యావత్ ప్రపంచ దృష్టి మొత్తం చంద్రయాన్-3 మీదనే ఉన్నాయి. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ విజయవంతం అయితే ఇండియా సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. ఇస్రో ఖ్యాతి తారాస్థాయికి చేరుతుంది.
చందమామకు చేరువలో ఉన్న చంద్రయాన్-3 నేడు (ఆగస్ట్ 23) ల్యాండింగ్ కానుంది. ఈ చారిత్రత్మక ఘట్టాన్ని చూడడం కోసం భారత్ మాత్రమే కాదు యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. అయితే ల్యాండర్ చంద్రుని పై సురక్షితంగా ల్యాండ్ కావడానికి ఆఖరి 17 నిమిషాలు అత్యంత కీలకం. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 గత నెల బయలుదేరి, ఎట్టకేలకు ఆఖరి అంకానికి చేరుకుంది. కొన్ని గంటల్లో ల్యాండర్ చంద్రుని దక్షిణధ్రువం తొలి అడుగు పెట్టడానికి సిద్ధమైంది. ఆ క్షణం కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తోంది. దేశం మొత్తం ఇస్రో జయహో అని నినదిస్తోంది. ఈరోజు సాయంత్రం 5.27 గంటలకు ఈ ప్రక్రియ మొదలుకాబోతుంది. సరిగ్గా సాయంత్రం 6.04 గంటలకు చందమామ ఉపరితలం పై ల్యాండర్‌ను సురక్షితంగా ల్యాండ్ చేయడానికి ఇస్రో శాస్త్రవేత్తలు ఏర్పాట్లన్నిటిని పూర్తి చేశారు.
అయితే, ఈ మిషన్ లో చివరి 17 నిమిషాలు చాలా కీలకం. దీనిని ‘17 మినిట్స్ ఆఫ్ టెర్రర్’ అని చెప్తున్నారు. ఈ ప్రక్రియ సక్సెస్ ఫుల్ గా పూర్తి అయితే దాదాపు జాబిల్లి ఉపరితలం మీదకి ల్యాండర్ సురక్షితంగా చేరుకున్నట్లే అని చెబుతున్నారు. ఈ ఆఖరి 17 నిమిషాలో ల్యాండర్ ఆటోమేటిక్ గా తనలోని ఇంజన్లను మండించుకోగలగాలి. అంతే కాకుండా ఈ చర్య కరెక్ట్ టైమ్ కి జరగడంతో పాటుగా దానికి అవసరమైన ఇంధనాన్ని కూడా ఉపయోగించుకోవడం అనేది అత్యంత కీలకం.
దీనిలో ఏమాత్రం హెచ్చుతగ్గులు వచ్చినా ప్రయోగం అంతా విఫలం అవుతుంది. అందువల్లే ఉత్కంఠంగా యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. ఇస్రో శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్‌ల వద్ద అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో చంద్రయాన్-2 ఎగుడుదిగుడుగా ఉన్న ప్రాంతాన్ని ఢీకొనడంతో కూలిపోయింది. ఈసారి అలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


ఇక ఈ బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరిచే సంస్థలు వేరు ధరలను కలిగి ఉన్నాయి. అయితే బొడ్డు తాడు రక్తాన్ని ఎన్ని సంవత్సరాల పాటు భద్రపరుస్తారనే విషయం కూడా ధరను నిర్ణయిస్తుంది. ఉదాహరణకు 25 సంవత్సరాల పాటు బొడ్డు తాడు రక్తాన్ని భద్రపరచడం కోసం స్టెమ్ సైట్ అనే సంస్థ 55 వేల రూపాయలు తీసుకుంటోంది. ఇక 75 సంవత్సరాల పాటు అయితే, ధర 70 వేల రూపాయలు వరకూ ఉంటుంది. అదనంగా ట్రీట్మెంట్ కోసం ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటించిన మూవీ భోళాశంకర్. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ విడుదలైన ఫస్ట్ డే ఫస్ట్ షోకే ప్లాప్ టాక్ తెచ్చుకుంది. మెగాస్టార్ చిరంజీవి బాగా నటించినప్పటికీ, కొన్ని సీన్ల వల్ల ఈ మూవీ నెట్టింట్లో ట్రోల్ అయ్యింది. ఆ సీన్స్ కు సంబంధించిన ఫోటోలతో మీమ్స్ కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి.
కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహించారు. అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మించారు. మెహర్ రమేష్ తెలుగు నేటివిటీకి తగిన విధంగా మార్పులు చేసినా కూడా అంతగా ఈ మూవీ ప్రభావం చూపెట్టలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టడంతో వసూళ్లు కూడా ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ సాధించలేక నష్టాలను మిగిల్చింది. ఆచార్య మూవీ కన్నా భారీ డిజాస్టర్ అనే టాక్ కూడా వచ్చింది.
అయితే ఒక ట్విట్టర్ యూజర్ పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ట్వీట్ లో “ఈరోజు అమ్మని జైలర్ కి తీసుకెళ్ళా, సినిమా మొదలయ్యే ముందు పక్క స్క్రీన్ లో చిరంజీవి సినిమా ఆడుతుంది అని చెప్పా. అంతే ఆ తర్వాతి సెకను దానికి వెళితే అయ్యోపోయే కదా దీనికి ఎందుకు తీసుకొచ్చావు. సినిమా ఫ్లాప్ అయింది మా అంటే, చిరంజీవి సినిమా ఎలా ఉన్నా బాగానే ఉంటుంది అని అన్నారు. అదీ బాస్ అంటే” అని రాసుకొచ్చారు.
ఈ ఏడాది కన్నడ ఇండస్ట్రీలో రిలీజ్ అయిన చిత్రాలలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సినిమాలలో ‘హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే’ మూవీ ఒకటి. ఈ చిత్రానికి నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించారు. ఈ యూత్ పుల్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ, చిన్న సినిమాగా జులై 26న రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఆ సినిమానే ‘బాయ్స్ హాస్టల్’ అనే టైటిల్ తో అన్నపూర్ణ స్టూడియోస్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేయబోతున్నారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 26న థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ‘బేబీ’ మూవీ యూనిట్ తో ‘బాయ్స్ హాస్టల్’ ట్రైలర్ ను లాంచ్ చేయించారు. అయితే ఈ ట్రైలర్ చివర్లో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన డైలాగ్ ఉంటుంది.
ఒక కుర్రాడు ‘మేం ఆంధ్రా వాళ్లం, పక్కా తెలుగోళ్లం, తోపు కాపులురా ఇక్కడ’ అని అనగానే, మరొకరు “ఒరేయ్ తప్పు తప్పుగా మాట్లాడకు, ఆంధ్రా అంటే కాపులే కాదు, కమ్మోళ్లు కూడా” అని అంటాడు. ఈ డైలాగ్ లు సాధారణంగా అయితే ప్రజలు మామూలుగా మాట్లాడుకునేవే. కానీ ప్రస్తుతం ఉన్న కండిషన్స్ లో ఇలాంటి డైలాగ్స్ అవసరమా అని అంటున్నారు.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై ట్రోల్స్, విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. రజినికాంత్ ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటనలో భాగంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి, జైలర్ మూవీ ఆయనతో కలిసి రజినికాంత్ చూడడం జరిగింది. యూపీముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కావడానికి ఆయన నివాసానికి వెళ్ళినపుడు, యోగి రజినికాంత్ ను ఆహ్వానించడం కోసం ఎదురు వచ్చారు. ఆ సమయంలో రజినికాంత్ యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కారం చేశాడు. ఆ వీడియో క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అయ్యింది.
