తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇక పై 2000 రూపాయల నోట్లను కస్టమర్లకు ఇవ్వకూడదని ఆర్బీఐ బ్యాంకులకు ఆదేశాలను ఇచ్చింది.
2016 లో 500, 1000 రూపాయల నోట్ల రద్దు అనంతరం ఆర్బీఐ రెండు వేల రూపాయల నోట్లు అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే తాజాగా వాటిని కూడా వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకుంది. నోట్ల రద్దు నేపథ్యంలో సోషల్ మీడియాలో బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలు ట్రెండ్ అవుతున్నాయి. మరి నోట్ల రద్దు అయితే ఈ చిత్రాల గురించి ఎందుకు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుందో ఇప్పుడు చూద్దాం..
2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఆర్బీఐ ప్రజలు తమ దగ్గరున్న 2000 నోట్లను సెప్టెంబర్ 30 లోపు బ్యాంకులలో జమ చేయడం, లేదా మార్చుకోవడం చేయాలని సూచించింది. కానీ రోజుకు ఇరవై వేల వరకు మాత్రమే మార్చుకోవచ్చు. జమ చేయడం అయితే ఎంత అయిన చేసుకోవచ్చు. ‘క్లీన్ నోట్ పాలసీ’ లో భాగంగానే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకునే డిసిషన్ తీసుకన్నామన్న ఆర్బీఐ తెలిపింది. ఇక ఈ ప్రకటన వచ్చినప్పటి నుండి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ విషయం పై చర్చలు జరుగుతున్నాయి.
ఇక ఇదే విషయం పై సోషల్ మీడియాలో మరో విధంగా జరుగుతుంది. దేశంలో నోట్ల రద్దుకు బిచ్చగాడు, బిచ్చగాడు 2 చిత్రాలకు ముడిపెడుతు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. విజయ్ ఆంటోని హీరోగా నటించిన ‘బిచ్చగాడు’ సంచలన విజయం సాధించిన విషయమ తెలిసిందే. ఈ మూవీ కోలీవుడ్ లో 2016 మార్చి 4న రిలీజ్ అయ్యింది. తెలుగులో అదే ఏడాది మే 13న విడుదల అయ్యింది. ఈ మూవీ తెలుగులో రిలీజ్ అయిన దాదాపు 5 నెలలకు పీఎం మోదీ ఇండియా లో 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టుగా ప్రకటించారు.
నిన్న ‘బిచ్చగాడు 2’ మూవీ రిలీజ్ అయ్యింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయిన రోజే 2000 రూపాయల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆర్బీఐ ప్రకటించింది. ఆశ్చర్యంగా ఉన్నా ఈ విషయం పై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ నడుస్తోంది. బిచ్చగాడు మూవీకి, నోట్ల రద్దు లేదా ఉపసంహరణకు సంబంధం లేకపోయినా కాకతాళీయంగా జరగడంతో నెట్టింట్లో కొందరు నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక నెటిజెన్ హీరో విజయ్ ఆంటోనీని బిచ్చగాడు చిత్రాలు తీయొద్దని చెప్పాలి అంటూ కామెంట్ చేశారు. మరొకరు ‘బిచ్చగాడు 3’ తీయకుండా చూసుకోండయ్యా అని కామెంట్ చేశారు.
బిచ్చగాడు టైమ్ లో 500/1000 నోట్ల ఉపసంహరణ
బిచ్చగాడు-2 రిలీజ్ టైమ్ కి 2000 నోట్ల ఉపసంహరణ
———————
ఈ లింకేమిటి సామీ? pic.twitter.com/N7xM4XtAsV— Nellore PeddaReddy (@Tenali_RK) May 19, 2023
Also Read: ఇండస్ట్రీలో ఆయన పని అయిపోయింది అనుకున్న వారందరికీ షాక్ ఇచ్చారు..! ఇంతకీ ఎన్టీఆర్ ఏం చేశారంటే..?

ఎన్టీ రామరావుగారి పద్దతి వేరు. ఆయన ఏ క్యారెక్టర్ చేయాల్సి వస్తే ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం ఎన్టీఆర్ కి ఉన్న ప్రత్యేకత. అప్పట్లో ఎన్టీఆర్ చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూసేవారు. అయితే ప్రతి రంగంలోనూ ఆటుపోట్లు అనేవి ఎదురవడం సహజమే. అలాగే ఒక సమయంలో ఎన్టీఆర్ కు కెరీర్ లో కూడా అలాంటి పరిస్థితి ఎదురయ్యింది. 1977 కి ముందు ఎన్టీఆర్ చిత్రాలు విడుదల అవుతున్నా, అంతకుముందులా హిట్ అవడం లేదు.
