ఇప్పటి హీరోయిన్లతో పోల్చుకుంటే అప్పట్లో హీరోయిన్లు ఎక్కువ మంది తమ కెరీర్ ను సరిగా ప్లాన్ చేసుకోలేక, కొంతమంది సంపాదించిన దానిని సరిగ్గా ఉపయోగించక పోవడం వల్ల ఎన్నో ఇబ్బందులు పడ్డారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఆరోజుల్లోనే కెరీర్ ను సంపాదనను కూడా జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లారు. అలాంటి వారిలో సినియర్ నటి కేఆర్ విజయ ఒకరు.
ఆరోజుల్లో కేఆర్ విజయ బాగా పాపులర్ హీరోయిన్. నటుడు జెమినీ గణేషన్ ప్రోత్సాహం వల్ల ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అలా వచ్చిన విజయకు మళ్ళీ వెను తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఆమె తరువాటి తరం హీరోల చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను అలరించారు. ఆమె అగ్ర హీరోలకు తల్లిగా నటించారు. ముఖ్యంగా దేవత పాత్రలో అనేక సినిమాలలో నటించి మెప్పించారు. ఇప్పటికి దేవత పాత్ర అంటే మొదట గుర్తొచ్చేది కేఆర్ విజయ.
దాదాపు అప్పటి అగ్ర హీరోలందరికి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరావు, సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నసమయంలోనే పెద్ద వ్యాపావేత్తను వివాహం చేసుకుని, సెటిలయ్యారు. పెళ్లి తరువాత ఆమె మహారాణి వంటి జీవితాన్ని గడిపారు. ఆమె భర్త వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, ఆమెకు అప్పట్లోనే సొంత హెలికాప్టర్ కూడా ఉండేది.
దానిని కేఆర్ విజయ భర్తే నడిపేవారట. ఆమెకి ఎక్కడ మూవీ షూటింగ్స్ ఉన్నా తన సొంత హెలికాప్టర్లోనే వెళ్ళి వచ్చేవారంట. అయితే ఆరోజుల్లో స్టార్ హీరోలకు సైతం సొంత హెలికాప్టర్ లేవు. ఇక ఆమె భర్తకు ఎన్నో రకాలు వ్యాపారాలు ఉండేవని, దాంతో మద్రాస్ దగ్గరలో 67 ఎకరాల తోట కొన్నారు. అంతేకాకుండా కేఆర్ విజయ రాజభవనం వంటి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారట. ఆ ఇంటి పై భాగంలోహెలికాప్టర్ ఆగేదంట.
విజయ వైభోగం గురించి సినీ పరిశ్రమలో అంతా చెప్పుకునేవారంట. ఆమె ఇంటిలో స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులు ఉండేవట. అవన్నీ చూసి అప్పట్లో అగ్ర హీరోలు ఎంతో ఆశ్చర్యపోయేవారట.కేఆర్ విజయ భర్త మరణాంతరం కుమార్తెతో కలిసి చెన్నైలో జీవిస్తోంది. అయితే ఆమె గతంలో ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలన్నీటిని ఆమె స్వయంగా చెప్పింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read: మిగిలిన హీరోలు చేస్తే లేనిది… “మహేష్ బాబు” చేస్తే మాత్రం ఎందుకు వచ్చింది..?

సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ మీడియా మీ పై వస్తున్నట్రోల్స్ గురించి మీ రియాక్షన్ ఏమిటి అని అడగడంతో కీర్తి ఇలా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో తన పై వచ్చే ట్రోల్స్ ను మరియు నెగిటివ్ కామెంట్స్ తాను పట్టించుకోను అని తెలిపింది. మహానటి చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు తన పై దారుణమైన ట్రోల్స్ చేశారని కీర్తి సురేశ్ చెప్పారు.
సావిత్రి క్యారెక్టర్ చేయడానికి మొదట తాను చాలా భయపడ్డానని, అందుకే ఆ సినిమాకి మొదట నో చెప్పానని అన్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నువ్వు చేయగలవు అని ప్రోత్సహించడంతో ఆ మూవీ చేయగలిగానని తెలిపింది. ఈ పాత్ర చేయడం నీకే సాధ్యం అని డైరెక్టర్ చెప్పడంతో ఆయనకి అంత నమ్మకం ఉండడంతో మహానటి సినిమాలో నటించానని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కెరీర్ మహానటి తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు మహానటి చిత్రం అంత పాపులారిటీని తీసుకొచ్చింది.
