యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ చిత్రం ‘ఆదిపురుష్’ జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మూవీ యూనిట్ ప్రమోషన్ల వేగం పెంచింది. తాజాగా ఆదిపురుష్ ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా తిరుపతిలో జరిగింది.
ప్రభాస్ బాలీవుడ్ లో నటించిన తొలి స్ట్రైట్ సినిమా ఇది. ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించింది. ఇదిలా ఉంటే ‘ఆదిపురుష్’ సినిమా కోసం మూవీ యూనిట్ ఒక పాత తెలుగు సినిమా ఫార్ములాను వాడుతున్నారట. మరి ఆ పాత తెలుగు చిత్రం ఏమిటో? ఆ ఫార్ములా ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ఆదిపురుష్ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఆడియెన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ తాజాగా ప్రకటన చేసింది. ఆదిపురుష్ థియేటర్లలో ఆ ఒక్క టిక్కెట్ అంటే సీట్ హనుమాన్ కోసం వదిలేస్తారట. ఎందుకంటే రామాయణ పారాయణం, శ్రీరాముడి కథను కానీ ప్రదర్శించినపుడు అక్కడికి హనుమాన్ వస్తాడని భక్తుల నమ్మకం. అందువల్ల ఆ ఒక్క సీటూ అంజనేయుడి కోసం ఉంచేస్తారట.
ఇక థియేటర్ ఫుల్ అయిన ఆ ఒక్క సీటు ఖాళీగా ఉంటే అందరి దృష్టి ఆ ఒక్క సీటు పైనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో ఆ సీట్ లో అంజనేయుడి ప్రతిమ ఉంచినట్లయితే ఆడియెన్స్ అందరు భక్తి మూడ్ లోకి వెళ్తారు. అలా హనుమాన్ తో కలిసి సినిమా చూసే ఛాన్స్ అంటే మూవీకి పబ్లిసిటీ మరింత పెరుగుతుందని భావిస్తున్నారు.
1995 జూన్ 16న రిలీజ్ అయిన ‘అమ్మెరు’ మూవీ సమయంలో కూడా ఇలాంటిది చేశారు. కానీ అది మూవీ యూనిట్ ప్లాన్ చేయలేదు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యాలు కలిసి చేశారు. ఆ మూవీ ప్రదర్శింపబడుతున్న సమయంలో హారతులు పట్టారు. అలాగే థియేటర్ల బయట చిన్న దేవాలయాన్ని కూడా పెట్టారు. పూజలు, ప్రసాదాలు, హుండీల లాంటివి ఏర్పాటు చేశారు. అమ్మెరు మూవీ అప్పటికే హిట్ అయినా వీటి వల్ల ఆ మూవీ వసూళ్లు మరింతగా పెరిగాయి.
Also Read: “ఆదిపురుష్” ‘ప్రీ-రిలీజ్’ ఈవెంట్ కి ఎంత ఖర్చు అయ్యిందో తెలుసా..? కేవలం బాణాసంచా కోసమే..??










ప్రభాస్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా ఛత్రపతి. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, జక్కన్న కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా కూడా ఇదే. ఈ చిత్రంలో హీరోయిన్ గా శ్రియ నటించింది. అయితే ఈ మూవీని రాజమౌళి ముందుగా మాస్ మహారాజ రవితేజతో చేయాలని భావించడట.
అయితే సంవత్సరానికి నాలుగైదు చిత్రాలు చేసే రవితేజ డేట్స్ ఇతర సినిమాలకి ఇవ్వడంతో డేట్స్ లేక ఈ సినిమాని ప్రభాస్ తో చేయాలని రాజమౌళి అనుకున్నాడు. కానీ ప్రభాస్ దగ్గరకి వెళ్ళడానికి కాస్త ఆలోచించాడట. దానికి కారణం గతంలో రాజమౌళి ప్రభాస్ స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి చిత్రాలను రిజెక్ట్ చేసాడు. ఈ మూవీని కూడా రిజెక్ట్ చేస్తాడేమో అని అనుకున్నాడట.
అయితే ఒకరోజు ప్రభాస్ పుట్టినరోజు పార్టీకి తెలుగు స్టార్ హీరోలు, నిర్మాతలను కూడా ఆహ్వానించాడట. ఆ ఆహ్వానం తనకు కూడా రావడంతో రాజమౌళి పార్టీకి వెళ్ళినపుడు, తన దగ్గర ఒక కథ ఉందని, వింటావా అని ప్రభాస్ ని అడగాడట. తరువాతి రోజు చెప్పమని అన్నాడంట. రాజమౌళి తరువాతి రోజే ప్రభాస్ ఇంటికి వెళ్లి కథ చెప్పడం, ప్రభాస్ కి నచ్చడంతో ఒకే చెప్పారంట.
టాలీవుడ్ చిత్రాలలో నటించి హీరోగా మంచి ఇమేజ్ ఏర్పరుచుకున్న సిద్ధార్థ్ కొంతకాలం తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు. 2021 లో శర్వానంద్ తో కలిసి మహాసముద్రం మూవీ ద్వారా ఆడియెన్స్ ముందుకు వచ్చారు. అయితే ఆ చిత్రం ప్లాప్ అయ్యింది. ఆ మూవీ పై సిద్ధార్థ్ హిట్ అవుతుందని చాలా నమ్మకంగా మాట్లాడాడు. మహాసముద్రం ప్రీరిలీజ్ ఈవెంట్ లో కానీ ఆమూవీ ఆశించినట్లుగా విజయం సాధించలేకపోయింది.
తాజాగా ఈ చిత్రం ప్లాప్ అవడం పై ఒక ఇంటర్వ్యూలో ఇలా చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ‘మహా సముద్రం’ నా ఫేవరెట్ సినిమా. కానీ ఆ మూవీ జనాలకి కనెక్ట్ కాలేదు. హీరో ఫ్రెండ్ లవర్ ను పెళ్లి చేసుకోవడం ఆడియెన్స్ కి నచ్చలేదు, అందువల్లే ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు. అలా అని ఈ చిత్రం చెడ్డ మూవీ కాదు. దర్శకుడు అజయ్ భూపతితో వర్క్ చేయడానికి ఇప్పటికీ నేను రెడీగా ఉన్నాను.
అతను గ్రేట్ టెక్నీషియన్. ఆర్.ఎక్స్ 100 మూవీని మించిన చిత్రాలు అజయ్ నుండి చాలా వస్తాయని అన్నారు. కొంతమంది నాతో ఈ మూవీ మరో 10 సంవత్సరాల తరవాత రావాల్సింది అంటూ ఉంటారు. ఆ మాటలు విన్నప్పుడు నాకు నవ్వాలో, ఏడ్వాలో తెలియదని చెప్పుకొచ్చారు.



#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18


సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఆదిపురుష్ హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తున్నారు. సీతాదేవిగా బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్, రావణసురుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. తానాజీ డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 16న తెలుగు, మలయాళం, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోలలో చాలా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.
ఈ క్రమంలో ఆదిపురుష్ మూవీ బడ్జెట్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. బిజినెస్ గురించి చూసినట్లయితే ఇప్పటివరకు ఈ మూవీకి శాటిలైట్, మరియు డిజిటల్ రైట్స్ అన్ని భాషలకు 250 కోట్లు వచ్చాయట. అయితే ఈ చిత్రం మ్యూజిక్ రైట్స్ ను మాత్రం అమ్మలేదని సమాచారం. ఇక తెలుగు రాష్ట్రాలలో ముందుగా యువి క్రియేషన్స్ విడుదల చేస్తుందని అనుకున్నా, ఆ తరువాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ 185 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. 

