బలమైన కథ, గ్రాండ్ విజువల్స్, భారీ హంగులతో సినిమాను రూపొందిస్తే భాష, ప్రాంతాలతో సంబంధం లేకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులంతా ఆదరిస్తారని ‘బాహుబలి’తో రుజువైంది. ఈ సినిమాతో ఎస్.ఎస్.రాజమౌళి పాన్ ఇండియా లెవెల్లో సూపర్ సక్సెస్ కావడంతో చాలా మంది ఫిల్మ్ మేకర్స్‌కి తమ కలల ప్రాజెక్ట్‌లు తెరకెక్కించడానికి ధైర్యం వచ్చింది.
అలాంటి ఒక ధైర్యంతోనే దిగ్గజ దర్శకుడు మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ నవలను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయించుకున్నారు. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ అనే నవలను తెరకెక్కించాలని 4 దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. దీనిని రెండు భాగాలుగా తెరకెక్కించాలని భావించిన మణిరత్నం.. మొదటి భాగం ‘పొన్నియిన్ సెల్వన్: 1’ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

తమిళ్ తో పాటు హిందీ, తెలుగు, కన్నడ, మలయాళంలో ఈ సినిమాను ఏక కాలంలో సెప్టెంబర్ 30ని ఈరోజు విడుదల చేశారు. విక్రమ్, జయం రవి, కార్తి, ఐశ్వర్య రాయ్ బచ్చన్, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శరత్‌కుమార్, విక్రమ్ ప్రభు, శోభిత ధూళిపాళ, జయరామ్, ప్రభు, పార్తిబన్, ప్రకాష్ రాజ్ వంటి భారీ తారాగణం నటించిన ఈ మూవీకి మొదటి షో నుండే మిశ్రమ స్పందన వచ్చింది.

ఇక ఇది ఇలా ఉంటే ఈ చిత్రంలో విక్రమ్ కూడా అద్భుతంగా నటించారు. విక్రమ్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలు చేసి విక్రమ్ మంచి నటుడనిపించుకున్నారు. పైగా నటనంటే చాలా ఇష్టం విక్రమ్ కి. అందుకే భిన్నంగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ ఉంటారు. విక్రమ్ తమిళంలో టాప్ హీరోలలో ఒకరు. ప్రేక్షకులు ఈయన నుండి ఏం కోరుకుంటారో అటువంటి పాత్రలనే అతను చేస్తారట. సెట్స్ లో కూడా విక్రమ్ చాలా సరదాగా ఉంటారు.

తెలుగులో వచ్చిన నాన్న చిత్రంలో కూడా విక్రమ్ ఎంతో అద్భుతంగా నటించారు. అయితే ‘నాన్న’ చిత్రం మీకు గుర్తుందా..? అందులో ఒక చిన్న పాప విక్రమ్ కి కూతురు గా నటిస్తుంది. అయితే ఆ పిల్ల ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో విక్రమ్ కి క్రష్ పాత్ర చేసింది. ఐశ్వర్యా రాయ్ చిన్నప్పటి పాత్ర ఈ అమ్మాయి చేసింది. ఇలా ఆమె నటించడంతో సోషల్ మీడియాలో పెద్దఎత్తున మీమ్స్ వస్తున్నాయి. అప్పుడు విక్రమ్ కి కూతురుగా నటించిన ఈ చిన్నారి ఇప్పుడు పొన్నియన్ సెల్వన్ సినిమాలో క్రష్ గా నటించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.









సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బన్నీ కెరీర్ ను మలుపు తిప్పింది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో పెరిగిపోయింది. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చిత్రంలో నటించబోతున్నాడు. ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ కెరీర్లో కొన్ని సినిమాలు ప్రకటన దశలోనే నిలిచిపోయాయి. మరి ఆ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1.అల్లు అర్జున్-వేణు శ్రీరామ్ :
2.అల్లు అర్జున్-లింగుస్వామి :
3.అల్లు అర్జున్-కొరటాల శివ :
Also Read:
తన తండ్రిది వరంగల్ అని, హైదరాబాద్ లో స్థిరపడ్డారని, తను ఏడాదిన్నర వయసు నుండే మాట్లాడేదాన్ని అని తెలిపింది. ఒక పార్టీలో నన్ను చూసి సినిమాలలో ఛాన్స్ ఇచ్చారని తెలిపింది. నాతోపాటు అమ్మ, అమ్మమ్మ షూటింగ్ కు వచ్చేవారు. హీరో భానుచందర్ గారు నటించిన ‘ఉద్యమ నా తొలి సినిమా. నేను చిన్నపిల్లను అవడంతో హీరోలంతా నాతో బాగుండేవారు. రామ్‌చరణ్ వల్ల ఇంటికి వెళ్లినపుడు టెడ్డీబేర్‌తో ఎక్కువగా ఆడుకునేదాన్ని. చెన్నైలో ఒకసారి షూటింగ్‌కు వెళ్ళిన సమయంలో రామ్‌చరణ్ ఉప్మా చేసి పెట్టారని తెలిపింది. అది నా లైఫ్ లో మర్చిపోలేని క్షణాలు.
ఇక సమరసింహారెడ్డి సినిమా ఆఖరి రోజు షూటింగ్ లో ప్రొడక్షన్ టీమ్‌లో ఉన్నవారందరికి వెండి రింగ్స్ ఇచ్చాను.
Also Read:
బలగం సినిమాలో అంతగా సీన్లు లేకున్నా, ఒక్క డైలాగ్ లేకున్నా, సౌదామిని తన సిగ్గు పడుతూ, ఇన్నోసెంట్ నటనతో ఆడియెన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇటీవల సౌదామిని ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ అడిషన్ కు వెళ్లినపుడు డైరెక్టర్ వేణు సిగ్గు పడమని చెప్పారని, తాను అలాగే చేయడంతో తనను ఆ పాత్రకు వెంటనే ఎంపిక చేశారు. ఈ చిత్రం కోసం కేకులు బాగా తిని 10 కిలోలు బరువు పెరిగానని తెలిపారు. నా మొదటి చిత్రం ఇదేనని చెప్పారు.
తనకు ఫన్ జోనర్ చిత్రాలు అంటే ఇష్టమని అన్నారు. చిన్నతనం నుండే ఆర్టిస్ట్ కావాలని అనుకున్నానని తెలిపారు. బీఎస్సీ మొదటి సంవత్సరంలోనే కోవిడ్ కారణంగా ఆగిపోయిందని చెప్పారు. అవకాశాల కోసం ఎక్కడికి వెళ్ళిన తన అన్నయ్యను తీసుకెళ్ళేదానినని చెప్పుకొచ్చారు. కొందరు నీ ఫేస్ కి హీరోయిన్ అవుతావా అని అనేవారని దామిని తెలిపారు. హీరోలలో మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్ అభిమాన హీరోలు అని అన్నారు.
దర్శకుడు వేణు ఈ సినిమాలో ఛాన్స్ ఇవ్వడం వల్లే ఇంత గుర్తింపు వచ్చిందని సౌదామిని వెల్లడించారు. జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ కాల్ చేసి అప్రిషియేట్ చేశారని, తమ సినిమాలో మంచి పాత్ర ఇస్తామని అన్నారని తెలిపారు. సౌదామిని చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.




అక్కినేని నాగార్జున కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అఖిల్ కి హీరోగా మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత పలు చిత్రాలు చేసినప్పటికి వాటిలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మాత్రమే హిట్ గా నిలిచింది. ప్రస్తుతం అఖిల్ భారీ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ నేపథ్యంలోని డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన ఏజెంట్ సినిమాలో నటించాడు. స్పై థ్రిల్లర్ సినిమాగా రూపొందిన ఈ చిత్రం నేడు రిలీజ్ అయ్యింది.
రీసెంట్ గా ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ పలు ఇంటర్వ్యూలు ఇచ్చారు. అఖిల్ ఈ మూవీకి సంబందించిన చాలా విషయాలను మీడియాకు వెల్లడించారు. ఇక ఈ మూవీకి హీరో అఖిల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయాన్ని ఈ మూవీ ప్రొడ్యూసర్ అనిల్ సుంకర వెల్లడించారు.
నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ 80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీకి అఖిల్ పారితోషికం తీసుకోకుండానే వర్క్ చేసినట్లు తెలిపారు. ఈ మూవీ నిర్మాణంలో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇద్దరు భాగమయ్యారని నిర్మాత వెల్లడించారు. మా సినిమా కోసం వర్క్ చేసిన వారంతా వారి మొత్తం రెమ్యూనరేషన్ తీసుకుంటే మూవీ బడ్జెట్ వంద కోట్లు అయ్యేదని అన్నారు. అయితే అఖిల్, సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండా తమ రెమ్యూనరేషన్‌ని మూవీ నిర్మాణంలో పెట్టుబడిగా పెట్టారని తెలిపారు.
ఇక ఈ చిత్రానికి బడ్జెట్ ఏమాత్రం సమస్య కాదని థియేటర్ మరియు డిజిటల్ పరంగా మూవీ సేఫ్ లోనే ఉంటుందని ప్రొడ్యూసర్స్ బడ్జెట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని తెలిపారు. మొత్తానికి హీరో అఖిల్, డైరెక్టర్ సురేందర్ రెడ్డి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే ఏజెంట్ చిత్రానికి పనిచేశారు. ఈ చిత్రం మంచి విజయం సాధిస్తే, వచ్చిన లాభాల్లో వీరికి కొంత వాటా వస్తుందని అంటున్నారు.