బేబీ సినిమా తో మంచి క్రేజ్ తెచ్చుకున్న నటుడు విరాజ్ అశ్విన్ హీరోగా నటించిన జోరుగా హుషారుగా సినిమా నేడు విడుదల అయింది.ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…!
- నటీనటులు: విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ, సిరి హన్మంతు, మధు నందన్, సాయికుమార్, రోహిణి, బ్రహ్మజీ, జెమినీ కిరణ్, చంద్రికా థాకూర్ తదితరులు
- దర్శకత్వం: అనుప్రసాద్
- నిర్మాత: నిరీష్ తిరువీడుల
- మ్యూజిక్: ప్రణీత్ నంబూరి
- సినిమాటోగ్రాఫర్: మహి రెడ్డి పొందుగుల
- ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
- బ్యానర్: శిఖర, అక్షర ఆర్ట్స్ ఎల్ఎల్పీ
- సమర్పణ: శ్రీమతి నివేదిత
- రిలీజ్ డేట్: 2023-12-15

కథ:
సంతోష్(విరాజ్ అశ్విన్) ఆనంద్(మధునందన్) ఆఫీస్ లో పని చేస్తుంటాడు. సంతోష్ లవర్ నిత్య(పూజిత పొన్నాడ) అతనికి చెప్పకుండా అతని ఆఫీస్ లో టీంలీడ్ గా జాయిన్ అవుతుంది. దీంతో సంతోష్ షాక్ అయి తమ లవ్ గురించి ఆఫీస్ లో ఎవ్వరికి తెలియకూడదు, తెలిస్తే జాబ్స్ తీసేస్తారు అని చెప్తాడు. ఆనంద్ పెళ్లి కావట్లేదని బాధపడుతూ ఉంటాడు. ఆఫీస్ లో సుచిత్ర(సిరి హనుమంత్) ఆనంద్ ని ఇష్టపడుతుంది. వీళ్ళిద్దర్నీ కలిపితే బాస్ మెచ్చుకొని తనకి కావాల్సిన శాలరీ హైక్ ఇస్తాడని ఆనంద్, సుచిత్రని కలపడానికి సంతోష్ ట్రై చేస్తాడు.

కానీ ఆనంద్ తప్పుగా అర్ధం చేసుకొని సంతోష్ లవర్ నిత్యని ప్రేమిస్తాడు. మరో పక్క ఊళ్ళో చేనేత కార్మికుడిగా ఉన్న సంతోష్ తండ్రి(సాయి కుమార్) 20 లక్షలు అప్పు చేస్తే ఆ అప్పు కొడుకు కడతాడని ఎదురు చూస్తూ ఉంటాడు. మరి సంతోష్ తండ్రి అప్పు తీర్చాడా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఏమైంది? సుచిత్ర లవ్ ఆనంద్ కి చెప్పిందా? సంతోష్ – నిత్యల ప్రేమ కథ ఆఫీస్ లో తెలిసిందా? తెలియాలి అంటే మిగిలిన కథ తెరపై చూడాల్సిందే.

రివ్యూ:
మొదటి హాఫ్ అంతా ఆఫీస్ లో విరాజ్ – పూజిత మధ్య లవ్ సీన్స్, ఆఫీస్ లో కొన్ని కామెడీ సీన్స్, హీరో హీరోయిన్స్ లవ్ ఎవ్వరికి తెలియకూడదు అని సాగుతుంది. మధ్యలో విరాజ్ తల్లితండ్రులుగా సాయి కుమార్ – రోహిణి సీన్స్ చూపిస్తారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతుంది. ఇంటర్వెల్ కి మధునందన్ సుచిత్రని ప్రేమిస్తాడు అనుకుంటే నిత్యని ప్రేమిస్తాడు అని చెప్పి ఓ కన్ఫ్యూజన్ లో ట్విస్ట్ తో బ్రేక్ ఇస్తారు.

