సాధారణంగా ప్రతి ఐపీఎల్ సీజన్ లో చాలా మంది యంగ్ ప్లేయర్స్ తమ టాలెంట్ ను నిరూపించుకుని వెలుగులోకి రావడమే కాకుండా ఐపీఎల్ స్టార్లుగా మారుతున్నారు.
ఈ క్రమంలో ఈ ఏడాది జరుగుతున్నఐపీఎల్ 16 వ సీజన్ లో యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. తాజాగా ఈ యంగ్ క్రికెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. అయితే ఈసారి తన ఆటతో మాత్రం కాదు. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
ప్రతి సీజన్ లాగే ఈ ఐపీఎల్ లో ఇద్దరు యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైస్వాల్. అతను రాజస్థాన్ రాయల్స్ జట్టు తరుపున ఆడుతున్నాడు. యశస్వి తన బ్యాటింగ్ తో సృష్టిస్తున్న విధ్వంసం క్రికెట్ ఫ్యాన్స్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బక్క పల్చగా ఉండే యశస్వి కొడుతున్న సిక్సర్లు చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారని చెప్పవచ్చు. ఆడే ప్రతి మ్యాచ్ లో ఓపెనర్ గా భారీ స్కోర్లు సాధిస్తున్నాడు. దేశవాళి క్రికెట్ లో వలె ఐపీఎల్ లో కూడా తన బ్యాటింగ్ తో విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ సీజన్ లో యంగ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ తన అద్భుతమైన ఆటతో క్రికెట్ ఫ్యాన్స్ ను, మాజీ క్రికెటర్లను ఆకర్షించాడు. రీసెంట్ గా ఆడిన మ్యాచ్‌లో 98 రన్స్ చేసి మరోసారి ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్ తో అతను వార్తల్లో నిలిచాడు. ఈ క్రమంలోనే తాజాగా యశస్వి జైస్వాల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి, తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాడు. అయితే అది క్రికెట్‌కు సంబంధించిన విషయంలో కాదు.
యశస్వి జైస్వాల్ దర్శక ధీరుడు రాజమౌళి రవితేజ హీరోగా తెరకెక్కించిన ‘విక్రమార్కుడు’ సినిమాలోని బాలనటుడిని పోలి ఉండటంతో ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. విక్రమార్కుడు సినిమాలో ఒక బాల నటుడు హీరో రవితేజతో కలిసి ఒక సన్నివేశంలో నటించాడు. ఆ అబ్బాయికి, యశస్వి జైస్వాల్ మధ్య పోలికలు ఉండటంతో నెటిజెన్లు ఆ బాలుడు మరియు యశస్వి జైస్వాల్ మీమ్స్ ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. యశస్వి జైస్వాల్ జక్కన్న విక్రమార్కుడు మూవీలో నటించారా అన్నట్టుగా ఆ మీమ్స్ ను క్రియేట్ చేశారు.
Vikramarkudu lo vunnadhi @ybj_19 e antara #IPL2023 #IPL pic.twitter.com/nqJ8OiCHD4
— Prasad Arisetty (@PrasadAGVR) May 13, 2023
Also Read: “ధోనీ” లాంటి క్రికెటర్, శతాబ్దానికి ఒక్కడే వస్తాడు..! సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై, కోల్‌కతా జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో కోల్‌కతా జట్టు విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ధోనీ స్టేడియం చుట్టూ తిరిగాడు. ఆ సమయంలో చెన్నై ప్లేయర్స్ అంతా ధోనితో నడుస్తూ ఫ్యాన్స్ కి అభివాదం చేశారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళిన గవాస్కర్ ధోనిని ఆటోగ్రాఫ్ ఇవ్వమని అడిగి, తన షర్ట్ పైనే గవాస్కర్ ధోనీ ఆటోగ్రాఫ్ ను తీసుకున్నాడు.
కొన్ని రోజులుగా చెపాక్ లోనే ధోనీ చివరి ఐపీఎల్ మ్యాచ్ అని, రిటైర్మెంట్ ప్రకటిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ దగ్గర దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత ధోనీ గొప్పతనాన్ని మెచ్చుకున్నారు. “ధోనీ కనీసం వచ్చే ఐపీఎల్ సీజన్ లేదా మరిన్ని సీజన్లలో ఆడాలని అన్నారు. ధోనీ ఆడటం వల్ల ఐపీఎల్ చాలా ప్రయోజనం ఉంటుందని అన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ 10 ఏళ్లకు ఓ సారి వచ్చే ఆటగాడు కాదని, వందేళ్లకు ఒకసారి వచ్చే ఆటగాడని కొనియాడారు.