వయసులో రజినికాంత్ యోగి కన్నా చాలా పెద్దవాడు. యోగి వయసు చాలా తక్కువ. రజినీ తన కన్నా చిన్నవాడైన యోగి పాదాలకు ఎందుకు నమస్కారం చేశాడు. తమిళనాడులో అందరూ నిన్ను ఆరాధిస్తుంటే నువ్వెళ్లి యోగి పాదాలు మొక్కుతావా? తమ ఆత్మాభిమానాన్ని కించపరిచావంటూ తమిళ ఫ్యాన్స్ మండిపడ్డారు. రజిని యాంటీ ఫ్యాన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు సమర్ధిస్తున్నారు.
సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ విమర్శల పై స్పందించారు. తాజాగా చెన్నైలో అడుగుపెట్టిన రజినీకాంత్ ను మీడియా ఈ వివాదం గురించి అడుగగా, తన పై వచ్చిన విమర్శుల పై స్పందించాడు. “వయసులో పెద్ద వారైనా, చిన్న వారైనా, సన్యాసి అయినా, మఠాధిపతి, మత గురువు, యోగి, స్వామిజీ అయినవారి పాదాలకు నమస్కరించడం నా అలవాటు” అని వెల్లడించారు.
పవన్ కళ్యాణ్ తనయుడు, రేణు దేశాయ్ గారాల కుమారుడు అకిరా నందన్. రేణు దేశాయ్ తన కుమారుడికి సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అకిరా సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నాడని ఇప్పటికే చాలాసార్లు ప్రచారాలు జరిగాయి. అయితే వాటిని రేణూ దేశాయ్ ఖండించింది. అయినప్పటికీ అకిరా ఎంట్రీ రూమర్స్ మాత్రం ఆగడం లేదు.
అకిరా ప్రస్తుతం విదేశాలలో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రేణూ దేశాయ్ నార్వేలో అకిరా నందన్‌తో ఉంది. తాజాగా అకిరా నందన్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోలో అకిరాతో పాటు దర్శకేంద్రుడు కే రాఘవేంద్ర రావు కూడా ఉన్నారు. ఈ ఫోటోను షేర్ చేసి కాసేపటికే డిలీట్ చేశారు. అయితే అప్పటికే ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
ఇక రాఘవేంద్ర రావుతో అకిరా కనిపించడంతో ఏదో ఉందని అనుకున్నారు. నెటిజెన్లు రాఘవేంద్ర రావుతో లాంచ్ చేయిస్తున్నారా? అకిరా యాక్టింగ్ స్కూల్లో చేరారా? అని రేణూ దేశాయ్ పై ప్రశ్నలు అడుగుతున్నారు. రేణూ దేశాయ్ నెటిజన్ల కామెంట్లకు ఇన్ స్టా స్టోరీలో జవాబు చెప్పింది. అకిరా ఏ యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వలేదు. అకిరాకు ఇప్పుడు నటన పై ఆసక్తి లేదు. అకిరాకు నటించే ఆసక్తి వచ్చినపుడు ఆ విషయాన్ని ముందుగా ఇన్ స్టాగ్రాంలో అనౌన్స్ చేస్తానని చెప్పుకొచ్చింది.
వరలక్ష్మీ వ్రతం రోజున అనగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు తెల్లవారుజామునే అభ్యంగన స్నానాన్ని చేయాలి. ఆ తరువాత గృహంలో ఈశాన్య భాగంలో ఆవుపేడతో చక్కగా అలికి ముగ్గులు పెట్టాలి. ఆ తరువాత మండపాన్ని ఏర్పాటు చేసి, అందులో కొత్తబియ్యం పోసి చక్కగా తీర్చిదిద్ది, ఆ బియ్యం మధ్యలో కలశాన్ని పెట్టి, మామిడి, మర్రి, మేడి, రావి, జువ్వి చిగుళ్లను కలశంలో వేయాలి. తరువాత ఆ కలశం పై కొబ్బరికాయను పెట్టి, ఎర్రని రంగు రవిక గుడ్డతో అలంకరించాలి.
