హీరో మంచు విష్ణు గత ఏడాది జిన్నా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యి, ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకపోయింది. ఈ మూవీ ప్లాప్ అవడంతో అప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్న మంచు విష్ణు ఇటీవల తన కలల ప్రాజెక్ట్ ను ప్రకటించారు.
ఎన్నో ఏళ్ల నుండి విష్ణు తెరకెక్కించాలనుకుంటున్న కన్నప్ప మూవీని రీసెంట్ పూజా కార్యక్రమాలతో మొదలు పెట్టారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. అయితే ఆమె స్టార్ హీరోయిన్ చెల్లి అని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకేకిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్న విష్ణు, ఫైనల్ గా ఈ మూవీని ప్రకటించారు. అలాగే శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో మంచు విష్ణు పక్కన హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. నుపుర్ సనన్ బాలీవుడ్ లో నటి మరియు సింగర్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీలో కామర్స్ పూర్తి చేసింది. ఆమె తన అక్క కృతి సనన్ అడుగుజాడల్లో నడవడానికి ముంబైకి మారింది. అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్: బి ప్రాక్: ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వచ్చిన కునాల్ కెమ్ము, సౌరభ్ శుక్లా నటించిన కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్ తో ఆమె నటిగా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన నూరానీ చెహ్రా మూవీలో నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.
https://www.instagram.com/p/CqFMyeEIUdW/
Also Read: “మీరు ఇలా అనడం ఏంటి..?” అంటూ… “ప్రకాష్ రాజ్” పై ఫైర్ అవుతున్న నెటిజెన్స్..! విషయం ఏంటంటే..?

ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి పై అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే తొలిసారి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై అడుగుపెడుతుందని ఇస్రో వెల్లడించింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అవడంతో అన్ని దేశాల దృష్టి ప్రస్తుతం చంద్రయాన్-3 పైనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో ఒక ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్స్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి, టీ పోస్తున్నట్లు ఉంది. అది కూడా కార్టూన్ లా ఉంది. ఇక ఈ ట్వీట్ కు ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుండి పంపించిన తొలి చిత్రం’ అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వ్యంగ్యంగా ఉండటంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 ఇండియాకి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషంతో శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మరొకరు చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించిందని, బీజేపీది కాదని కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.
1. కింగ్ ఆఫ్ కొత్త:
2. గాండీవధారి అర్జున:
3. బెదురులంక 2012:
4. పార్ట్నర్ :
5. బాయ్స్ హాస్టల్:
6. మన్మధుడు:
ఈ మూవీకి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించారు. దేవి శ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా 29న రీరిలీజ్ కానుంది.
అనసూయ సోషల్ మీడియాలో ఏడుస్తున్న వీడియో షేర్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఈ విషయం చర్చకు దారి తీసింది. ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక, నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ తరువాత అనసూయ ఆ వీడియో గురించి మాట్లాడుతూ మళ్ళీ ఒక వీడియోను ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. అయితే అప్పటికీ ఆమె ఎందుకు ఏడుస్తుందో క్లారిటీగా రాలేదు. ఈ క్రమంలోనే నటి శ్రీ రెడ్డి అనసూయ వీడియో పైన ట్విట్టర్ వేదికగా స్పందించింది.
శ్రీరెడ్డి తన ట్వీట్ లో ” అరేయ్, ఎందుకు రా అనసూయ ఆంటీని ఇలా ఏడిపిస్తున్నారు, పాపం రా. ఇంతకి తను ఎందుకు ఏడుస్తుందో చాలా మందికి అర్ధం కాలేదు, సింపుల్ గా చెప్పాలంటే, తను లోపల ఒకటి, బయట ఒకటి కాకుండా, తన మనసు ఏం చెప్తే అలా, తన భావాలను, సోషల్ మీడియా లో పంచుకుంటున్నారు, తను చెప్పేది నచ్చని వాళ్ళు, తనకి తప్పుగా కామెంట్స్ చేస్తున్నారు, పాపం అవి తనని బాగా బాధిస్తున్నాయి.



కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీ తెలుగులో కూడా బ్లాక్బాస్టర్ గా నిలిచింది. నిరుద్యోగి కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు, హీరో కెరీర్ లో ఎదిగే విధానంతో పాటు, డైలాగ్స్, సాంగ్స్, ఇలా అన్ని అంశాలు ‘రఘువరన్ బి.టెక్’ ను యూత్‌కు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. రిలీజ్ అయిన ఎనిమిదేళ్ళ తరువాత ఈ మూవీ తాజాగా రీరిలీజ్ అవగా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
యూత్ థియేటర్లో ఒక పాటకు పాట పాడుతూ హోరెత్తించారు. వారి పాటతో థియేటర్ మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో ధనుష్ తమ్ముడు కార్తీక్ గా నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. అతని పేరు హృషికేశ్. ఇతను ధనుష్ కు బావమరిది అవుతాడని తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కి బంధువు.
హృషికేశ్ పీస్బిబి స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ లో విజువల్ కమ్యూనికేషన్‌ను అభ్యసించారు. ఆ తర్వాత హృషికేశ్ యాడ్స్, డాక్యుమెంటరీలలో పని చేశారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ మూవీలో ధనుష్ తమ్ముడి పాత్రలో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత రమ్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించారు. ఆమూవీ తరువాత వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు అనే తెలుగు సినిమాలోనూ నటించాడు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జైలర్’ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి, బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో రజనీకాంత్ పలు దేవాలయాల దర్శిస్తూ, ఉత్తరప్రదేశ్ కు చేసరుకున్నారు. ఈ క్రమంలో రజనీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ ని కలిసి, ఆయనతో ‘జైలర్’ మూవీని చూశారు. అయితే రజినికాంత్ కు స్వాగతం పలికిన సీఎం యోగి కాళ్లకు రజినికాంత్ నమస్కారం చేశారు.
రజినికాంత్ లాంటి పెద్ద హీరో తన కన్నా చిన్న వయసులో ఉన్న యోగి ఆదిత్య నాథ్ కాళ్ళకు నమస్కరించడం ఇటు తమిళనాడులో, అటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రిని కలిసిన సమయంలో చేతులతో నమస్కరించడమో లేదా షేక్ హ్యాండ్ ఇవ్వడం లాంటివి కాకుండా యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశారని అభిమానులు, నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
రజనీకాంత్‌కు 72 సంవత్సరాలు కాగా, సీఎం యోగి వయసు 51 ఏళ్లని, రజిని తనకంటే వయసులో చాలా చిన్నవాడైన యోగి కాళ్లకు మొక్కడం ఆయన అభిమానులు బాధపడుతున్నారు. రజనీకాంత్ యాంటీ ఫ్యాన్స్ రజిని సినిమాలలోని కొన్ని సన్నివేశాలతో ట్రోల్ చేస్తున్నారు. ‘రజనీకాంత్ ఆత్మగౌరవాన్ని తమిళనాడులోనే వదిలేసి, యోగి కాళ్లకు నమస్కరించారు’ అని విమర్శిస్తున్నారు. అయితే కొందరు సీఎం యోగి సన్యాసి కావడం వల్లనే రజనీ అలా నమస్కరించాడని, అందులో తప్పులేదని వాదిస్తున్నారు. రజనీ ఆథ్యాత్మిక కోణంలో అలా చేశారని కొందరు అంటున్నారు.

‘వివాహ భోజనంబు’ డైరెక్టర్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమా అనిల్ సుంకర సమర్పణలో ‘ఎకె ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాజేష్ దండా నిర్మించారు. ఇటీవల ఓటీటీలో రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా రికార్డులను బ్రేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి నుండి క్లైమాక్స్ వరకు ఫన్ ఉంటుంది. ఇక క్లైమాక్స్ సైతం కన్విన్సింగ్ గా ఉంటుంది. ఇటీవల కాలంలో ఇంత ఫన్ ఉన్న మూవీ రాలేదని చెప్పవచ్చు. శ్రీవిష్ణు, నరేష్ ఇద్దరు పోటీపడి నటించారు.
పదేళ్లు అమెరికాలో ప్రయత్నించినప్పటికీ కెరీర్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో 1971లో మళ్ళీ హాంకాంగ్ కి వెళ్ళిపోయారు. అక్కడే ‘ది బిగ్ బాస్’, ‘ఫస్ట్ ఆఫ్ ఫ్యూరీ’, ‘ది వే ఆఫ్ డ్రాగన్’ అనే 3 యాక్షన్ చిత్రాలతో విజయం సాధించారు. ది వే ఆఫ్ డ్రాగన్ మూవీకి కు బ్రూస్ లీ దర్శకుడుగా వ్యవహరించాడు. ఆ తరువాత ఆయన నటించిన మూవీ ఎంటర్ ది డ్రాగన్. ఈ మూవీ 1973 ఏప్రిల్ లో షూటింగ్ పూర్తయింది. అయితే మూవీకి డబ్బింగ్ చెప్పే సమయంలో బ్రూస్ లీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే హాస్పటల్ కి తరలించారు.
అప్పుడే సెరిబ్రల్ ఎడెమీ(మెదడువాపు) వ్యాధి అని తెలిసింది. అయితే ఆ వ్యాధి రావడానికి కారణం వైద్యులు చెప్పలేకపోయారు. బ్రూస్ లీ కోలుకుని తిరిగి సినిమాల్లో నటిస్తారని వైద్యులు హామీ ఇచ్చారు. 2 నెలల తర్వాత బ్రూస్ లీ ప్రేయసి బెట్టీ టింగ్ పెయి ఇంట్లో ఉన్న సమయంలో బ్రూస్ లీ స్పృహ తప్పారు. అలా బ్రూస్ లీ 1973 జులైలో తన 32 ఏళ్ల వయసులో ఈలోకాన్ని విడిచారు. బ్రూస్ లీ చనిపోవడానికి ఖచ్చితమైన కారణం ఇప్పటికి అంతుచిక్కలేదు. ఆయన మరణానికి కారణం పెయిన్ కిల్లర్లు ఎక్కువగా తీసుకోవడం అని అప్పట్లో డాక్టర్లు ప్రకటించారు.