చెప్పుకోదగ్గ స్థాయిలో సక్సెస్ కావడం లేదు. అప్పటికే ఇండస్ట్రీలోకి కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు లాంటి యంగ్ హీరోలు రావడంతో ఎన్టీఆర్ జోరు కొంచెం తగ్గింది. ఆ సమయంలో కొందరు ఎన్టీఆర్ పనైపోయిందని కూడా అన్నారు. అయితే ఎన్టీఆర్ వయసు పై బడిందని ఊరుకోలేదు. సినీ పరిశ్రమలో తనకు ఎదురులేదని నిరూపించాడు.
నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. ఒకే సంవత్సరంలో ఏకంగా 3 ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చి అందరి నోళ్ళు మూయించారు. 1977లో ఎన్టీఆర్ కు 3 బ్లాక్ బస్టర్ హిట్స్ ఉన్నాయి. జనవరి 18న విడుదల అయిన ‘దానవీరశూరకర్ణ’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రలలో నటించి అందరిని ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా ఆయనే.
ఈ మూవీ విజయం మరవకముందే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించిన ‘అడవి రాముడు’ మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అదే సంవత్సరం చివరలో ఎన్టీఆర్ నటించిన ‘యమగోల’ మూవీ విడుదలై బ్లాక్ బాస్టర్ గా నిలిచింది. ఈ విధంగా ఎన్టీఆర్ 1977లో 3 చిత్రాలు చేసి రికార్డ్ సృష్టించారు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ చిత్రంలో కానిస్టేబుల్ శివగా నాగ చైతన్యనటించారు. అరవింద్ స్వామి ఈ చిత్రంలో విలన్‌గా నటించగా, శరత్‌కుమార్, సంపత్ రాజ్, YG మహేంద్రన్ కీలక పాత్రలలో నటించారు. శివ గర్ల్ ఫ్రెండ్ రేవతి పాత్రలో కృతి శెట్టి, ముఖ్యమంత్రి పాత్రలో ప్రియమణి నటించారు. ఈ చిత్రానికి మ్యాస్ట్రో ఇళయరాజా ఆయన కుమారుడు యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు
శివ (నాగచైతన్య) నిజాయితీగల పోలీస్ కానిస్టేబుల్ గా సీఎం దాక్షాయణి (ప్రియమణి) ప్రశంసలు పొంది జిల్లాలో చాలా పాపులర్ అవుతాడు. ఓ రోజు రాత్రి పూట డ్యూటీలో చేస్తూ ఎవరో తెలియకుండానే పెద్ద క్రిమినల్ అయిన రాజు (అరవిందస్వామి) మరియు సిబిఐ ఆఫీసర్ అయిన జార్జ్ (సంపత్ రాజ్) లను అరెస్ట్ చేస్తాడు. ఆ సంఘటనతో సాధారణ కానిస్టేబుల్ అయిన శివ లైఫ్ తలకిందులవుతుంది. రాజూ ఎవరు? అతడిని ఎందుకు సిబిఐ పట్టుకోవాలని అనుకుంటుంది? ఇందులో శివ ఎందుకు ఇరుక్కున్నాడు? ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ.
తాజాగా కస్టడీ ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. సాధారణంగా ఏ చిత్రం రిలీజ్ అయినా 45 రోజుల తరువాతనే ఓటీటీలోకి వస్తుంది. అంటే ఈ సినిమా మే 12న రిలీజ్ అయింది. అంటే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా జూన్ చివర్లో ఓటీటీలోకి వస్తుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతుందని సమాచారం.
అయితే థియేటర్స్ లో చూడని చాలా మంది ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా ఈ మధ్య చాలా చిత్రాలు థియేటర్స్ లో రిలీజ్ అయినపుడు వచ్చే టాక్ కన్నా ఓటీటీలో విడుదల అయిన తరువాత మంచి టాక్ వస్తుంది. మరి ఈ సినిమాకి ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
1. కూకబుర్ర బాల్:
2 . ఎల్ఈడీ స్టంప్స్, బెయిల్స్:
3. స్పైడర్ కెమెరాలు:
4. హాట్ స్పాట్:
5. బగ్గీక్యామ్ – రోబోటిక్ కెమెరా :
ప్లేయర్స్ తో పాటే ఇవి పరుగెత్తుతూ వారి కదలికలను చిత్రీకరిస్తాయి. గ్రౌండ్ లో బౌండరీ లైన్ వద్ద రోబోటిక్ కెమెరాలు తిరుగుతూ ప్లేయర్స్ ప్రతీ మూమెంట్‌ను రికార్డు చేస్తాయి.
