వైవాహిక జీవితంలో భార్య భర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. ఎటువంటి గొడవలు రాకుండా భార్య భర్తలు ఎలా ఉండాలి..?, అసలు గొడవలు రాకుండా వైవాహిక జీవితంలో ఎలా నడుచుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది ఆశ్చర్యపోతారు వైవాహిక జీవితం అన్నాక గొడవలు వస్తూ ఉంటాయి కదా..
భార్య భర్తల మధ్య గొడవలు సహజం కదా అని భావిస్తారు. అయితే నిజానికి చిన్న చిన్న గొడవలు కూడా రాకుండా మనం అడ్డుకోవచ్చు. ఎటువంటి గొడవలూ రాకుండా ఆనందంగా భార్యాభర్తలు జీవించవచ్చు.
#1. ఒకసారి ఆగండి:
ఏదైనా మాట్లాడే ముందు కానీ ఏదైనా చెప్పేముందు కానీ ఒకసారి ఆగండి. ఒకసారి ఆలోచించుకుని అప్పుడు మాత్రమే దానిని చెప్పండి. అప్పుడు కచ్చితంగా గొడవలు రాకుండా ఉంటాయి.
#2. మీ పార్టనర్ ని నిందించవద్దు:
మీ యొక్క భావాలని మీరు చెప్పినప్పుడు ఇతరులను నిందించకండి. వాళ్ళ తప్పుల గురించి మాట్లాడద్దు.
#3. అసలు సమస్యనే చూసుకోండి:
చాలామంది డైవర్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా అసలు సమస్య ఏమిటి అనే దానిని పరిష్కరించుకోండి. అలా చేస్తే ఇబ్బందులు రాకుండా ఉంటాయి.
#4. మొదట వినండి:
గొడవలు రాకుండా ఉండాలంటే ముందు ఎదుటి వారు చెప్పేది వినండి. ఆ తర్వాత మీరు మాట్లాడండి. ఇలా చేయడం వల్ల కూడా మీ మధ్య గొడవలు రాకుండా ఉంటాయి.
#5. మాట్లాడే టోన్ మార్చండి:
మాట్లాడేటప్పుడు కోపంగా మాట్లాడద్దు. మీ టోన్ బాగుండేలా చూడండి. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మీరు చెప్పేది వింటారు. గట్టిగా అరుచుకుంటూ వెళ్తే ఇబ్బందులు తప్ప సమస్యకి పరిష్కారం ఉండదు.
#6. వాళ్ళ ప్లేస్ లో ఉండి ఆలోచించండి:
ఎప్పుడైనా సరే గొడవలు రాకుండా ఉండాలంటే వాళ్ళ ప్లేస్ లో ఒకసారి మీరు ఉంటే ఏం చేస్తారు అనేది చూసుకోండి. ఇలా చేయడం వల్ల వాళ్లు చేసేది కూడా కరెక్ట్ అని మీకు అర్థమవుతుంది. మీ మధ్య గొడవలు కూడా రాకుండా ఉంటాయి.