రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న మైథిలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం రామాయణం ఆధారంగా వస్తుంది. ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటించిన ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ఎన్నో విమర్శలు ఎదురుకున్న చిత్ర యూనిట్ అవన్నీ సరి చేసుకొని ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం ‘ఆది పురుష్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ చేసారు.

ఈ ట్రైలర్ ని 2D అండ్ 3D ఫార్మాట్స్ లో రిలీజ్ చేస్తుండగా.. 3D ట్రైలర్ ని ఈరోజు సాయంత్రం 5:04 నిమిషాలకు దేశమంతటా పలు థియేటర్స్ లో ప్రదర్శించనున్నారు. అయితే అంతకంటే ముందే ఈరోజు మధ్యాహ్నం ఈ ట్రైలర్ ని ఆడియన్స్ ముందుకు వచ్చింది.

ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది నా రాముడి కథ అంటూ వాయిస్`ఓవర్‌తో మొదలుపెట్టారు. ‘ఆయన మనిషిగా పుట్టిన భగవంతుడు అయిన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రామనామం.. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందుడి ఘనత. యుగయుగాల్లోనూ సజీవం. జాగృతం. మా రాఘవుడి కథే రామయణం..’ అంటూ ట్రైలర్‌ను పరిచయం చేశారు.

సీతను రావణుడు అపహరించడంతో మొదలుపెట్టి రాముడి ఆగమనం, ఆయోధ్య పరిచయం ఇలా కొనసాగించి చివరికి రామ, రావణ యుద్ధం షాట్లతో ట్రైలర్‌ను ముగించారు. ఇక ఈ ట్రైలర్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్రైలర్ చూసిన ఆడియన్స్ టీజర్ లోని గ్రాఫిక్స్ కంటే ఇప్పటి VFX వర్క్ బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ పై నెట్టింట పలు మీమ్స్ వైరల్ అవుతున్నాయి.. వాటిపై ఓ లుక్కేయండి..
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18

watch video :

పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి ఒక చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాని డైరెక్టర్ మరియు నటుడు అయిన సముద్రఖని తెరకెక్కిస్తున్నాడు. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘వినోదయ సీతం’ రీమేక్ గా తెలుగులో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా నటిస్తున్నారు. ఇంతకు ముందు విక్టరీ వెంకటేష్ నటించిన గోపాల గోపాల సినిమాలో పవన్ కళ్యాణ్ కృష్ణుడిగా కనిపించారు. మళ్లీ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో ఆడియెన్స్ ని అలరించబోతున్నారు.
ఈ చిత్రం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రీకరణ దాదాపు పూర్తయ్యిందని సమాచారం. ఈ చిత్రంలోపవన్ తన పాత్ర షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తోంది. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీ టైటిల్ గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు దేవర దేవుడు, దేవుడే దిగి వచ్చినా అనే టైటిల్స్ వినిపించాయి. తాజాగా ఈ మూవీ టైటిల్ లీక్ అయినట్టు తెలుస్తోంది.
“బ్రో” అనే టైటిల్ ఎంచుకున్నారని తెలుస్తోంది. ఈ టైటిల్‌ను ఎంచుకోవడానికి కారణం ఏమిటంటే సాయిధరమ్ తేజ్ పవన్ కల్యాణ్‌ని సినిమాలో “బ్రో” అని పిలుస్తాడని, అందువల్ల అదే టైటిల్ గా పెట్టారని తెలుస్తోంది. అయితే ఈ టైటిల్ కి మాత్రం అంత మంచి స్పందన రావట్లేదు. సోషల్ మీడియాలో ఈ టైటిల్ ఇప్పటికే వైరల్ అయ్యింది. టైటిల్ చూసిన చాలా మంది, “అసలు పవన్ కళ్యాణ్ సినిమాకి ఉండాల్సిన టైటిల్ ఇదేనా?” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీని పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని జూన్ 28న విడుదల చేయనున్నారట.
నాలుగేళ్లకి పైగా ప్రేమించుకున్న తర్వాత 2017లో ఇరు కుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు. 2021లో ఈ జంట విడాకులు తీసుకుని, విడిపోయారు. నాగచైతన్య, సమంత డివోర్స్ తీసుకున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అప్పటి నుండి ఇద్దరి పర్సనల్ విషయాల గురించి తరచుగా సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక డివోర్స్ గురించి చైతూ, సామ్ లకు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నయి. ఈ క్రమంలో కస్టడీ ప్రమోషన్లలో భాగంగా నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో విడాకుల పై స్పందించారు.
తమ డివోర్స్ అయిపోయిందని, ఇద్దరం ఒకేసారి సోషల్ మీడియాలో ప్రకటించామని, ఇది ముగిసిపోయిందని, ఇంకా ఈ విషయాన్ని ఎందుకు సాగదీస్తున్నారో తనకు అర్థం కావట్లేదని చెప్పారు. అయిన కొంతమంది తమ న్యూస్ హెడ్ లైన్స్ కోసం ఇలా సాగదీయడం చాలా తప్పు అని చెప్పుకొచ్చారు. కొత్త చిత్రాలు రిలీజ్ అయిన శుక్రవారం రోజే అంతా డిసైడ్ అయిపోతుందని అన్నారు. అలాగే తన చిత్రాలు రిలీజ్ అయినపుడు సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్, రేటింగ్స్ చూస్తానని అన్నారు.
ఆ కామెంట్స్ చూస్తే కొన్నిసార్లు ఎందుకు ఇంకా బ్రతుకున్నామో అన్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఆడియెన్స్ వైపు నుండి కూడా ఆలోచిస్తానని చెప్పారు. ఇక నాగచైతన్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం కస్టడీ మే 12న విడుదల కానుంది. ఈ చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించారు. ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన మూవీ ట్రైలర్ కస్టడీ చిత్రం పై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రాన్ని తెలుగు మరియు తమిళ భాషల్లో మే 12న విడుదల చేయనున్నారు.


1. సీతారామ కళ్యాణం:
2. సంపూర్ణ రామాయణం- 1958:
3. లవకుశ:
4. పాదుకా పట్టాభిషేకం:
5. వీరాంజనేయ:
6. సంపూర్ణ రామాయణం:
7. శ్రీ రామాంజనేయ యుద్ధం:
9.సీతా రామ వనవాసం:
10. శ్రీరామ పట్టాభిషేకం:
11. రామాయణం:
12. శ్రీరామరాజ్యం:
బాపుగారు దర్శకత్వం వహించిన మరో పౌరాణికం సినిమా ‘శ్రీరామరాజ్యం’. ఈ చిత్రం ఎన్టీఆర్ నటించిన ‘లవకుశ’ చిత్రానికి రీమేక్ లాంటింది. ఈ చిత్రంలో రాముడిగా నందమూరి బాలకృష్ణ నటించారు. సీతగా నయనతార నటించింది.
ఈ సినిమాలో రాముడిగా ప్రభాస్ నటించగా, సీతగా కృతి సనన్ నటిస్తున్నారు. ఈ మూవీ జూన్ 16 న రిలీజ్ కాబోతుంది.


