శ్రీశైలముని వంటివారు భైరవకోన క్షేత్రాన్ని మలిచినట్టుగా చరిత్ర చెబుతోంది. ఒకే కొండలో 8 ఆలయాలు, వాటి చుట్టూ ఎటు చూసినా నల్లమల అడవులు 8 ఆలయాలలో దేవుళ్ళు శిలా రూపంలో దర్శనమిస్తారు.
ఇక్కడ ఒకే కొండలో 8 ఆలయాలు చెక్కిన విధానం ఎంతో అపురూపంగా ఉంటుంది. అన్నీ శివాలయాలు. అవి శశినాగ, రుద్రేశ్వర, నగరికేశ్వర, విశ్వేశ్వర, మల్లికార్జున, భార్గేశ్వర, రామేశ్వర, పక్షమాలిక లింగ. ఇందులో 7 దేవాలయాలు తూర్పుముఖానికీ ఉండగా, ఒకటి దేవాలయం మాత్రం ఉత్తర ముఖంగా చెక్కబడ్డాయి. ఆలయాలలోని శివలింగాలను మాత్రమే గ్రానైట్ శిలలతో చెక్కారు. ఇక్కడ త్రిమూర్తులను ఒకే ఆలయంలో పూజిస్తారు. శివలింగం మధ్యలో ఉండగా గుహ గోడల పై ఒకవైపు గోడ పై బ్రహ్మ, మరొక వైపు గోడ పై విష్ణువులు శిల్పారుపాలలో ఉన్నారు.
శివాలయాలన్నీ పై వరసలో ఉండగా, కింద ఉండే ఆలయంలో త్రిముఖ దుర్గ, శివలింగం పూజలు అందు కుంటున్నాయి. దుర్గ దేవి ఆలయంలో దుర్గాదేవి మూడు ముఖాలతో ఉంటుంది. దుర్గాదేవి కుడివైపున మహాకాళి ముఖం, నోట్లోంచి జ్వాల వస్తున్నట్టుగా వుంటుంది. మధ్యన మహాలక్ష్మి, ప్రసన్నమైన ముఖం. ఎడమవైపున ముఖం సరస్వతీదేవి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ సరస్వతీ దేవి అద్దం చూసుకుంటూ కనిపిస్తుంది.
అమ్మవారి విగ్రహం పైన కార్తీకపౌర్ణమి రోజున చంద్ర కిరణాలు పడటం భైరవకోన మరో విశేషం. ప్రతి ఏడాది కార్తీక పౌర్ణమి రోజున చంద్ర బింబం, దుర్గ ఆలయాలనికి 3 అడుగుల కింద ప్రవహించే సెలయేటిలో పడి, ఆ చంద్ర కిరణాలు దుర్గాదేవి విగ్రహం పై పడుతాయి. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకు తరలి వస్తారు.
1.హైయ్యేస్ట్ పార్టనర్ షిప్ (229 ):
2. అత్యధిక ఐపీఎల్ స్కోర్(263/5):
3. అత్యధిక వ్యక్తిగత స్కోరు(175 ):
4. అత్యధిక సెంచరీలు(16):
5. IPL ఒక సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్(973 ):
6. ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు (17)
7. ఒకే ఫ్రాంచైజీకి అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్ (237)
అంతేకాకుండా 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు అదే జట్టుకు ఆడిన ఏకైక ప్లేయర్ విరాట్ కోహ్లీ. 15 ఏళ్ల నుండి కోహ్లీ ఆర్సీబీ ఐపీఎల్లో ప్రతి సీజన్ లో ఆడాడు. కోహ్లి కనిపించినంతగా మరే ఇతర ఆటగాడు అదే జట్టులో కనిపించలేదు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 204 మ్యాచ్‌లు ఆడిన మహేంద్ర సింగ్ ధోని రెండవ స్థానంలో ఉన్నాడు.
తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దేవర’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ఏడాది డిసెంబర్ వరకు పూర్తి కానుందని తెలుస్తోంది. ఇక తారక్ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వచ్చే చిత్రం 2024 మార్చి నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం. ఈ విషయం పై మేకర్స్ నుండి అధికారి ప్రకటన వచ్చింది. తారక్ పాన్ ఇండియా చిత్రాలలో పాన్ ఇండియా దర్శకుల చిత్రాలలో నటిస్తున్నారు.
