లాక్డౌన్ కారణంగా థియేటర్లలో సినిమాలు విడుదల చేసే పరిస్థితి లేని విషయం తెలిసిందే. ఒక వేళ ఓపెన్ అయినా ఇది వరకులా ధియేటర్స్ ప్రేక్షకులు వచ్చే అవకాశాలు లేవు.. దీంతో ఇప్పటికే షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న సినిమాలను ఒటిటి ప్లాట్ ఫామ్ పై రిలీజ్ చేసేందుకు ఆయా నిర్మాతలు రెడీ అవుతున్నారు..తాజాగా జ్యోతిక నటించిన “పోన్ మగల్ వందల్” సినిమా ను ఈ నెల 29 న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తాం అని దర్శకనిర్మాతలు తెలిపారు. పరిస్థితుల్ని బట్టి చిన్న సినిమాల్ని ఓటీటీ ఫ్లాట్‌ఫాంలో విడుదల చేయడం సరైన నిర్ణయమేనని నిర్మాతలు పేర్కొన్నారు.పోన్ మగల్ వందల్ మూవీకి సూర్య నిర్మాత..ఫెడరిక్ దర్శకత్వం వహించాడు
News
వరంగల్ బావిలో 9 మృతదేహాల వెనక అసలు మిస్టరీ ఇదే…నిద్రమాత్రలు ఇచ్చి స్నేహితులతో కలిసి!
వరంగల్ లోని గొర్రెకుంట గన్నీ సంచుల గోదాంలోని బావిలో తొమ్మిది మృతదేహాలు బయటపడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది..మూడు రోజుల క్రితం దొరికిన ఈ మృతదేహాల కేసులో ముందు నుండి హత్య నేపధ్యంలోనే పోలీసులు దర్యాప్తు చేపట్టారు..కానీ ఎవరు చేశారు ఎందుకు చేశారనేదానికి సమాధానాలు లభ్యం కాలేదు..అయితే తాజాగా ఆ హత్యలు తానే చేశానని అంగీకరించాడు సంజయ్ కుమార్ అనే వ్యక్తి.. ప్లాన్ ప్రకారమే వారిని హత్య చేసి బావిలోపడేసినట్టు వెల్లడించాడు.

warangal latest news
అసలేం జరిగింది?
పశ్చిమ బెంగాల్ నుండి వలస వచ్చిన మక్సూద్ ఆలం గొర్రెకుంట శివారులోని సుప్రియ కోల్డ్ స్టోరేజీ సమీపంలోని బార్దాన్ కుట్టే గోదాంలో పనిచేస్తున్నాడు మహ్మద్ మక్సూద్ ఆలం , అతడితో పాటు అతడి భార్య నిషా ఆలం కూడా అక్కడే పని చేస్తుంది,వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు..మక్సూద్ ఆలం, నిషాం ఆలంతో పాటు , కూతురు బుష్రా ఖాతూన్‌తో పాటు ఆమె మూడేళ్ల కుమారుడు గురువారం బావిలో శవాలై తేలారు..వారిని ఎవరు చంపి ఉంటారా అనే దిశలో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు..మక్సూద్ ఆలం కి కూతురు బుష్రాతో పాటు మరో ఇద్దరు కుమారులు షాబాజ్ ఆలం, సోహిల్ ఆలం ఉన్నారు..వారిద్దరితో పటు మక్సూద్ ఆలంతోపాటు గోదాంలో పనిచేసే శ్యాం కుమార్ షా, శ్రీరాం కుమార్ షా అనే కుర్రాళ్లు కనిపించకపోవడం, వారి ఫోన్లు స్విఛ్చాప్ రావడంతో ఇదంతా వారి పనే అని మొదట పోలీసులు భావించారు..

warangal latest news
ఆ గొడవే కారణమా??
కానీ అనూహ్యంగా మరుసటి రోజు ఈ నలుగురి మృతదేహాలతో పాటు మరో మృతదేహం అదే బావిలో లభ్యమైంది..ఆ ఐదో మృతదేహం ఎవరిదా అని ఆరా తీయాగా మక్సూద్ ఆలంకి సన్నిహితుడు మహ్మద్ షకీల్ గా గుర్తించారు.వీరందరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది అని అందరిని దర్యాప్తు చేయగా అంతకు ముందు రోజు స్థానికంగా కొంతమంది యువకులకు , ఆ కుటుంబానికి గొడవ జరిగిందనే విషయం తెలిసింది.

warangal latest news
ఒక్కడే ఇన్ని హత్యలు ఎలా చేసాడు??
పోలీసులు వారందరని ఎంక్వైరీ చేశారు..ఇక్కడ ఒక విషయం బయటపడింది. మక్సూద్ ఆలం కూతురు బుష్రా స్థానికంగా నివసించే యువకుడితో కొన్నాళ్లుగా సన్నిహితంగా మెలుగుతుంది..ఆ విషయంపై ఏదైనా వాగ్వివాదం జరిగి అతడే ఈ హత్యలు చేశారా అని ,కానీ ఇన్ని హత్యలు ఒక్కడు ఎలా చేయగలరని, అతడిని విచారించారు పోలీసులు..అప్పుడు కూడా ఎటువంటి విషయాలు బయటపడలేదు..

warangal latest news
నిద్రమాత్రలు ఇచ్చి చంపేసాం…
కాల్ రికార్డ్ డేటా ఆధారంగా మొదటి నుండి సంజయ్ కుమార్ ని అనుమానిస్తూ..అతడిని నిందితుడిగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.అతడిని తమ స్టైల్లో విచారిస్తే అసలు విషయం బయటపెట్టాడు “తానే ఈ హత్యలు చేశానని, ప్లాన్ ప్రకారం వారందరికి నిద్రమాత్రలు ఇచ్చి వారిని స్నేహితుల సాయంతో బావిలో పడేసానని చెప్పుకొచ్చాడు..ఆ కుటుంబాన్ని మాత్రమే చంపాలనుకున్నా అని కానీ, ఈ విషయం బయటకి వస్తుందనే భయంతో శ్యాం కుమార్ షా, శ్రీరాం కుమార్ షా ని కూడా చంపేసానని ..ఇదంతా మక్సూద్ ఆలం అల్లుడు ఖతూర్ ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం వారిని చంపానని వెల్లడించాడు..సంజయ్ కుమార్ కి మోహన్ అనే మరో వ్యక్తి , ఒక ఆటో డ్రైవర్ సాయం చేసినట్టు తెలుస్తోంది..
కానీ ఖతూర్ కి ఈ కుటుంబాన్ని ఇంతమందని చంపాల్సిన అవసరం ఏముంది అనే ప్రశ్న తలెత్తుతోంది..ఇక్కడే మరో అసలు విషయం బయటపడింది. కాల్ రికార్డ్స్ ప్రకారం ముందురోజు సంజయ్ ,బుస్రాతో మాట్లాడినట్టు తెలుస్తోంది..వీరిద్దరి మధ్య రిలేషన్ ఉందని..దాన్ని మక్సూద్ వ్యతిరేకించి సంజయ్ ని దూరం పెట్టాడని, అయినప్పటికి సంజయ్ ,బుస్రా ల మద్య కాల్స్, ఛాటింగ్ నడిచేదని స్పష్టం అవుతోంది..బుస్రా బీహార్ కి చెందిన మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందనే కారణం చేతనే ఆ కుటుంబాన్ని మట్టుపెట్టాడనేది మరో సమాచారం.మొత్తానికి ఈ హత్యలు చేసింది సంజయ్ అనేది స్పష్టం అవుతోంది..కానీ దానికి గల బలమైన కారణాలు ఏంటి?సంజయ్ కి సాయం చేసిన ఆ స్నేహితులు ఎవరు?? అనేది తెలియాల్సి ఉంది.
కరోనా నేపథ్యంలో ఓ వధూవరుల క్రియేటివిటీ…పెళ్లిపత్రికే మాస్కుగా వింత పెళ్లి.!!!
సరిగ్గా పెళ్లిల్ల హడావిడి మొదలయ్యే ముందు కరోనా అటాక్ చేసింది..వెంటనే లాక్ డౌన్ ప్రకటణతో చేసేదేం లేక పెళ్లిల్లు పెట్టుకున్నవాళ్లు ఆగిపోక తప్పని పరిస్థితి..కొందరు ఎలాగోలా పెళ్లిల్లు చేసేసుకుంటే..మరికొందరు వాయిదా వేసుకుంటూ వచ్చారు.. ఇప్పుడు లాక్ డౌన్ సడలింపుల్లో 20మందితో పెళ్లి చేస్కోవచ్చని ప్రభుత్వం ప్రకటించగానే చాలామంది రెడీ అయిపోయారు..కానీ భౌతిక దూరం, మాస్కు తప్పని సరి..ఇదే మాస్కు విషయంలో ఒక పెళ్లిజంట విభిన్నంగా ఆలోచించింది..
పెద్దపల్లి జిల్లా తొగర్రాయిలో ఓ జంట వేదమంత్రాల సాక్షిగా ఒక్కటైంది. కొద్దిమంది అతిథులు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.ఈ పెళ్లికి వచ్చినవారందరికీ మాస్కులు కూడా వారే స్వయంగా పంపిణీ చేశారు.. అక్కడే ఉంది స్పెషల్ వీరు పంపిణి చేసిన మాస్కులపై వధూవరుల ఫొటోలు, పెళ్లి వివరాలు ముద్రించారు. ఏకంగా పెళ్లిపత్రికనే మాస్కుపైకి ఎక్కించారన్నమాట.
ఈ పెళ్లికి వచ్చిన అందరి ముఖాలకు ఇవే మాస్కులు ఉండడంతో అందరిని ఆకట్టుకుంది. వధూవరులు, పురోహితుడు సైతం ఈ మాస్కులనే ధరించారు. పెళ్లింటి వారి చేసిన ఈ డిఫరెంట్ మాస్కుల ఏర్పాటుని గ్రామస్తులు, బంధువులు అభినందనలతో ముంచెత్తారు.. ఆ నోట ఈ నోట ఈ విషయం అధికారుల వరకు తెలియడంతో పెళ్లి వారు చేసిన పనికి వారు కూడా హర్షం వ్యక్తం చేశారు..
ఈ డిఫరెంట్ పెళ్లి మాస్కులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి..దీనిపై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నరు..కరోనాతో సహజీవనం చేయాల్సిందే అని ఫిక్సయ్యాక మాస్కులు,శానిటైజర్లు మన జీవితంలో భాగం కావాల్సిందే అని మనుషులందరూ గుర్తిస్తున్నారు అనడానికి ఇదే చక్కటి ఉదాహరణ.
కొత్త రూల్స్: హెల్మెట్, లైసెన్స్, ఆర్.సి, ఇన్సూరెన్స్ ఉంటే సరిపోదు…ఆ రెండు కూడా ఇప్పుడు తప్పనిసరి!
మొన్నటి వరకు ఇంట్లో ఉన్నవారంతా ఒక్కసారిగా లాక్ డౌన్ సడలించగానే రెక్కలొచ్చిన పక్షుల్లా రోడ్లపైకి చేరారు..అందుకు ప్రత్యక్ష ఉదాహరణ హైదరాబాద్ రోడ్లే.. రోడ్ల మీద ఎక్కడా ఖాళీ లేకుండా గతంలో మాదిరిగానే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి.. కరోనా భయం ఏ ఒక్కరిలోనూ లేదు.. సరే కరోనా కి భయపడకపోతే పోయారు..ట్రాఫిక్ చలానలకు మాత్రం భయపడాల్సిందే…ఎందుకు భయపడాలి మా దగ్గర ఆర్ సి , లైసెన్స్, పొల్యుషన్ చెక్ రిపోర్ట్ ఉన్నాయి..హెల్మెట్ కూడా పెట్టుకున్నాం అని అంటారా..ఇప్పుడు అవి మాత్రమే సరిపోవు.. మరేం కావాలి… హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు..అవేంటంటే..
ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎంతమంది మరణిస్తున్నా చాలామంది హెల్మెట్ పెట్టుకునే విషయంలో అశ్రద్ద వహిస్తుంటారు..గతంలో పెంచిన ట్రాఫిక్ చలాన్ల భయానికి అయినా హెల్మెట్స్ పెట్టుకునే వారి సంఖ్య పెరిగిందని చెప్పవచ్చు..కానీ ఇకపై బైక్ డ్రైవ్ చేసేవారు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటే సరిపోదు..వారితో పాటు వెనక కూర్చున్నవారు కూడా హెల్మెట్ పెట్టుకుని తీరాల్సిందే..లేకపోతే..ఫైన్..
బైక్ కొనుక్కోగానే అందరూ చేసే మొదటి పని సైడ్ మిర్రర్స్ తీసేయడం..సైడ్ మిర్రర్స్ ఉంటే బైక్ షో పోతుంది అని కొందరి వాదన..సైడ్ మిర్రర్స్ లో చూడకుండా కూడా మేం డ్రైవ్ చేయగలం అని కాలరెగరేసేవారు కొందరు.. ఇకపై అలాంటి వాదనలు చెల్లవు..సైడ్ మిర్రర్స్ లేకపోవడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని..కాబట్టి ప్రతి వెహికిల్ కి సైడ్ మిర్రర్స్ ఉండాల్సిందే అనేది మరో కొత్త రూల్.. లేకపోతే ఫైన్..
వెహికిల్ డ్రైవ్ చేసే ప్రతి ఒక్కరికి లైసెన్స్ తప్పనిసరి..కానీ లైసెన్స్ లేకుండానే బండి తీసేవారు కూడా లేకపోలేదు..మరికొందరు మా దగ్గర లెర్నింగ్ లైసెన్స్ ఉందని వారికి ఇష్టం వచ్చినట్టు బండి నడిపిస్తుంటారు..ఇకపై అలాంటి పప్పులేం ఉడకవు..మీ దగ్గర లైసెన్స్ లేకపోతే అసలు బండి నడపడానికే అనర్హులు ..ఇక లెర్నింగ్ లైసెన్స్ ఉంటే వారి వెనుక ఖచ్చితంగా లైసెన్స్ ఉన్న మరో వ్యక్తి ఉండాల్సిందే..
ఇవండీ హైదరాబాద్ లో అమలు కాబోయే సరికొత్త ట్రాఫిక్ నిబంధనలు..కాబట్టి తస్మాత్ జాగ్రత్తా..
టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా? మంచు మనోజ్ ప్రశ్నల ట్వీట్!
ప్రస్తుతం టీటీడీ ఆస్తులు అమ్మడం అనే విషయం చర్చనీయాంశం అయ్యింది. ఈ క్రమంలో ఈ విషయంపై హీరో మంచు మనోజ్ ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ లో ఏమని రాసారంటే…
ఓం నమో వేంకటేశాయ
టీటీడీ ఆస్తులు అమ్మమని దేవుడేమన్నా చెప్పాడా ? కరోనా సంక్షోభంలో రోజుకు లక్ష మందికి ఆకలి తీర్చమని కూడా దేవుడు ఏమన్నా చెప్పాడా? చేసేది, చెప్పేది అంతా టీటీడీ పాలక మండలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తులను, కొండకి వచ్చిన లక్షలాది మందిని, సుప్రభాత సేవకి టైమ్ అయ్యింది నిద్ర లేవాలి.. అని శ్రీహరిని సైతం కంట్రోల్ చేసేది టీటీడీ పాలక మండలి. కొండపైన ఉన్న వడ్డీ కాసులవాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయి అంటే “గోవిందా గోవిందా” అని అరచిన ఈ గొంతు కొంచెం తడబడింది.

source: twitter/Manchu manoj
మోసం జరగట్లేదు అని తెలుసు. ఎందుకంటే ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా కాకుండా | వేలం వేసి అందరి ముందూ అందరు చూస్తుండగానే అమ్మకం జరుపుతారు. కానీ, ఎందుకు అమ్ముతున్నారు?.. అని పాలక మండలిని కాస్త వివరణ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. వివరణ మాత్రమే. ఏమీ లేదు సార్. | ఇంత పెద్ద కొండ మాకు అండగా ఉంది అని చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి ఆపుకోలేక అడుగుతున్నా సార్.. అంతే. జై హింద్..
మీ
మనోజ్ మంచు
ఇకపై మొబైల్ ఫోన్లు పనిచేయకపోవచ్చంట..! బలహీనపడుతున్న భూ అయస్కాంత క్షేత్రమే కారణం!
2020 స్టార్టయినప్పటి నుండి దెబ్బ మీద దెబ్బ లా ఏదో ఒక నెగటివ్ న్యూస్ వస్తూనే ఉన్నాయి..ఇంకా కరోనా కలవరం పోనే లేదు..మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు..మన భూమి చుట్టూఅయస్కాంత క్షేత్రం ఉంటుంది కదా.. అది బలహీనంగా అయిపోయిందనేదే ఆ షాకింగ్ న్యూస్..అలా ఎందుకు జరిగింది అనే దానికి సరైన కారణాలు శాస్త్రవేత్తలకు కూడా అంతుబట్టడం లేదు..ఈ అయస్కాంత క్షేత్రం బలహీన పడడం వలన కలిగే నష్టాలేంటో తెలుసా..
సౌత్ అట్లాంటిక్ ఎనోమలీ అని పిలిచే ఏరియా.. కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉంది. అంటే అయస్కాంత క్షేత్రాల బలహీనత తగ్గుతుందని అర్థం. ఇంతకు ముందు 24000 నానోటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం.. ప్రస్తుతం 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) సైంటిస్టులు పేర్కొన్నారు.ముఖ్యంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికాల మధ్య భూమిలో ఉన్న అయస్కాంత క్షేత్రం బలహీనపడినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎప్పటి నుంచో ఈ ఎనామలీపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు, తాజాగా నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైందని, అది అంతకంతకూ పెరుగుతూనే పోతుందని గుర్తించారు.ఇక ఈ మార్పులతో భూమిలోపల ఎలాంటి చర్యలు చోటుచేసుకుంటాయో కనుగొనడం తమకు అతి పెద్ద సవాల్ అని నిపుణులు చెబుతున్నారు..7,80,000 సంవత్సరాల క్రితం ఉత్తరధృవం, దక్షిణ దృవం తిరగబడ్డాయని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు..మళ్లీ అలాంటి మార్పు జరగడానికి చాలా సమయం ఉందని అన్నారు.
టెలీకమ్యునికేషన్, శాటిలైట్లు పని చేయాలంటే భూ అయస్కాంత క్షేత్రంపైనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు అయస్కాంత క్షేత్రం బలహీన పడడం వలన ప్రపంచ వ్యాప్తంగా శాటిలైట్ల కమ్యునికేషన్ కొంతవరకూ దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అలాటే టెలీకమ్యునికేషన్, మొబైల్ ఫోన్లు కూడా పనిచేయకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
అలాగే ఆ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో విమానాలకు కూడా టెక్నికల్ సమస్యలు ఎదురయ్యే ప్రమాదముందని అంటున్నారు..మరోవైపు అయస్కాంత క్షేత్రం తిరగబడడానికి చాలా సమయం ఉంది కావున ఈ ప్రమాదాలు సంభవించకపోవచ్చు అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.. చూడాలి ఏం జరుగుతుందో…
ఆకలి బాధలు తట్టుకోలేక రోడ్డుపై చనిపోయిన కుక్కని తిన్న బాధితుడు!
కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దాదాపు అన్ని దేశాలు ఈ విపత్తును ఎదురుకుంటున్నాయి కాగా అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఇతర దేశాలలో చనిపోయిన వారి చివరి చూపు కూడా చూసుకోవడానికి వీలులేని ఎన్నో హృదయ విషాదకర సంఘటనలు చాలానే చూసాం.కాగా వలస కూలీలు ఎక్కడివారు అక్కడ చిక్కుకుపోగా కాలినడకన తమ ప్రాంతాలకు చేరుకొనే లోపు చనిపోయిన సంఘటనలు ఈ లాక్ డౌన్ చూసాం.అయితే ఆకలి తట్టుకోలేక ఓ వ్యక్తి రోడ్ మీద కూర్చొని చనిపోయిన కుక్క మాంసాన్ని తినడం అందరి కళ్ళు చెమర్చేలా చేసింది..ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం..
ప్రాధామ్యాన్ సింగ్ నౌరాక అనే వ్యక్తి బైక్ మీద ఢిల్లీ నుండి జైపూర్ రహదారి మీదగా వెళ్తుండగా అతనికి ఓ హృదయ విషాదకర సంఘటన కనిపించింది.దానితో అతను ఆగి ఆ వ్యక్తి దగ్గరకి వెళ్ళాడు .రోడ్ మీద కూర్చొని చనిపోయిన కుక్క మాంసం తింటున్నాడు ఓ వ్యక్తి.కట్ చీఫ్ సహాయంతో అతనికి దగ్గరకి వెళ్ళాడు ప్రాధామ్యాన్ ఎందుకంటే అక్కడ తీవ్రమైన చెడు వస్తుంది.ఎందుకు మీరు ఇలా కుక్క మాంసాన్ని తింటున్నారు అని అడగగా ఆకలి వేస్తుంది భోజనం తిని చాలా కాలం అయ్యింది.ఈ లాక్ డౌన్ లో భోజనం పెట్టేవాళ్ళు కూడా లేరు అని చెప్పాడు ఆ వ్యక్తి.
దీంతో తీవ్ర ఆవేదన చెందిన ప్రాధామ్యాన్ ఆ కుక్క ను తినకు ఆలా ఈ మాంసం తింటే నువ్వు చనిపోతావ్ అని చెప్పి తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఆ వ్యక్తికీ అందచేశారు ప్రాధామ్యాన్.కాగా కొన్ని డబ్బులు కూడా అతనికి అందచేసాడు.రోడ్ల మీద ఇంత మంది కార్లు ,బైకులు వేసుకుని ఇతని ముందు నుండి వెళ్తున్నారు గాని ఎవరు ఆగి సహాయం చెయ్యట్లేదు ఎవరికీ మానవత్వం లేదు అని ఆవేదన వ్యక్తం చేసారు ప్రాధామ్యాన్.సదరు సంఘటన ను వీడియో తీసి పేస్ బుక్ లో అప్లోడ్ చేసి ఆ వ్యక్తికీ సహాయం చెయ్యాలసిందిగా ప్రజలను అభ్యర్ధించారు ప్రాధామ్యాన్.
This is beyond heartbreaking. No one deserves this
He is eating the carcass of a dead dog.@narendramodi India won’t forget this amount of pain and humiliation heaped of the poor #ShamelessBJP pic.twitter.com/NifOFgzAbQ— Lavanya Ballal | ಲಾವಣ್ಯ ಬಲ್ಲಾಳ್ (@LavanyaBallal) May 20, 2020
జబర్దస్త్ నుండి ఆ కమెడియన్స్ ని తీసేస్తున్నారా? వైరల్ అవుతున్న వార్త!
బుల్లితెరపై బాగా సక్సెస్ ఐన కామెడీ షో జబర్దస్త్.ఈ షో తో కెరీర్ ను ఆరంభించి సినిమాలలోకి వెళ్లిన కమెడియన్లు చాలామందే ఉన్నారు.జనాలు ఎప్పుడూ నవ్వుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఆలా నవ్వించడంలో విజయం సాధించింది కాబట్టే ఈ షో ఇంత సక్సెస్ అయ్యింది అని జబర్దస్త్ కమెడియన్ చమ్మక్ చంద్ర అన్నారు.లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ అన్ని కూడా నిలిపివేసిన విషయం తెలిసిందే.అందుకే జబర్దస్త్ షో TRP రేటింగ్స్ పడిపోయాయి.
కాగా జబర్దస్త్ నుండి నాగబాబు ,చమ్మక్ చంద్ర మరియు కొంతమంది బయటకు వెళ్ళిపోయి జీ తెలుగులో ఇంకో ప్రముఖ షో లో చేస్తున్నారు.ఈ నేపథ్యంలో జబర్దస్త్ గురించి జనాలలో తీవ్రంగా చర్చలు జరుగుతున్నాయి.ఇది వరకు సినిమా అవకాశాలు వచ్చాయి అని షకలక శంకర్ ,రఘు ఇలా కొంతమంది జబర్దస్త్ ను వదిలేసారు.
అందుకే ఇప్పుడున్న కమెడియన్స్ ఇలాంటి తప్పు చేయడంలేదు. సుడిగాలి సుధీర్ ,హైపర్ అది లాంటి వాళ్ళు ఈ షో ను ఇప్పటికి వదలకుండా కొనసాగుతున్నారు.లైఫ్ ఇచ్చిన ఈ షో ను ఎప్పటికి వదలము అని వారు చెప్తున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ షో మళ్ళీ ముందుకు దూసుకువెళ్తుంది.అయితే మంచి పెర్ఫార్మన్స్ లేని కమెడియన్ లను షో నుండి తొలగించాలని మల్లెమాల బృందం చూస్తుంది అనే వార్త వైరల్ అవుతుంది. అందులో నిజమెంతో తెలీదు.ఎవరిమీద వేటు పడుతుందో అని జబర్దస్త్ కమెడియన్ లందరు భయభ్రాంతులకు గురవుతున్నారంట . ఆ వార్త వెనక అసలు నిజం ఏంటో తెలియాలంటే వేచి చూడాలి.
ఆగష్టు 4 నాటికి భారత్ కి పెద్ద ముప్పు…అమెరికా సైంటిస్ట్ హెచ్చరికలు ఇవే..!
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటికీ ఎప్పటికి మర్చిపోని ఒక విపత్తుగా గుర్తిండిపోతుంది.ఇప్పటిదాకా ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మరణాలు సంభవించాయి కాగా ప్రతీ రోజు కొన్ని వేల పాజిటివ్ కేసు లు నమోదు అవుతున్నాయి.అమెరికా ,బ్రిటన్ లాంటి అగ్ర దేశాలు కూడా ఈ కరోనా దాటికి తట్టుకోలేకపోయాయి.దాదాపు అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లిపోయాయి.అన్ని రవాణా మార్గాలు నిలిపివేయడంతో ఎన్నో హృదయ విషాదకర సంఘటనలు వెలుగులోకి వచ్చాయి.ప్రపంచ దేశాలన్నీ తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయి.అయితే కరోనా మళ్ళీ తిరిగి విజృభించనున్నదని అమెరికా సైంటిస్ట్ కొన్ని వ్యాఖ్యలు చేసారు.వివరాల్లోకి వెళ్తే….
అమెరికా కు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ సైంటిస్ట్ ఫహీమ్ యూనస్ కరోనా పై ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నారు.అయితే దీనిలో భాగంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రోజుల్లో భారత్ ,పాకిస్తాన్లలో తీవ్రంగా కరోనా విజ్రాబించనున్నదని తెలిపారు.అయితే మార్చి నెల మొదటి నుండి భారత్ మరియు పాకిస్తాన్లో కరోనా కేసు ల పరిస్థితిపై అధ్యయనం చేసారు డాక్టర్ యూనస్.
అయితే ఈయన లెక్కల ప్రకారం భారత్ లో 32 వేల మరణాలు ,పాకిస్తాన్ లో 5 వేల మంది మరణిస్తారని తెలిపారు.అయితే తాజాగా తన నివేదిక మళ్ళీ తిరిగి వ్యాఖ్యలు చేసారు యూనిస్.
