కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాలుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద రికార్డుల సృష్టిస్తాయి. ప్రొడ్యూసర్లకి ఊహించనన్ని లాభాలను తెచ్చిపెడుతాయి. ఇటీవల వచ్చిన కాంతార మూవీ అలాంటిదే. కాగా కాంతార లాంటి మూవీ తెలుగులో వచ్చిందా అంటే దానికి సమాధానమే ‘ఆకాశవాణి’ అనే సినిమా.
దర్శక ధీరుడు రాజమౌళి శిష్యుడు ‘ఆకాశవాణి’ అనే పేరుతో కాంతార తరహా సినిమాని రూపొందించాడు. అయితే ఈ మూవీ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది.ఈ సినిమా సెప్టెంబర్ 24, 2021 న ఓటీటీలో రిలీజ్ అయ్యింది.

మరి ఆకాశవాణి కథ ఏమిటో చూద్దాం. బయట వేరే ప్రపంచం ఉందని కూడా తెలియకుండా నాగరిక ప్రపంచానికి సుదూరంగా ఓ అడవిలో కొందరు గూడెం వాసులు బతుకుతూ ఉంటారు. వాళ్ళు ఉన్నట్టు బయట ప్రపంచానికి కూడా తెలియదు. గూడెం వారంతా దొర కనుసన్నలలో జీవిస్తుంటారు.వారికి దొర మాట అంటే దైవాజ్ఞ. ఆ దొర కూడా తానే దేవుడిని అని నమ్మిస్తూ, భయపెడుతూ అక్కడి వారిని అడవి దాటి బయటికి వెళ్ళకుండా చూస్తుంటాడు.
ఇక ఆ ఊరిలోకి వేరే ఊరి వారు వస్తే వచ్చిన వాళ్లను వచ్చినట్టే దొర చంపేస్తూంటాడు.ఈ క్రమంలో ఆ గూడెంలోని ఒక పిల్లాడికి రేడియో దొరుకుతుంది.రేడియో అంటే ఏమిటో,ఎలా ఉంటుందో వాళ్ళకి తెలియదు. అయితే ఆ రేడియో వల్ల గూడెంలో అల్లకల్లోలం జరిగి, అదే దేవుడిగా మారుతుంది.దీంతో తాను కాకుండా ఇంకో దేవుడు ఉండటం నచ్చని దొర అప్పుడు ఏం చేసాడు. మూఢనమ్మకాలతో బతుకుతున్న అక్కడి ప్రజలకు ఆ రేడియో ద్వారా ఓ స్కూల్ మాస్టర్ వారికి ఎలా విముక్తి కలిగించాడు అనేది మిగిలిన కథ.
ఈ సినిమాను రాజమౌళి శిష్యుడు అయిన అశ్విన్ గంగరాజు రూపొందించారు. అయితే ఈ మూవీలో నటించిన వారిలో చాలా మంది కొత్తవారు కావటం, అంతేకాకుండా సబ్ స్క్రైబర్లు తక్కువ సంఖ్యలో ఉన్న సోనీ లివ్ లాంటి ఓటీటీలో విడుదల అవడం కూడా ఆకాశవాణికి మైనస్ అయ్యిందనే చెప్పాలి.కానీ ఓటీటీలో మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకులకు ఆకాశవాణి మంచి ఆప్షన్ అవుతుంది.

జెమినీలో గత వారం ఈ సినిమా ప్రసారం కాగా, దారుణమైన రేటింగ్ వచ్చింది. ఈ సినిమాకి కేవలం 3.41 రేటింగ్ వచ్చింది. హీరో నిఖిల్ నటించిన కార్తికేయ మూవీకి 7.88 రేటింగ్ వచ్చింది. కార్తికేయ సినిమా బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు వసూల్ చేసి, బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక అదే టైమ్ లో సీతారామం స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు మంచి రేటింగ్స్ అందుకుంది. మొదటిసారి ప్రసారం చేయగా 8.73 టీఆర్పీ రావడం విశేషం. ఈ సినిమా రేటింగ్ ప్రభాస్ రాధే శ్యామ్ ఫస్ట్ టైం టిఆర్పి కంటే కూడా ఎక్కువే.
ఇక ఈ మూడు సినిమాలలో సీతారామం సినిమాకే ఎక్కువ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. రెండోసారి టెలికాస్ట్ చేయబడిన సర్కారు వారి పాట 6.8 రేటింగ్ వచ్చింది. అయితే ఒకప్పుడు TRP రేటింగ్ 20 పాయింట్ల కంటే ఎక్కువ ఉండేది. ప్రస్తుతం పుష్ప సినిమా టాప్ ప్లేస్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం జనాలు టీవీల్లో మూవీస్ చూసేందుకు అంతగా ఆసక్తి పెట్టడం లేదని తెలుస్తోంది. దాంతో టీఆర్పీ రేటింగ్స్ 10కి తగ్గిపోయింది.

























రాజమౌళికి ఆస్కార్ అవార్డ్ వస్తుందని మరోసారి రుజువైంది. ఎందుకంటే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ ఎవరిని ఎంచుకుంటే దాదాపు వారికే ఆస్కార్ అవార్డు వస్తాయంట. అయితే ఈ ఏడాది ఆ సంస్థ రాజమౌళిని ఉత్తమ దర్శకుడిగా ఎంచుకుంది. ఇక దీనితో రాజమౌళికి ఈసారి ఆస్కార్ అవార్డ్ వస్తుందని అందరు ఫిక్స్ అయిపోయారు. రాజమౌళి పై తెలుగు సినీ సెలెబ్రిటీలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, కంగ్రాట్స్ చెబుతున్నారు. అడివి శేష్, శోభు యార్లగడ్డ వంటి వారు స్పందించారు.
మరి జక్కన్నకి ఆస్కార్ అవార్డ్ వస్తుందో, లేదో చూడాలి. రాజమౌళికి ఒకవేళ ఆస్కార్ అవార్డ్ కనుక వస్తే, భారతీయ సినీ పరిశ్రమకే అది గర్వకారణం అవుతుంది. వందేళ్ల ఇండియన్ సినిమా చరిత్రలో ఏ దర్శకుడికి ఇంత వరకు ఆస్కార్ అవార్డు రాలేదు. రాజమౌళి RRR మూవీని ఇంటర్ నేషనల్ లేవల్లో ప్రమోట్ చేశాడు. విదేశాల్లో కూడా ఆర్ఆర్ఆర్ సినిమా విజయం పొందింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పన్నెండు వందల కోట్లు వసూల్ చేసింది. జపాన్లో ఈ సినిమా ఇప్పటికీ బాగానే ఆడేస్తోంది.


