కత్తి కార్తీక పాపులర్ టీవీ యాంకర్ , బిగ్ బాస్ సీజన్లో 1 కంటెస్టెంట్ కాంగ్రెస్ పార్టీ లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే కార్తీక టి .పి .సి .సి చైర్మన్ మధు యాష్కీ గౌడ్ ని కలిసి తనకు పార్టీ పై ఉన్న ఆసక్తిని గురించి చర్చించారు . 2020 నవంబర్ దుబ్బాక బై ఎలక్షన్స్ లో పోటీ చేసి ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొని చివరికి ఓటమిని చవిచూసారు .

ఏదైనా ఒక రాజకీయ పార్టీ సపోర్ట్ ఉంటె మంచిది అని భావించిన కార్తీక కాంగ్రెస్ పార్టీలోకి చేరుటకు ఆసక్తి కనబరుస్తున్నారు. కత్తి కార్తీక కాంగ్రెస్ లోకి చేరటం ఒకరకం గా తెలంగాణ రాజకీయాల్లో ఆందోళన కలుగచేస్తోంది. టి ఆర్ ఎస్ కీలకనేత , డిప్యూటీ స్పీకర్ పద్మారావు కు బంధువు కావటం గమనార్హం. కత్తి కార్తీక త్వరలో కాంగ్రెస్ కండువా వేసుకోనున్నారు..
Filmy Adda
“జయంతి” గారి మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటు-నందమూరి బాలకృష్ణ
సినీ నటి జయంతి గారి మృతిపై నందమూరి బాలకృష్ణ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. జయంతి గారు, బాలకృష్ణతో, అలాగే నందమూరి తారక రామారావు గారితో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. బాలకృష్ణ మాట్లాడుతూ “జయంతి గారు గొప్ప నటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక తరాలతో కలిసి పని చేసిన సీనియర్ నటీమణి. నాన్నగారి జగదేకవీరుని కథ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమై, తర్వాత కులగౌరవం, కొండవీటి సింహం, జస్టిస్ చౌదరి వంటి అజరామరమైన చిత్రాల్లో కలిసి నటించారు”.

“నేను హీరోగా నటించిన అల్లరి కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, తల్లితండ్రులు వంశానికొక్కడు చిత్రాల్లో మంచి పాత్రలు పోషించారు. దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా సినిమాలు చేశారు. ప్రేక్షకులు అందరి మన్ననలు అందుకున్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు పెద్ద లోటుగా భావిస్తున్నాను. ఆమె కుటుంబ సభ్యులకు భగవంతుడు ఆత్మ స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
Anchor suma : ” ఈ వయసులో కూడా ఏంటీ దుస్తులు”.. సుమపై కామెంట్ చేసిన సినీ నటి.
స్టార్ యాంకర్ గా సుమ అందరికి సుపరిచితం. సుమ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సుమ తన యాంకరింగ్ తో బుల్లితెరపై ప్రత్యేకస్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. ఎంటర్టైన్మెంట్ ,ప్రీ రిలీజ్ ,సినీ అవార్డు ఫంక్షన్ లలో తన హోస్టింగ్ తో సందడి చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. సుమ హోస్ట్ చేసే కాష్ ప్రోగ్రాంకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
సెలబ్రిటీలతో సందడిగా సాగే ఈ ప్రోగ్రాం లో సుమ అందరిని ఆటపట్టిస్తూ ఉంటుంది. వారు కూడా అలానే సుమ పై జోక్స్ వేస్తూ సరదాగా తీసుకుంటారు . ఐతే తాజాగా కాష్ ఎపిసోడ్ ప్రోమో విడుదల కాగా అందులో బాబూమోహన్ , గౌతమ్ రాజు, రాజ్య లక్ష్మి, శివపార్వతి పాల్గొన్నారు. సుమ పై రాజ్యలక్ష్మి కామెంట్ చేసారు. సుమ రాజ్యలక్ష్మితో… ఇవాళ నాకు కాంపిటేషన్ గా వచ్చారు అనడం తో, రాజ్య లక్ష్మి.. తాను చిన్నప్పుడు ఎప్పుడో లంగా ఓణీలు వేసుకుంటే నువ్వు మాత్రం ఇప్పటికి వేసుకుంటున్నావ్.. నాకు నిన్ను చూస్తే అసూయగా ఉంది అని అన్నారు. దీంతో సుమ ఏంటి నేను ఇంత వయసు వచ్చిన లంగా ఓణీలు వేసుకుంటున్నాననా… అని అనడం తో అక్కడ ఉన్న అందరు నవ్వుకున్నారు . ఈ ప్రోమో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఆర్ఆర్ఆర్ సినిమా బృందం ఇవాళ మరొక అప్డేట్ విడుదల చేసింది. అదేంటంటే ఈ సినిమా ఆడియోకి సంబంధించిన హక్కులను లహరి మ్యూజిక్ సంస్థ చేసుకుంది. హిందీ ఆడియోకి సంబంధించిన హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పటికే సంగీత దర్శకులు కీరవాణి గారు ఈ సినిమా పాటలు రికార్డ్ చేసే పనిలో ఉన్నారు.