తారక్ బాలీవుడ్ వార్2 చిత్రంలో నటిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజున బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ విషెస్ తెలుపుతూ చేసిన ట్వీట్ ద్వారా ఎన్టీఆర్ వార్ 2 లో నటిస్తున్నట్టుగా క్లారిటీ వచ్చేసింది. దీంతో ఎన్టీఆర్ – హృతిక్ రోషన్ కాంబో నెక్స్ట్ రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు మాస్ ఆడియెన్స్ తో పాటుగా యూత్ లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ నెగిటివిటీని ఏమాత్రం పట్టించుకోకుండా కెరీర్ లో ముందుకెళ్తున్నారు.
గత ఏడాది ఇండియన్ రైల్వే ప్రయాణికులకు కొత్త రూల్స్ ను ప్రకటించింది. రైలులో ప్రయాణం చేసే సమయంలో ప్రయాణికులు ఈ రూల్స్ ను తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాలి. తరచూగా రైలులో ప్రయాణం చేసేవారు, రైలు లో లాంగ్ జర్నీ వెళ్లాలనుకునేవారు ఈ రూల్స్ ను తప్పనిసరిగా పాటించాలి. ఇండియన్ రైల్వే తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా తమ ప్రయాణాన్ని కొనసాగించాలానే ఉద్దేశ్యంతో ఈ రూల్స్ ను ప్రవేశ పెట్టింది.
ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణం చేసేవారికి ఈ రూల్స్ ఎక్కువగా వర్తిస్తాయి. ఈ కొత్త నియమనిబంధనలు పాటించనట్లయితే ప్రయాణికులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో బెర్త్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిసారీ అనుకున్న ప్రకారం సీటు దొరకకపోవచ్చు. ఇక రైలులో మిడిల్ బెర్త్ దొరికితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిజానికి లోయర్ బెర్త్‌లు ఉన్న ప్రయాణికులు అర్థరాత్రి వరకు కూర్చుంటారు. అటువంటి పరిస్థితిలో, మిడిల్ బెర్త్ కలిగిన ప్రయాణికుడు తప్పనిసరిగా మిడిల్ బెర్త్ నియమాన్ని తెలుసుకోవాలి.
మిడిల్ బెర్త్ రూల్:
మన పితృస్వామ్య వ్వవస్థ కుటుంబంలో అల్లుడూ, కోడలు ఇద్దరూ వేరే కుటుంబాల నుండి వచ్చినప్పటికీ, కోడలికి కుటుంబ బాధ్యతను, అల్లుడికి అయితే హోదా ఇచ్చింది. ఇక ఇల్లరికం వెళ్ళిన అల్లుడు అయితే బాధ్యతలో కోడలితో సమానంగా చూస్తారు. అందువల్లనే ఇల్లరికపు అల్లుడిని ఇంటికి పెద్ద పాలికాపు అని అంటారు. సాధారణంగా ఎవరింటి కైనా వెళ్ళినపుడు అతిథి పాటించే నియమాలన్నీ కూడా అల్లుడికి అత్తవారింటికి వెళ్ళిన సమయంలో వర్తిస్తాయని చెప్పచ్చు.
జెమినీ మ్యూజిక్ ‘ఆదిత్య టీవీ’ గా మొదలు అయినప్పటి నుండి ఆ ఛానెల్ లో రాత్రి 10 గంటలకు వచ్చే ‘వెన్నెల’ షోకి జయతి సుమారు 10 ఏళ్ల పాటు యాంకరింగ్ చేసింది. కాలర్స్‌తో మాట్లాడుతూ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఆమె మాటల కోసమే వెన్నెల ప్రోగ్రామ్ చూసేవారంటే ఆ రోజుల్లోనే ఆమెకు ఎంత క్రేజ్ ఉండేదో చెప్పనవసరం లేదు.
ఆ తరువాత తొలిసారి హీరోయిన్గా ‘లచ్చి’ అనే చిత్రంలో నటించింది. దీనికి నిర్మాత కూడా జయతినే. ఆ మూవీ ఆశించినంత విజయం సాధించలేదు. ఇక ఆ తరువాత ఆమె మళ్ళీ కనిపించలేదు. చాలా గ్యాప్ తరువాత జయతి రీసెంట్ గా ఓ ప్రైవేట్ ఆల్బమ్‌తో ఆడియెన్స్ ని పలకరించింది. ఈ పాటలో జయతి తన హావ భావాలతో, మూమెంట్స్‌లో ఆకట్టుకుంది.
