పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న చిత్రాలలో ‘ఆదిపురుష్’ మూవీ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ తొలిసారిగా శ్రీ రాముడి క్యారెక్టర్ లో నటిస్తున్నాడు.
ఈ చిత్రం పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా ఆదిపురుష్ ట్రైలర్ మే 9న విడుదల కానుందని ప్రభాస్ తన ఇన్స్టా ఖాతాలో తెలియజేశారు. కొన్ని ఎంపిక చేసిన థియేటర్లలో త్రీడీ ట్రైలర్ను ప్రదర్శించనున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఏ థియేటర్లలో ‘ఆదిపురుష్’ స్క్రీనింగ్ చేస్తున్నారో ఇప్పుడు చూద్దాం..
1. నిజాం
నైజాంలో ‘ఆదిపురుష్’ త్రీడీలో ట్రైలర్ స్క్రీనింగ్ అయ్యే జిల్లాలు..
1. హైదరాబాద్
2. వరంగల్
3. ఖమ్మం
4. కరీంనగర్
5. నిజామాబాద్
6. మహబూబ్ నగర్
7. నల్గొండ
8. ఆదిలాబాద్
9. రంగారెడ్డి
ఈ జిల్లాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.

2. ఆంధ్రప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ లో ‘ఆదిపురుష్’ త్రీడీలో ట్రైలర్ స్క్రీనింగ్ అయ్యే జిల్లాలు..
1. ఈస్ట్ గోదావరి
2. వెస్ట్ గోదావరి
3. గుంటూరు
4. కృష్ణా
5. నెల్లూరు
ఈ జిల్లాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.
3. సీడెడ్:
సీడెడ్ లో ‘ఆదిపురుష్’ త్రీడీలో ట్రైలర్ స్క్రీనింగ్ అయ్యే ప్రాంతాలు..
1. తిరుపతి
2.చిత్తూరు
3. శ్రీ కాళహస్తి
4. కడప
5. ప్రొద్దుటూరు
6. పులివెందుల
7. రాజంపేట
8. అనంతపూర్
9. హిందూపూర్
10. గుంతకల్
11. ధర్మవరం
12. కర్నూల్
13. నంద్యాల
14. ఆదోని
15. ఎమ్మిగనూరు
ఈ ప్రాంతాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.

4. ఉత్తరాంధ్ర:
ఉత్తరాంధ్రలో ‘ఆదిపురుష్’ త్రీడీలో ట్రైలర్ స్క్రీనింగ్ అయ్యే ప్రాంతాలు..
1. విశాఖపట్నం
2. విజయనగరం
3. శ్రీకాకుళం
ఈ ప్రాంతాల్లో ఏయే థియేటర్స్ లో ‘ఆదిపురుష్’ ట్రైలర్ స్క్రీనింగ్ అవుతుందనేది ఇక్కడ చూడండి.
హీరో ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పౌరాణిక మూవీ “ఆదిపురుష్” జూన్ 16న రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ట్రైలర్ ను నభూతో నభవిష్యతి అనేలా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఆదిపురుష్ త్రిడీ ట్రైలర్ మే 9న రిలీజ్ కానుంది. ఆ రోజు సాయంత్రం 5:30 నిమిషాలకు అటు థియేటర్స్ లోనూ, ఇటు సోషల్ మీడియా మధ్యమాలలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read: “ప్రభాస్” ‘ఆదిపురుష్’ మూవీ లో ‘సీత’ పాత్రకి ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా..??



















అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఏజెంట్’ మూవీ నిరాశపరిచిన విషయం తెలిసిందే. అయితే రిలీజ్ అయిన 4 రోజులకే ఈ చిత్ర నిర్మాత మూవీ ఫెయిల్యూర్ ను ఒప్పుకుంటు, తమ దగ్గర బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మూవీ మొదలు పెట్టామని చెప్పారు. ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి గతంలో దర్శకులకు చేసిన సూచనలు ఇప్పుడు వైరల్ గా మారాయి. చిరంజీవి ఆరోజు చెప్పిందే ఏజెంట్ మూవీ విషయంలో జరిగిందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో కూడా ఇదే టాక్ వినిపిస్తోందని సమాచారం. కానీ చిరంజీవి అప్పుడు అలా చెప్పినపుడు ఆయన పై విమర్శలు, ట్రోల్స్ విపరీతంగా చేశారు. ఇప్పుడు ఆయన చెప్పిందే నిజం అని అంటున్నారు. వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ యంగ్ దర్శకులకు పలు సూచనలు చేశారు. మూవీ షూటింగ్ మొదలు పెట్టడానికి ముందే దర్శకులు బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం చేసుకోవాలని సూచించారు. చిత్రీకరణ మధ్యలో సందర్భానుసారంగా సన్నివేశంలో మార్పులు చేస్తే పర్లేదు.
అయితే అప్పటికప్పుడే సన్నివేశాన్ని రాసుకునే పద్ధతిని పద్దతిని,అప్పుడు కథ రాసుకునే విధానాన్ని మానుకోవాలని సూచించారు. సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్ ను దాటి ఒక్క సన్నివేశాన్ని కూడా రూపొందించకుండా ముందుగానే పేపర్ వర్క్ చేసుకోవాలని సూచించారు. ఆ విధనగా నిర్మాతకి డబ్బు ఆదా అయ్యేలా చేయాలని, నిర్మాతలను బతికించాలని, నిర్మాతలు బాగుంటేనే ఇండస్ట్రీలో మరిన్ని చిత్రాలు వస్తాయని, అప్పుడే సినీ పరిశ్రమ బాగుంటుదని మెగాస్టార్ యువ దర్శకులకు గట్టిగానే చెప్పారు. మరి ఇక నుండి అయిన డైరెక్టర్స్ మెగాస్టార్ సూచనలు పాటిస్తారేమో చూడాలి.
