ఇటీవల బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన అమిత్ త్రివేది తో ఒక పాటని రికార్డ్ చేశారు కీరవాణి గారు. ఆ పాటని అమిత్ త్రివేది తో కలిసి రియా ముఖర్జీ పాడారు. నిన్న తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో కలిసి ఈ సినిమాకి సంబంధించిన ఒక మ్యూజిక్ సెషన్ చేశారు కీరవాణి గారు. దీనికి సంబంధించి “అనిరుధ్ తో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది” అని చెప్పారు కీరవాణి గారు.
Glad to acquire the music rights of India’s Biggest Action Drama, @SSRajamouli’s @RRRMovie 🤩🔥🌊
An @mmkeeravaani Musical
🎶 on @TSeries & @LahariMusic#RRRAudioOnTseriesLahari@tarak9999 @AlwaysRamCharan @ajaydevgn @aliaa08 pic.twitter.com/6ZFlL613fa
— LahaRRRi Music (@LahariMusic) July 26, 2021
ఇక సినిమా షూటింగ్ విషయానికొస్తే ఇటీవల హీరోయిన్ అలియా భట్ షూటింగ్ లో పాల్గొన్నారు. అంతే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రవితేజ, ప్రభాస్ మీద ఒక ప్రమోషనల్ సాంగ్ ఉంది అనే వార్త వినిపిస్తోంది. ఇది ఆగస్ట్ లో విడుదల అవుతుంది అని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే సినిమా బృందం అధికారికంగా ప్రకటించేంత వరకు ఆగాల్సిందే. ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన థియేటర్లలో విడుదల అవ్వబోతోంది.
Chiru153: మెగాస్టార్ “లూసిఫర్” రీమేక్ గురించి ఆసక్తికరమైన అప్డేట్ చెప్పిన తమన్.!
ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న సంగీత దర్శకులలో ఒకరు తమన్. అల వైకుంఠపురంలో, తర్వాత సోలో బ్రతుకే సో బెటర్, పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన యువరత్న, మాస్ మహారాజా రవితేజ కం బ్యాక్ మూవీ క్రాక్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్లాక్ బస్టర్ సినిమా వకీల్ సాబ్ తో పాటు గత ఏడాది నుండి ఎన్నో హిట్ పాటలు ఇచ్చారు తమన్.