ఈ మూవీ ట్రైలర్ విడుదల అయినప్పటి నుండి దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపింది. కేరళ ముఖ్యమంత్రితో సహా రాజకీయ నాయకులు ఈ చిత్రం పై తీవ్రంగా మండిపడ్డారు. టీజర్, ట్రైలర్ రిలీజ్ వెంటనే ఈ మూవీని విడుదల చేయకూడదని కేరళ హై కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. కేరళ, తమిళనాడుల్లో ఈ మూవీని రిలీజ్ ఆపేందుకు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. ఆందోళనలు, వివాదాలు, విమర్శలు, నిరసనల మధ్యనే ఈ చిత్రం విడుదలైంది.
ఈ మూవీ కథ లోకి వెళ్తే కేరళలోని కాసర్గాడ్లోని నర్సింగ్ కాలేజీలో హిందువైన షాలిని ఉన్నికృష్ణన్ చేరుతుంది. అక్కడ నిమా, గీతాంజలి పరిచయం అవుతారు. హాస్టల్లో అసీఫాతో కలిసి రూమ్ షేర్ చేసుకొంటారు. అసీఫా ఐసీస్ లో అండర్ కవర్‌గా పనిచేస్తూ, అమ్మాయిలను టార్గెట్ చేసి వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం మతంలోకి మారుస్తూ ఉంటుంది. ఈ ముగ్గురు అసీఫా మాటలకు ఆకర్షితులై ఇస్లాం మతంలోకి మారుతారు.
మతం మార్చబడిన ఈ అమ్మాయిలు ఇస్లామిక్ స్టేట్లోకి రిక్రూట్ అయ్యారు. వీరిని ఆఫ్ఘనిస్తాన్, యెమెన్ మరియు సిరియాలకు ఇస్లాం మతం కోసం పోరాడటానికి పంపిస్తారు. నిజం తెలుసుకున్న తరువాత వారు ఏం చేశారు అనేదే ఈ చిత్రం. ఇక ‘ది కేరళ స్టోరీ’లోని అదా శర్మ పోషించిన ‘షాలినీ ఉన్నికృష్ణన్’ అనే పాత్ర కేరళ నలుగురు మహిళల్లో ఒకరైన నిమిషా అలియాస్ ఫాతిమా ఇసా జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈమె 2016 -2018 కాలంలో ఐసీస్ లో చేరి, ఆ ఉగ్రవాద సంస్థకు వ్యతిరేకంగా యుద్ధం చేసేందుకు ఆఫ్ఘనిస్తాన్‌కు పారిపోయారు.
ఐసీస్ నియంత్రణలో ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్‌లో US దళాలు నిమిషా అలియాస్ ఫాతిమాతో పాటు పారిపోయిన మరో ముగ్గురిని సోనియా సెబాస్టియన్ అలియాస్ ఆయిషా, మెర్రిన్ జాకబ్ అలియాస్ మరియం మరియు రఫెలాగా గుర్తించారు. నిమిషా భర్త ఐసిస్ ఉగ్రవాద దాడిలో చనిపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ జైలులో ఉన్నారు. ఆమె అసలు పేరు నిమిషా సంపత్. హిందువు తరువాత ఇస్లాంలోకి మారింది. అలాగే తన పేరును కూడా ఫాతిమా ఇసాగా మార్చుకుంది. నిమిషా మరియు మెర్రిన్ ఫాతిమా, మరియమ్‌లు ఇస్లాంలోకి మారారు. వారి భర్తలు కూడా ఇస్లాంలోకి మారారు.