ముందుగా పసుపుతో గణపతికిపూజా చేసి, ఆ తరువాత ఆ కలశం ముందు లక్ష్మీదేవి విగ్రహాన్ని పెట్టి, వరలక్ష్మీ దేవతను ఆవాహన చేయాలి. వరలక్ష్మీ కీర్తిస్తూ షోడశోపచారాలు, అష్ణోత్తరశత నామాలతో అర్చన చేయాలి. అనంతరం దీప, దూప, నైవేద్యాలను తాంబూలాలని వరలక్ష్మీ దేవికి సమర్పించాలి. ఆ తరువాత కర్పూర నీరాజనం, మరియు మంత్రపుష్పం సమర్పించాలి.
మంగళహారతి ఇచ్చిన తరువాత తోరగ్రంథి పూజ చేయాలి. తోరబంధన మంత్రం చెప్తూ ఆ తోరణాన్ని కుడిచేతికి కట్టుకొవాలి. తొమ్మిది రకాల పిండివంటలు, పండ్లు మొదలగు వాటిని వరలక్ష్మీ దేవికి సమర్పించిన తరువాత, చివరగా ఒక ముత్తైదువకు వాయనదాన మంత్రం చెబుతూ తాంబూలం సమర్పిస్తూ ఆ ముత్తైదువను శ్రీ మహాలక్ష్మీగా భావించి వాయనం ఇచ్చి, ఆశీర్వాదం తీసుకోవాలి.
‘గన్స్ అండ్ గులాబ్స్’ 1990ల కాలంలో ‘గులాబ్ గంజ్’ అనే ఊరులో సాగే స్టోరీ. గులాబ్ గంజ్ లో గవర్నమెంట్, ఔషధ తయారీ అవసరాల కోసం ఆ ఊరి రైతులు నిషేధిత నల్లమందుకు సంబంధించిన పంటను పండిస్తుంటారు. వారి దగ్గర ఆ పంటను గవర్నమెంట్ కొనుగోలు చేస్తుంటుంది. అదే సమయంలో ఆ ఊరిలో ఉండే ఒక గ్యాంగ్ కూడా అక్రమంగా అక్కడి రైతులతో పెద్ద మొత్తంలో నల్లమందు పంటను పండిస్తుంది. ఈ పంటను వెస్ట్ బెంగాల్ కు చెందిన పెద్ద గ్యాంగ్‌స్టర్ కు అమ్మడానికి అగ్రిమెంట్ చేసుకుంటుంది. దీనికి షేర్పూర్ లోని వేరే గ్యాంగ్ అడ్డుపడుతుంటుంది.
నల్లమందును కొనుగోలు విషయంలో ఈ రెండు గ్యాంగ్ ల మధ్య వార్ సాగుతూ ఉంటుంది. ఈ గోడవల వల్ల ‘నార్కోటిక్ ఆఫీసర్’ గా ఆ ప్రాంతానికి అర్జున్ వర్మ ( దుల్కర్ సల్మాన్) ను నియమిస్తారు. అర్జున్ నల్లమందు మాఫియాను ఎలా అడ్డుకుంటాడు? ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యలు ఏమిటి? బైక్ మెకానిక్ గా పనిచేసే టిప్పు ( రాజ్ కుమార్ రావు) పాత్ర ఏమిటి? రెండు గ్యాంగ్ ల మధ్య జరిగే పోరులో ఎవరిది పైచేయి అనేది మిలిన కథ.
ఏడు ఎపిసోడ్లు గా రూపొందిన ఈ వెబ్ సిరీస్ లో టిప్పుగా రాజ్ కుమార్ రావ్ సహజంగా నటించాడు. దుల్కర్ సల్మాన్ ఎప్పటిలానే తన నటనతో ఆకట్టుకున్నాడు. అర్జున్ గా ఆ క్యారెక్టర్ కి జీవం పోశాడు. వైవిధ్యమైన పాత్రలో గుల్షన్ దేవయ్య నటించాడు. అయితే రాజ్ అండ్ డీకే గత సిరీస్ ల రేంజ్ లో లేదని చెప్పవచ్చు. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఈ వెబ్ సిరీస్ అలరిస్తుంది.
