మోచేతి పై దెబ్బ తగిలినప్పుడు ఒళ్ళంతా ఎందుకు జివ్వుమంటుంది..? ఆ ప్లేస్ లో దెబ్బ తగిలినప్పుడు ఏమి జరుగుతుందంటే?

మోచేతి పై దెబ్బ తగిలినప్పుడు ఒళ్ళంతా ఎందుకు జివ్వుమంటుంది..? ఆ ప్లేస్ లో దెబ్బ తగిలినప్పుడు ఏమి జరుగుతుందంటే?

by Anudeep

Ads

మనం ఆడుకుంటున్నప్పుడో.. లేక అటు ఇటు తిరుగుతున్నప్పుడో శరీరానికి దెబ్బలు తగలడం సహజమే. అయితే.. ఈ దెబ్బలు ఎక్కడ తగిలినా మనం కొద్దిగా తట్టుకోగలుగుతాము. కానీ, మోచేతిపై దెబ్బ తగిలితే మాత్రం అస్సలు తట్టుకోలేము. ఆ ప్లేస్ లో దెబ్బ తగలగానే ఒళ్ళంతా జివ్వుమంటుంది. ఎక్కువగా బండి మీద నుంచి పడిపోయినప్పుడు.. కార్నర్ లకు దగ్గరగా నడుస్తున్నపుడు ఇలా దెబ్బలు తగులుతూ ఉంటాయి.

Video Advertisement

elbow pain

మోకాలి వద్ద కూడా అంతే.. మోకాలి కీలుపై కానీ, మోచేతి వద్ద కానీ దెబ్బ తగిలినప్పుడు ఒళ్ళంతా షాక్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. మీకెప్పుడైనా ఇలాంటి ఫీలింగ్ అనుభవం అయిందా? చాలా మందికి సైకిల్ నేర్చుకునే కొత్తల్లోనో.. లేక బైక్ నేర్చుకునే కొత్తల్లోనో.. అదుపు తప్పి కింద పడిపోయినప్పుడు ఇలా మోచేయి మరియు మోకాళ్ళకి దెబ్బలు తగులుతూ ఉంటాయి.

elbow pain 2

మోకాలు కానీ, మోచేయి కానీ పైకి గట్టిగా కనిపించినా.. నిజానికి సున్నితమైన ప్రదేశాలు. ఈ జాయింట్స్ లో ఉండే ఎముకలు ఏ మాత్రం కదిలినా చాలా అవస్థ పడాల్సి వస్తుంది. నిజానికి ఈ ప్లేస్ లో దెబ్బ తగలగానే అందరు ఎముకకు దెబ్బ తగలడం వల్ల నొప్పిగా ఉందని అనుకుంటారు. కానీ, అది వాస్తవం కాదు.. ఆ ప్లేస్ లో ఉండే నరానికి దెబ్బ తగలడం వల్ల నొప్పి వస్తుంది. ఆ నరం శరీరమంతా వ్యాపించి ఉంటుంది కాబట్టి.. ఆ ప్లేస్ లో దెబ్బ తగలగానే ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అనిపిస్తుంది.

elbow pain 3

ఈ నరాన్ని అల్నార్ నరం అని పిలుస్తారు. ఇది చిటికెన వేలు, ఉంగరం వేలు చివర్ల నుంచి వెన్నెముక అంతా వ్యాపించి ఉంటుంది. మోచేతి కీలు వద్ద ఈ నరానికి రక్షణ తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ దెబ్బ తగలగానే ఆ ప్రభావం పడి, ఒళ్ళంతా జివ్వుమన్నట్లు అనిపిస్తుంది.


End of Article

You may also like