కెవిన్ పీటర్సన్ గతంలో ఒకసారి ఇంపాక్ట్ ప్లేయర్ గురించి చెప్పాడు. ఇంపాక్ట్ ప్లేయర్ గా మహేంద్ర సింగ్ ధోనీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడాలని అన్నారు. నూరేళ్లకు ఓ సారి వచ్చే ధోనీ లాంటి ప్లేయర్ ను అభిమానులు మళ్లీ మళ్లీ చూడాలని భావిస్తారని, కనుక ఇదే ధోనీ ఆఖరి సీజన్ కాదని, మళ్లీ ఆడతాడనే భావిస్తున్నానని” అని గావాస్కర్ అన్నారు.








#2 చెన్నై సూపర్ కింగ్స్:
#3 ముంబై ఇండియన్స్:
#4 లక్నో సూపర్ జెయింట్స్:
#5 రాజస్థాన్ రాయల్స్:
#6 కోల్‌కతా నైట్ రైడర్స్:
#7 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు:
#9 సన్‌రైజర్స్ హైదరాబాద్:
#10 ఢిల్లీ క్యాపిటల్స్:
అయితే ఆ తర్వాత ఢిల్లీ తన ఆటను మెరుగుపరుచుకుని, 5 మ్యాచ్‌ల లో 4 మ్యాచ్ లు గెలిచింది. అయితే చెన్నై జట్టు చేతిలో ఓటమి పాలవడంతో ఈ జట్టు ప్లేఆఫ్స్ ఆశలు ఆవిరి అయ్యాయి. ఇక ఈ జట్టు ప్లేఆఫ్స్ చేరేందుకు కేవలం 2 శాతం ఛాన్స్ ఉంది.
అయితే ఆస్ట్రేలియా పాకిస్తాన్ మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో పాక్ బ్యాట్స్ మెన్ జావేద్ మియాందాద్ ఆస్ట్రేలియా బౌలర్ బిల్లీ వేసిన బంతిని ఎదుర్కొని రన్స్ కోసం పరుగెడుతున్న సమయంలో బిల్లీని ఢీ కొన్నాడు. చెప్పాలంటే బిల్లీ కావాలనే జావేద్ కు అడ్డుగా వచ్చాడు. అక్కడితో ఆగకుండా అంపైర్ దగ్గర ఉన్న స్వెటర్ తీసుకుంటూ పక్కనే ఉన్న జావేద్ ను కాలితో తన్నాడు. దాంతో జావేద్ కు కోపం వచ్చి బిల్లీని బ్యాట్ తో కొట్టబోయాడు. కానీ అంపైర్ అతన్ని ఆపి, ఇద్దరినీ కూల్ చేసి పంపించాడు.
2. ఇండియా పాకిస్థాన్ మధ్య జరిగిన టీ20 వరల్డ్ కప్ లో పాక్ బౌలర్ షాహిద్ అఫ్రిది భారతజట్టులో ముగ్గురు దిగ్గజ ఆటగాళ్లను అవుట్ చేసి, ఇండియాను ఓడించాలనే కోరికను తీర్చాడు. ఆ తరువాత మ్యాచ్ లో అఫ్రిది బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పాక్ ఆడియెన్స్ ముందు మ్యాచ్ లో అవుతా అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ పేర్లను పదే పదే అరుస్తు ఉన్నారు. వారి అరుపులు విన్న అఫ్రిది ఆ ముగ్గురు బ్యాట్స్ మెన్స్ ఎలా అవుట్ అయ్యారో ఇమిటేట్ చేసి చూపించారు. ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన అఫ్రిది ఇలా చేయడం సిగ్గుచేటని చెప్పవచ్చు.
3. అతిధి దేవో భవ అని అంటుంటాం. కానీ ఈ విషయం ఇంగ్లండ్ ఫ్యాన్స్ మాత్రం పాటించలేదు. క్రికెట్ దేవాలయంగా భావించేటువంటి లార్డ్స్ మైదానంలో ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కే ఎల్ రాహుల్ పై ఇంగ్లాండ్ ఫ్యాన్స్ షంపైన్ బాటిల్ క్యాప్స్ విసిరేశారు. దీన్ని చూసిన విరాట్ కోహ్లీ వాటిని తిరిగి వారి పైకి విసిరేయమని అన్నాడు. ఫ్యాన్స్ చేసింది చూసిన కామెంటేటర్స్ కూడా వాళ్ళు చేసిన పనికి వారిని అసహ్యించుకున్నారు.