నిమిషా అలియాస్ ఫాతిమా కేరళలో ఐసీస్ అబ్దుల్ రషీద్ వివాహం చేసుకుంది. మే 2016లో చదువు కోసం శ్రీలంకకు వెళుతున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పి భారత్‌ను విడిచిపెట్టింది. కానీ ఆమె తన భర్త మరియు ఇతరులతో కలిసి ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి సిరియాకు వెళ్లింది. నివేదికల ప్రకారం 2016 జూన్-జూలైలో నిమిషా ఉమ్ము కులుసు అనే అమ్మాయికి జన్మనిచ్చింది. కొంతకాలం తర్వాత సిరియా నుంచి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లారు. 2016 ఆగస్టులో ఎన్ఐఏ ఎఫ్ఐఆర్ నమోదు చేసి 21 మంది పై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసింది.
ఐసీస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ చనిపోయిన తర్వాత, అక్కడి బలగాలతో జరిగిన పోరాటంలో తమ భర్తలు మరణించిన తర్వాత 10 మంది మహిళలు మరియు 21 మంది పిల్లలు (నిమిషా మరియు ఉమ్ము కులుసుతో సహా) అక్టోబర్ 2019లో ఆఫ్ఘన్ అధికారుల ముందు లొంగిపోయారు. ఆ తర్వాత వారిని జైల్లో పెట్టారు.
కేరళలో, ఫాతిమా తల్లి బిందు కె తన కుమార్తె మరియు నాలుగేళ్ల మనవరాలిని స్వదేశానికి రప్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. తన కుమార్తె పెళ్లి లేదా ‘లవ్ జిహాద్’ ద్వారా ఇస్లాం మతంలోకి మారిందని బిందు అన్నారు. తీవ్రవాద గ్రూపుల మత మార్పిడుల పై కేంద్ర ఏజెన్సీతో విచారణ జరిపించాలని కోరుతూ ఆమె సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు
భారత దర్యాప్తు సంస్థలు కాబూల్‌లో పిల్లలతో నివసిస్తున్న నలుగురు మహిళలను ఇంటర్వ్యూ చేశాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో ఆ మహిళలలో ఇస్లామిక్ ఉగ్రవాదానికి అనుకూలమైన, బలమైన వైఖరితో ఉన్నారని దర్యాప్తు సంస్థలు తెలుసుకున్నాయి. అందువల్ల ఐసీస్ లో చేరిన ఆ నలుగురు కేరళ మహిళలు భారత్ కు తిరిగి వచ్చేందుకు భారత ప్రభుత్వం నిరాకరించింది. వారు ఐసీస్ లో చేరిన నలుగురు కేరళ మహిళలైన సోనియా అలియాస్ ఆయిషా, మెరిన్ జాకబ్ అలియాస్ మరియం, నిమిషా అలియాస్ ఫాతిమా, రఫెలా.
భారత దేశంలో మధ్య తరగతి ప్రజలు స్కూటర్ల మీద ఎక్కువగా ప్రయాణిస్తారు. ఒక బైక్ మీద ఫ్యామిలీ మొత్తం నలుగురు, ఐదుగురు వెళ్తుంటారు. అలా ప్రయాణిస్తున్న సమయంలో పిల్లలు నలిగిపోతుంటారు. ఇలాంటి ప్రయాణం గుంతల రోడ్డు పై చాలా ప్రమాదకరం. ఇక ఇలాంటి సంఘటనలు ఎన్నో చూసిన రతన్ టాటా బాధపడి మధ్యతరగతి ప్రజల కోసం, వారి భద్రత గురించి ఆలోచించి ఏదైనా తయారుచేయాలని అనుకున్నారు. అలా ఆయన ఆలోచనల నుండి వచ్చిందే టాటా నానో కారు. ప్రజల కారుగా పేరుగాంచింది.
నానో కారు ఖరీదు లక్ష రూపాయలు మాత్రమే. సామాన్యు ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ కార్ ను తయారు చేశారు. రతన్ టాటా ఈ కార్ ను ప్రకటించినపుడు ప్రపంచంలోని ఆటోమొబైల్ కంపెనీలు, మీడియా ఈ కార్ కోసం ఎదురు చూశారు. ఈ కార్ కి ప్రపంచవ్యాప్తంగా పబ్లిసిటీ వచ్చింది. అయినప్పటికీ ఈ కార్ ఫెయిల్ అయ్యింది. దీని సక్సెస్ కోసం రతన్ టాటా ఎంతో కష్టపడ్డారు. అయితే లక్ష రూపాయలతో కార్ తయారు చేయడం అనేది అతి పెద్ద టాస్క్. ఇది ప్రాక్టికల్ గా అసాధ్యం కూడా. అప్పటి సీఈఓ సైరస్ మిస్త్రీ కూడా టాటా నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
అయినా టాటా కంపెనీలోని యంగ్ ఇంజనీర్స్ తో ఈ కార్ ను డిజైన్ చేయించారు. ఎంత ప్రయత్నించిన లక్ష రూపాయలలో కార్ తయారుకాలేదు. దాంతో టాటామోటార్స్ జనాలకి ప్రామిస్ చేశాం కాబట్టి నానోలోని బేస్ మోడల్ కు మాత్రమే లక్ష రూపాయలు ఫిక్స్ చేసి, మిగతా మోడల్స్ కి 2.5 లక్షల వరకు పెట్టారు. ఇక లక్ష రూపాయలలో వచ్చే బేస్ మోడల్ కార్ కు ఎయిర్ బ్యాగ్స్ కానీ, ఏసీ కానీ, సేఫ్టీ రేటింగ్ లాంటివి ఏమి ఉండవు. అందువల్ల నానో కార్ ఆక్సిడెంట్స్ ను కాపాడలేదు. ప్రామిస్ చేశారు కాబట్టి కుదించి లక్ష రూపాయలలో తయారుచేశారు.
సాధారణంగా కారులో ప్రయాణించేప్పుడు సేఫ్ గా భావిస్తారు. కానీ నానో విషయంలో సేఫ్ గా భావించలేము. అలాంటి కారు ఎప్పటికీ విజయవంతం కాలేదు. నానో ఫెయిల్ అవడానికి ఇది ఒక కారణం. అయితే ఈ కార్ తయారీ వెనుక ఉన్న బలమైన ఉద్దేశ్యం ద్విచక్రవాహనం పై నలుగురు, కారులో అయితే ఎండ తగలకుండా, వర్షంలోను ఇబ్బంది పడకుండా ప్రయాణం చేయాలనుకున్నారు. అనుకున్నట్టుగానే రతన్ టాటా కారు తయారు చేయించి, మార్కెట్ లోకి విడుదల కూడా చేశారు. అయితే ఆ ఉద్దేశ్యాన్నిమార్కెటింగ్ టీమ్ ప్రజలలోకి సరైన విధంగా తీసుకెళ్ళలేకపోయింది.
మార్కెటింగ్ టీమ్ నానో కారును కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహిస్తే సరిపోతుందని భావించి చిపెస్ట్ కారుగా మార్కెట్లోకి తెచ్చారు. ఈ వ్యూహం కారణంగా దీర్ఘకాలంలో ఈ కారు ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే ప్రజలు పేదరికానికి చిహ్నంగా ఈ కారును పరిగణించడం మొదలుపెట్టారు. ఈ ట్యాగ్ ను ఎవరు ఇష్టపడలేరు. ఈ కారు విఫలం కావడానికి కారణం ప్రమోషన్ మరియు పొజిషనింగ్ అని చెప్పవచ్చు.
టాటా మోటార్స్ ఏడాదికి 2,50,000 నానో కార్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది, అయితే ప్రారంభ అమ్మకాలు 30,000 (సుమారుగా) మాత్రమే. 2011-12లో అత్యధికంగా 74,527 అమ్మకాలు జరిగాయి. ఇది 2016-17లో 7,591కి పడిపోయింది. జూన్ 2018లో ప్లాంట్ 1 నానో అమ్మకం మాత్రమే జరిగింది. దీంతో ఉత్పత్తిని నిలిపివేశారు.
దహాద్ సైకో థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా లీడ్ రోల్ లో నటించింది. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ హీరోయిన్ తమన్నా బాయ్ ఫ్రెండ్ గా వైరల్ అవుతున్న విజయ్ వర్మ ఈ సిరీస్ లో విలన్ పాత్రలో నటించాడు. ఎలాంటి హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చి, సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ దహాద్ లో కథ ఏమిటి అంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉండే మండువా అనే చిన్న సిటీలో ఊహించని విధంగా యువతులు పబ్లిక్ టాయిలెట్స్ లో బలవన్మరణానికి పాల్పడి మరణిస్తుంటారు. ఇదే విధంగా 27 కేసులు రిజిస్టర్ అవుతాయి.
