అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం ‘కస్టడీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు వెంకట్ ప్రభు డైరెక్ట్ చేస్తుండగా, ఈ సినిమాలో చైతూ ఓ కానిస్టేబుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అయితే ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకునేందుకు చైతూ రెడీ అవుతున్నాడు.
ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తుంది. అరవింద్ స్వామి ప్రతి నాయక పాత్రలో కనిపించనున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా మే 12వ తేదీన విడుదల కానుంది. వెంకట్ ప్రభు ఇటీవలే ‘మానాడు’తో మంచి ఫాంలోకి వచ్చారు. మరోవైపు నాగ చైతన్యకు మాత్రం ‘థాంక్యూ’ రూపంలో గతేడాది గట్టి షాక్ తగిలింది. దీంతో తన కెరీర్లో ‘కస్టడీ’ ఎంతో కీలకంగా మారింది. ఈ చిత్రానికి సంగీత ద్వయం ఇసైజ్ఞాని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

అయితే తాజాగా నాగ చైతన్య లుక్ ఒకటి వైరల్ గా మారింది. చై ఫుల్ కాజువల్ లుక్ లో ఉన్న ఆ ఫొటోలో నాగ చైతన్య ధరించిన వాచ్ గురించి నెట్టింట చర్చలు నడుస్తున్నాయి. నాగ చైతన్య ధరించిన వాచ్ రిచర్డ్ మిల్లె బ్రాండ్‌కు చెందిన RM -030 . దీని ఖరీదు 1,15 ,73 ,580 కోట్లు. దీంతో దీని విలువ చూసిన చై ఫాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్క వాచ్ ఇంత రేట్ ఆహ్.. అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక తన రానున్న చిత్రం కస్టడీ లో ఆయన సీరియస్ అండ్ రివల్యూషనరీ రోల్ చేస్తున్నట్లు సమాచారం. టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. టీజర్ కూడా రిలీజ్ చేసారు మేకర్స్. కృతి శెట్టి కూడా గత చిత్రాలకు భిన్నమైన పాత్ర చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక విడుదల తేదీ దగ్గరపడుతుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. నాగ చైతన్య తన పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారిక పోస్టర్ విడుదల చేశారు.

