మన పురాణాల ప్రకారం మనిషికి నిద్ర ఎంతో అవసరం. మనం నిద్రపోయేటప్పుడు మన శరీరంలోని అవయవాలన్నీ కూడా రిలాక్స్ అవుతాయి కాబట్టి శరీరం ఉత్తేజవంతం అవుతుంది. మనం మన జీవితాన్ని ఆరోగ్యకరంగా గడపాలి అనుకుంటే మన ఆహారపు అలవాట్లతో పాటు మంచి నిద్ర కూడా చాలా అవసరం.
ప్రతిరోజు మన శరీరానికి సరిపడాంత నిద్ర ఇవ్వగలిగినప్పుడే మనం ఆరోగ్యవంతంగా ఉండగలుగుతాము. ప్రశాంతమైన నిద్రకు పడుకునే స్థలంతో పాటు మన చుట్టూ ఉన్నటువంటి వస్తువుల ప్రభావం కూడా ఉంటుంది. మనం నిద్రించే సమయంలో కొన్ని వస్తువులను పొరపాటున కూడా మన దరిదాపుల్లో ఉంచుకో కూడదని వాస్తు నిపుణులు ,మన పెద్దలు చెబుతూ ఉంటారు. మరి ఆ వస్తువులు ఏమిటో అవి నిద్రించే స్థలంలో ఉండడం వల్ల కలిగే దుష్ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందామా….
ఇవి కూడా చదవండి: “పూజ చేసేటప్పుడు ఆవలింతలు రావడం దేనికి సంకేతమో తెలుసా? ఏమైనా కీడు జరుగుతుందా?
మొదటగా మనం నిద్రపోయే టైం లో మన బెడ్ చుట్టుపక్కల కూడా ఎక్కడ వాలెట్ పర్సు లాంటివి ఉంచుకోకూడదు. పొరపాటున ఇలాంటి వస్తువులు ఉంచినట్లయితే మన మెదడులో డబ్బుకు సంబంధించిన ఆలోచనలే కలుగుతాయి. నా పర్సులో డబ్బు ఉందో లేదో అన్న భావనతో మనిషికి నిద్ర పట్టదు. అందుకని పొరపాటున కూడా నిద్రించే స్థలాలలో వాలెట్లు పర్సులు లాంటివి ఉంచకండి. చాలామందికి ఇంటిలో చెప్పులు వేసుకుని తిరగడం అలవాటు. అదే క్రమంలో నిద్ర పోయేముందు బెడ్ కింద చెప్పులు వదిలి పడుకుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో చికాకులు కలుగుతాయని వాస్తు శాస్త్రజ్ఞులు చెబుతారు. ప్రశాంతమైన నిద్ర కావాలనుకునే వాళ్ళు మీ పాదరక్షకులను బెడ్ దగ్గర వదలకండి.
ఇవి కూడా చదవండి: రాధని అంతలా ప్రేమించిన కృష్ణుడు పెళ్లి ఎందుకు చేసుకోలేదు..? దీని వెనుక ఇంత కారణం ఉందా?
ఇప్పుడు చాలామందికి నిద్ర వచ్చేంతవరకు సెల్ ఫోన్ చూస్తూ పడుకోవడం అలవాటు. అదో పెద్ద ఫ్యాషన్ అని మంచి హాబిట్ అని వాళ్ళ అభిప్రాయం. కానీ ఇలా నిద్ర వచ్చే వరకు మొబైల్ చూడడం అనేది మంచి పద్ధతి కాదు అని చాలామంది చెబుతుంటారు. కాబట్టి నిద్రించే టైం మీ మొబైల్ ఫోన్స్ ను మీకు దూరంగా ఉంచండి.అలాగే మనం నిద్రించే ప్రదేశం లో వార్త పత్రికలు కానీ పుస్తకాలు కానీ మన పక్కన ఉంచుకోకూడదని కొందరు అంటారు. ఇలా నిద్రపోయే సమయంలో మన దగ్గర పుస్తకాలు ఉంచుకున్నట్లయితే సరస్వతీ దేవిని అవమానించినట్లు అని పెద్దలు చెబుతుంటారు.
కాబట్టి సుఖవంతమైన జీవితం ఆరోగ్యకరమైన శరీరం కావాలనుకుంటే మంచి నిద్రపోవడం చాలా అవసరం. అందుకని పైన చెప్పిన జాగ్రత్తలు పాటించండి మీ జీవితంలో ప్రశాంతమైన మంచి జీవనశైలిని అలవర్చుకోండి.
ఇవి కూడా చదవండి: ద్రౌపది తన ఐదుగురు భర్తలతో ఎలా కాపురం చేసేదో తెలుసా..? ద్రౌపది గురించి ఎవరికీ తెలియని విషయాలు..!