ఇప్పుడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సర్కారు వారి పాట తో పాటు, రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా, అలాగే పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా రూపొందుతున్న సినిమాతో బిజీగా ఉన్నారు తమన్. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న లూసిఫర్ తెలుగు రీమేక్ కి కూడా సంగీతం అందించబోతున్నారు తమన్.
A Very biG day 🎵in My life a Dream Coming True Recording First Song 🎧 for Our Beloved #MegastarChiranjeevi gaaru @KChiruTweets #Chiru153 @AbbeyRoad Studios in #London 🇬🇧 UK 🪧 With 60 piece Grand philharmonic Orchestra ❤️ it’s time to Celebrate Our #MegaStar It’s BIGGGGG ! 🎧🎵 pic.twitter.com/eghLIJzC7N
— thaman S (@MusicThaman) July 26, 2021
మెగాస్టార్ చిరంజీవితో తమన్ కి ఇది మొదటి సినిమా. అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్డేట్ ఇచ్చారు తమిళ్. లూసిఫర్ తెలుగు రీమేక్ కి సంబంధించిన మొదటి పాటని తమన్ ఇవాళ రికార్డ్ చేశారు. రికార్డింగ్ స్టూడియోలో పాట రికార్డ్ చేస్తున్న ఫోటోని కూడా విడుదల చేశారు తమన్.
Loving the process with @MusicThaman brother on our Mega journey together 👍 #Chiru153
Shooting to start very soon 😍 https://t.co/xE1ByqXDgJ— Mohan Raja (@jayam_mohanraja) July 26, 2021
ఫోటో షేర్ చేస్తూ, “నా జీవితంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. మెగాస్టార్ చిరంజీవి గారికి మొదటి పాట రికార్డ్ చేయాలి అనే కల నెరవేరింది. యూకేలోని, లండన్ లోని అబ్బే రోడ్ స్టూడియోస్ లో 60 పీస్ గ్రాండ్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా (philharmonic Orchestra) తో పాటని రికార్డ్ చేశాం. మెగాస్టార్ ని సెలబ్రేట్ చేసుకునే సమయం వచ్చింది” అని రాశారు. అంతే కాకుండా ఆ పాటకు సంబంధించిన మ్యూజిక్ నోట్స్ ఫోటో షేర్ చేసి, దర్శకుడు మోహన్ రాజాకి థాంక్స్ చెప్పారు తమన్. దాంతో అభిమానులు అందరికీ లూసిఫర్ రీమేక్ పై అంచనాలు ఇంకా పెరిగాయి.
Karthika Deepam: అందరిముందు డాక్టర్ బాబు పరువు తీసేసిన యాంకర్ శ్రీముఖి..! ఏమైందంటే..?
యాంకర్ శ్రీముఖి ఎంత అల్లరిపిల్లో అందరికి తెలిసిందే. ఫుల్ ఎనర్జీ తో ఆమె ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలరు. తాజాగా. స్టార్ మా లో స్టార్ మా పరివార్ చాంపియన్షిప్ షో కి ఆమె యాంకరింగ్ చేసారు. ఈ షో కు “కార్తీక దీపం” టీం అంతా వచ్చి బాగా సందడి చేసారు. నిరుపమ్, మోనిత, భాగ్యం పాల్గొని ఎంటర్టైన్ చేసారు. అయితే.. ఈ షో లో వంటలక్క మాత్రం కనిపించలేదు.

షో లో భాగం గా స్టేజి పైనే శ్రీముఖి డాక్టర్ బాబు నిరుపమ్ పరువు తీసేసింది. మోనిత వస్తే తప్ప మూడ్ రాదా.. అంటూ డాక్టర్ బాబుని ఆటపట్టించేసింది. యాంకర్ శ్రీముఖి ఈ డైలాగ్ వేయగానే అక్కడ షో లో ఉన్నవారందరూ నవ్వేశారు. డాక్టర్ బాబు ఒక నిమిషం షాక్ అయినా.. వెంటనే నవ్వేసి లైట్ తీసుకున్నారు. చివరగా.. డాక్టర్ బాబు ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అందరిని ఎంటర్టైన్ చేసారు.
“డియర్ కామ్రేడ్” లో “రష్మిక” క్యారెక్టర్ లో ఈ మార్పు గమనించారా.? ఆత్మవిశ్వాసం పై అంత ప్రభావం ఉంటుందా.?
ఒక మనిషిని చూసి జడ్జ్ చేసే వాటిలో ఎక్కువ మంది గమనించేది
డ్రెస్సింగ్ సెన్స్. ఒక మనిషి వేసుకున్న డ్రెస్ చూసి వారు కాన్ఫిడెంట్ గా ఉన్నారా, భయం గా ఉన్నారా, ఇంకా వేరే విషయాలను కూడా ఎంతో మంది జడ్జ్ చేస్తూ ఉంటారు. ఇవి కొంత వరకు నిజమే అవుతూ ఉంటాయి కానీ కొంత వరకు నిజం కాకపోవచ్చు. తమ మీద తమకు కాన్ఫిడెన్స్ లేకపోతే, ఏదైనా విషయం వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటే ఏ మనిషి అయినా సరే డ్రెస్సింగ్ మీద కానీ, రెడీ అవ్వడం మీద కానీ అంత పెద్దగా శ్రద్ధ పెట్టలేరు.

