భార్యాభర్తల బంధం ఎంతో సున్నితమైనది. ఇద్దరి మధ్య సఖ్యత కుదరడం ఒక్కటే ప్రధానం కాదు.. ఇరువురికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది అర్ధం చేసుకుని మసలుకున్న వారు అదృష్టవంతులే. కానీ, దురదృష్టవశాత్తు మన దేశం లో గృహ హింస కేసులు ఎక్కువ అవుతున్నాయి.

భర్తని అనే అహంకారం తో.. భార్యను ఏమి చేసినా భరించాలని భావించే వారు హెచ్చు సంఖ్యలోనే ఉన్నారు. ఈ క్రమం లో గృహ హింస కి గురి అవుతూ అనేక కష్టాలు పడుతున్న ఆడువారు ఎంతమందో ఉన్నారు. కొందరు పైకి చెప్పలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, ఓ గృహిణి భర్త పెట్టె హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంది..

“నా భర్తను చంపేయండి.. అతను కొట్టే దెబ్బలు తట్టుకోలేకపోతున్నా..” అంటూ ఓ వివాహిత లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం స్థానికం గా సంచలనం రేపింది. డైలీ హంట్ – ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం యూసఫ్ గూడ, ఎస్ ఆర్ హిల్స్ కు సమీపం లో ఆంజనేయులు, విజయ దంపతులు నివసిస్తున్నారు. భర్త ఆంజనేయులు రోజు తన భార్యని చిత్ర హింసలకు గురి చేసేవాడు.. వీరిద్దరూ 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అకారణం గా మొదలైన మనస్పర్థలు వీరిద్దరి మధ్య దూరాన్ని పెంచాయి.

దీనితో ఆంజనేయులు విజయను చిత్రహింసలకు గురి చేయడం మొదలు పెట్టాడు.. దానికి తోడు ఆంజనేయులు సోదరుడు చంద్రయ్య కూడా ఆమెను చంపివేయాలంటూ ప్రోత్సహించేవాడట. ఈ మేరకు ఆమె లేఖలో పేర్కొంది. తనను వదిలించేసుకుంటే.. ఆంజనేయులుకి మరో పెళ్లి చేయాలనీ పధకం పన్నేవాడట. తన పిల్లల పోషణను తన తల్లి, సోదరులు తీసుకోవాలని ఆమె కోరింది. మృతురాలి తల్లి ఫిర్యాదు ఇవ్వగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


























మన భారత మాజీ కెప్టెన్ ,మిస్టర్ కూల్ ధోనీ భార్య సాక్షి ధోని… అప్పటివరకు మిస్టర్ కూల్ గా,అమ్మాయిల కలల రాకుమారుడిగా,మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ గా ఉన్న ధోనికి జోడి అయింది సాక్షి.ధోనితో పెళ్లి కాగానే ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చింది సాక్షి. పెళ్లి తర్వాత క్రికెట్లో ధోని దశ కూడా తిరిగింది..వీరిద్దరి గారాల పట్టి జీవా..పెళ్లికి ముందే హోటల్ మేనేజ్మెంట్ చేసింది సాక్షి,ట్రెయిన్ గా కోల్ కతాలో జాబ్ కూడా చేసింది..కోల్ కతలో తాజ్ బెంగాల్లో ఇంటర్న్ షిప్ ట్రెయిని గా చేసేటప్పుడే ధోనితో పరిచయం అయింది.ప్రస్తుతం “సాక్షి రావత్ ఫౌండేషన్” పేరిట అనాధలకోసం ఒక సంస్థని స్థాపించి,సంస్థ బాద్యతలు చూస్కుంటుంది.
రితికా,ప్రొఫెషన్ స్పోర్ట్స్ మేనేజర్..గ్రాడ్యుయేషన్ తర్వాత కార్నర్ స్టోన్ స్పోర్ట్స్ అండ్ ఎంటర్ట్నైన్మెంట్ లో స్పోర్ట్స్ మానేజర్ గా పనిచేసింది..రోహిత్ శర్మ ని కలిసింది ప్రోఫెషనల్ మీట్ లోనే..సిక్స్ ఇయర్స్ డేటింగ్ తర్వాత వివాహం చేసుకుంది ఈ జంట..వీరిద్దరికి ఒక కూతురు పేరు సమైరా శర్మ.
వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ భార్య దిపికా పల్లికల్ ఫేమస్ స్క్వాష్ ప్లేయర్..స్క్వాష్ ప్లేయర్స్ లో మొట్టమొదటి అర్జుణ అవార్డు గ్రహీత.అంతేకాదు పద్మశ్రీ అవార్డును సైతం కైవసం చేసుకుంది.ప్రొఫెషనల్ స్క్వాష్ అసోషియేషన్ టాప్ 10లో ఇండియాని నిలబెట్టిన ప్రతిభాశీలి.
సురేశ్ రైనా భార్య ప్రియాంక చౌదరి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మరియు బ్యాంకర్.గతంలో యాక్సెంచర్,విప్రో వంటి సంస్థలలో పని చేసింది..గ్రేసియా రైనా ఫౌండేషన్ స్థాపించి,సంస్థ బాద్యతలు చూసుకుంటుంది.గ్రేసియా సురేష్ రైనా,ప్రియాంకల కూతురు పేరు.. పిల్లలు మరియు తల్లి ఆరోగ్యాన్ని పెంపొందించే సంస్థ గ్రేసియా రైనా ఫౌండేషన్.
ఆయేషా కిక్ బాక్సర్,అథ్లెట్.శిఖర్ ధావన్ తో వివాహానికి ముందే ఆయేషా కిక్ బాక్సర్ గా పేరుగాంచింది.. ఆయేషా ,శిఖర్ లది రెండవ వివాహం.శిఖర్ తో వివాహానికి ముందే ఆయేషాకు పెళ్లి జరిగి,ఇద్దరు పిల్లలున్నారు..వీరిద్దరి పరిచయం జరిగింది ఫేస్ బుక్లో..పరిచయం ప్రేమగా మారి,పెళ్లి వరకు వచ్చింది.ఆయేషాని పెళ్లి చేసుకోవడానికి శిఖర్ తన ఫ్యామిలితో చిన్నపాటి యుద్దమే చేసాడు..మొత్తానికి కుటుంబాన్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.

క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ వైఫ్ ఇంజినీర్.వీరిద్దరూ సేమ్ కాలేజ్ నుండి గ్రాడ్యుయేషన్ పట్టా అందుకున్నారు.వీరికి ఇద్దరు అమ్మాయిలు అకీరా,ఆద్యా.
మయంతి జర్నలిస్టు, ఫేమస్ స్పోర్ట్స్ యాంకెర్,క్రికెట్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి మయంతి సుపరిచితురాలే.క్రికెటర్ స్ట్రావుడ్ బిన్నిని వివాహం చేసుకున్నారు మయంతి లాంగెర్.
సాగరికా ఘాట్గే నటి మరియు అథ్లెట్..ప్రముఖ బాలివుడ్ నటుడు షారుక్ నటించిన ఛక్ దే ఇండియా సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే..ఆ చిత్రంలో సాగరిక కీలక పాత్రలో నటించి వెండితెరకు పరిచయం అయింది.వివిధ చిత్రాలు,రియాలిటి షోలు మరియు వెబ్ సిరిస్ లలో కూడా నటించింది.



