చైనాలో కొన్ని వేలమందిని వణికిస్తున్న వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని మొత్తాన్ని వణికిస్తుంది. చైనా నుండి పాకి అనేక దేశాలకు చేరుకుంది. మన భారత్ లో కూడా కేరళ లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా కొత్తగా నాలుగు నగరాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను నిర్వహించడానికి అనుమతించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఇందులో హైదరాబాద్‌తోపాటు అలిప్పీ(కేరళ), ముంబయి, బెంగళూర్లను చేర్చింది.

కరోనా వైరస్ హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. మన దేశంలో కొత్తగా రెండు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని తెలిపింది. అంతేకాదు ఢిల్లీలో మరో వ్యక్తికి కూడా కరోనావైరస్ వచ్చిందని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. ప్రస్తుతం వారిద్దరికి ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స కొనసాగిస్తున్నారు.

అలాగే మనం కూడా జాగ్రత్తలు పాటిద్దాం. ఇతరుల కళ్లు, నోరు, ముక్కు భాగాలను తాకొద్దు. ఎల్లప్పుడూ మాస్క్ ధరించాలి. చేతుల్ని శుభ్రంగా కడుగుతూ ఉండాలి .జంతువులకు వీలైనంత దూరంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం ఎక్కువగా చాలా రోజులనుండి ఉంటె వెంటనే డాక్టర్ ని కలవండి.
















చిరు152 వ సినిమాకి ‘ఆచార్య’ అనే టైటిల్ అనుకుంటన్నారు .ఈ సినిమాలో చిరు ఓ కమ్యునిస్ట్ గా కనిపించబోతున్నట్టు ఇటీవల లీక్ అయిన ఓ పిక్ చూస్తే క్లియర్ గా తెలిసిపోతుంది. అయితే ఈ చిత్రంలో యంగ్ చిరంజీవి పాత్ర ఓ లెక్చరర్ అని , అసలు లెక్చరర్ గా ఉన్న ‘ఆచార్య’ నక్సలైట్ గోవింద గా ఎలా మారడానికి దారి తీసిన పరిస్ధితులు ఏంటి.. అన్నది అసలైన కథ . లెక్చరర్ ఆచార్య పాత్ర గురించే ఇప్పుడు డిస్కషన్ .











ప్రస్తుతం చాలా మంది సినిమాలను థియేటర్ కి వెళ్లకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లాంటి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో సినిమాలు చూస్తున్నారు. సినిమా విడుదలైన రెండు నెలలకే అందులో రావడంతో థియేటర్స్ పై ఎక్కువ మక్కువ చూపించట్లేదు. విదేశాల్లో అయితే ఇది మరి ఎక్కువ.
అయితే అలా వైకుంఠపురంలో సినిమాకి ఓటిటి ప్లాటుఫార్మ్స్ లో లభించదు తెలిసి చాలా మంది థియేటర్ కి వెళ్లి చూసారు. పాజిటివ్ టాక్ రావడంతో అందరు థియేటర్ కి వెళ్లారు. అయితే ఇప్పుడు ఇలా నెట్ ఫ్లిక్స్ లో ప్రత్యక్షమయ్యేసరికి అందరు ఆశ్చర్యపోతున్నారు. మమ్మల్ని థియేటర్లకు రప్పించడంకోసం ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తారా అంటూ సినిమా యూనిట్ పై ఫైర్ అవుతున్నారు నెటిజెన్స్.