#8
#9
#10
#11
#12
మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్స్ లో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ ఒకటి. ఈ చిత్రం పైన ప్రకటించినప్పటి నుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్నిపాన్ ఇండియా మూవీ అనుకున్నారంత. రామ్ చరణ్ కి ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ మూవీని పాన్ గ్లోబల్ ఫిల్మ్ గా మారుతుందని కొందరు భావించారు.
అయితే ఈ మూవీ ఎవరు ఊహించని విధంగా ఈ మూవీ రీజనల్ చిత్రంగా తెరకెక్కుతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా రీజనల్ మూవీ అని ఫిల్మ్ నగర్ లో టాక్. అది కూడా ద్విభాషా చిత్రం అని, తెలుగుకు దగ్గరగా పూర్తి స్థాయి తమిళంలో తెరకెక్కుతున్న సినిమా అని వినిపిస్తోంది.
రీజనల్ సినిమా అనే విషయం ప్రస్తుతం అందర్నీ షాక్ కి గురి చేస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో నెటిజెన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గత ఏడాది ఎన్నో అంచనాల మధ్యన వచ్చిన లైగర్ చిత్రంలో కూడా చాలావరకు హిందీనే ఉంటుంది. ఇపుడు గేమ్ ఛేంజర్ చిత్ర విషయంలో కూడా మేకర్స్ అదే తప్పు చేస్తున్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి.
రీసెంట్ గా డాన్స్ మాస్టర్ చైతన్య నెల్లూరులో ఒక హోటల్ లో ఉరి వేసుకుని మరణించాడు. అతను మరణించే ముందు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. అందులో అప్పుల వల్లనే ఇలా చేస్తున్నానని, జబర్దస్త్ లో ఎక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని, ఢీ షోలో తక్కువ రెమ్యూనరేషన్ ఇస్తారని తెలిపాడు. దాంతో మల్లెమాల వారు ఢీ షోలో పనిచేసేవారికి తక్కువ రెమ్యూనరేషన్ ఇవ్వడం వల్లనే అతను ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
తాజాగా అదిరే అభి ఈ విషయం పై స్పందించాడు. చైతన్య మాస్టర్ మరణం నేపథ్యంలో ఇండస్ట్రీకి కొత్తగా వచ్చే వారికి అదిరే అభి కొన్ని సూచనలు చేశాడు. అదిరే అభి తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పంచుకున్నాడు. ఆ వీడియోలో సిని పరిశ్రమ లేదా టీవీ పరిశ్రమలోకి రావాలని అనుకునేవారికి, వచ్చే వారికి అంత తేలికగా అవకాశం దొరకదు. రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం చెప్తారని అనుకోవడం, డబ్బులు బాగా ఇస్తారని అనుకోవడం చాలా పొరపాటు. ఇక్కడికి వచ్చాక ఎంతోమంది కష్టాలు పడి, తమ కడుపు మాడ్చుకొని, నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపితే తప్ప ఒక బ్రేక్ రాదు.
ఆ బ్రేక్ వచ్చిన తరువాత కూడా దానిని కొనసాగించడం కూడా పెద్ద విషయమే. ఇవ్వన్ని చెప్పడానికి కారణం ఇండస్ట్రీలోకి రావలనుకునేవారు ఇవ్వని తెలుసుకొని మానసికంగా సిద్ధపడి వస్తే, వచ్చాక ఏర్పడిన కష్టాలను ఎదుర్కోవచ్చు. అలాగే ప్లాన్ బి కూడా పెట్టుకుంటే కాస్త ధైర్యంగా ఉంటారు. అలాగే వచ్చిన ఆదాయంలో కూడా కొంచెం దాచుకోవడం వల్ల కష్టకాలంలో ఆ డబ్బు ఉపయోగపడుతుంది. ఒకటి రెండు చిత్రాలలో నటించిన తర్వాత కానీ, రెండు మూడు షోలలో చేసిన తర్వాత అయిన ఇబ్బందులు ఎదురు కావచ్చు.
అంత పెద్ద స్టార్ అమితాబచ్చన్ కూడా 1990 చివర్లో ప్రొడ్యూసర్ గా 100 కోట్లకు పైగా నష్టాలను చూశారు. అయితే అమితాబ్ ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ షోతో మళ్లీ డబ్బులు సంపాదించారు. కాబట్టి కెరీర్ లో ఏ టైమ్ లో అయినా ఇబ్బందులు రావచ్చు. వాటి కోసం జీవితానికి ముగింపు పలికే నిర్ణయాలు తీసుకోవద్దని అభి చెప్పుకొచ్చాడు. అలాగే షోకి వచ్చే రేటింగ్ ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తారని, జబర్దస్త్ షోకి రేటింగ్ ఎక్కువ వస్తుంది కాబట్టి అందులో పని చేసేవారికి రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తారని చెప్పుకొచ్చారు.