నటుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి రవితేజ. సైడ్ క్యారెక్టర్స్ తో మొదలు పెట్టి, తర్వాత హీరోగా ఎదిగి ఇప్పుడు ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరో అయిన నటులలో ముందు వరుసలో ఉన్నారు రవితేజ. అయితే రవితేజ ప్రొడ్యూసర్ గా కూడా మారి కొత్త వారికి అవకాశాలు ఇస్తూ టాలెంట్ ని ప్రోత్సహిస్తున్నారు. అలా రవితేజ కార్తీక్ రత్నం హీరోగా నిర్మించిన సినిమా ఛాంగురే బంగారు రాజా. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
- చిత్రం : ఛాంగురే బంగారు రాజా
- నటీనటులు : కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు, అజయ్, ఎస్తేర్, వాసు ఇంటూరి.
- నిర్మాత : రవితేజ
- దర్శకత్వం : సతీష్ వర్మ
- సంగీతం : కృష్ణ సౌరభ్
- విడుదల తేదీ : సెప్టెంబర్ 15, 2023

స్టోరీ :
ఒక చిన్న ఊరిలో ఉండే ఒక మెకానిక్ (కార్తీక్ రత్నం) చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. అనుకోకుండా అతను ఒక మర్డర్ లో ఇరుక్కుంటాడు. తన పేరుని అందులో నుండి తీసేయడానికి కష్టపడుతూ ఉంటాడు. తను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి అతను చేసే ప్రయాణంలో ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? చివరికి అతను నిర్దోషి అని తెలిసిందా? అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అసలు ఆ మర్డర్ ఎవరు చేశారు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

రివ్యూ :
కేరాఫ్ కంచరపాలెం, నారప్ప వంటి సినిమాలతో గుర్తింపు సంపాదించుకున్నాడు నటుడు కార్తీక్ రత్నం. ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. సినిమా స్టోరీ లైన్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఒక చిన్న మెకానిక్ తనని తాను ఒక నిర్దోషి అని నిరూపించుకోవడానికి చేసే ప్రయాణంలో అతను ఎదుర్కొన్న సంఘటనలని కామెడీ యాడ్ చేసి చూపించే ప్రయత్నం చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన సినిమాలకి ఈ మధ్య ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

ఇటీవల వచ్చిన బలగం సినిమా చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఎన్ని అవార్డులు అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే ఒక ఊరిలో జరిగే సినిమాగా రూపొందించారు. అక్కడ జరిగే సంఘటనలు, వారిలో ఉండే అమాయకత్వం వీటన్నిటిని దర్శకుడు తెరపై చాలా బాగా చూపించారు. ఇంక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సినిమాలో అందరూ కూడా తమని తాము ఆల్రెడీ నటులుగా ప్రూవ్ చేసుకున్నవారే.

కాబట్టి వారందరూ కూడా వారి పాత్రలకి తగ్గట్టుగా నటించారు. కార్తీక్ రత్నంకి మరొక మంచి పాత్ర దొరికింది. ఇందులో కార్తీక్ రత్నం చాలా సహజంగా నటించారు. అలాగే కార్తీక్ రత్నం తర్వాత సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర సత్య. ఇటీవల వచ్చిన రంగబలి సినిమాకి సత్య కామెడీ టైమింగ్ హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించారు.

పాటలు పరవాలేదు. సినిమాకి తగ్గట్టుగా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. కానీ కథలో మాత్రం అక్కడక్కడ కొత్తదనం కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. చూసే ప్రేక్షకులకు ఈ సినిమా తెలిసిపోయేలాగానే ఉంటుంది. దాంతో ఈ విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.
ప్లస్ పాయింట్స్ :
- కార్తీక్ రత్నం నటన
- సినిమాటోగ్రఫీ
- నిర్మాణ విలువలు
- కామెడీ
మైనస్ పాయింట్స్:
- తెలిసిన కథ
- సాగదీసినట్టుగా ఉన్న కొన్ని ఎపిసోడ్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా, ఒక మంచి కామెడీ సినిమా చూద్దాం అనుకునే వారికి, రొటీన్ కథ అయినా పర్వాలేదు ఎంటర్టైనింగ్ గా ఉంటే చాలు అని అనుకునే వారికి ఛాంగురే బంగారు రాజా సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.
watch trailer :
ALSO READ : MARK ANTONY REVIEW : “విశాల్, SJ సూర్య” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!