సిల్క్ స్మిత ఎలాంటి సినినేపథ్యం లేకుండా మేకప్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీకి వచ్చి, స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. సిల్క్ స్మిత తన నిషా కళ్లతో ఆడియెన్స్ ని మాయలో పడేసింది. అప్పట్లోనే గ్లామర్ రోల్స్ లో నటించింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం వెయిట్ చేసేవారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికీ తెలుగు ఆడియెన్స్ మనసుల్లో ఆమె అలాగే ఉండిపోయింది. దశాబ్దం పాటు ఇండస్ట్రీలో వందలాది సినిమాలలో నటించిన ఆమె, చివరకు బలవన్మరణానికి పాల్పడి, కన్నుమూసింది. ఆమె మరణం చాలా మందిని కలిచివేసింది.
అయితే ఆమె మరణించిన తరువాత ఇండస్ట్రీ నుండి ఒక్క హీరో కానీ, డైరెక్టర్స్, నిర్మాతలు ఎవరు వెళ్లలేదు. ఆఖరికి ఆమె కుటుంబసభ్యులు కూడా సిల్క్ స్మితను చూడాటానికి వెళ్లలేదు. దాంతో సిల్క్ స్మితకు అనాథ శవంలా అంతిమ సంస్కారాలు చేశారు. అయితే ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో సిల్క్ స్మిత అందాల తారగా నిలిచిపోయింది. ఇటీవల రిలీజ్ అయిన దసరా మూవీలో కనిపించిన సిల్క్ స్మిత పోస్టర్ తో ఆమె జీవితం వార్తల్లో నిలిచింది.
అచ్చం సిల్క్ స్మిత లాగే కనిపిస్తున్న ఒక అమ్మాయి ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారడంతో ఆమెను ఫ్యాన్స్ జూనియర్ సిల్క్ స్మిత అని పిలుస్తున్నారు. ఆమె పేరు విష్ణు ప్రియ. ఫేస్ మాత్రమే కాకుండా ఎక్స్‌ప్రెషన్స్‌తో సైతం ఆమె సిల్క్ స్మితను గుర్తు చేస్తుంది. అంతే కాకుండా విష్ణుప్రియ సిల్క్ స్మిత సాంగ్స్ కు రీల్స్ చేస్తూ నెట్టింట్లో సందడి చేస్తోంది. విష్ణు ప్రియ జూనియర్ సిల్క్ గా పాపులర్ అయ్యింది.
2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్‌కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్‌లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్‌లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్‌లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు. వసూళ్ల పరంగా మొత్తం ఓపెనింగ్ వీకెండ్ గ్రాస్ 18 కోట్లకు పైగా ఉంటుంది. 2018 మలయాళం సినిమా అత్యధిక ఓపెనింగ్ కలెక్షన్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది.
ప్రభాస్, కృతి సనన్ సీతారా చిత్రం ములుగా నటిస్తున్న ‘ఆదిపురుష్’. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ వి.ఎఫ్.ఎక్స్ నాసిరకంగా ఉందని, కార్టూన్ మూవీలా ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేశారు. అయినప్పటికీ ‘ఆదిపురుష్’ టీజర్ ట్రెండ్ అవడమే కాక, యూట్యూబ్ లో వంద మిలియన్లకు పైగా వ్యూస్ తో రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్ రావడం, ప్రభాస్ లుక్ పై సెటైర్లు రావడం ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు అని చెప్పవచ్చు.
ఒక ట్విట్టర్ యూజర్ ఇలా ట్వీట్ చేశారు. ట్రైలర్ నిడివి 3 నిమిషాల 22 సెకన్లు. ట్రైలర్ సీతను ఎత్తుకెళ్ళే సన్నివేశంతో మొదలై, రావణుడితో ఆఖరి పోరు వరకు జరిగే సంఘటనలతో కుడి ఉందని తెలిపారు. డీసెంట్ ట్రైలర్, టీజర్ కంటే వీఎఫ్ఎక్స్ బెటర్ గా ఉందని ట్వీట్ లో రాసుకొచ్చారు.
‘ఆదిపురుష్’ ట్రైలర్ ను చూసిన మరొక ట్విట్టర్ యూజర్ తన ట్వీట్ లో ” ట్రైలర్ లో 2 నిముషాల 32 సెకండ్ల వద్ద షాట్ గూస్బంప్స్ వచ్చేలా ఉందని బెస్ట్ వి.ఎఫ్.ఎక్స్ షాట్” అని రాసుకొచ్చారు. అలాగే మరొక ట్వీట్ లో ట్రైలర్ లోని చివరి షాట్ అందరినీ విస్మయానికి గురి చేస్తుందని తెలిపారు. 




