సన్‌రైజర్స్ హైదరాబాద్ కి సొంతగడ్డ పై కూడా అదృష్టం కలిసిరాలేదు. 145 పరుగుల తక్కువ లక్ష్యాన్ని కూడా ఛేదించలేక ఏడు పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు చేతిలో ఓడిపోయింది.
ఈ సీజన్లో హైదరాబాద్ జట్టుకి ఇది వరుసగా ౩వ ఓటమి. ఐదు వరుస ఓటముల తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ అందుకున్న విజయమిది. వరుసగా 2 విజయాలతో ఢిల్లీ జట్టు మళ్లీ పుంజుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలో 144 పరుగులు మాత్రమే చేసింది.
ఆ తరువాత లక్ష్య ఛేదనలో భాగంగా బ్యాటింగ్ దిగిన హైదరాబాద్ జాట్ట్టు 6 వికెట్ల నష్టానికి 137 రన్స్ మాత్రమే చేసి, అపజయం పాలైంది. హైదరాబాద్ జట్టులో మయాంక్ అగర్వాల్ 49 రన్స్ చేశాడు. ఆఖరి బంతి వరకు రెండు జట్ల మధ్య హోరాహోరీగా ఆట కొనసాగింది. ఆఖరి ఓవర్లో హైదరాబాద్ జట్టు గెలుపు కోసం 6 బాల్స్ 13 రన్స్ చేయాల్సి ఉంది. సుందర్ దూకుడుగా ఆడినప్పటికీ ముఖేష్ కుమార్ ఆఖరి ఓవర్లో కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో హైదరాబాద్ జట్టు ఓటమి తప్పలేదు. సుందర్ 15 బాల్స్ లో 24 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఓపెనర్ మయాంక్ 49, హారీ బ్రూక్ 7, రాహుల్ త్రిపాఠి 15, అభిషేక్ శర్మ 5, ఆడెన్ మార్క్రమ్ త్రీ,హెన్రిచ్ క్లాసెన్ 19 బంతుల్లో 31, వాషింగ్టన్ సుందర్ 24 నాటౌట్ కాగా, మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టులో మనీశ్ పాండే 27 బంతుల్లో 34 , అక్షర్ పటేల్ 34 బంతుల్లో 34, ఓపెనర్ సాల్ట్ 0, మిచెల్ మార్ష్ 15 బంతుల్లో 25, డేవిడ్ వార్నర్ 20 బంతుల్లో 21, సర్ఫరాజ్ ఖాన్ 10, అమన్ హసీమ్ ఖాన్ 4 చేసారు.
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read: “ఇంక కప్ రెడీ చేసి పెట్టుకోండి..!” అంటూ… CSK VS KKR మ్యాచ్‌లో “చెన్నై” గెలవడంపై 15 మీమ్స్..!

రాధా కృష్ణుల ప్రేమ గురించి ఎన్నో రకాల కథలు ప్రచారంలో ఉన్నాయి. ఎనిమిది మంది భార్యలు, వేలాది మంది గోపికలు ఉన్నప్పటికీ కృష్ణుడి హృదయంలో రాధకి ప్రత్యేక స్థానం ఉంది. రాధ కృష్ణుడు తన కళ్ల ముందుకు వచ్చే దాకా తన కళ్లు తెరవననే షరతుతో వృషభానుడు ఇంట్లో జన్మిస్తుంది. అతను రాధ అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. కానీ పాప పెరిగుతున్న కళ్లు తెరవకపోవడంతో అటుగా వచ్చిన నారద మహర్షితో విషయం చెబుతాడు. రాధ జన్మ రహస్యం నారద మహర్షికి తెలిసి ఉండడటంతో యశోదనందులతోపాటుగా కృష్ణున్ని కూడా ఇంటికి పిలవమని చెబుతాడు.
వృషభానుడు నందుని కుటుంబాన్ని తన ఇంటికి పిలవడంతో కృష్ణుడితో పాటుగా అతని ఇంటికి వస్తారు. శ్రీకృష్ణుడు రాధ దగ్గరకి రావడంతో ఒకసారిగా రాధ కళ్లు తెరుస్తుంది. ఆరోజు నుండి వారిరువురూ ఎంతో సన్నిహితంగా, ఎడబాటు మెలుగుతుంటారు. బృందావనంలో కృష్ణుడు వేణు గానం చేస్తుండే రాధ తన్మయత్వంతో వింటూ ఉండేది. అలా వారు లేకుండా కొన్నేళ్ళు గడిపారు. అయితే కృష్ణుడు మేనమామ కంసున్ని చంపడానికి మధురకు వెళ్లే ముందు రాధను కలిసి తన కర్తవ్యాన్ని చెబుతాడు. విషయం అర్థం చేసుకున్న రాధ ఎంతో బాధతో కృష్ణుడికి వీడ్కోలు పలుకుతుంది.