మరణాలపై కొంతమంది నాయకులు,ప్రజలు ద్వేషించవచ్చు గాని కరోనా కు రెండు దేశాలు సమానం.నా ప్రొజెక్షన్ తప్పు అయినా పాఠం మాత్రం కచ్చితంగా నిజమవుతుంది అంటూ ట్వీట్ చేసారు.
పెళ్లి కోసం డబ్బులు దాచుకున్నారు ఆ ఆటో డ్రైవర్…కానీ వాయిదా పడటంతో ఏం చేసారో తెలుసా?
కరోనా వైరస్ నేపథ్యంలో ఎవరికీ తోచిన సహాయం వారు చేసి మానవత్వాన్ని చాటుకుంటున్నారు.అయితే తాజాగా పూణే లో ఓ 30 యేళ్ళ ఆటోడ్రైవర్ చేస్తున్న సహాయం వెలుగులోకి వచ్చింది.అతని పేరు అక్షయ్ కోటవల.అక్షయ్ తన వివాహం కోసం రెండు లక్షల రూపాయలు దాచుకున్నాడు.అయితే ఇప్పుడు తన దాచుకున్న డబ్బునంతా కూడా కరోనా లాక్ డౌన్ లో ఆహారం లేకుండా బాధపడుతున్నవారికి ఉపయోగిస్తున్నారు.
అక్షయ్ కోటవల ఇంతటితో ఆగిపోకుండా తన ఆటోలో ముసిలివారిని మరియు గర్భిణీ స్త్రీలను డబ్బులు తీసుకోకుండా ఆటో లో వారికీ అవసరమైన చోట దింపుతున్నాడు.అతని ఆటోలో మైక్ పెట్టుకొని అందరూ సామాజిక దూరం పాటించండి కరోనా పై పోరాడండి అని చెపుతూ కరోనా గురించి ప్రజలకు అవగాహనా కల్పిస్తున్నాడు.అక్షయ్ తన స్నేహితులతో కలిసి ఆహారాన్ని సిద్ధం చేసి రోడ్ల మీద నిరాశ్రయంగా ఉన్న పేద వారికి దాదాపు రోజుకి 400 మందికి ఆహారాన్ని అందచేస్తున్నరు.
ఈ లాక్ డౌన్ సమయంలో ఇలా సహాయం చెయ్యగలుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అంటున్నారు అక్షయ్.తన వివాహం మే 25 వ తారీఖున జరగాల్సి ఉంది కానీ ప్రస్తుత పరిస్థితులలో వివాహాన్ని వాయిదా వేసుకోవడం మంచిది అని ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అక్షయ్ తెలిపారు.మా స్నేహితులందరం కలిసి ఒక వంటశాల ను ఏర్పాటు చేసాం అందులో చపాతీ ,కూరగాలయాల కూర తయారుచేస్తున్నాం అని అక్షయ్ తెలిపారు.చపాతీ లకు ఎక్కువ ఖర్చు కావడంతో ప్రస్తుతం వెజిటల్ బిర్యానీ ని తయారుచేసి పంచిపెడదామని నిర్ణయం తీసుకున్నట్లుగా అక్షయ్ తెలిపారు.
మా దగ్గర ఉన్న డబ్బుతో మే 31 వరకు ఆహారం అందించగలమని అన్నారు అక్షయ్.అంతేకాకుండా రోడ్ల మీద ఉన్న పేదవారికి మరియు వలస కూలీలకు మస్క్‌లు మరియు శానిటైజర్ లు పంచిపెడుతున్నారు అక్షయ్ మరియు అతని స్నేహితులు.గత సంవత్సరం మహారాష్ట్ర లో వచ్చిన వరదల సందర్భంలో కూడా చాలా మందికి ఆహారం అందచేశారు అక్షయ్.కాగా ఒక ఆటోడ్రైవర్ అయినాసరే అతను చేస్తున్న సేవ మాములు విషయం కాదు అని పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అక్షయ్ మీద ప్రశంసల వర్షం కురిపిపిస్తున్నారు.