విశాఖపట్నంలో ‘బేబీ’ సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ స్టోరీలో ఇద్దరు మరణించగా, మరొకరు జైలు పాలయ్యారు. అయితే ఈ ఘటనలో దొరికిన లెటర్ లోని విషయాలు ఎవరికీ తెలియడం లేదు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి, ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు.
విశాఖపట్నంలో ఇంటర్ విద్యార్థిని ఇద్దరు అబ్బాయిలతో నడిపిన ముక్కోణపు ప్రేమకథ ఆఖరికి విషాదాన్ని మిగిల్చింది. ఇక వివరాలలోకి వెళ్తే, విశాఖ పట్నంలో నివసిస్తూ, అక్కడే ఇంటర్ చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థినికి ఇందిరా నగర్లో ఉండే డ్యాన్సర్ సాయికుమార్ తో పరిచయం ఏర్పడింది.
అదే సమయంలో ఆదర్శనగర్ లో నివసించే సూర్యప్రకాశరావు అనే యువకుడితో కూడా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత ఇద్దరితో ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమకథను సాగించింది. ఈ క్రమంలో ఆ బాలిక సాయికుమార్తో తల్లి కట్టించుకుంది. ఆ తరువాత కూడా సూర్యప్రకాశరావుతో ప్రేమకథను కొనసాగించింది. ఆ తరువాత సాయికుమార్ తో తాళి కట్టించుకున్న వీడియోలు బయటికి వచ్చాయి.
అంతేకాకుండా లవర్ సూర్య ప్రకాశరావుతో కలిసి ఉన్న ఫోటోలు కూడా బయటికి వచ్చాయి. ప్రసుతం వీడియో మరియు పొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటితో ఆ బాలిక ఇద్దరు యువకులతో ఒకరికి తెలియకుండా మరొకరితో నడుపుతున్న ప్రేమ కథ వెలుగులోకి వచ్చింది. దాంతో సాయికుమార్ మరియు సూర్యప్రకాశరావు ఆ బాలిక ఇంటికి వెళ్ళి ఇద్దరిలో ఎవరు కావాలని ? ఆమె ఎవరితో కలిసి ఉంటుందో చెప్పమని నిలదీశారు. ఊహించని పరిణామంతో ఏం చేయాలో తెలియని ఆ బాలిక ఉరి వేసుకుని ఆగస్ట్ 10న ప్రాణాలు తీసుకుంది.
ఆమె తండ్రి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు విచారణ చేపట్టారు. ఆ బాలిక మృతదేహం దగ్గర లెటర్ పోలీసులకు ఒక లెటర్ లభించింది. ఆ లెటర్ లో ‘సూర్య వాళ్లెవరినీ కూడా వదలకు కుక్క చావు చావాలి కొడుకులు’ అని ఉంది. అయితే సూర్యప్రకాశ్ అదే రోజు రాత్రి గోపాలపట్నం దగ్గరలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ముక్కోణపు ప్రేమ కథలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడగా, సాయికుమార్ ను పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Also Read: చిరుత దాడికి గురైన అమ్మాయి కోసం TTD కీలక నిర్ణయం..! అసలు విషయం ఏంటంటే..?