క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆత్రుతగా ఎదురు చూస్తున్న చిరకాల దాయాదుల పోరు ప్రారంభమైంది. ఆసియా కప్ 2023లో భాగంగా శ్రీలంక , క్యాండీలోని పల్లెకెలె స్టేడియం ఈ చారిత్రాత్మక మ్యాచ్ కి సాక్షిగా నిలిచింది. మొదట టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలత బ్యాటింగ్ ఎంచుకోవడం జరిగింది.
మ్యాచ్ కి వాన అడ్డంకి కలిగించే అవకాశం ఉంది అనే వార్తలు వచ్చినప్పటికీ…మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి వాతావరణం ఎంతో అనుకూలంగా మారింది.

ఎంతో ఉత్కంఠత మధ్య ప్రారంభమైన ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ప్రస్తుతం భారత్ బ్యాటింగ్ జరుగుతుంది. 45 ఓవర్లు పూర్తి అయ్యేసరికి భారత్ మొత్తం 8 వికెట్లు కోల్పోయింది. సరిగ్గా 45వ ఓవర్ తొలి బంతికే నసీమ్ షా , శార్దూల్ ఠాకూర్‌ను అవుట్ చేశాడు. మరోపక్క హార్దిక్ పాండ్యా,ఇషాన్ కిషన్‌తో తో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడుతూ తన కెరీర్లో 11వ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.
అయితే ప్రస్తుతం టీం తుది జట్టులో సీనియర్ పేసర్ మహమ్మద్ షమీకి చోటు దక్కకపోవడంపై అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. నిజానికి మహమ్మద్ షమీ స్థానంలో శార్దుల్ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నారు. అయితే ఈ వ్యవహారంపై క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో పలు రకాల మీమ్స్ చేసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మహమ్మద్ షమీ స్థానంలో వచ్చిన శార్దుల్ కేవలం మూడు పరుగులకే పెవీలియన్ దారి పట్టాడు.
టీం కెప్టెన్ రోహిత్ శర్మ తన తలా తోక లేని లాజిక్కులతో మంచి ప్లేయర్ అయిన మహమ్మద్ షమీని పక్కన పెట్టి శార్దుల్ ను టీంలోకి తీసుకున్నారని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పైగా ఇప్పుడు కేవలం మూడు పరుగులకే శార్దూల్ అవుట్ కావడంతో ఈమాత్రం షమీ కొట్టలేడా.. ఇందుకేనా శార్దూల్ ను జట్టులోకి తీసుకుంది అని రకరకాల మీమ్స్ తో ప్రశ్నిస్తున్నారు.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
ALSO READ : పాకిస్థాన్ తో జరగబోయే మ్యాచ్ లో… టీం ఇండియా చేస్తున్న మిస్టేక్ ఇదేనా..?

“పదేళ్ల క్రితం బాంబేలో వచ్చిన తుఫాన్ గుర్తుందా..” అంటూ ప్రారంభం అయిన ఓజి మూవీ గ్లింప్స్ వంద సెకన్ల నిడివితో రిలీజ్ అయ్యింది. ఈ గ్లింప్స్ తో మూవీ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి. గ్లింప్స్ లో పవర్ స్టార్ క్యారెక్టర్ కు కు ఇచ్చిన ఎలివేషన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ లుక్స్ తోనే ఆడియెన్స్ ఫిదా చేశారు.
పవన్ కళ్యాణ్ యాక్షన్ షాట్స్ కు గ్లింప్స్ లో అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. థమన్ అందించిన బీజీఎం అదిరిపోయేలా ఉంది. పవన్ కళ్యాణ్ గ్యాంగ్ స్టర్ క్యారెక్టర్ ఆడియెన్స్ కు, అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. పవన్ ఫ్యాన్స్ కు ఈ గ్లింప్స్ విందుభోజనంలా ఉందని చెప్పవచ్చు. కొన్ని షాట్స్ లో వింటేజ్ పవన్ ను గుర్తుకు తెస్తున్నా
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.
విజయ్ దేవరకొండ, సమంతలు మొదటిసారి హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి మూవీ ఈరోజు థియేటర్లో తెలుగు, మలయాళ, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో కూడా గ్రాండ్ గా విడుదల అయ్యింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా రిలీజ్ చేసిన టీజర్, పాటలు, ట్రైలర్లకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. మ్యూజిక్ కన్సర్ట్ లో విజయ్ దేవరకొండ, సమంత డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకున్నారు. ఈ మూవీ పై అంచనాలు పెంచాయి.
ఈ సినిమాకు ఓవర్సీస్ నుండి మంచి టాక్ వస్తోంది. లోకల్‌గా కూడా పాజిటివ్ రిపోర్టులు ఎక్కువగా వస్తున్నాయి. తొలి షోతోనే హిట్ టాక్ తెచ్చుకోవడంతో విజయ్ దేవరకొండ, సమంత అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. లైగర్ మూవీ డిజాస్టర్ తో విజయ్ దేవరకొండ చాలారోజుల వరకు బయటికి రాలేదు. సమంత, డైరెక్టర్ శివ నిర్వాణకు కూడా ఈ మూవీ విజయం కీలకంగా మారింది. శాకుంతలంతో సమంత, టాక్ జగదీష్ తో శివ నిర్వాణ ప్లాప్ లు అందుకున్నారు.
ఈ మూవీ కి ఎక్కడ చూసినా 2.5, లేదా 2.75 రేటింగ్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే లోకల్‌గా తపనిసరిగా త్రీ స్టార్ రేటింగ్ వచ్చేలా ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాని చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా కూడా తమ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. ఖుషి హిట్ టాక్ తెచ్చుకోవడంతో సోషల్ మీడియాలో ఈ సినిమా మీద పలు మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవి ఏమిటో మీరు చూడండి..
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
13.
14.
15.
16.
17.
18.





ప్రముఖ మలేసియా బిజినెస్ టైకూన్ ఖూ కే పెంగ్ మరియు మాజీ మిస్ మలేసియా అయిన పాలైన్ ఛాయ్ ల కూతురు ఏంజెలినా ఫ్రాన్సిస్. ఆమె ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంది. ఆ సమయంలోనే ఆమె జెడియా అనే ఫ్రెండ్ ని ప్రేమించింది. వారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న తరువాత ఏంజెలినా తన తల్లిదండ్రులకు ప్రేమ విషయాన్ని తెలిపింది. అయితే ఆమె తల్లిదండ్రులు వారి పెళ్ళికి నిరాకరించారు.
ఆర్థికపరంగా ఇద్దరి కుటుంబాల్లో చాలా తేడా ఉండడంతో వారు ప్రేమించిన వాడికి దూరం కావడమో లేదా కుటుంబ వారసత్వాన్ని వదులుకోవడమో రెండిటింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోమని ఆదేశించారు. అయితే ఏంజెలినా ప్రేమించినవాడితో జీవితం పంచుకోవడం కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి, 2008లో పెళ్లి చేసుకొని తాను కోరుకున్నవాడితో కొత్త లైఫ్ ను మొదలుపెట్టింది. ఈ క్రమంలో మేకు వారసత్వంగా రావలసిన దాదాపు రెండు వేల కోట్ల ఆస్తినీ వదిలేసింది.
పెళ్లి తరువాత ఇద్దరు కూడా కూడా ఇరు కుటుంబాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ, చాలారోజులు తరువాత ఏంజెలినా తన పేరెంట్స్ ను కలవాల్సి వచ్చింది. దానికి కారణం ఏంజెలినా తల్లిదండ్రులు డైవర్స్ తీసుకున్నారు. కోర్టులో వాంగ్మూలం ఇవ్వడానికి ఆమె కోర్టుకు వెళ్లింది. తన తల్లి పాలైన్ ఛాయ్ గురించి గొప్పగా చెప్పిన ఆమె తండ్రిపై విమర్శలు చేసింది. ప్రస్తుతం ఏంజెలినా లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



















ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.
అయితే, ఈ మిషన్ లో చివరి 17 నిమిషాలు చాలా కీలకం. దీనిని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయితే దాదాపు జాబిల్లి ఉపరితలం మీదకి ల్యాండర్ సురక్షితంగా చేరుకున్నట్లే అని చెబుతున్నారు. ఈ ఆఖరి 17 నిమిషాలో ల్యాండర్ ఆటోమేటిక్ గా తనలోని ఇంజన్లను మండించుకోగలగాలి. అంతే కాకుండా ఈ చర్య కరెక్ట్ టైమ్ కి జరగడంతో పాటుగా దానికి అవసరమైన ఇంధనాన్ని కూడా ఉపయోగించుకోవడం అనేది అత్యంత కీలకం.
దీనిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా ప్రయోగం అంతా విఫలం అవుతుంది. అందువల్లే ఉత్కంఠంగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్‌ల వద్ద అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో చంద్రయాన్-2 ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాన్ని ఢీకొనడంతో కూలిపోయింది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.