ప్రముఖ నటి చనిపోయారు అంటూ ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ నటి కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్. మిగిలిన భాషల్లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. అంతే కాకుండా రాజకీయాల్లో కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే, నటి దివ్య స్పందన చాలా సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో ఉన్నారు.
రమ్య అనే పేరుతో ఇండస్ట్రీలోకి పరిచయం అయిన దివ్య స్పందన ఎన్నో సినిమాల్లో నటించి గుర్తింపు సంపాదించుకున్నారు. సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పాపులర్ అయ్యారు.

ఇంకా చాలా సినిమాల్లో దివ్య స్పందన నటించారు. అయితే హఠాత్తుగా దివ్య స్పందన గురించి ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. దివ్య స్పందన చనిపోయారు అనే వార్త పెద్ద ఎత్తున ప్రచారం అయ్యింది. అంతేకాకుండా దివ్య స్పందన కూడా ఈ విషయంపై స్పందించి సోషల్ మీడియాలో ఈ పేరు మీద చాలా చర్చ జరుగుతుంది అని అర్థం వచ్చేలాగా ఒక పోస్ట్ చేశారు.

2003 లో అభి అనే సినిమాతో కన్నడ సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టారు దివ్య స్పందన. ఆ తర్వాత 2004 లో కుత్తు అనే తమిళ్ సినిమాలో కూడా నటించారు. 2013 లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కర్ణాటకలోని మాండ్య నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచారు. అయితే 2014 లో జరిగిన సాధారణ ఎన్నికల్లో అదే నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం సినిమాలు చేస్తూ, రాజకీయాల్లో కూడా ఉన్నారు.
ALSO READ : “మమ్మల్ని కూడా కొంచెం కాపాడండి..!” అంటూ… “విజయ్ దేవరకొండ” పాత సినిమా నిర్మాతల పోస్ట్..! ఏం అన్నారంటే..?

ధనుష్, మంజు వారియర్ నటించిన సినిమా అసూరన్. ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలలో ధనుష్ కు అక్క కూతురు మరియమ్మ పాత్రలో అమ్ము అభిరామి నటించింది. ధనుష్ శివసామిగా నటించాడు. శివసామి, మారియమ్మలు ప్రేమించుకుంటారు. ఆమె కుటుంబంతో సహా గుడిసెలలో సజీవదహనం అవుతుంది.
అయితే డైరెక్టర్ వెట్రిమారన్ మరియమ్మ పాత్రను చదువుకోవడానికి స్కూల్ కు వెళ్ళే పాత్రలో చూపించారు. ఈ మూవీ చదువు నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం 2019లో అక్టోబర్ లో రిలీజ్ అయ్యి, ఘన విజయం సాధించింది. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డ్ తో పాటు పలు అవార్డులను గెలుచుకుంది. ధనుష్ ఉత్తమ నటుడి అవార్డును అసురన్ చిత్రానికి గాను పొందారు. ఇదే సినిమాని తెలుగులో నారప్ప టైటిల్ తో తెరకెక్కించారు.
ఈ మూవీలో అగ్ర హీరో వెంకటేష్, ప్రియమణి జంటగా నటించారు. ఒరిజినల్ మూవీలో మరియమ్మ పాత్రను చేసిన అమ్ము అభిరామి నారప్ప ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే హీరో అక్క కూతురి పాత్రలో కన్నమ్మగా నటించింది. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కన్నమ్మ పాత్రను టైలరింగ్ నేర్చుకున్నట్టుగా చూపించారు. ఈ విషయాన్ని గమనించిన నెటిజెన్లు అసలు సినిమానే విద్య గురించి, కాబట్టి తమిళంలో చదువుకున్నట్టుగా చూపించారు. కానీ తెలుగులో ఆ పాయింట్ ఎందుకు మార్చారు అని కామెంట్స్ చేస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ నటిస్తున్న మూవీ ఓజి. ఈ చిత్రంలో ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సాహో డైరెక్టర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్, సుజిత్ కాంబో ప్రకటించినప్పటి నుండే ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మేకర్స్ ఎప్పటికప్పుడు మూవీ అప్డేట్స్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఈ సినిమా పై అంచనాలను పెంచుతూ వస్తున్నారు.
పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ రిలీజ్ అయిన తరువాత సినిమా పై అంచనాలి మరింతగా పెరిగిపోయాయి. పవన్ లుక్స్, యాక్షన్ తో ఉన్న టీజర్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించింది. ఫ్యాన్స్ మాత్రమే కాకుండా యూత్ అంతా ఓజి టీజర్ తో ఊగిపోతున్నారు. ఇప్పటికీ ఈ టీజర్ గురించి నెట్టింట్లో చర్చలు జరుగుతునే ఉన్నాయి.
ఒకటని కాకుండా కాస్ట్యూమ్స్, కత్తి, గన్ ఇలా టీజర్ లో చూపించిన ప్రతి ఒక్క దాని గురించి ఫ్యాన్స్ చర్చిస్తున్నారు. అయితే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా మరో ఇద్దరు సినీ స్టార్స్ కూడా ఉన్నారు. వారిలో ఒకరు బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి. ఈ మూవీలో విలన్ గా చేస్తున్నట్టు తెలుస్తోంది. మరొకరు కోలీవుడ్ నటి శ్రియారెడ్డి. ఆమె ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఒక సంచలనం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చినా, తన దైన రీతిలో నటిస్తూ, సినిమా సినిమాకి అభిమానులను, క్రేజ్ ను పెంచుకుంటూ పవర్ స్టార్ గా ఎదిగారు. సినిమాల కన్నా పవన్ వ్యక్తిత్వంతో ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఇండస్ట్రీలో సైతం పవన్ ను అభిమానించే హీరోలు ఎంతో మంది ఉన్నారు. పాలిటిక్స్ లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్, జనసేనానిగా ప్రజల సమస్యల పై తన గొంతు వినిపిస్తున్నారు. ఇటు ఇండస్ట్రీలోనూ వరస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు.
ఇది ఇలా ఉంటే కోరాలో “పవన్ కళ్యాణ్ గారు మన తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం, కాదంటారా?” అనే ప్రశ్నను అడుగగా,
పవన్ కళ్యాణ్ కి కానీ ఇప్పటి యువ హీరోస్ ఎవరికైనా కానీ తెలుగు సినిమాకి దొరికిన అదృష్టం అనే స్థాయి లేదు అని అందరికీ తెలుసు. ఆన్సర్స్ రాసే వాళ్ళు కొంచెం అది కూడా దృష్టిలో పెట్టుకుంటే మంచిది. ఒక వేళ అలా అనాల్సి వస్తే ఒక సీనియర్ ఎన్టీఆర్, ఏయన్నార్ , కృష్ణ , చిరంజీవి లాంటి వాళ్లకి మాత్రమే ఆ స్థాయి వుంది” అని చెప్పుకొచ్చారు.







సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రిష జంటగా నటించిన సినిమా అతడు. ఈ మూవీ థియేటర్లలో కన్నా బుల్లితెర పై ఎక్కువ విజయాన్ని సాధించింది. స్టార్ మా ఛానెల్ ఈ మూవీ పై పెట్టిన పెట్టుబడి కన్నా, ఊహించని స్థాయిలో ఆదాయం వచ్చిందని ఇండస్ట్రీ లో టాక్. ఇటీవలే ఈ మూవీ వెయ్యి సార్లు కన్నా ఎక్కువగా ప్రసారం అయిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. ఈ మూవీని సీనియర్ నటుడు మురళీ మోహన్ తన సొంత బ్యానర్ అయిన జయభేరి ప్రొడక్షన్స్ పైన నిర్మించారు.
మురళీ మోహన్ నటుడు మాత్రమే కాదు. నిర్మాత, వ్యాపార వేత్త కూడా విజయం సాధించాడు. నటుడుగా సినిమాలలో ఆర్జించిన డబ్బును రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టి విజయం సాధించారు. జయభేరి అనే నిర్మాణ సంస్థ స్థాపించి పలు సినిమాలను నిర్మించాడు. కానీ అతడు మూవీ తరవాత మళ్ళీ మురళీ మోహన్ చిత్రాలను నిర్మించలేదు. మురళీ మోహన్ అతడు మూవీ తరువాత సినిమాలను ఆపడానికి గల కారణాలను ఒక ఇంటర్వ్యూలో వివరించారు.
అతడు మూవీ సమయంలో రాజకీయంగా తాను బిజీగా మారిపోయానని మురళీ మోహన్ తెలిపారు. ఒక మూవీని నిర్మించేటప్పుడు సెట్ లో నిర్మాత ఉండి, అన్నింటినీ దగ్గరుండి చూసుకోవాలని, మేనేజర్లను నమ్ముకోకూడదని అన్నారు. అందుబాటులో ఉండలేని కారణం వల్లనే ఆ మూవీ తర్వాత జయభేరి బ్యానర్ లో మరే సినిమాలు నిర్మించలేదని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. మళ్ళీ తన బ్యానర్ లో సినిమాలు నిర్మించాలని ఆలోచిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.