ఒక రకంగా చెప్పాలంటే వాళ్ల భయం, వారి బిహేవియర్ పై ప్రభావం పడుతుంది. ఇదే విషయాన్ని ఎన్నో సినిమాల్లో మనకు చూపించారు. కానీ ఒక సినిమాలో మాత్రం ఈ పాయింట్ ని ఇంకొంచెం ఎఫెక్టివ్ గా చూపించారు. అదే డియర్ కామ్రేడ్. డియర్ కామ్రేడ్ సినిమాలో ఫస్ట్ హాఫ్ వరకు రష్మిక మోడ్రన్ గా రెడీ అయ్యి ఉంటారు. సెకండ్ హాఫ్ లో మానేజ్మెంట్ లో ఒకరు రష్మికతో మిస్ బిహేవ్ చేసే ఇన్సిడెంట్ అయిన తర్వాత నుంచి రష్మిక చుడిదార్స్ లో కనిపిస్తారు.

అలాగే రష్మిక బిహేవియర్ లో కూడా చాలా మార్పులు వస్తాయి. అంతకు ముందు లాగా యాక్టివ్ గా ఉండరు. హీరో కలిసినప్పుడు మామూలుగానే ఉంటారు కానీ మెంటల్ గా చాలా స్ట్రెస్ కి గురవుతూ ఉంటారు రష్మిక. సినిమాలో ఈ సీన్స్ చూసిన తర్వాత రష్మిక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి అలా బిహేవ్ చేస్తున్నారు అని మనకి అర్థం అయిపోతుంది.

క్లైమాక్స్ లో గట్టిగా అరిచి విషయం మొత్తం చెప్తారు రష్మిక. అంటే తాను ఎదుర్కొన్న సంఘటనల వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గి, భయపడుతూ అలాగే తను చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోయిన లిల్లీ పాత్ర క్లైమాక్స్ లో తన కోసం తాను నిలబడి, భయాలన్నీ వదిలేసి మాట్లాడి, తను అన్ని రోజులు అనుకున్న స్ట్రెస్ అంతా ఒకటే సారి బర్స్ట్ అవుట్ అయ్యింది అనే విషయాన్ని డైరెక్టర్ మనకి చెప్పారు.

Krithi Shetty: టీవీ సీరియల్ లో “ఉప్పెన” ఫేమ్ కృతిశెట్టి..? ఎందులో అంటే..?
“ఉప్పెన” సినిమా ఎంత హిట్ అయిందో.. ఆ సినిమాలో నటించిన “కృతిశెట్టి” కి అంతకంటే ఎక్కువ ఫేమ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ముందు నుంచే కృతిశెట్టి కి ఆఫర్స్ క్యూ కట్టాయి. తరువాత కృతి శెట్టి కూడా వరుసగా సినిమాలకు సైన్ చేసారు. కొంచం రెమ్యునరేషన్ ను కూడా పెంచారు. మరి ఆమె టీవీ సీరియల్ లో ఎందుకు నటిస్తున్నట్లు..? అని డౌట్ వచ్చిందా..?

