కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి ‘చార్లీ’ మూవీతో తెలుగు ఆడియెన్స్ కు చేరువయ్యారు. రక్షిత్ శెట్టి నటించిన “సప్తసాగరదాచే ఎల్లో” మూవీ రిలీజ్ అయ్యి, కన్నడ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాకుండా భారీ కలెక్షన్స్ సాధించి, కమర్షియల్ హిట్‌గా కూడా నిలిచింది.
అక్కడ హిట్ అయిన ఆ మూవీని ‘సప్త సాగరాలు దాటి’ అనే టైటిల్ తో తెలుగులో సెప్టెంబర్ 22 న రిలీజ్ చేశారు. తొలి షోతోనే మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోహీరోయిన్లుగా నటించిన కన్నడ సినిమా సప్త సాగర దాచే ఎల్లో. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని సప్త సాగరాలు దాటి పేరుతో తెలుగులోకి డబ్ చేసి, రిలీజ్ చేశారు. డైరెక్టర్ హేమంత్ రావు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ మూవీ రెండు పార్టులుగా రూపొందించారు. రెండవ పార్ట్ అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఆ మూవీ టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేశారు.
సెప్టెంబర్ 22 న రిలీజ్ అయిన సప్త సాగరాలు దాటి మూవీకి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో మను, ప్రియ ప్రేమించుకుంటారు. పెళ్లి చేసుకోవాలనుకున్న సమయంలో మను జైలుకు వెళ్తాడు. అప్పుడు ఆమె ఎన్ని సంవత్సరాలైన అయిన హీరో కోసం వేచి చేస్తా అని చెప్తుంది.
కానీ సెకండ్ పార్ట్ లో మాత్రం వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. హీరోయిన్ హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పే డైలాగ్ కు సంబంధించిన వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ‘మరి వెయిట్ చేసిందా’ అంటూ షేర్ చేశారు. ఆమె ముందు హీరో కోసం ఎదురుచూస్తా అని చెప్పి, ఆ తర్వాత పెళ్లి చేసుకుందని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.
https://www.instagram.com/reel/CyQYMqrpySh/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: రెండు భాషల్లో రీమేక్, ఇంకొక భాషలో డబ్బింగ్… కానీ ఈ సినిమాని కొట్టేదే లేదు..! ఈ సినిమా చూశారా..?

స్కంద మూవీలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. శ్రీకాంత్, సాయి మంజ్రేకర్, శరత్ లోహితస్వ, దగ్గుబాటి రాజా, గౌతమి, ఇంద్రజ, పృథ్వీరాజ్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్ కి ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. స్కంద మూవీని దర్శకుడు బోయపాటి శ్రీను తన మార్క్ కంప్లీట్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగానే ఉన్నాయి.
హీరో రామ్ పోతినేని మాస్ మరియు యాక్షన్ లుక్‌తో ఆకట్టుకున్నారు. రామ్, శ్రీలీల డ్యాన్స్ మూవీలో హైలైట్‌గా నిలిచింది. కానీ స్టోరీ, స్క్రీన్ ప్లే పరంగా ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాయని టాక్. రివ్యూలు కూడా మిశ్రమంగా రావడంతో స్కంద మూవీ ఆశించిన రేంజ్ లో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ ను వసూల్ చేయలేకపోయిందని తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే స్కంద మూవీ ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+ హాట్‌స్టార్ కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే అక్టోబర్ 27 నుండి ఈ మూవీ డిస్నీ+ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషలలో స్ట్రీమింగ్కు కానుందని సమాచారం. అయితే ఈ విషయం పై డిస్నీ+ హాట్‌స్టార్ నుండి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
మెగా కోడలు, రామ్ చరణ్ భార్య ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పెళ్లి అయిన చాలా ఏళ్ల తరువాత మెగాఫ్యామిలీలోకి వారసురాలు రావడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పాప వచ్చిన తరువాత జరిగే ప్రతి సందర్భాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
అయితే ఉపాసన సినిమాల విషయంలో తప్ప మిగితా విషయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటూ మెప్పు పొందుతున్నారు. ముఖ్యంగా ఆమె ఆహారం మరియు ఆరోగ్యానికి సంబంధించి సూచనలు, జాగ్రత్తలు తరచూ సోషల్ మీడియా లో షేర్ చేస్తూనే ఉంటారు. ఉపాసన ఫిట్నెస్, ఆరోగ్యానికి సంబంధించిన ‘బిపాజిటివ్’ అనే మ్యాగజైన్‌ను సైతం ప్రారంభించారు.