ఈ కేసులను ఇన్వెస్టిగేషన్ చేయడానికి వచ్చిన పోలీస్ ఆఫీసర్ అంజలి భాటి (సోనాక్షి సిన్హా)కి అదే సిటీలో ఒక కాలేజీలో లెక్చరర్ పనిచేస్తున్న వ్యక్తి (విజయ్ వర్మ) పై అనుమానం కలుగుతుంది. కానీ ఆమెకు ఎటువంటి ఆధారాలు లభించవు. ఇక ఈ కేసుల ఒక్కో చిక్కుముడిని సాల్వ్ చేస్తూ వెళ్లే క్రమంలో పోలీస్ ఆఫీసర్ అంజలి మరియు ఆమె కొలీగ్స్ కి విస్మయం కలిగించే అనేక విషయాలు తెలుస్తాయి. ఆ విషయలు ఏమిటి? చివరికి అంజలి హంతకుడిని ఎలా పట్టుకుంది అనేది కథ.
ఈ సిరీస్ ను 8 ఎపిసోడ్లతో రూపొందించారు. అయితే ట్రైలర్ లోనే విలన్ ఎవరనేది చూపించారు. విలన్ తప్పించుకునే క్రమంలో హత్యలను ఎలా చేయాలో ప్లాన్ చేసుకోవడం ఇంట్రెస్టింగ్ గా చూపించారు.
వారంలో మూడవ రోజు అయిన మంగళవారంకు అధిపతి అంగారక గ్రహం. ఈ గ్రహం భూమికి దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఆ గ్రహ ప్రభావం మంగళవారం పుట్టిన వ్యక్తుల పై ఎక్కువ ఉంటుంది. మంగళవారం పుట్టడం గొప్ప వరమని చెబుతారు. ముఖ్యంగా ఆడవాళ్లకు వరంగా చెబుతారు. పోరాట స్ఫూర్తిని, దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ రోజున పుట్టినవారు గొప్ప మేధస్సు కలిగి ఉంటారు. ఈ రోజున ఆగొప్ప వ్యక్తిత్వం కలవారు పుడతారు. గొప్ప ఆధ్యాత్మిక వేత్తలు మంగళవారం నాడు పుడుతుంటారు.
మంగళవారం జన్మించినవారు తమ గురిచి తాము ఆలోచిందడం కన్నా, ఇతరుల మేలు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. వారు బాగుండడం కన్నా చుట్టూ ఉన్నవారు బాగుండాలని కోరుకుంటారు. సహాయం చేయడంలో ముందుంటారు. దానధర్మాలు చేయడంలో ముందుంటారు. వారు సంపాదించిన దానిలో కొంత దానం చేస్తుంటారు. మంగళవారం జన్మించిన వారికి ఓపిక, సహనం ఎక్కువగా ఉంటుంది. వీరికి అనతి కాలంలోనే కీర్తి ప్రతిష్టలు వస్తాయి. సంపాదించడం మొదలు పెట్టిన చిన్న వయసులోనే లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు.
మంగళవారం పుట్టిన మేష, వృచ్చిక లగ్నాల వారు అయితే దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ అడ్మినిస్ట్రేటివ్ గొప్పగా ఉంటారు. వారిలో తప్పులు వెతికినా దొరకవు. అంటే వారు ఒక్క తప్పు కూడా చేయకుండా ప్లాన్ చేసుకోగల శక్తి మంగళవారం పుట్టిన వారికి ఉంటుంది. వీరికి అన్ని రంగాల గురించి చెప్పగల జ్ఞానం కలిగి ఉంటారు. ద్వేషించేవారికి కూడా పరిష్కారం చెప్పగలరు. అయితే వీరిది పై చేయిగా ఉండే తత్వం, ఎవరైనా తక్కువగా చూస్తే బాధపడతారు. నువ్వు గొప్ప అంటే మాత్రం ఎంత కష్టమైన పని అయిన చేస్తారు.
కుటుంబంలో మంగళవారం పుట్టిన వారి మనసు బాధ పడితే ఆ కుటుంబం కూడా సర్వనాశనం అవుతుందని పండితులు చెబుతున్నారు. కుటుంబ యజమాని కానీ, భార్య కానీ మంగళవారం జన్మించిన వారైతే వారి మనస్సును బాధపెట్టకుండా, ఎంత బాగా చూసుకోగలిగితే ఆ కుటుంబం అంత వృద్దిచెందుతుంది. పది మందికి అన్నం పెట్టగల శక్తి ఆ కుటుంబానికి వస్తుంది. మంగళవారం పుట్టినవారు ముఖ్యంగా స్త్రీలు అమ్మవారి ఆరాధన చేయాలి. మంగళ వారం పుట్టిన స్త్రీలు ఎంత శాంతంగా ఉంటే ఆ కుటుంబం అంత వృద్దిలోకి వస్తుంది. అమ్మవారి శ్లోకం పఠించాలి.