ఆమె పూర్తి గా సీరియల్ లో నటించడం లేదు. కేవలం ఓ తెలుగు టీవీ సీరియల్ లో గెస్ట్ రోల్ చేసారు. జీ తెలుగు ఛానెల్ లో “ముత్యమంత ముద్దు” అనే సీరియల్ లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ నటితో పాటు గా కృతి శెట్టి కూడా ఈ సీరియల్ గురించి వివరించే ప్రయత్నం చేసింది. ఈ సీరియల్ కు పాపులారిటీ తీసుకురావడం కోసమే వారు కృతిశెట్టిని సంప్రదించారు. ఈ సీరియల్ లో ప్రముఖ సీనియర్ నటి ఆమనితో పాటు, వాసు ఇంటూరి, శంకర్రావు లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Varshini: గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన వర్షిణి.. పాన్ ఇండియన్ సినిమాలో అవకాశం.!
గత కొద్ది సంవత్సరాలుగా టెలివిజన్ పై తన యాంకరింగ్ తో అలరిస్తున్నారు వర్షిణి సౌందరాజన్. ఈటీవీ తో పాటు, మాటీవీ అలాగే ఇంకా వేరే ఛానల్స్ లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ కి యాంకరింగ్ చేస్తున్నారు. అంతే కాకుండా ఈవెంట్స్ లో కూడా సందడి చేస్తారు వర్షిణి. అయితే వర్షిణి యాంకరింగ్ లోకి రాకముందు కొన్ని సినిమాల్లో నటించిన సంగతి మనందరికీ తెలిసిందే. వెబ్ సిరీస్ తో పాటు, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన చందమామ కథలు సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషించారు వర్షిణి.

అంతే కాకుండా కాయ్ రాజా కాయ్ అనే సినిమాలో కూడా ఒక హీరోయిన్ గా నటించారు. అయితే వర్షిణి ఇప్పుడు మళ్ళీ సినిమాలో కనిపించబోతున్నారు. అది కూడా పాన్ ఇండియన్ సినిమా. సమంత అక్కినేని హీరోయిన్ గా గుణశేఖర్ దర్శకత్వంలో వస్తున్న శాకుంతలం సినిమాలో ఒక పాత్రలో కనిపించబోతున్నారు వర్షిణి. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వర్షిణి నెటిజన్లతో పంచుకున్నారు.

అంతే కాకుండా సుమంత్ హీరోగా నటిస్తున్న ఒక సినిమాలో కూడా నటిస్తున్నారట వర్షిణి. ఇవి మాత్రమే కాకుండా స్టార్ మా లో కామెడీ కింగ్స్ ప్రోగ్రాంకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.
Vijay Devarakonda: ‘డియర్ కామ్రేడ్’ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న విజయ్ దేవరకొండ !
ఒక సినిమాకి కళాకారులు ఎంత వరకు వారి నుంచి నటన, సంగీతం, దర్శకత్వం., మొదలగు వాటిల్లో వారు ఇవ్వాలో వారు మొత్తం చేస్తారు. ఎన్ని చేసిన చివరికి ప్రేక్షకుల ఆదరణ, వారి అభిమానాలు ఎంతైనా ముఖ్యం. వారిని ఆకట్టుకునే ప్రయత్నం లో తిండి, నిద్ర, సమయం అన్ని కూడా మర్చిపోయి ప్రాణం పెట్టి మరీ చేస్తారు. కానీ ఒక్కోసారి అవి గురి తప్పి గమ్యం మరీ ఫలితం మరో విధంగా ఉంటుంది.

vijay devarakonda twitter
ఇలాంటి సినిమాల్లో ‘ఖలేజా’, ఆరంజ్, గౌతమ్ నంద, ఇలా చాల సినిమాలే ఉన్నాయి. ఇదే కోవలో డియర్ కామ్రేడ్ సినిమా కూడా ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా పెద్దగా హిట్ అవ్వలేదు. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా. ప్రేక్షకుల ఎక్సపెక్టషన్స్ రీచ్ అవ్వలేదనే చెప్పాలి. ‘డియర్ కామ్రేడ్’ లోని కొన్ని ఇన్సిడెంట్స్ గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ పోస్ట్ చేసారు విజయ్ దేవరకొండ. మేము ఏమి చేయాలో అన్ని చేసాము అని కాప్షన్ జోడించి పోస్ట్ చేసారు.

డియర్ కామ్రేడ్ సినిమా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘లైగర్ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాని పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్నారు.
Also Read: MAHESH BABU: ప్రొడ్యూసర్స్ కి వార్నింగ్ ఇచ్చిన మహేష్ ? దానికి కారణం అదేనా !
https://twitter.com/TheDeverakonda/status/1419575820788535297