ఇక సెకండ్ హాఫ్ అంతా హీరో వాళ్ళిద్దర్నీ కలపడానికి ట్రై చేయడం, వీళ్ళ లవ్ గురించి చెప్పకపోవడంతో హీరో – హీరోయిన్స్ మధ్య మనస్పర్థలు, ఊళ్ళో తండ్రీకొడుకుల ఎమోషన్ చూపిస్తారు. చివరి అరగంట మాత్రం కొంచెం కామెడీతో నవ్వుకోవచ్చు. కొంచెం ఎమోషన్ కూడా వర్కౌట్ అవుతుంది.హీరో విరాజ్ అశ్విన్, హీరోయిన్ పూజిత పొన్నాడ తమ తమ పాత్రల్లో బాగా నటించారు. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ, ఇగో సీన్స్ వర్కవుట్ అయ్యాయి. సోను ఠాకూర్ తన అందంతో కాసేపు మెప్పించింది. అమాయకమైన అమ్మాయి రోల్ లో సిరి హనుమంత్ ఫర్వాలేదనిపించింది.

మధునందన్, రాజేష్ ఖన్నా, బ్రహ్మాజీ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయి కుమార్, రోహిణి పత్రాలు చిన్నవే అయినా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యాయి. కెమెరా విజువల్స్ మాత్రం బాగున్నాయి. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనిపించినా సాంగ్స్ మాత్రం యావరేజ్ అనిపిస్తాయి. కథ పరంగా ఇంట్రెస్ట్ గా ఉన్నా దర్శకుడు స్క్రీన్ ప్లేని ఇంకొద్దిగా బాగా రాసుకుంటే బాగుండేది అనిపిస్తుంది. మొత్తంగా జోరుగా హుషారుగా సినిమా.. ఓ ప్రేమకథకు అదనంగా ఫాదర్ సెంటిమెంట్ జోడించి కొంచెం కన్ఫ్యూజన్ తో నవ్వించి మెప్పించడానికి ట్రై చేశారు.
ప్లస్ పాయింట్స్:
- విరాజ్ నటన
- సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్
మైనస్ పాయింట్స్:
- కథ
- స్క్రీన్ ప్లే
- అక్కడక్కడా బోరింగ్ సీన్స్
రేటింగ్:
2.5/5
ఫైనల్ గా:
కొంచెం జోరు…కొంచెం హుషారు…
watch trailer :

స్టోరీ:
ఆంథోని చిన్న కుమార్తెలో చాలా మార్పు వస్తుంది. ప్రెగ్నెంట్ అయిన ఆంథోని భార్య హాస్పటల్ పాలవుతుంది. అతని తల్లికి కూడా ప్రమాదం జరుగుతుంది. వారికి ఎదురైన సమస్యలకు కారణం ఏమిటి? వాటి వెనక ఉన్న అదృశ్య శక్తి ఏమిటి? ఆంథోని ఆ పురాతన ఇంటిని ఎందుకు కొన్నాడు? ఆంథోని తన ఫ్యామిలిని ఎలా రక్షించాడు అనేది మిగిలిన కథ.
రివ్యూ:
నటీనటుల విషయానికి వస్తే, శ్రీరామ్ ఇప్పటి వరకు గ్లామర్ మరియు యాక్షన్ హీరోగానే నటించారు. ఈ మూవీలో ఢిఫరెంట్ లుక్, నటనతో ఆకట్టుకున్నారు. ఎమోషనల్ సీన్స్ లో శ్రీరామ్ నటన బాగుంది. ఆంథోని భార్య పాత్రలో నటించిన ఖుషి రవి ఆ పాత్రలో ఒదిగిపోయారు. ఆంథోని పిల్లలుగా నటించిన ఇద్దరు చక్కగా నటించారు. ముఖ్యంగా తార గా నటించిన చైత్ర పెద్ది అద్భుతంగా నటించింది. అన్నమ్మగా కీలక పాత్ర చేసిన ఈశ్వరీ రావు నటన ఈ సినిమాకి మేజర్ అస్సెట్ గా నిలిచింది. అవసరాల శ్రీనివాస్ పాత్ర నిడివి తక్కువైనా గుర్తుండిపోయేలా నటించారు.
ప్లస్ పాయింట్స్ :



