- చిత్రం : కోస్టి
- నటీనటులు : కాజల్ అగర్వాల్, కె.ఎస్.రవికుమార్, యోగిబాబు.
- నిర్మాత : సీడ్ పిక్చర్స్
- దర్శకత్వం : కళ్యాణ్
- సంగీతం : సామ్ సిఎస్
- విడుదల తేదీ : మార్చ్ 22, 2023

khosty movie review in Telugu
స్టోరీ :
సినిమా ఆర్తి (కాజల్ అగర్వాల్) అనే ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఒక రౌడీని ఆర్తి పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఆర్తి కొన్ని ప్రమాదాల్లో ఇరుక్కుంటుంది. దానివల్ల ఆర్తి అనుకున్న పనిని చేయలేకపోవడం మాత్రమే కాకుండా ఇంకా కొన్ని విచిత్రమైన సంఘటనలు ఎదుర్కొంటుంది. అప్పుడు ఆర్తి ఏం చేసింది? చివరికి ఆ సమస్యల నుండి బయటపడిందా? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

Khosty Movie Review రివ్యూ :
ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ మధ్యలో తన వ్యక్తిగత జీవితానికి సమయం కేటాయించి సినిమాలకి కొంత కాలం వరకు దూరంగా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు కాజల్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు.

ఈ సినిమా తమిళ్ సినిమా అయినా కూడా తెలుగులో విడుదల చేశారు. అయితే కాజల్ సినిమా అంటే ప్రతి సారి ఎంతో కొంత సందడి అయితే ఉంటుంది. ఈ సారి మాత్రం అలా ఏమీ లేకుండా ఈ సినిమా విడుదల అయ్యింది. హారర్ కామెడీ అని జోనర్ ఉన్న సినిమాలని మనం చాలా చూశాం. ఇది కూడా అలాంటి సినిమానే. కథలో పెద్దగా కొత్తదనం ఏమీ లేదు.

కామెడీ చేయాలని ప్రయత్నించినా కూడా అది కామెడీ లాగా ఎక్కడ అనిపించదు. ఈ సినిమాలో చాలా మంది పెద్ద నటీనటులు ఉన్నారు. కానీ ఎవరూ కూడా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడలేకపోయారు. స్క్రీన్ ప్లే చాలా బలహీనంగా ఉంది. ఎమోషన్స్ కూడా ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ అవ్వవు.
ప్లస్ పాయింట్స్ :
- కాజల్ అగర్వాల్
- చాలా మంది పాపులర్ నటీనటులు ఉండడం
మైనస్ పాయింట్స్:
- బలహీనమైన కథ
- ప్రేక్షకులకి అస్సలు కనెక్ట్ అవ్వని ఎమోషన్స్
రేటింగ్ :
2/5
ట్యాగ్ లైన్ :
సినిమా నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా కాజల్ అగర్వాల్ కోసం చూడాలి అనుకునే వారికి కోస్టి సినిమా ఒక్కసారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది.
watch trailer :














