సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యి, తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బర్రెలక్క అలియాస్ శిరీష పెళ్లి ఇటీవల జరిగింది. నాగర్ కర్నూల్ కి చెందిన శిరీషకి, అదే ప్రాంతానికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తితో మార్చి 28వ తేదీన పెళ్లి జరిగింది. ఎంగేజ్మెంట్ జరిగిన తర్వాత ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ సడన్ గా ఎంగేజ్మెంట్ జరిగింది అని, దాంతో ఎవరిని పిలిచే అవకాశం తనకి దొరకలేదు అని బర్రెలక్క చెప్పారు.
ఆ తర్వాత పెళ్లికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ, తన పెళ్లి మార్చి 28వ తేదీన జరుగుతోంది అని, అందరూ రావాలి అని చెప్పారు. తన భర్త వెంకటేష్ కి కూడా రాజకీయాలు అంటే ఆసక్తి ఉంది అని, పెళ్లి జరిగిన తర్వాత ఇద్దరూ కలిసి రాజకీయాల్లో పాల్గొంటారు అని చెప్పారు. వెంకటేష్ తనకి చుట్టమని, అలా వారి ఇద్దరికీ పరిచయాలు ఏర్పడ్డాయి అని అన్నారు. బర్రెలక్క పెళ్లి వేడుకను కూడా కొన్ని చానల్స్ టెలికాస్ట్ చేశారు. పెళ్లయ్యాక ఇప్పుడు బర్రెలక్క ఒక రీల్ షేర్ చేశారు. తన భర్త అంటే తనకి ఎంత ఇష్టమో చెప్తూ ఈ వీడియో షేర్ చేశారు.
ఈ వీడియోకి, “నువ్వు నా లైఫ్ లోకి రావడం నిజంగా నా అదృష్టం మై డియర్ హస్బెండ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్” అంటూ ఈ వీడియోని షేర్ చేశారు. ఈ వీడియోకి అమ్మానాన్న తమిళ అమ్మాయి సినిమాలోని నీవే నీవే పాటని ఫిమేల్ వెర్షన్ ఉన్న ఆడియో ఒకటి యాడ్ కూడా చేశారు. బర్రెలక్క తన భర్తతో కలిసి ఉమామహేశ్వర స్వామి గుడికి కూడా వెళ్లారు. ఈ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. బర్రెలక్క, భర్త వెంకటేష్ వాళ్ళిద్దరికీ తాంబూలాలు ఇస్తున్న ఫోటో ఒకటి షేర్ చేశారు. అందుకు బర్రెలక్క, “తండ్రి ప్రేమ లేకున్నా, నన్ను తండ్రిలా చూసుకునే, నా గుండా వెంకన్న లక్ష్మీ అమ్మ చేతుల మీద నాకు పుట్టింటి చీర అందింది. థాంక్యూ” అని షేర్ చేశారు.
watch video :