ఫిల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘లీడర్’. ఈ చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించింది. అప్పటిదాకా ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్ లాంటి చిత్రాలను తీసిన శేఖర్ కమ్ముల సడెన్ గా పొలిటికల్ డ్రామాతో లీడర్ సినిమాను తీశారు. ఈ చిత్రంతో దగ్గుబాటి వారసుడు రానా హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ ఏ.వి.ఎం ప్రొడక్షన్స్ నిర్మించారు.
2010లో ఫిబ్రవరి 19న ఈ సినిమా రిలీజ్ అయ్యింది. తొలి ఆటతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ ను వచ్చాయి. కానీ తరువాత రోజుల్లో ఎక్కువగా వసూళ్లు సాదించలేకపోయింది. ఎగ్జామ్స్ సీజన్ లో ఈ సినిమా రిలీజ్ అవడంతో బ్రేక్ ఈవెన్ చేయలేక అబౌవ్ యావరేజ్ చిత్రంగా నిలిచింది. వేరే సమయంలో రిలీజ్ అయితే ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉండేది. అయినా ఈ మూవీ క్లాసిక్ గా నిలిచింది. అర్జున్ ప్రసాద్ గా రానా నటన అత్యద్భుతం. మొదటి సినిమా అనే ఫీలింగ్ ఆడియెన్స్ కి కలిగించకుండా అద్భుతంగా నటించాడు.
ఈ చిత్రంలోని పాటలను వేటూరి గారు రాశారు. ఆయన రాసిన వందేమాతరం పాటఎంతో అర్ధవంతంగా ఉంటుంది. ఈ పాటలోని “చితిలోనే సీమంతం” పదానికి అర్ధం ఏమిటని ‘రంగుల రాట్నం’ అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో చర్చ జరిగింది. అందులో భాగంగా ఇలా చెప్పుకొచ్చారు. “సాధారణంగా సీమంతం పుట్టబోయే బిడ్డ బాగుండాలని జరుపుకుంటారు. ఈ పాటలో పుట్టబోయే బిడ్డని రాబోయే తరంతో పొలుస్తున్నారని తెలిపారు. వచ్చే తరం కూడా అవినీతిలో ఉంటుందని, ఆరని రావణకాష్టంలో వచ్చే తరాలు కూడా ఆహుతు అవుతున్నాయి” అని వివరించారు.
ఒక లైలా కోసం మూవీ తరువాత పూజా హెగ్డే వెనుదిరిగి చూడాల్సి రాని విధంగా ఓ రేంజ్ లో టాలీవుడ్ లో దూసుకెళ్లింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘అలా వైకుంఠపురంలో’ మూవీతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ మూవీతో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుని టాలీవుడ్ లో బుట్ట బొమ్మగా నిలిచింది.
ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంది. అయితే వరుసగా ఫ్లాప్ లతో ఇప్పుడు ఐరన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది. ఒకప్పుడు ఆమెను సెంటిమెంట్ గా అనుకునే దర్శక నిర్మాతలు ఇప్పుడు ఆమెకు తమ సినిమాలలో ఛాన్స్ ఇవ్వడానికి వెనుకడుతున్నారు. ఇది ఇలా ఉంటే రీసెంట్ గా పూజా హెగ్డే తల్లి కూతురి పెళ్లి గురించి కొన్ని కండిషన్స్ వెల్లడించింది. మదర్స్ డే సందర్భంగా పూజా హెగ్డే తన తల్లితో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. అందులో పూజ తల్లికి కూతురికి ఎలాంటి భర్త కావాలని అనుకుంటున్నారనే ప్రశ్నను అడగడంతో ఆమె తన అభిప్రాయన్ని చెప్పింది.
ఆమె మాట్లాడుతూ “తన కుమార్తెను అన్ని విధాలుగా అర్ధం చేసుకోగల వ్యక్తి గురించి చూస్తున్నామని, పెళ్లి అనేది ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఇద్దరి మధ్య సఖ్యత ఉండాలని, అప్పుడే వారి మధ్య గౌరవం పెరుగుతుంది. అలాంటి వ్యక్తి దొరికితే పూజను ఇచ్చి పెళ్లి చేస్తామని” వెల్లడించింది.