4. క్రికెట్ లో అంపైర్ డిసిషన్ ని ఫైనల్ డిసిషన్ గా తీసుకుంటారు. కానీ కొన్నిసార్లు ప్లేయర్స్ అత్యుత్సాహంతో టెంపర్ మెంట్ ను అంపైర్ పై అరుస్తూ ఉంటారు. ఇలాంటిదే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో షకిబ్ అల్ హాసన్ బౌలింగ్ చేస్తూ ఎల్బిడబ్ల్యు కోసం పదే పదే అప్పీల్ చేశాడు. కానీ అంపైర్ స్పందించక పోవడంతో షకిబ్ అల్ హాసన్ కోపంగా వెళ్ళి స్టంప్స్ ని తన్నాడు.
5. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన ఒక మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్నసెహ్వాగ్ సెంచరీకి ఇంకా ఒక పరుగు అవసరం ఉన్న సమయంలో సూరజ్ రందీవ్ సెంచరీని అడ్డుకోవడానికి చివరి బంతిని ఉద్దేశపూర్వకంగా నో బాల్ వేసాడు. సెహ్వాగ్ దాన్ని సిక్సర్ కొట్టాడు. భారత్ గెలిచింది. కానీ సెహ్వాగ్ సెంచరీ మిస్ అయ్యాడు. నో బాల్ వేసిన సూరజ్‌కు ఒక మ్యాచ్ నిషేధం విధించారు.
6. 2012 సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ లో ఆస్ట్రేలియన్ ఫ్యాన్స్ విరాట్ కోహ్లీని అసభ్యకరమైన కామెంట్స్ చేశారు. వాటిని విన్న కోహ్లీ వాళ్ళకి తన మిడిల్ ఫింగర్ ను చూపించాడు. అలా చేసినందుకు కోహ్లీ మ్యాచ్ ఫీజ్ లో 50% కోత విధించారు. అలాగే ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. తరువాత తప్పు తెలుసుకుని ఇలా చేయడమే తప్పే, కానీ వాళ్ళు నీ తల్లి, చెల్లి అంటూ అసభ్యకరమైన మాటలు మాట్లాడితే ఏం చేయాలి అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశాడు.
7. 2009లో పాకిస్థాన్‌తో టెస్ట్ మ్యాచ్ కోసం శ్రీలంక జట్టు లాహోర్‌లోని గడాఫీ స్టేడియంకు వెళుతుండగా, తాలిబాన్లకు చెందిన ఉగ్రవాదులు వారి బస్సు పై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఎనిమిది మంది మృతి చెందగా, ఆరుగురు శ్రీలంక ఆటగాళ్లు, సిబ్బంది గాయపడ్డారు. వెంటనే ఆ మ్యాచ్ ను రద్దు చేసుకొని, శ్రీలంక ప్లేయర్స్ ను క్రికెట్ గ్రౌండ్ లోనే హెలికాప్టర్ ఎక్కించి, శ్రీలంకకు తీసుకెళ్లారు. ఆ రోజును క్రికెట్ చరిత్రలో బ్లాక్ డే గా పరిగణించారు.
8. క్రికెట్ జట్టులోని ఆటగాళ్ల మధ్య స్నేహం, అవగాహన ఉంటే ఆ జట్టు రాణిస్తుంది. కానీ కొన్నిసార్లు ఆటగాళ్ల మధ్య తప్పుగా అర్ధం చేసుకోవడం జరుగుతుంది. ఇలాగే ఢాకా ప్రీమియర్ లీగ్ లో జరిగింది. ఒక మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ కొట్టిన ఒక బాల్ ను పట్టుకోవడానికి బంగ్లాదేశ్ బౌలర్ నసుమ్ అహ్మద్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ఇద్దరు వెళ్లారు. ఆ ప్రయత్నంలో ఇద్దరు ఢీకొన్నారు. రహీమ్ బాల్ ను పట్టుకున్నాడు. అయిన కోపంతో నసుమ్ అహ్మద్ ను కొట్టడానికి చేయి పైకి ఎత్తాడు. కానీ తనను తాను కంట్రోల్ చేసుకుని ఆగాడు.