దర్శకుడు వంశీ ఈ సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవాలని భావించారు. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట. కథ విన్న జగపతి బాబు కారణం ఏమిటో కానీ, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తరువాత వంశీ రవితేజకు కథ చెప్పి, ఒప్పించారు. హీరోయిన్ గా కళ్యాణిని తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి, డైరెక్టర్ వంశీని తిరిగి సినిమాలు చేయడానికి ఆయనకి నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ తాను రాసుకున్న కథని అలాగే స్క్రీన్ మీద చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. అలా ఆయన సినిమాలను చేయడం మెల్లిగా తగ్గించారు.
Also Read:
దాదాపు అప్పటి అగ్ర హీరోలందరికి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరావు, సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నసమయంలోనే పెద్ద వ్యాపావేత్తను వివాహం చేసుకుని, సెటిలయ్యారు. పెళ్లి తరువాత ఆమె మహారాణి వంటి జీవితాన్ని గడిపారు. ఆమె భర్త వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, ఆమెకు అప్పట్లోనే సొంత హెలికాప్టర్ కూడా ఉండేది.
దానిని కేఆర్ విజయ భర్తే నడిపేవారట. ఆమెకి ఎక్కడ మూవీ షూటింగ్స్ ఉన్నా తన సొంత హెలికాప్టర్లోనే వెళ్ళి వచ్చేవారంట. అయితే ఆరోజుల్లో స్టార్ హీరోలకు సైతం సొంత హెలికాప్టర్ లేవు. ఇక ఆమె భర్తకు ఎన్నో రకాలు వ్యాపారాలు ఉండేవని, దాంతో మద్రాస్ దగ్గరలో 67 ఎకరాల తోట కొన్నారు. అంతేకాకుండా కేఆర్ విజయ రాజభవనం వంటి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారట. ఆ ఇంటి పై భాగంలోహెలికాప్టర్ ఆగేదంట.
విజయ వైభోగం గురించి సినీ పరిశ్రమలో అంతా చెప్పుకునేవారంట. ఆమె ఇంటిలో స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులు ఉండేవట. అవన్నీ చూసి అప్పట్లో అగ్ర హీరోలు ఎంతో ఆశ్చర్యపోయేవారట.కేఆర్ విజయ భర్త మరణాంతరం కుమార్తెతో కలిసి చెన్నైలో జీవిస్తోంది. అయితే ఆమె గతంలో ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలన్నీటిని ఆమె స్వయంగా చెప్పింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ మీడియా మీ పై వస్తున్నట్రోల్స్ గురించి మీ రియాక్షన్ ఏమిటి అని అడగడంతో కీర్తి ఇలా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో తన పై వచ్చే ట్రోల్స్ ను మరియు నెగిటివ్ కామెంట్స్ తాను పట్టించుకోను అని తెలిపింది. మహానటి చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు తన పై దారుణమైన ట్రోల్స్ చేశారని కీర్తి సురేశ్ చెప్పారు.
సావిత్రి క్యారెక్టర్ చేయడానికి మొదట తాను చాలా భయపడ్డానని, అందుకే ఆ సినిమాకి మొదట నో చెప్పానని అన్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నువ్వు చేయగలవు అని ప్రోత్సహించడంతో ఆ మూవీ చేయగలిగానని తెలిపింది. ఈ పాత్ర చేయడం నీకే సాధ్యం అని డైరెక్టర్ చెప్పడంతో ఆయనకి అంత నమ్మకం ఉండడంతో మహానటి సినిమాలో నటించానని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కెరీర్ మహానటి తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు మహానటి చిత్రం అంత పాపులారిటీని తీసుకొచ్చింది.
Also Read:
ఈ విధంగా 3 వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పది మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఒకే ఒక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ మహేష్ బాబుకు మాత్రమే ఉండడంతో ఆయన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి అని వినిపిస్తోంది. ఈ సినిమాని జక్కన్న పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంతే కాకుండా రాజమౌళి గత చిత్రాల కన్నా రెట్టింపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని వినిపిస్తోంది. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంగానే మహేష్ బాబు అరుదైన రికార్డును నమోదు చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ బాబు 100 కోట్ల పారితోషికం తీసుకునే సెలబ్రిటీల లిస్ట్ లో చేరనున్నారు.
Also Read: 






ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు రహస్యంగా, సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తరువాత ఆ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా వివాహం చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి ఇక్కడ కాకుండా విదేశాల్లో చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రియాంక నల్కారి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి సుపరిచితామే. బాలనటిగా కూడా చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్నింటిలో ముఖ్యమైన పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి యాంకర్‌గా చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు యాంకర్ గా గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఆఫర్స్ లేకపోవడంతో ప్రియాంక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమె నటిస్తోన్న రోజా సీరియల్ తమిళంలో టాప్ రేటింగ్‌తో రన్ అవుతోంది. దాంతో అక్కడ ప్రియాంకకు పాపులారిటీ విపరీతంగా వచ్చింది.
ఈ క్రమంలో మార్చి 23న ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి వ్యక్తితో ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్‌గా దేవాలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు అందరు సడెన్‌గా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటూనే శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రియాంక తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.

మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు మనుషులు ఆపుతున్నారు. విష్ణు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. కానీ ఆ తరవాత ఎందుకో డిలీట్ చేశాడు. అయితే గతంలోనే వీరి మధ్య గొడవలు ఉండేవని, మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి. పిల్లలు చిన్న వయసులోనే విద్యాదేవి మరణించడంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కుమారుడే మనోజ్. ఇక మనోజ్ కు మంచు లక్ష్మీతో పాటు విష్ణుతో కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లిని అక్క లక్ష్మీనే దగ్గరుండి మరి తల్లిలా జరిపించారు.
Also Read: