ఏటీఎం పిన్ కేవలం నాలుగు డిజిట్స్ మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా..?

ఏటీఎం పిన్ కేవలం నాలుగు డిజిట్స్ మాత్రమే ఎందుకు ఉంటుందో తెలుసా..?

by Anudeep

Ads

మన రోజువారీ జీవితంలోనే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. అవసరం వచ్చేదాకా కొన్ని విషయాలను మనం తెలుసుకోవాలని కూడా అనుకోము. మనందరికీ ఏటీఎం లు సుపరిచితమే. బ్యాంకు కి వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేకుండా.. ఓ డెబిట్ కార్డు ద్వారా మనకు అవసరం అయిన మొత్తాన్ని ఏటీఎం ల నుంచి తీసుకుంటూ ఉంటాం. అయితే ఇందుకోసం ఒక పిన్ ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

Video Advertisement

atm pin 1

కేవలం డబ్బు డ్రా చేయడానికి మాత్రమే కాదు.. ఆన్ లైన్ లో పే చేయడానికి స్వైప్ చేయాలంటే కూడా మనం పిన్ ఎంటర్ చేయాలి. ఈ పిన్ కేవలం నాలుగు నంబర్లు మాత్రమే ఉంటుంది. ఏటీఎం పిన్ ఇలా ఫోర్ డిజిట్స్ మాత్రమే ఎందుకు ఉంటుంది అని ఎప్పుడైనా ఆలోచించారా..? వాస్తవానికి ఏటీఎం మెషిన్ అనేదాన్ని కంప్యూటర్ లోన్ మెషీన్ కాన్సెప్ట్ ద్వారా కనిపెట్టారు. జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్ అనే బ్రిటిషర్ దీనిని కనిపెట్టారు. ATM అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని అర్ధం.

atm pin 2

కార్డు పై పిన్ స్టోర్ చేసే విధానాన్ని కూడా జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్ డెవలప్ చేసారు. తొలుత 6 డిజిట్ పిన్ ను జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్ డెవలప్ చేసారు. కానీ, ఆ ఐడియా ను ఆయన భార్య కారోలిన్ రిజెక్ట్ చేసారు. ఎందుకంటే ఆమె కేవలం నాలుగు డిజిట్లు మాత్రమే గుర్తుపెట్టుకోగలిగేది. 6 నంబర్లు ఉంటె ఆమెకు గుర్తు తెచ్చుకోవడం కష్టం అయ్యేది.

atm pin 3

అందుకే జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్ 4 డిజిట్ పిన్ ను డెవలప్ చేసారు. కొన్ని బ్యాంకు ఆప్ లు 6 డిజిట్ పిన్ కోడ్ ను అడుగుతుండడం చూస్తూనే ఉన్నాం.. అయితే.. 4 డిజిట్ పిన్ కోడ్ అందరికి గుర్తుపెట్టుకోవడానికి ఈజీ గా ఉంటుందన్న ఉద్దేశ్యం తో జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్ ఎటిఎం కార్డులకు 4 డిజిట్ పిన్ నే ఉంచారు.


End of Article

You may also like