మనందరం స్కూల్ డేస్ నే ఎక్కువ మిస్ అవుతూ ఉంటాం. ఎందుకంటే..మనకి అప్పుడు ప్రపంచం ఎలా ఉంటుందో తెలియదు.. మన ఫ్యూచర్ గురించి అమాయకం గా కలలు కనే రోజులు అవి.. ఆ రోజుల్లో.. స్కూల్ డేస్ అయిపోవచ్చి.. లాస్ట్ ఫేర్ వెల్ వచ్చేసరికి.. మనందరి చేతిలో కామన్ గా ఉండేవి స్లాం బుక్స్.. మన ఆటోగ్రాఫ్ మన ఫ్రెండ్స్ కి ఇస్తూ.. వారివద్దనుంచి మెమోరీస్ మనం తీసుకుంటూ.. అసలు ఆ రోజులే వేరు. ఎవరికైనా.. స్లాం బుక్ ఓ తీయని జ్ఞాపకం.
మనం చిన్నపుడు ఏవేవో అవుదాం అని అనుకుని ఉంటాం.. అవే మన స్లాం బుక్ లో రాసుకుంటూ ఉంటాం.. కానీ పరిస్థితులను బట్టి నడుస్తూ ఉంటాం. తాజాగా.. విరాట్ కోహ్లీ తన చిన్నప్పటి స్లాం బుక్ ను సోషల్ మీడియా లో పంచుకున్నారు. అందులో.. తానూ చిన్నప్పుడు ఏమి అవ్వాలనుకుని రాసారో తెలుసా..? క్రికెటర్ అని.. కోహ్లీ నిజం గానే మంచి ఆటగాడు అయ్యి యావత్ భారత్ గర్వించదగ్గ క్రికెటర్ గా ఎదిగాడు. నిజం గా గ్రేట్ కదా…