తెలుగు బుల్లితెరపైకి పెద్ద సంఖ్యలోనే యాంకర్లు ఉన్నారు. అయితే, గతంలో మాత్రం చాలా తక్కువ మంది మాత్రమే హోస్టులుగా సందడి చేసేవారు. అందులో బబ్లీ బ్యూటీ శిల్పా చక్రవర్తి ఒకరు. చాలా కాలం క్రితం టెలివిజన్ రంగంలో తనదైన శైలి యాంకరింగ్‌తో సందడి చేసిన ఈ భామ.. వివాహం తర్వాత కెరీర్‌కు గ్యాప్ ఇచ్చేసింది.
‘వావ్’ ది అల్టిమేట్ గేమ్ షో తో టీవీ లో తన కెరీర్ మొదలుపెట్టింది శిల్పా చక్రవర్తి. ప్రొఫెషనల్ డాన్సర్ అయిన ఆమె అనేక స్టేజి పెరఫార్మన్సులు ఇచ్చింది. తర్వాత 2018 లో ‘కంటే కూతుర్నే కను’ సీరియల్ లో కూడా నటించారు శిల్ప.

యాంకర్‌గా పరిచయం అయిన తర్వాత శిల్పా చక్రవర్తి తనదైన హోస్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఈ అమ్మడికి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ఆమె ఎన్నో షోలలో భాగం అయింది. దీంతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగిపోయింది. షోలు మాత్రమే కాదు సినిమా ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు, స్పెషల్ ఈవెంట్లతోనూ సందడి చేసింది.

తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 లో ఆమె వైల్డ్ కార్డు ఎంట్రీ తో వెళ్లారు. ఈ అవకాశం తో ఆమె కెరీర్ మళ్ళీ పుంజుకుంటుందని భావించారు అంతా. కానీ ఎక్కువ రోజులు హౌస్ లో ఉండలేకపోయారు. కేవలం రెండు వారాలే బిగ్ బాస్ హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయ్యి ఫాన్స్ ను నిరాశ పరిచారు.

శిల్ప కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. అయితే వివాహం తర్వాత కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన శిల్ప సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్ గానే ఉంటున్నారు. ఇందులో భాగంగానే దీని ద్వారా తరచూ ఆమె తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలు, విశేషాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది.

తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శిల్ప చక్రవర్తి ఏంటి ఇలా అయిపోయింది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.




















నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు, హిందీ, తమిళం భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి గొప్పనటుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన కెరిర్ లో నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తన ఛానెల్ పరుచూరి పలుకుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ గా మారారని చెప్పారు. బి.నాగిరెడ్డి, కేవిరెడ్డి, చక్రపాణి వీరంతా చాలా గొప్పవారని అన్నారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అనే పాయింట్ తో దర్శకనిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించారని చెప్పారు.
ఈ చిత్రానికి ముందు వరకు జానపద చిత్రాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తుకు వచ్చేవారని తెలిపారు. అయితే పాతాళ భైరవి సినిమా విడుదలైన తరువాత జానపదం అంటే ఎన్టీఆర్ అనేంతగా ఆయన ప్రభావం చూపారని వెల్లడించారు. జానపదం, సాంఘికం,చారిత్రకం, పౌరాణికం లాంటి చిత్రాలలో ఎన్టీరామరావుగారు జీవించేవారని చెప్పారు. ఇక పాతాళభైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికి, మళ్ళీ చూడాలనిపించేలా ఏదో కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలిపారు.
ఆ మూవీలోని డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయని అన్నారు. యస్.వి. రంగారావుని మాంత్రికుడిగా చూస్తే భయమేసేదని అన్నారు. రీరిలీజ్ చేసినా వంద రోజులు ఆడే చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం ముందు ఉంటుందన్నారు. ఈ చిత్రం ఓటీటీల్లో ఉన్నట్లయితే చూడమని అందరిని పరుచూరి కోరారు.






బాలీవుడ్ లో తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఆదిపురూష్ సినిమాని రూపొందించాడు. దాంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. అది మాత్రమే కాకుండా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఆడియెన్స్, అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్యన రిలీజ్ అయిన మూవీ టీజర్ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను నిరాశ పరిచింది. కారణం క్యారెక్టర్స్ లుక్స్, గ్రాఫిక్స్.
మరి ముఖ్యంగా రావణుడు, హానుమాన్ రూపాలను చూడగానే ఆంగ్ల చిత్రాలను చూసినట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. రాముడు, సీత, పాత్రలను అవమానించారంటూ మూవీ యూనిట్ పై విమర్శలు చేశారు. దీంతో మూవీ యూనిట్ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాని జూన్ 16కు వాయిదా వేసింది. గ్రాఫిక్స్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆ మార్పు అర్ధం అవుతోంది. ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కన్నా ముందుగా డైరెక్టర్ ఓంరౌత్ బాలీవుడ్ స్టార్ హీరోను రాముడిగా అనుకున్నారంట. దర్శకుడు ఓం రౌత్ ముందుగా హృతిక్ రోషన్ కథ చెప్పారట, దానికి హృతిక్ ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పాడట. చివరకు ప్రభాస్ కు కథ చెప్పడం ఆయన ఒప్పుకోవడం జరిగింది.















తొలిప్రేమ మూవీ సూపర్‌హిట్ అవడంతో పాటు వాసుకి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో ఆమె సినిమాలలో నటిస్తూ బిజీగా మారుతుందని అందరు అనుకున్నారు. కానీ వాసుకి ఆ మూవీ తరువాత యాక్టింగ్ మానేసి, తొలిప్రేమ మూవీ ఆర్ట్ డైరెక్టర్ పవన్ కళ్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయిని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయ్యింది. ఆమె పిల్లలు, ఫ్యామిలీ జీవితంతో బిజీ అయిపోయింది. దాదాపు 23 సంవత్సరాల తర్వాత వాసుకి ‘అన్నీ మంచి శకునములే’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది.
ఈ చిత్రంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీలో హీరో సంతోష్ శోభన్ సిస్టర్ క్యారెక్టర్ లో వాసుకి నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. విందా మూవీస్, స్వప్న సినిమా సంస్థల పై ప్రియాంక దత్, స్వప్న దత్, ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాను మే 18న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీలో నటించిన వాసుకి మీడియాతో మూవీ విశేషాలు మరియు ఆమె మళ్ళీ సినిమాలలో నటించడానికి గల కారణాలను వెల్లడించారు.
వాసుకి మాట్లాడుతూ ‘‘తొలిప్రేమ సినిమా తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు నటించడం కుదరలేదు.పెళ్లి, పిల్లలు, వాళ్ళ చదువులు వీటితో నటించడం కుదరలేదు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలు పెద్దగా అయ్యారు. యూకేలో పాప మెడిసిన్, బాబు ఆర్కిటెక్చెర్ చదువుతున్నారు. నా భర్త తన పనిలో బిజీగా వుంటారు. దాంతో ప్రస్తుతం ఏదైనా చేయడానికి నాకు టైమ్ కుదిరింది. ఇలాంటి టైమ్ లోనే డైరెక్టర్ నందిని రెడ్డి ‘అన్నీ మంచి శకునములే’ కథ చెప్పారు. ఆ కథ నచ్చడంతో ఈ చిత్రంలో నటించానని వెల్లడించారు.