9. 1981 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలవాలంటే చివరి బంతికి 6 పరుగులు చేయాలి. అంటే చివరి బంతిని సిక్స్ కొడితే న్యూజిలాండ్, కొట్టలేకపోతే ఆస్ట్రేలియా గెలుస్తుంది. అయితే ఆసీస్ బౌలర్ బంతిని కొట్టడానికి వీలు లేకుండా వేశాడు. దాంతో న్యూజిలాండ్ ఓడిపోయింది. బ్యాట్స్ మెన్ కోపంతో బ్యాట్ విసిరేసి వెళ్ళిపోయాడు. బాల్ అలా వేయడం తప్పు కానప్పటికీ, క్రీడాస్పూర్తికి విరుద్ధం. న్యూజిలాండ్ ఫ్యాన్స్, తో పాటు ఆస్ట్రేలియా ఫ్యాన్స్ కూడా ఆ బౌలర్ పై ఆగ్రహించారు. రెండు దేశాల పీఎంలు కూడా దీన్ని విమర్శించారు. అయితే దీన్ని చాపెల్ బ్రదర్స్ కావాలని చేశారు.
10. 1996 లో ఇండియా శ్రీలంక మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ లో దేశమంతా సిగ్గుపడే సంఘటన జరిగింది. భారత్ 15.5 ఓవర్లలో 120 పరుగుల వద్ద 8 వికెట్లు కోల్పోవడంతో భారత అభిమానుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. గ్రౌండ్లో కి బాటిల్స్, చెప్పులు స్టేడియంలోకి విసరేసి, సీట్లకు నిప్పు అంటించారు.
మ్యాచ్ ను 30 నిమిషాల పాటు ఆపారు. తరువాత మ్యాచ్ మొదలు పెట్టగా పరిస్థితి అలాగే ఉండడంతో డిఫాల్ట్‌గా శ్రీలంక గెలిచినట్లుగా ప్రకటించారు. మార్చి 13, 1996, క్రికెట్ చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. అలాగే షేమ్ ఫుల్ ఇన్సిడెంట్స్ లో ఈ సంఘటన ముందు వరుసలో ఉంటుంది.


ఈ లీగ్ ద్వారా భారత జట్టుతో పాటు, ఆయా దేశాల జాతీయ జట్లకు ఎంపికైన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం ఐపీఎల్ తమ ప్రతిభను ప్రదర్శిస్తే చాలు, వారిని నేషనల్ టీం లోకి తీసుకుంటున్నారు. వెంకటేష్ అయ్యర్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వంటి వారు ఐపీఎల్ ద్వారానే భారత జట్టులో స్థానం సంపాదించుకున్నారు. ఈ సీజన్ లో తన ఆటతో ఆకట్టుకుంటున్న ఆ యువ క్రికెటర్ పంజాబ్ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మ. జితేష్ వయసు 29 సంవత్సరాలు. అతని అతను ప్రదర్శన చూసి క్రికెట్ అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం ఫిదా అయ్యారు
పంజాబ్ జట్టు తరపున ఆడుతున్న జితేష్, కీపర్ గానే కాకుండా, విధ్వంసకర బ్యాటింగ్ తో గుర్తింపు సంపాదించు కున్నాడు. జితేష్ శర్మ బ్యాటింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ ని గుర్తు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో జితేష్‌కు ఇండియా టీ20 జట్టులో స్థానం కల్పించాలని రోజు రోజుకు డిమాండ్ కూడా పెరుగుతుంది. బుధవారం నాడు ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్‌లో జితేష్ 27 బాల్స్ లో 5 ఫోర్లు, 2 సిక్స్ లతో 49 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు ఈ మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ, ఈ ఇన్నింగ్స్‌తో జితేష్ స్థాయి మరింత పెరిగిందని చెప్పవచ్చు.
జితేష్‌కి ఐపీఎల్లో ఇదే టాప్ స్కోరు. గత ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ పై జితేష్ 44 పరుగులు చేశాడు. అయితే జితేష్ 5 లేదా 6 స్థానాల్లో బ్యాటింగ్ చేస్తాడు. అందువల్ల ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం అతనికి లేదు. అయినప్పటికీ అతనికి వచ్చిన ఛాన్స్ నే జితేష్ సద్వినియోగం చేసుకున్నాడు. చివరి ఓవర్లలో జితేష్ బ్యాటింగ్ విధ్వంసకరంగా ఉంటుంది.
ఈ యంగ్ ప్లేయర్ ని సరైన విధానంలో వాడినట్లయితే మరో ధోని కాగలడని క్రికెటర్లు నిపుణులు భావిస్తున్నారు. నిజం చెప్పాలంటే ధోని అనంతరం భారత జట్టుకు ధోని స్థాయిలో వికెట్ కీపర్ బ్యాటర్ లభించలేదు. అయితే ఆ లక్షణాలు జితేష్ శర్మలో కనిపిస్తున్నాయి. దీంతో సరిగ్గా వాడితే మరో ధోనీ అవుతాడని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు.