జయతి విజన్స్ సమర్పణలో వచ్చిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందించారు. కాస్లర్ల శ్యామ్ రాసిన ఈ సాంగ్ ను శ్రావణ భార్గవి ఆలపించారు. ఈ పాటను ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో జయతి కనిపించారు. ఆమె ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. ఆమె ఇన్నేళ్లకు కనిపించడంతో ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు.
తన వదిన విషయంలో ఒక మరిది చేసిన పని అందరిని షాక్ అయ్యేలా చేస్తోంది. అయితే సోషల్ మీడియాలో కొంత మంది నెటిజెన్లు అతనిపై ప్రశంసలను కురిపిస్తూ ఉన్నారు. అయితే ఆ మరిది ఏం చేశాడంటే అతను తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. షాక్ అయ్యారా? అదేంటి వదినను పెళ్లి చేసుకోవడం తప్పు. అతన్ని మెచ్చుకోవడం ఎందుకు అనుకుంటున్నారు కదా. ముగ్గురు పిల్లలు ఉన్న ఆ మహిళ భర్త మరణించడంతో పిల్లల బాధ్యత చూసుకుంటూ ఒంటరిగా బ్రతుకుతోంది. అయితే ముగ్గురు పిల్లల బాధ్యతలను తీసుకోవాలని మారిది అనుకున్నాడు
ఈ క్రమంలోనే తన అన్న భార్యను వివాహం చేసుకున్నాడు. శంబాజీ అనే వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడు. శంబాజీకి భార్య, ఎనిమిది నెలల కొడుకు, ఇద్దరు కవలల ఉన్నారు. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న వదినను, అన్న పిల్లలను చూసి బాధపడిన శంబాజీ తమ్ముడు రాహుల్ వినోద్ ఒంటరిగా బ్రతుకుతున్న వదినకు తోడు ఉండడానికి, తన అన్న పిల్లల బాధ్యతలను తీసుకోవడానికి అన్న భార్యను పెళ్లి చేసుకున్నాడు. అందువల్లనే అతని పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కెరిర్లో బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సినిమాలలో ‘పసివాడి ప్రాణం’ సినిమా ఒకటి. ఈ చిత్రానికి దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి డైరెక్షన్ చేశారు. ఈ సినిమాలో విజయశాంతి, హీరోయిన్ గా నటించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించారు. కె.చక్రవర్తి ఈ సినిమాకి సంగీతం సమకూర్చారు. ఈ మూవీ 1987లో రిలీజ్ అయ్యి ఘన విజయం సాధించింది.
ప్రస్తుతం సోషల్ మీడియా ద్వారా నేరుగా అభిమాన హీరోలతో మాట్లాడడానికి అవకాశం ఉంది. కానీ అప్పట్లో అభిమానులు హీరోలకు లెటర్స్ రాసేవారు. ఇక హీరోలు కూడా తమ అభిమానులకు తన సినిమాల గురించి లెటర్స్ రాసేవారు. దానికి నిదర్శనమే మెగాస్టార్ చిరంజీవి పసివాడి ప్రాణం ముందు అభిమానులకు రాసిన లెటర్. చిరంజీవి ఆ లెటర్ లో తన సినిమాల గురించి తెలిపారు.
“ప్రియమైన అభిమానులకు గీతా ఆర్ట్స్ నిర్మించిన “పసివాడి ప్రాణం” ఈ నెల 23 న రిలీజ్ కాబోతుంది. డినిలో ఓ కొత్త తరహా క్యారెక్టర్ నటించాను. ఈ సినిమా పై మీ అభిప్రాయం తెలుపండి. రోజా మూవీస్ వారి చిత్రం 18-7-87న ప్రారంభమైనది. తదుపరి రిలీజ్ కాబోయే చిత్రం “స్వయంకృషి” రీరికార్డింగ్ జరుపుకుంటుంది.
ప్రస్తుతం అంజనా ప్రొడక్షన్స్, దేవి ఫిలిమ్స్ షూటింగ్స్ జరుగుతున్నవి. నా బర్త్ డే విషయం ఇంకా నిర్ణయించు కోలేదు. నిర్ణయించుకున్న తరువాత మీకు ఏ విషయం లెటర్స్ ద్వారా ముందుగా తెలుపబడుతుంది. ఈ లెటర్ తో పాటు అరవింద్ గారి “పసివాడి ప్రాణం” కలర్ స్టిల్ పంపుతున్నాను. ఉంటాను.. సదా మీ అభిమానాన్ని ఆశించే మీ చిరంజీవి” అని రాశారు.