కాంతారా సినిమా అంటే ఎవరు ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే.కాంతారా సినిమాతో కన్నడ హీరో రిషబ్ శెట్టి రేంజ్ మారిపోయింది. ఒకే ఒక్క సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఏ అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన కాంతారా సినిమా దేశ వ్యాప్తంగా ఏకంగా రూ.400 లకు పైగా కోట్లు కొల్లగొట్టి చరిత్ర సృష్టించింది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతారా-2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. శరవేగంగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది.ఇటీవల విడుదలైన పోస్ట్ లుక్ టీజర్ విపరీతంగా ఆకట్టుకుంది. తాజాగా రిషబ్ శెట్టి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కర్ణాటకలోని తన స్వగ్రామమైన కెరడిలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకున్నారు.
తన రిషబ్ శెట్టి ఫౌండేషన్ ద్వారా ఆ స్కూలుకు సాయం చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ ఆ హీరోను ఆకాశానికెత్తుతున్నారు. ఇది కదా హీరోలు చేయాల్సిన పని అంటూ అభినందిస్తున్నారు.రిషబ్ శెట్టి రీల్ హీరోనే కాదు…రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












కల్యాణి ప్రియదర్శన్ తెలుగు మూవీ ‘హలో’ తో హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ చిత్రానికి గాను ఆమె ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ అవార్డును అందుకుంది. ఆ తరువాత చిత్రాలహరి, రణరంగం సినిమాలతో అలరించారు. ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలలో నటిస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్ లీడ్ రోల్ లో నటించిన ‘శేషమ్ మైక్ – ఇల్ ఫాతిమా’ మలయాళ మూవీ నవంబర్ 17న విడుదల అయ్యింది. ఈ సినిమా మంచి వసూళ్లు సాధించి, అక్కడ సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రం విమర్శకుల నుండి ప్రశంసలు అందుకుంది. డిసెంబర్ 16 నుండి ‘నెట్ ఫ్లిక్స్’లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇక మూవీ కథ విషయానికి వస్తే, ఫాతిమా (కళ్యాణి ప్రియదర్శన్) చిన్నతనం నుండి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు తండ్రి మునీర్ (సుధేశ్), తల్లి (ప్రియా శ్రీజిత్), అన్నయ్య ఆసిఫ్ (అనీష్) ఉంటారు. తండ్రి అన్నయ్య మెకానిక్ షెడ్ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటారు. మునీర్ కుటుంబ పరువు ముఖ్యంగా భావిస్తూ ఉంటాడు. ఫాతిమాకు ఆసిఫ్ సపోర్ట్ చేస్తుంటాడు. ఫుట్‌బాల్ చూస్తూ, అర్థం చేసుకుంటూ పెరిగిన ఫాతిమా ఎక్కడున్నా కబుర్లు చెప్పే అలవాటు ఉంటుంది.
కాలేజ్ లో చదివేటప్పుడు ఫుట్ బాల్ టోర్నమెంట్స్ కి ఫాతిమా కామెంటేటర్ గా చేయడంతో మంచి గుర్తింపు లభిస్తుంది. ఆమె ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ మ్యాచ్ లకు వ్యాఖ్యాతగా వృత్తిని కొనసాగించాలని డిసైడ్ అవుతుంది. కానీ ఫాతిమా జనాల్లోకి వెళ్లడం వల్ల వారి కుల పెద్దల నుండి విమర్శలు వస్తాయి. దాంతో మునీర్ ఫాతిమాకి పెళ్లి చేయాలనుకుంటాడు. అయితే ఫాతిమా మాత్రం అనుకున్నది సాధించిన తరువాతే పెళ్లి చేసుకుంటానని, కొచ్చికి వెళుతుంది. అక్కడ ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఫాతిమా అనుకున్నది సాధిస్తుందా? అనేది మిగిలిన కథ.