కృష్ణుడు వెళ్ళే ముందుగా రెండు వాగ్ధానాలను అడుగుతుంది. ఒకటి రాధ మనసులో ఎప్పటికీ కృష్ణుడు మాత్రమే ఉండాలని, రెండు తన చివరి ఘడియాల్లో కృష్ణుడు తనకి దర్శనం ఇవ్వాలని చెబుతుంది. అలా కృష్ణుడి ఎటబాటుకు గురవుతుంది. కృష్ణుడు దూరం కావడం వల్ల కన్నయ్యనే ధ్యానిస్తూ రాధ ఎప్పుడూ పరధ్యానంలో ఉంటుంది. అలా రాధను చూసి ఆమె తల్లిదండ్రులు ఆమెకు ఇష్టం లేకపోయినా ఒక యధావుడి తో పెళ్లి చేస్తారు. అయితే అతను రాధను తాకితే బూడిదగా మారిపోతాడానే శాపం ఉంటుంది.
దాంతో ఆమె పెళ్లి తరువాత కూడా కృష్ణుడి ఆరాధనలో గడుపుతూ రాధ తన వైవాహిక బాధ్యతలను నిర్వర్తిస్తుంది. రాధ ఆఖరి గడియలు దగ్గర పడడంతో కృష్ణుడిని పిలుస్తుంది. అలా ఆమెను చూసి బాధపడి ఏమైనా వరం కోరుకోమని అడుగుతాడు. రాధ బృందావనంలో వేణుగానం ఆలపించే కృష్ణుడిని చూస్తు కన్నుమూయాలని ఉందని చెబుతుంది. ఆమె కోరిక మేరకు కృష్ణుడు వేణుగానం చేతస్తుండగా రాధ కన్నుమూస్తుంది. ఆ బాధతో కృష్ణుడు వేణువును విరుస్తాడు. వేణువుకు రాధకు విడదీయలేని అనుబంధం ఉంటుంది. ఆ కారణంతో కృష్ణుడు వేణువును ఎప్పుడూ తాకలేదని చెబుతారు.
లెజెండరీ దర్శకుడు మణిరత్నం చాలా కాలం తర్వాత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2’ అనే పీరియాడిక్ సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు, ట్రైలర్ తో ఈ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీలో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఈ సినిమాను రెండు భాగాలుగా తీశారు.
గతంలో వెయ్యి ఏళ్ల క్రితం రాచరిక పాలన కాలంలో మహిళలకు స్థానం లేదని హిస్టరీ పాఠాలలో చదువుకున్నాము. కానీ అవి తప్పని నిరూపించే చారిత్రక మహిళా ఉన్నారు. ఆమె కుందవై. పదవ శతాబ్దంలో చోళ సామ్రాజ్యం వేగంగా విస్తరిస్తున్న సమయంలో రాజు సుందర చోళుడు సామ్రాజ్యాన్ని విస్తరిస్తుంటే, ఆదిత్య కరికాలన్ చోళ సామ్రాజ్య ఖ్యాతిని దక్షణ భారతదేశంలో విస్తరించాడు. తరువాత రాజరాజచోళుడి పాలనలో చోళ ఖ్యాతి ఇండియా దాటి ఖాంబోడియా వరకు విస్తరించింది. అయితే రాజరాజచోళుడి ఖ్యాతి వెనుక ఒక మహిళా చాణిక్య ఉన్నారు.
ఆమె కుందవై. రాజు సుందర చోళుడికి ముగ్గురు పిల్లలు. ఆదిత్య కరికాలన్ , కుందవై, అరుళ్‌మొళి వర్మన్ (రాజరాజచోళ). చోళులకాలంలో మగవారితో సమనంగా ఆడవారు నిర్ణయాలు తీసుకునేవారు. కుందవై తల్లి మహాదేవి కూడా రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. ఆమె శిక్షణలో కుందవై కూడా శక్తివంతమైన మహిళగా రాజకీయాలు నడిపారు. ఈ నవలను రాసిన రచయిత కాస్తంత కల్పితాన్ని జోడించాడు. వాస్తవంగా ఆదిత్య కరికాలన్ కంటే చాలా చిన్నవాడు అరుళ్‌మొళి, ఆదిత్యుడు మరణించిన తరువాత కుందవై తమ్ముడిని చూసుకుంది.
సంక్షోభ పరిస్థుతులలో ఉన్న సమయంలో రాజ్యాన్ని తన తెలివితేటలతో కాపాడుకున్న పవర్ ఫుల్ మహిళ. రాజకీయాలు, ఆధ్యాత్మిక, సౌందర్యం, ఎదురులేని చాణక్యం అన్ని కలగలసిన అరుదైన వ్యక్తిత్వం కుందవై. రాజరాజచోలుడు చిక్కుల్లో ఉన్న ప్రతిసారీ తల్లిలా ఆదుకుంది. తంజావూరు బృహధీశ్వర ఆలయ నిర్మాణంలో కుందవై పాత్ర కీలకమైనది. అక్కడ గోడలపై చోళుల శిల్పాలతో పాటుగా, కుందవై శిల్పాలు కనిపిస్తాయి.
కుందవై ఇతర రాజ్యాలతో సయోధ్య, యుద్ధ విషయాలలో ఆమె నిర్ణయాలకు ఎదురులేదు. ఆమె తెలివితేటలను సామంత రాజులు ఎంతో గౌరవించేవారు. తమ కుమార్తెలను శిక్షణ కోసం కుందవై దగ్గరకు పంపించేవారు. ఆమెను వివాహం చేసుకోవడానికి ఎనద్రో రాజులు పోటీ పడేవారు. ఆమె రాజరాజచోలుడి మిత్రుడైన వంధ్యదేవున్ని పెళ్లి చేసుకుందని కల్కి రాసిన నవలలో ఉంది. మరి కొన్ని కథనాల ప్రకారం ఆమె వివాహం చేసుకోలేదని తెలుస్తోంది. ఆమె చాలా కాలం పాలయారైలో ఉండేవారు.
ఇప్పటికి అక్కడ ఉండే చాలా కుటుంబాలు ఆమెను ఆడపడుచుగా పూజిస్తారు. కుందవైని నాచియార్ గా పూజిస్తారు. శైవ నాయనర్ల సాహిత్యాన్ని సేకరించి భద్రపరచింది. ఆ సాహిత్యం ఇప్పటికి భద్రంగా ఉందంటే కుందవై కారణం అని అంటారు. రాజరాజచోళుడికి చరిత్రలో ఇంతగొప్ప స్థానం ఉందంటే దాని వెనుక కుందవై కృషి ఎంతో ఉంది. కానీ ఆమె గురించి చరిత్ర పాఠాలలో ఎక్కడ ప్రస్తావించలేదు.
ఆమె ఆధునికంగా ఆలోచించేది. రాజ్యంలో శాంతి ఉండాలంటే అన్ని సంస్కృతులను గౌరవించాలని చెప్పి, ఆచరించింది. అందుకు అనుగుణంగా ఆమె నిర్మించిన శైవ, వైష్ణవ, జైన ఆలయాలను తమిళనాడులో చూడవచ్చు. ఆమె రాజకీయాలలోనే కాకుండా సంగీత, సాహిత్యంలో జ్ఞాని. ఒకప్పుడు పాండ్య, లంక, చాళక్య రాజ్యాల నుండి చోళ రాజ్యానికి ముప్పు ఉండేది. అయితే ఆ మూడు రాజ్యాల పై రాజ రాజ చోళుడు పట్టు సాధించి, ముమ్మడి చోళుడిగా ఖ్యాతి చెందాడు. ఆ ఖ్యాతి వెనుక ఉన్న మహిళా శక్తి కుందవై.
హీరోల తరువాత హీరోయిన్ల పారితోషికం, వారి తర్వాత స్థాయిలో విలన్ క్యారెక్టర్ పోషించేవారు రెమ్యునరేషన్ తీసుకుంటారు. అయితే హీరోల కన్నా ఎక్కువ పారితోషికం హీరోయిన్లు తీసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. అప్పట్లో ఎన్టీఆర్ అత్యధిక పారితోషికం తీసుకునే కాలంలో ఇద్దరు హీరోయిన్లు సీనియర్ ఎన్టీఆర్ ను కన్నా ఎక్కువగా ఇద్దరు హీరోయిన్లు పారితోషికం తీసుకుని సంచలనం సృష్టించారు. అయితే ఈ విషయం ఎక్కువ మందికి తెలియదు. ఆ ఇద్దరు హీరోయిన్ల గురించి చూద్దాం..
1. భానుమతి:
2. అంజలి దేవి:
అంతే కాకుండా తన రెమ్యునరేషన్ తానే నిర్ణయించేవారని తెలుస్తోంది. కాగా అప్పటికే టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సావిత్రి, రాజసులోచన వంటి హీరోయిన్లు మాత్రం పారితోషికం తక్కువగా తీసుకునే వారంట.
1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:


అక్కినేని అఖిల్ ప్రస్తుతం భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అఖిల్ ఈ మూవీకి ముందు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రంతో డీసెంట్ హిట్ నుఅందుకున్నారు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఏజెంట్’ తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. యాక్షన్, బాడీ, డాన్స్ ఇలా అన్ని రకాలుగా అఖిల్ చాలా శ్రమించారని తెలిస్తోంది.
రిలీజ్ దగ్గర పడుతున్న క్రమంలో మేకర్స్ ఈ మూవీ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తున్నారు. మూవీ ప్రమోషన్స్ అఖిల్ విభిన్నంగా నిర్వహిస్తున్నారు. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా అఖిల్ 171 అడుగుల ఎత్తు నుండి జంప్ చేసి ఆడియెన్స్ ను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ మూవీ గురించి మరో అప్డేట్ వచ్చింది. తాజాగా ‘ఏజెంట్’ సినిమా సెన్సార్ కార్యక్రమాలను కంప్లీట్ చేసుకుందని మేకర్స్ తెలిపారు.
సెన్సార్ బోర్డు ‘ఏజెంట్’ సినిమాకి U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. ఈ మూవీలో భారీ యాక్షన్ మరియు వయలెన్స్ ఉండటం వల్ల U/A సర్టిఫికెట్ ను ఇచ్చారు. అంటే కుటుంబంతో కలిసి ఈ మూవీ చూడవచ్చు. 12 సంవత్సరాల లోపు పిల్లల తమ పేరెంట్స్ తో కలిసి చూడొచ్చు. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 36 నిమిషాలు. యాక్షన్ థ్రిల్లర్ సినిమాలకు ఇది ఫర్ఫెక్ట్ రన్ టైమ్.
ఈ చిత్రం అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందని మూవీ యూనిట్ భావిస్తున్నారు. ఈ మూవీకి వక్కంతం వంశీ కథను అందించారు. మలయాళ మెగా స్టార్ మమ్ముుట్టీ ముఖ్యపాత్రలో నటించారు. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించారు. ఏప్రిల్ 28న తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీలలోనూ విడుదల చేయబోతున్నారు.
ఓయ్, అమ్మమ్మగారిల్లు సినిమాల తరువాత షామిలీ మళ్ళీ టాలీవుడ్ లో కనిపించలేదు. ఆమె ప్రస్తుతం ఏం చేస్తోంది? ఆమె లక్ష్యం ఏమిటి? మళ్లీ సినిమాలలో నటిస్తుందా లాంటి ప్రశ్నలకు తాజాగా ఆమె సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం షామిలీ నాట్య కళలు, చిత్రలేఖనం పై ఇంట్రెస్ట్ ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఆమె ఇలా చెప్పుకొచ్చారు. ‘‘నేను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో సుమారు యాబైకి పైగా సినిమాలలో నటించాను.
కొన్ని సినిమాలలో హీరోయిన్గా కూడా నటించాను. అయితే నాకు చిత్రలేఖనం పై ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ రంగంలో దృష్టి పెట్టానని, నా టాలెంట్ ను నిరూపించుకుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నా. అమెరికాకు వెళ్ళి చిత్రలేఖనం లో ట్రైనింగ్ తీసుకున్నాను. చెన్నై, బెంగుళూరులలో జరిగిన పెయింటింగ్ కి సంబంధించిన ఎగ్జిబిషన్లలో నేను వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించాను. త్వరలో సొంతంగా ఒక పెయింటింగ్ ఎగ్జిబిషన్ చెన్నైలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను.
సినిమాల్లో మళ్ళీ నటించే విషయం పై ఆలోచించలేదు. నా లక్ష్యం పెయింటింగ్ ఎగ్జిబిషన్. అది పూర్తయితే మళ్లీ నటిస్తానో లేదో ఇప్పుడే ఏం చెప్పలేను. నేను ప్రస్తుతం ఏ మూవీకి సైన్ చేయలేదు” అని షామిలీ తెలిపింది. ఇక ఆమెకు పెయింటింగ్ అంటే ఎంత ఆసక్తో షామిలీ ఇన్‌స్టాగ్రమ్ ఫాలోవర్స్ కి బాగా తెలుసు. ఆమె పెట్టె పెయింటింగ్ పోస్ట్‌లకు కామెంట్స్ వస్తుంటాయి. ప్రస్తుతం ఆమె దృష్టి అంతా పెయింటింగ్ ఎగ్జిబిషన్ పైనే మీదనే ఉంది.
ఈ చిత్రానికి సుకుమార్ శిష్యుడు కార్తిక్ వర్మ దండు మొదటిసారి దర్శకత్వం వహించి విజయం సాధించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో రూ.21 కోట్లు వసూల్ చేసింది. ‘విరూపాక్ష’ ప్రీ-రిలీజ్ బిజినెస్ దాదాపు రూ.22 కోట్లు చేసింది. అంటే ఈ మూవీ బ్రేక్ ఈవెన్‌కు చాలా దగ్గరగా ఉంది. ఈ మూవీ హీరోయిన్ సంయుక్త మీనన్ తెలుగులో వరుసగా హిట్లతో ముందుకెళ్తోంది. ఇక విరూపాక్షతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది.
విరూపాక్ష మూవీ స్టోరీ పర్వత ప్రాంతంలోని రుద్రవనం అనే ఊరి నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ ఆటిట్యూడ్ కలిగిన ‘నందినీ’ అనే పల్లెటూరి అమ్మాయిగా నటించింది. గ్రామంలో పుట్టి పెరిగిన నందిని చాలా ఎనర్జిటిక్ ఉంటుంది. ఈ పాత్రలో సంయుక్త మీనన్ తన నటనతో మరోసారి ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ చిత్రంలో సంయుక్త మీనన్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పిన ఆర్టిస్ట్ పేరు హరిణి రావు. తన గాత్రంతో హీరోయిన్ పాత్రకు మరింత అందాన్ని ఇచ్చిందని చెప్పవచ్చు.
ఆమె ఈ చిత్రానికి ముందు ‘అవతార్ 2’ చిత్రంలో కిరి అనే పాత్రకి డబ్బింగ్ చెప్పింది. అలాగే అక్షయ్ కుమార్ నటించిన ‘రామసేతు’ చిత్రానికి కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా చేశారు. ఆ చిత్రంలో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హరిణి రావు తెలుగు వర్షెన్ కి డబ్బింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్న ‘కాంతర’ తెలుగు వర్షెన్ లో హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పారు. హరిణి రావు ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. ఆమె అక్కడ వర్క్ చేస్తూనే టాలీవుడ్ లో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో పలు ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
ఈ సీజన్లో చెన్నై జట్టు అదిరిపోయే గెలుపును అందుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా జట్టు పై చెన్నై సూపర్ కింగ్స్ గెలుపొందింది. చెన్నైజట్టుకి ఈ సీజన్లో ఇది ఏడో మ్యాచ్. చెన్నైకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో స్కోర్ లో టాప్ ప్లేస్ దూసుకెళ్లింది. ఈ సీజన్ లో ఏడవ మ్యాచ్ ఆడిన కోల్‌కతా జట్టుకి ఐదవ ఓటమి. ఇక ఈ ఓటమితో 8వ స్థానానికి చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై 236 పరుగుల భారీ టార్గెట్ ను కోల్‌కతా ముందు ఉంచింది.
లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ మొదలు పెట్టిన కోల్‌కతా మ్యాచ్ ఆరంభంలోనే తడబడి, వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ సునీల్ నరైన్ మొదటి ఓవర్లోనే డకౌట్ కాగా, జగదీశన్ (1) అవుట్ అయ్యాడు. ఆ తరువాత 3,4 వ స్థానాల్లో వచ్చిన వెంకటేశ్ అయ్యర్ 20, కెప్టెన్ నితీశ్ రాణా 27 హిట్టింగ్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యారు.
కానీ 5 వ స్థానంలో వచ్చిన జేసన్ రాయ్ 61 వేగంగా అర్ధ సెంచరీ చేసి, కోల్‌కతా జట్టులో గెలుపు పై ఆశలు రేపాడు. కానీ 61పరుగుల కే అవుట్ అయ్యాడు. రింకు సింగ్ 53 నాటౌట్, ఆండ్రీ రసెల్ 9 తో కోల్‌కతా ఓటమి ఖాయమైంది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ పై చెన్నై జట్టు విజయం పై సోషల్ మీడియాలో మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. అవి ఏమోటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
Also Read:
1.శాకుంతలం:
2.వారసుడు:
3. ఆచార్య:
4.బ్రహ్మోత్సవం:
5.శ్రీకారం:
6.వరుడు:
7.ఇంటిలిజెంట్:
8.గోరింటాకు:
9.సన్ ఆఫ్ ఇండియా:
10.టక్ జగదీష్:
11.థాంక్యూ:
12.శ్రీనివాస కళ్యాణం:
2018లో విడుదలైన ఈ మూవీ సీరియల్ టాక్ తో ప్లాప్ గా నిలిచింది. ఈ మూవీని నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకం పై నిర్మించారు.