#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
ఎన్టీఆర్ తన వారసుడుగా బాలకృష్ణను సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశాడు. అలా వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్ లో టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పటికి కూడా బాలయ్య తన చిత్రాలతో ఈ తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అయితే బాలకృష్ణ తన కెరీర్ మొదట్లో ఒక స్టార్ హీరోయిన్ ని ప్రేమించారట. ఆ హీరోయిన్ ని వివాహం చేసుకోవాలని ఎంతగానో అనుకున్నాడంట. అయితే బాలయ్య ఆశలపై ఆయన తండ్రి ఎన్టీఆర్ నీళ్లు చల్లారు. దానికి కారణం బాలయ్య ప్రేమించిన ఆ హీరోయిన్ గ్లామర్ పాత్రలు చేసింది.
ఎన్టీఆర్ తమ ఇంటికి కోడలుగా అడుగు పెట్టె అమ్మాయి పద్ధతిగా ఉండాలని భావించారు. ఆ హీరోయిన్ పద్ధతి లేకుండా గ్లామర్ రోల్స్ చేస్తూ ఉండడంతో ఎన్టీఆర్ గారికి నచ్చలేదు. ఆ కారణంతో బాలయ్య ఆమెను పెళ్లి చేసుకోకుండా అడ్డుపడ్డారు. ఈ విషయంలో హరికృష్ణ కూడా ఆ పెళ్లికి అడ్డు చెప్పారంట. చిత్రాల గురించి మాత్రమే ఆలోచించమని, ప్రేమ అని ఫ్యామిలీ పరువు తీయవద్దని ఎన్టీఆర్ బాలయ్యకి వార్నింగ్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారంట.
అయితే బాలయ్య ఆ హీరోయిన్ ని ఎక్కడ పెళ్లి చేసుకుంటారో అని నెల రోజుల్లోనే ఎన్టీఆర్ వసుంధర దేవితో పెళ్లి జరిపించాడు. వసుంధర దేవి సాంప్రదాయమైన ఫ్యామిలిలో పుట్టిన అమ్మాయి. ఆ విధంగా ఎన్టీ రామారావు గారు బాలయ్య ప్రేమ పెళ్లి జరగకుండా ఆపాడని తెలుస్తోంది. అప్పట్లో బాలయ్య ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ కుష్బూ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ వార్త ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ వీరిద్దరి పేర్లు అప్పట్లో బాగా వినిపించాయి.
Also Read:
సూర్య విభిన్న క్యారెక్టర్స్ లో నటిస్తూ ఆడియెన్స్ ని కట్టిపడేస్తుంటారు. ఆకాశం నీ హద్దురా, జై భీమ్, విక్రమ్ లాంటి చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సూర్య. డైరెక్టర్ శివ దర్శకత్వంలో ‘సూర్య 42’ అనే పాన్ ఇండియా మూవీతో పాటుగా మరి కొన్ని చిత్రాలతో సూర్య చాలా బిజీగా ఉన్నారు. కుటుంబ కలహాల నేపద్యంలో సూర్య తన కుటుంబంతో ముంబైకి షిఫ్ట్ కాబోతున్నారనే వార్త చర్చకు దారి తీసింది. ఈ క్రమంలో సూర్య ముంబైలో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు చేశారని, దాని ఖరీదు రూ. 70 కోట్లని తెలుస్తోంది.
సెలబ్రిటీలు ఎక్కువగా ఉండే గేటెడ్ కమ్యూనిటీలో ఈ ఫ్లాట్ ఉన్నట్టుగా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. ఈ ఫ్లాట్ సుమారు తొమ్మిది వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని, త్వరలోనే ముంబైకి షిఫ్ట్ కావాలని సూర్య, జ్యోతిక అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. సూర్య కొనుగోలు చేశారని భావిస్తున్న ఫ్లాట్లో జిమ్, లైబ్రరీ, పార్కింగ్ స్పాట్, గార్డెన్ స్పేస్, స్విమ్మింగ్ పూల్, థియేటర్ వంటి ఆధునిక హంగులు ఉన్నాయని సమాచారం. ఆ ఫ్లాట్ ఖరీదు 68 కోట్లు, రూ.2 కోట్లు అపార్ట్మెంట్ బుకింగ్ మరియు ఇతర ఖర్చులు అని నెటిజన్లు చెప్పుకుంటున్నారు.
Also Read: 















తారకరత్న జ్ఞాపకార్థంగా గుండె సమస్యలతో బాధపడే పేదవారికి వారికి ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య నిర్ణయం తీసుకున్నారు. దాని కోసం బసవతారకం హాస్పటల్ లో ఒక బ్లాక్ ను ఏర్పాటు చేసి, దానికి తారకరత్న బ్లాక్ అని పేరు పెట్టారు. బసవతారకం హాస్పటల్ లో మాత్రమే కాకుండా హిందూపురంలో బాలయ్య నిర్మిస్తున్న హాస్పటల్లో కూడా ఉచిత వైద్యం అందుబాటులో ఉంటుందని తెలిపారు. బాలకృష్ణ మంచి మనసును చాటుకున్నారని ఫ్యాన్స్ నెటిజెన్స్ నుండి సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
బాలయ్య కొడుకు తారకరత్న పైన ఉన్న ప్రేమను తెలిపేందుకు హృద్రోగ బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని బాలయ్య తీసుకున్న నిర్ణయం పట్ల అందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాలకృష్ణ తీసుకున్న నిర్ణయం పట్ల తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి కూడా బాలకృష్ణను ఉద్దేశించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. అందులో బాలకృష్ణ ఫోటోను కూడా షేర్ చేశారు.
ఆ పోస్ట్ లో ‘మీమీద ఉన్న కృతజ్ఞతను ఎలా చెప్పాలో, ఏమి చెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. మీ హృదయం బంగారం అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. మీలా ఎవరు చేయలేరు. మీలో తండ్రిని, స్నేహితున్ని చూశాము. మీలో ఇప్పుడు దేవుడిని కూడా చూస్తున్నాం. నాకు చెప్పడానికి మాటలు రావట్లేదు. నా హృదయ పూర్వక కృతజ్ఞతలు. మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకన్న ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తాం, జై బాలయ్య, జై జై బాలయ్య అని అలేఖ్య రెడ్డి పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.