ఉపాసన డైట్ సీక్రెట్స్..
స్టార్ హీరోల సినిమాలలో వారి నటన, ఫైట్స్, డ్యాన్స్ లతో పాటుగా వారు చెప్పే డైలాగ్స్ కూడా ప్రేక్షకులను, ముఖ్యంగా అభిమానులను అలరిస్తాయి. ఒక సినిమాలోని డైలాగ్ ను మరో సినిమాలో అది కూడా ఒక స్టార్ హీరో చెప్పినప్పుడు ఆ డైలాగ్ ఆడియెన్స్ కు మరింతగా గుర్తుంటుంది. ఒకప్పుడు అంతగా పట్టించుకునేవారు కాదు. తెలుసుకునే అవకాశం ఎక్కువగా ఉండేది కాదు.
కానీ ఓటీటీలు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత గతంలో వచ్చిన సినిమాలను చూడడం, అవి ఆ తరువాత వచ్చిన చిత్రాలలో చూసినట్టుగా అనిపించగానే, ఆ వీడియోని సోషల మీడియాలో షేర్ చేయడం సాధారణం అయిపోయింది. ఇలాంటి వీడియోని ఒక యూజర్ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ప్రభాస్ నటించిన రాఘవేంద్ర మూవీలోని డైలాగ్ కు సంబంధించిన వీడియో అది.
ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక యూజర్ రాఘవేంద్ర సినిమాలోని ఒక వీడియో క్లిప్ ను షేర్ చేశారు. ఆ వీడియోలో మురళీమోహన్ ఒక వ్యక్తితో “కరెంట్ తీగ చూడడానికి మామలుగానే ఉంటుంది. ఒక్కసారి దానిమీద చెయ్యి వేస్తే తెలుస్తుంది దాని పవర్ ఏమిటో” అంటూ చెప్తాడు. ఈ మూవీ 2003 లో రిలీజ్ అయ్యింది. అయితే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ కూడా కాస్త అటు ఇటుగా ఇలానే ఉంటుంది. ఈ డైలాగ్ పాపులర్ అయ్యింది. ఈ మూవీ 2011 లో రిలీజ్ అయ్యింది. రాఘవేంద్ర మూవీ నుండి కాపీ చేశారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తమన్నా భాటియా 1989లో డిసెంబర్ 21న ముంబైలో పుట్టి, పెరిగారు. ఆమె పదమూడు ఏళ్ళ వయస్సులో నటనలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఎన్నో స్టేజ్ షోలలో నటించింది. 2005 లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2006లో శ్రీ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో, కేడితో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2007లో హ్యాపీ డేస్, కల్లూరి సినిమాలలోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
ఈ రెండు సినిమాలలో తమన్నా కాలేజీ స్టూడెంట్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలు తమన్నాను టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ, కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి, మెప్పించారు.
అయితే ఆమె కెరీర్ లో ఒకేఒక్క హీరో మాత్రమే తమన్నాకు హీరోగా, అన్నగా నటించారు. ఆ హీరో ఎవరంటే సుశాంత్. 2008లో కాళిదాసు మూవీతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ మూవీలో సుశాంత్, తమన్నాకు అన్నగా నటించారు.
