ఏంటి.. “పుష్ప” సినిమా నుండి ఇన్ని పాఠాలు నేర్చుకోవచ్చా..? ఈ విషయం ఇప్పటివరకు తెలీదే..?

ఏంటి.. “పుష్ప” సినిమా నుండి ఇన్ని పాఠాలు నేర్చుకోవచ్చా..? ఈ విషయం ఇప్పటివరకు తెలీదే..?

by Mohana Priya

Ads

అల్లు అర్జున్‌ని పాన్ ఇండియన్ స్టార్ చేసిన సినిమా పుష్ప. ఈ సినిమా విడుదల అయినప్పుడు కొంత మందికి నచ్చింది. కొంత మందికి అంత పెద్దగా నచ్చలేదు. సుకుమార్ సినిమా అంటే ఇంకా ఎక్కువగా ఊహించుకున్నాం అని చెప్పారు. కానీ కొంత మందికి మాత్రం ఈ సినిమా విపరీతంగా నచ్చింది. అల్లు అర్జున్‌ని అలా చూడటం ఇదే మొదటిసారి.

Video Advertisement

పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్ అయితే ఈ సినిమాకి చాలా కష్టపడ్డారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుండి తన గెటప్‌కి సంబంధించిన చిన్నచిన్న వివరాల వరకు కూడా చాలా జాగ్రత్తపడ్డారు అల్లు అర్జున్. అలాగే చిత్తూరు యాస కూడా చాలా బాగా మాట్లాడారు. సినిమా థియేటర్లలో విడుదలైన కొద్ది రోజులకి అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైంది. అప్పుడు ఈ సినిమాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం టాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాకుండా ఇతర భాషల ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. అయితే ఈ సినిమా రెండవ భాగం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పుష్ప సినిమా నుండి కొన్ని లీడర్‌షిప్ లెసన్స్ (నాయకత్వ పాఠాలు) కూడా నేర్పుకోవచ్చట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

pushpa ey bidda song edit with a comedy scene

#1 మనం ఏదైనా ఒక కల కంటే, ఆ కలని సాధించాలి అంటే కాన్ఫిడెన్స్ అనేది చాలా అవసరం. అది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం కోల్పోకూడదు. పుష్పకి కూడా డబ్బులు లేనప్పుడు కాన్ఫిడెన్స్ చాలా ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్‌తోనే పుష్ప తను అనుకున్న స్థాయికి ఎదుగుతాడు.

#2 ఏం లేకపోయినా కూడా మన మీద మనకు నమ్మకం ఉండటం చాలా ముఖ్యం. పుష్ప కూడా తన దగ్గర ఏమీ లేనప్పుడు తనని తాను నమ్ముకున్నాడు. అందుకే అంత ధైర్యంగా మంగళం శ్రీను దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇచ్చి వస్తాడు. అంతే కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కంటే కూడా తన మీద తనకే నమ్మకం ఎక్కువ ఉంది కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే పుష్ప సమస్యలను పరిష్కరించుకోగలుగుతాడు.

reasons behind pushpa negative talk

#3 కొంతవరకు ఒక మనిషి ఎదగాలి అంటే యాటిట్యూడ్ కూడా ముఖ్యమే అయ్యుండాలి. పుష్పకి కూడా అది ఉంటుంది. తన వైపు ఎవరైనా వేలెత్తి చూపిస్తే పుష్పకి నచ్చదు. వాళ్లని తప్పు అని నిరూపిస్తాడు. నిజ జీవితంలో కూడా ఒక మనిషికి ఇలాంటి గుణం ఉండాలట. అప్పుడే జీవితంలో ఏదైనా చేయాలి అనే ఒక ఆలోచన ఉంటుంది.

#4 అయిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా, అవ్వబోయే దాని గురించి ఆలోచించాలి. పుష్పని షెకావత్ సార్ అవమనిస్తాడు. కానీ ఆ తర్వాత మనసులో పెట్టుకొని ఎక్కువ బాధ పడడు పుష్ప. తన పని తాను చేసుకుంటూనే షెకావత్ సర్ కి ఎలా బుద్ధి చెప్పాలో ప్లాన్ చేస్తాడు. అలాగే పుష్ప చిన్నప్పటి నుంచి కూడా చాలా అవమానాలు ఎదుర్కొంటాడు. వాటివల్ల పుష్ప బాధపడి అక్కడే ఉండి పోకుండా పెద్ద స్థాయికి ఎదుగుతాడు. అందరూ కూడా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉండకుండా రాబోయే భవిష్యత్తు గురించి ఆలోచించాలి అనే పాఠం ఇందులో నుండి నేర్చుకోవచ్చు.

#5 ఏదైనా మనకు దక్కకపోతే అంత సులభంగా వదిలేయకూడదు. మనకి దక్కేంత వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. పుష్ప కూడా ఇదే చేస్తాడు. తను ప్రేమించిన శ్రీవల్లి విషయంలో, అలాగే ఎర్ర చందనాన్ని ఎగుమతి చేసేందుకు కూడా చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తాడు.

reasons behind pushpa negative talk

పుష్ప సినిమా నుండి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఈ విషయాలు నేర్చుకోవచ్చు అని ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పోస్ట్ చేసింది.

sourced from : Instagram (Magic Institute of Excellence)


End of Article

You may also like