#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
మహాలక్ష్మి, రవీందర్ చంద్రశేఖరన్‌ను పెళ్లి చేసుకోవడంతో ఆమె అతని డబ్బు కోసమే అని విమర్శించారు. ఆ తరువాత వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు వినిపించాయి. అయితే మహాలక్ష్మీ దంపతులు సోషల్ మీడియా ద్వారా తమ అందమైన ఫొటోలను షేర్ చేస్తూ, విడాకుల రూమర్లకు చెక్ పెట్టారు. ఆ మధ్యన మహాలక్ష్మి రవీందర్ బర్త్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసింది.
ఇది ఇలా ఉంటే తాజాగా రవీందర్ చిక్కుల్లో పడ్డాడు. ఒక వ్యాపారవేత్తను మోసం చేశారని, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నిర్మాత రవీందర్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కోలీవుడ్ లో ఈ వార్త సంచలనంగా మారింది. సాలిడ్ వెస్ట్ నుంచి కరెంట్ ను ఉత్పత్తి చేసే ప్లాంట్ పెట్టడం ద్వారా చాలా లాభాలు వస్తాయని రవీందర్ చెన్నై వ్యాపారవేత్త అయిన బాలాజీని నమ్మించాడట. సదరు ప్లాంట్ కోసం డూప్లికేట్ పేపర్స్ ను క్రియేట్ చేసి, బాలాజీని నమ్మించి అందులో పార్ట్నర్ గా చేశాడు. దానికి గాను బాలాజీ నుండి దాదాపు పదహారు కోట్లు తీసుకున్నారని, రవీందర్ పై ఆరోపణలు వచ్చాయి.
ఈ ఒప్పందం తర్వాత రవీందర్ చెప్పినట్లుగా ఏ పని జరగలేదని, బాలాజీ డబ్బు తిరిగి ఇవ్వాలని అడిగినా, ఎలాంటి స్పందన రవీందర్ నుండి రాలేదట. దాంతో బాలాజీ రవీందర్ పై చర్యలు తీసుకోవాలని చెన్నై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ లో కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో పోలీసులు నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్ చేశారు.


అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ తొలిరోజు హీరోగా, నయనతార హీరోయిన్ గా నటించిన మూవీ జవాన్. ఈ చిత్రంలో విజయయ సేతుపతి, దీపికా పదుకొనే, అతిథి పాత్రలో సంజయ్ దత్ నటించారు. రిలీజ్ కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ సృష్టించిన జవాన్ తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ కలెక్షన్స్ రాబట్టిందని తెలుస్తోంది.
షారుక్ ఖాన్ మొదటిసారి సౌత్ దర్శకుడి సినిమాలో హీరోగా నటిస్తుండడం, అది కూడా వరుస హిట్లతో దూసుకెళ్తున్న అట్లీ వంటి దర్శకుడితో కావడంతో ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే జవాన్ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అట్లీ చిత్రాలు ఎలా ఉంటాయో దక్షణాది ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కథ రొటీన్ అయినా కొంచెం కొత్తగా, మాస్ పల్స్ తో స్టైలిష్‌గా చూపిస్తుంటాడు. ఈ విషయంలో అట్లీ ఆరితేరిపోయాడని ఆయన తీసిన సినిమాలే చెప్తాయి.
అలా అట్లీ తన స్టైల్లో, అలవాటైన ఎలివేషన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో షారుఖ్ ఖాన్‌ను సరికొత్తగా చూపించాడు. అదే నార్త్ ప్రేక్షకులకు చాలా నచ్చింది. బాలీవుడ్లో ఈ మూవీకి 3, 4, నాలుగున్నర రేటింగ్స్ వచ్చాయి. అయితే తెలుగులో యావరేజ్, తమిళంలో నార్మల్ టాక్ రాగా, బాలీవుడ్లో బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఈ మూవీ పై మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూసేయండి.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
















ఉదయనిధి స్టాలిన్‌మాట్లాడుతూ సనాతన ధర్మం బడుగు, బలహీన వర్గాలు మరియు దళితులను అణగదొక్కి, బ్రాహ్మణిజాన్ని పోషిస్తోందని అన్నారు. సనాతన ధర్మం పేరుతో కొందరు దళితులకు ఆలయ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పేర్కొన్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసాయి. రాజకీయంగా పలువురు నేతలు ఉదయనిధి చేసిన కామెంట్స్ ను ఖండిస్తున్నారు.
తాజాగా ఉదయనిధి వాఖ్యల పై చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన పూజారి రంగరాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని ఎవ్వరు కూడా నిర్మూలించలేరని అన్నారు. ఉదయనిధి లాంటివారిని ఇప్పటికే చాలామందిని ఈ దేశం చూసిందని అని అన్నారు. మన దేశం మీద ఎంతోమంది దండయాత్రలు చేశారని, కానీ వారంతా కూడా కాలగర్భంలో కలిశారని చెప్పారు. హిందూ దేవలయాలపై ఎన్నో దాడులు చేశారని, అయినా హిందూ ధర్మం నిలిచే ఉందని అన్నారు.
సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయని అన్నారు. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉందని, ముందు ఉదయనిధి స్టాలిన్ ద్రవిడ భావజాలం అంటే అర్ధం తెలుసుకోవాలని రంగరాజన్ చెప్పారు. సనాతన ధర్మం నిర్మూలించాలని చెపుతున్న ఉదయనిధి స్టాలిన్ తమిళ సంస్కృతి కోసం, అభివృద్ధి, పరిరక్షించడం కోసం ఏం చేశారని ప్రశ్నించారు. ప్రజలు సనాతన ధర్మాన్ని గౌరవించే వారినే ప్రతినిధులుగా ఎన్నుకోవాలని రంగరాజన్ కోరారు.