పైన కనిపిస్తున్న అబ్బాయి పేరు రోషన్ కనకాల. అతను స్టార్ యాంకర్ సుమ, యాక్టర్ రాజీవ్ కనకాల కుమారుడు. వారి గురించి బుల్లితెర నుండి వెండి తెర ప్రేక్షకుల వరకు అందరికీ సుపరిచితులే. వారి తనయుడు రోషన్ కనకాల బబుల్గమ్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. హీరోగా ఇదే మొదటి సినిమా అయినా, నటుడుగా రోషన్ కనకాల 2016 లో వచ్చిన నిర్మలా కాన్వెంట్ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో హీరో ఫ్రెండ్ భాషాగా నటించాడు.
ఆ తరువాత రోషన్ ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. తన స్టడీ పూర్తి అవడంతో, తిరిగి వచ్చిన రోషన్ హీరోగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకున్నారని సమాచారం. ఈ క్రమంలో రవికాంత్ దర్శకత్వంలో బబుల్గమ్ మూవీలో నటించాడు. ఈ మూవీలో హీరోయిన్గా మానస చౌదరీ చేస్తున్నారు. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.
తాజాగా ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. హీరో నాని పాల్గొని మూవీయూనిట్ కు విషెస్ తెలిపారు. ఈ ఈవెంట్ కు హోస్ట్ గా సుమ, గెస్ట్ గా రాజీవ్ కనకాల పాల్గొని సందడి చేశారు. ఈవెంట్లో నాని సుమ, రోషన్ గురించి మాట్లాడిన తీరు ఆకట్టుకుంది. ఈవెంట్లో హీరో రోషన్ కనకాల ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోలా మాట్లాడిన విధానం అందరినీ ఆకర్షించింది.
ప్రపంచకప్ 2023 మెగాటోర్నీలో రెండవ విజయాన్ని సాధించింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకను చిత్తు చేసింది. 345 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన పాక్, ఆ లక్ష్యాన్ని 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి, 6 వికెట్ల తేడాతో అవలీలగా విజయభేరి మోగించింది. దీంతో 48 సంవత్సరాల వన్డే ప్రపంచ కప్ హిస్టరీలో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని చేధించిన జట్టుగా పాకిస్థాన్ రికార్డు క్రియేట్ చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు ఐర్లాండ్ జట్టు పేరు మీద ఉండేది.
అయితే ప్రపంచ నెంబర్ వన్ బ్యాటర్ అయిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం మరోసారి ఈ మ్యాచ్ లో దారుణ ప్రదర్శన కంటిన్యూ చేశాడు. ఈ టోర్నీ ప్రారంభం కాకముందు బాబర్ టాప్ స్కోరర్ గా నిలిస్తాడని కామెంట్లు వినిపించాయి. అయితే వన్డే ప్రపంచకప్-2023లో నెదర్లాండ్స్ బాబర్ పై 5 రన్స్ మాత్రమే చేశాడు. తాజాగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. గత నాలుగు మ్యాచ్‌ల నుండి బాబర్ సరిగ్గా ఆడలేదు. గత 5 మ్యాచ్‌ల్లో బాబర్ 71 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో బాబర్ ప్రదర్శన పై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. “వార్మప్ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడటం కాదు. ముఖ్యమైన టోర్నీలో ఆడాలని” కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్‌ల్లో కెప్టెన్ బాబర్ చెలరేగి ఆడాడు. అయితే మెగా టోర్నీలో దానికి భిన్నంగా ఉంది.
తెలుగు ప్రేక్షకులకు కౌబాయ్, జేమ్స్ బాండ్ అనగానే గుర్తుకువచ్చేది సూపర్ స్టార్ కృష్ణ. ఆయన పలు గుడాచారి సినిమాలలో నటించారు. వాటిలో ప్రత్యేకంగా నిలిచిన మూవీ ఏజెంట్ గోపి. ఈ సినిమాని లెజెండరీ డైరెక్టర్ కె.ఎస్.ఆర్.దాస్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో జయప్రద హీరోయిన్ గా నటించారు. కాంతారావు, ప్రభాకర్ రెడ్డి, రాజనాల వంటి లెజెండరీ నటులు కీలకపాత్రలలో నటించారు. ఏజెంట్ గోపి మొదటి సినిమా స్కోప్ జేమ్స్ బాండ్ సినిమాగా నిలిచింది.
ఇక ఈమూవీ స్టోరీ విషయానికి వస్తే, గోపాల్ కృష్ణ అలియాస్ గోపి (ఘట్టమనేని కృష్ణ) ఒక తెలివైన పోలీస్ ఏజెంట్. 50 కోట్ల విలువైన వజ్రాల దొంగలను కనుగొనే క్రమంలో చాలా మంది పోలీసు అధికారులు చంపబడతారు. దాంతో ఉన్నతాధికారి ఈ పనిని ఏజెంట్ గోపీకి అప్పగిస్తాడు. తనకు అప్పగించిన బాధ్యతలో భాగంగా గోపీ విశాఖపట్నం వెళ్తాడు. అక్కడ ఎస్ఐ రాజారావు (ప్రభాకర్ రెడ్డి) కలుస్తాడు. అతని చెల్లి పేరు లత(జయప్రద) అని తెలుస్తుంది.
లత గోపి ఉన్న హోటల్లో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తుంది. అనుమానాస్పద రీతిలో వ్యవహరిస్తున్న గోపి గురించి తెలుసుకోవడం కోసం ప్రేమించినట్టుగా నటిస్తుంది. అయితే ఆమె గురించి తెలిసిన గోపి, లతను ఆమె అన్న రాజారావు దగ్గరకు గోపి తీసుకువెళతాడు. కానీ లత అది నిజం కాదని, రాజారావును నమ్మకూడదని అతను మోసగాడని చెప్తుంది. తన అన్నయ్య రాజారావును వజ్రాల కోసం స్మగ్లర్ల గ్యాంగ్ కిడ్నాప్ చేసిందని చెప్తుంది.
ఆ తరువాత అసలైన రాజారావు స్మగ్లర్ల నుండి తప్పించుకుని వచ్చి, స్మగ్లర్ల గుహకు దారిచూపే మ్యాప్‌ను గోపికి ఇస్తాడు. లత, గోపి, అతని కొలీగ్ చిట్టి(పద్మనాభం) కలిసి గుహను కనుగొంటారు. అయితే వారిని స్మగ్లర్లు పట్టుకుంటారు. గోపి స్మగ్లర్ల డాన్ (రాజనాల)ని కలుస్తాడు. డాన్, అతని గ్యాంగ్ వజ్రాల కోసం ఇదంతా చేయడం లేదని, ప్రపంచ విధ్వంసం కోసం అని గోపి తెలుసుకుంటాడు. ఆ తరువాత గోపి, ఎస్ఐ రాజారావు, లత, చిట్టిల సహాయంతో స్మగ్లర్లను అంతం చేసి ప్రపంచాన్ని కాపాడుతాడు.
అప్పట్లో ఈ మూవీ చాలా పెద్ద హిట్. అసలు ఇలాంటి సినిమా అప్పుడు వచ్చిందంటే చాలా గొప్ప విషయం అని అంటున్నారు. కె.ఎస్.ఆర్.దాస్ అప్పట్లోనే అడ్వాన్స్ టెక్నాలజీకి చెందిన వాటిని ఈ సినిమాలో చూపించారు. హీరో అడివి శేష్ గూడాచారి2 మూవీలో ఏజెంట్ గోపికి నివాళిగా తన క్యారెక్టర్ ను రాసుకున్నారు.
ఐ ఫోన్ సిరీస్ లు వచ్చిన వెంటనే అమ్ముడవుతాయి. రీసెంట్ గా కొత్తగా ఐఫోన్ 15, ప్రో మాక్స్ రిలీజ్ అయ్యాయి. అలా రాగానే ఐ ఫోన్ లవర్స్ ఎగబడి మరి వాటిని కొనుగోలు చేశారు. ఈ క్రమంలోనే ఐఫోన్ అంటే ఇష్టం ఉన్న ఒక బిచ్చగాడు చిల్లర నాణేలను యాపిల్ స్టోర్‌కు తీసుకువచ్చి, ఆ నాణేలతో యాపిల్ ఫోన్ ను కొనుగోలు చేశాడు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఆ వీడియోలో మాసిపోయిన బనియన్, లుంగీతో శరీరం అంతా మురికితో ఒక బిచ్చగాడు, జనాలతో రద్దీగా ఉన్న యాపిల్ స్టోర్‌కు వెళ్ళాడు. ఒక సంచీని భుజానికి వేసుకుని ఉన్నాడు. అయితే స్టోర్ లో ఉన్నవారు ఏం జరుగుతుందో అర్థం కాక అతన్ని చూడడం మొదలుపెట్టారు. ఆ బిచ్చగాడు కొత్తగా రిలీజ్ అయిన ఐఫోన్ 15 ప్రో మాక్స్ యాపిల్ ఫోన్ కొనడం కోసం స్టోర్‌కు వచ్చినట్లు చెప్పాడు. అది విన్నవారు అతను జోక్ చేస్తున్నాడని భావించారు. అయితే అతను తాను తీసుకువచ్చిన సంచీలో ఉన్న డబ్బును చూపించడంతో అందరూ షాక్ అయ్యారు.
సంచిలో తీసుకువచ్చిన చిల్లర అంతా స్టోర్‌లోని ఫ్లోర్ పై పోసి, వాటిని తీసుకుని యాపిల్ ఫోన్ 15 ప్రో మాక్స్ ఇవ్వామని అడిగాడు. ఇక ఆ స్టోర్ సిబ్బంది అందరూ ఆ నాణేలను లెక్కించగా, రూ.1.59 లక్షల ఉంది. అవి తీసుకుని అతనికి ఐఫోన్ ను ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియోను తీసి, సామాజిక మధ్యమంలో షేర్ చేయగా, ప్రస్తుతం వైరల్ గా మారింది. కానీ కొంత మంది మాత్రం ఇది ప్రాంక్ వీడియో అని అంటున్నారు. మరి కొంత మంది అయితే నిజంగానే ఇలా జరిగింది అంటున్నారు. నెటిజెన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇప్పటికే నవదీప్‌ను ఈ కేసులో సెప్టెంబర్ 23న ఈడీ అధికారులు విచారించారు. అయితే వారు అడిగిన కొన్నింటికి నవదీప్ జవాబులు చెప్పినా, కొన్నింటిని దాటవేశారని తెలుస్తోంది. రామ్‌చంద్ పదేళ్ల కిందటే తనకు పరిచయమని, అయినప్పటికీ, తాను ఎవరికీ వాటిని ఇవ్వలేదని చెప్పారు. దాంతో 2017లో నమోదైన టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసును, మాదాపూర్ మాదకద్రవ్యాల కేసును కలిపి ఈడీ ఈరోజు నవదీప్‌ని ప్రశ్నిస్తోంది. మాదకద్రవ్యాల కేసులో ఉన్న నైజీరియన్లతో మీకున్న సంబంధం ఏమిటి? వారితో ఆర్ధిక లావాదేవీలను ఎందుకు జరిపారు?
ముగ్గురు నైజీరియన్ల మనీలాండరింగ్ కేసు గురించి ఏం తెలుసు? ఈడీకి మీ అకౌంట్ల అన్ని వివరాలను ఇవ్వగలరా? మీరు మేనేజర్ మరియు డ్రైవర్ అకౌంట్లతో ఏమైనా ట్రాన్సాక్షన్లు చేశారా? రామ్‌చంద్, కలహర్ రెడ్డితో ఉన్న లావాదేవీల విషయం ఏమిటి? ఈవెంట్లకు సంబంధించిన అన్ని రికార్డులను ఇస్తారా? వంటి ప్రశ్నలను ఈడీ అధికారులు అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ విచారణలో కొంతమంది కీలకమైన వారి పేర్లు బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే విచారణ తరువాత బయటికి వచ్చిన నవదీప్ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.