బాలనటిగా శ్వేత బసు మొదటి హిందీ సినిమా ‘మక్డీ’ లో డబుల్ రోల్ చేసి అలరించిడమే కాక, బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా నేషనల్ అవార్డ్ కూడా అందుకుంది. సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్న సమయంలో శ్వేత బసుకు జరిగిన ఒక ఇన్సిడెంట్ అప్పట్లో అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. ఆ సంఘటన ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. అది జరిగిన తరువాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళింది. అక్కడే ఉంటూ హిందీలో సీరియల్స్ లో నటిస్తూ, ఇంకో వైపు అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ పని చేసింది. శ్వేత బసు డిసెంబర్ 2018 లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది.కానీ ఏం జరిగిందో కానీ ఏడాదికే విడిపోయారు.
అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నట్టుంది. అందుకేనేమో ఇటీవల హాట్ ఫోటో షూట్లను షేర్ చేస్తూ, ఇన్‌స్టాలో హీట్ పెంచుతోంది. సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే సంపాదించింది. తాజాగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లిన శ్వేత బసు బీచ్‌లో సందడి చేసింది. ‘ఇండియా లాక్డౌన్’ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మరియు ప్రమోషన్స్‌లోనూ అందాల ఆరబోతతో రచ్చ లేపింది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శ్వేత బసును ఇన్‌స్టాగ్రామ్‌లో 440K ఫాలో అవుతున్నారు.












డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కొనసీమ జిల్లా అమలాపురానికి చెందిన దెందుకూరి సత్తిబాబు రాజు ఇటీవల తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు. కుమార్తె సాహితీని భీమవరంకు చెందినటువంటి కనుమూరి గౌతమ్ వర్మతో పెళ్లి నిసచేయం చేశారు. ఆ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్న సత్తిబాబు రాజు, కొబ్బరి తోటలో అద్భుతమైన సెట్టింగులు, పందిరి వేసి కుమార్తె పెళ్ళిని గ్రాండ్ గా జరిపించాడు.
పెళ్లిని అందరు ఘనంగా చేశారని అనుకుంటే, దానికి మించి సారె పంపించి అందరు ఆశ్చర్యపోయేలా చేశాడు. పెళ్లి చేసి, అత్తారింటికి పంపిస్తున్న కూతురితో పాటు 2700 కిలోల స్వీట్స్, దాదాపు మూడు టన్నుల స్వీట్స్ ను సారెగా సత్తిబాబు రాజు పంపించాడు. అది కూడా స్వీట్స్ షాప్స్ లో ఆర్డర్ లాంటివి ఇవ్వకుండా ఇంట్లోనే, కుటుంబ సభ్యులందరు కలిసి ఆ స్వీట్స్ ను తయారు చేశారట.
సత్తిబాబు రాజు కుటుంబ సభ్యులు వివాహానికి వారం రోజుల ముందు నుంచి ఈ స్వీట్స్ తయారుచేయడం ప్రారంభించారట. పాలకోవ, లడ్డు, తొక్కుడు లడ్డు, పుతరేకులు, గోరుమిటీలు లాంటి స్వీట్స్ తో వారిల్లు అంతా నిండిపోయిందట. ఇక స్వీట్స్ ను అందరికి పంచడం కోసం ఒక స్టీల్ బాక్స్ ను సైతం ప్రత్యేకంగా పెట్టడం జరిగింది. ఈ సారె వల్ల మర్యాదలకు పుట్టినిల్లుగా పేరుగాంచిన కోనసీమ గురించి అందరు మాట్లాడుకుంటున్నారు.

రాజమౌళి మహేష్‌బాబుతో మూవీని అనౌన్స్ చేసి చాలా రోజులు అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కేఎల్ నారాయణ నిర్మాణంలో రాబోతుంది. అయితే త్రివిక్రమ్ మూవీ పూర్తయిన తరువాత ఈ సినిమాను మొదలుపెడతారు. అంటే ఈ సినిమా 2023 చివరలో మొదలు అవుతుందని అనుకుంటున్నారు. రాజమౌళి ఈ సినిమా గురించి తాజాగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్‌గా మారాయి.ఈ మూవీ కోసం మహేష్ బాబు లుక్‌లో మార్పులు చేయడం లేదని రాజమౌళి కామెంట్స్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
‘ఇండియానా జోన్స్’ లాంటి మూవీ చేయాలని ఎన్నో రోజుల నుండి అనుకుంటున్నానని, అడ్వంచరస్ కథల్లో మహేష్ కనిపిస్తే బాగుంటుంది. ఎప్పట్నుంచో అలాంటి ఆలోచన ఉందని, అలాంటి మూవీ చేయడానికి ఇదే సరైన సమయం. అందుకే మహేష్ సినిమాను గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచరస్ మూవీగా తీయాలని అనుకుంటున్నానని అన్నారు. ఈ సినిమాకు మహేష్ ఇప్పుడున్న లుక్ సరిపోతుందని జక్కన్న భావిస్తున్నారని సమాచారం.