హీరో మంచు విష్ణు నటిస్తున్న కన్నప్ప మూవీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ముఖేశ్ కుమార్ సింగ్ తెరకేకిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ల పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. చాలా కాలంగా ఈ సినిమా స్క్రిప్ట్ పై పనిచేస్తున్న విష్ణు, ఫైనల్ గా ఈ మూవీని ప్రకటించారు. అలాగే శ్రీ కాళహస్తిలో ప్రారంభించారు. ఈ చిత్ర షూటింగ్ త్వరలోనే మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో మంచు విష్ణు పక్కన హీరోయిన్ గా నుపుర్ సనన్ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ సోదరి. నుపుర్ సనన్ బాలీవుడ్ లో నటి మరియు సింగర్. ఆమె ఢిల్లీ యూనివర్శిటీలోని కిరోరి మాల్ కాలేజీలో కామర్స్ పూర్తి చేసింది. ఆమె తన అక్క కృతి సనన్ అడుగుజాడల్లో నడవడానికి ముంబైకి మారింది. అక్షయ్ కుమార్ సరసన బి ప్రాక్: బి ప్రాక్: ఫిల్హాల్ అనే మ్యూజిక్ వీడియోలో నటించి, గుర్తింపు తెచ్చుకుంది.
గత ఏడాది వచ్చిన కునాల్ కెమ్ము, సౌరభ్ శుక్లా నటించిన కామెడీ డ్రామా టెలివిజన్ సిరీస్ పాప్ కౌన్ తో ఆమె నటిగా మారింది. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన నూరానీ చెహ్రా మూవీలో నటిస్తోంది. తెలుగులో మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇదే ఆమె మొదటి తెలుగు మూవీ.
ఇటీవల ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి పై అడుగుపెట్టడానికి రెడీ అవుతోంది. మరికొన్ని గంటల్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడు దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టనుంది. చంద్రయాన్-3 సక్సెస్ అయితే తొలిసారి దక్షిణ ధ్రువం పై అడుగుపెట్టిన దేశంగా చరిత్ర సృష్టించనుంది. ఆగస్ట్ 23న విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం పై అడుగుపెడుతుందని ఇస్రో వెల్లడించింది. రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలం అవడంతో అన్ని దేశాల దృష్టి ప్రస్తుతం చంద్రయాన్-3 పైనే ఉన్నాయి.
దేశవ్యాప్తంగా చంద్రయాన్-3 గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈక్రమంలో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ట్విటర్ లో ఒక ఫొటోను షేర్ చేస్తూ, కామెంట్స్ చేశారు. ఆయన షేర్ చేసిన ఫొటోలో ఒక వ్యక్తి లుంగీ ధరించి, టీ పోస్తున్నట్లు ఉంది. అది కూడా కార్టూన్ లా ఉంది. ఇక ఈ ట్వీట్ కు ‘బ్రేకింగ్ న్యూస్.. విక్రమ్ ల్యాండర్ చంద్రుడి నుండి పంపించిన తొలి చిత్రం’ అని ప్రకాశ్ రాజ్ రాసుకొచ్చారు. చంద్రయాన్-3 పై ప్రకాశ్ రాజ్ పెట్టిన పోస్టు వ్యంగ్యంగా ఉండటంతో నెటిజెన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రయాన్-3 ఇండియాకి గర్వకారణం. కానీ, ప్రకాశ్ రాజ్ గుడ్డి ద్వేషంతో శాస్త్రవేత్తలను ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని మండిపడుతున్నారు. మరొకరు చంద్రయాన్ 3ని ఇస్రో ప్రయోగించిందని, బీజేపీది కాదని కామెంట్ చేశారు. ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.