Also Read:
ఈ విధంగా 3 వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పది మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఒకే ఒక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ మహేష్ బాబుకు మాత్రమే ఉండడంతో ఆయన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి అని వినిపిస్తోంది. ఈ సినిమాని జక్కన్న పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంతే కాకుండా రాజమౌళి గత చిత్రాల కన్నా రెట్టింపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని వినిపిస్తోంది. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంగానే మహేష్ బాబు అరుదైన రికార్డును నమోదు చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ బాబు 100 కోట్ల పారితోషికం తీసుకునే సెలబ్రిటీల లిస్ట్ లో చేరనున్నారు.
Also Read: 






ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు రహస్యంగా, సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తరువాత ఆ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా వివాహం చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి ఇక్కడ కాకుండా విదేశాల్లో చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రియాంక నల్కారి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి సుపరిచితామే. బాలనటిగా కూడా చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్నింటిలో ముఖ్యమైన పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి యాంకర్‌గా చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు యాంకర్ గా గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఆఫర్స్ లేకపోవడంతో ప్రియాంక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమె నటిస్తోన్న రోజా సీరియల్ తమిళంలో టాప్ రేటింగ్‌తో రన్ అవుతోంది. దాంతో అక్కడ ప్రియాంకకు పాపులారిటీ విపరీతంగా వచ్చింది.
ఈ క్రమంలో మార్చి 23న ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి వ్యక్తితో ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్‌గా దేవాలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు అందరు సడెన్‌గా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటూనే శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రియాంక తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు మనుషులు ఆపుతున్నారు. విష్ణు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. కానీ ఆ తరవాత ఎందుకో డిలీట్ చేశాడు. అయితే గతంలోనే వీరి మధ్య గొడవలు ఉండేవని, మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి. పిల్లలు చిన్న వయసులోనే విద్యాదేవి మరణించడంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కుమారుడే మనోజ్. ఇక మనోజ్ కు మంచు లక్ష్మీతో పాటు విష్ణుతో కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లిని అక్క లక్ష్మీనే దగ్గరుండి మరి తల్లిలా జరిపించారు.
Also Read:
ఉపాసన అందించిన సేవలకు ఈ ఘనత లభించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఇందుకు గాను ఉపాసన కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది. పర్సనల్ జీవితాన్ని మరియు ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా నిర్వహిస్తున్న వారిలో ఉపాసన ఒకరని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. వీటన్నిటితో మెగా కుటుంబంలో సంతోషాలు నిండాయని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఉపాసన తరచుగా సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కూడా చేస్తోంది. ఆమె ఇప్పుడు అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. అంతే కాకుండా ఎడిటర్‌గా ‘బి పాజిటివ్’ హెల్త్ మ్యాగజైన్‌కు వ్యవహరిస్తున్నారు. ఆమె చిన్నతనం నుండే బిజినెస్ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఆమె ‘యు ఎక్స్చేంజ్’ సంస్థ స్థాపించి, పాత స్కూల్ బుక్స్ ను సేకరించి, వాటిని పేదవారి పిల్లలకు అందచేసేవారు. అలాగే మురికివాడల్లో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తమ అపోలో హెల్త్ సిటీలో ఉచితంగా చికిత్స చేయించేవారు.
Also Read:
ఆ నటి పేరు వడివుక్కరసి. ఆమె కోలీవుడ్ లో పాపులర్ యాక్టర్. ఆమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. తెలుగులో కూడా తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె తన వయసు కన్నా ఎక్కువ వయసు పాత్రలలో మెప్పించింది. వడివుక్కరసి సుమారు 350 పైగా సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.
అయితే ఆమె తొలిసారి తెలుగు ఆడియెన్స్ కి కనిపించింది అరుణాచలం సినిమాతోనే. ఈ మూవీలో వడివుక్కరసి క్యారెక్టర్ కీలకమైనది. ఈ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్ కి బాగా గుర్తుండిపోయాయి. ఈ మూవీలో బామ్మగా, వంగిన నడుముతో గూని ఉన్నట్టుగా కష్టపడుతూ కూడా షూటింగ్ అంతా సింగిల్ షాట్ లోనే చేసిందట.
ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసు అయినా కూడా ఆమె బామ్మ పాత్రలో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్ చూసి, రజనీకాంత్ వడివుక్కరసి గట్టిగా హత్తుకున్నారట. అంతే కాకుండా నువ్వు ఎంతో ప్రతిభ ఉన్న నటివి అని ఎంకరేజ్ చేశారంట. ఈ విషయాన్ని వడివుక్కరసి ఎప్పటికీ మర్చిపోలేను అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె రజినీకాంత్ తో శివాజీ సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది.
Also Read: