తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పటి అందాల నటి అయిన జయలలిత గురించి టాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం చేయాల్సిన పని లేదు. ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి అప్పటి ఆడియెన్స్ అలరించింది. జయలలిత ప్రస్తుతం సినిమాలతో పాటు బుల్లితెర సీరియల్స్ లో కూడా రాణిస్తోంది.
ఇక జయలలిత సినీ కెరీర్ సజావుగా కొనసగినప్పటికి, ఆమె వ్యక్తిగత జీవితం ముళ్లబాట అని చెప్పవచ్చు. అందులోనూ వివాహ జీవితంలో ఆమె చాలా వేధింపులకు లోనయ్యింది. అయితే ఏనాడూ కూడా ఈ విషయాన్నీ జయలలిత మీడియాకి చెప్పలేదు. కానీ తొలిసారి ఈ విషయాన్ని ఆమె ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది.
కమల్ హాసన్ నటించిన ‘ఇంద్రుడు చంద్రుడు’ అనే చిత్రంతో జయలలిత ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. అప్పట్లో సహాయక పాత్రలలో, నెగెటివ్ పాత్రలలో ఆమె నటన అద్భుతంగా అని చెప్పవచ్చు. ఆమె కెరీర్ గొప్పగా ఉన్న సమయంలోనే మలయాళ దర్శకుడు వినోద్ ను ప్రేమించింది. ఇంట్లో వాళ్ళు అంగీకరించకపోవడంతో వాళ్ళను ఎదురించి దర్శకుడు వినోద్ ను వివాహం చేసుకుంది. వినోద్ తో తాను 25 చిత్రాలు చేశానని, ఒకసారి జరిగిన గొడవలో ఆయన తనను సేవ్ చేయడంతో అతనికి దగ్గర అయ్యానని తెలిపింది.
అలా 7 సంవత్సరాలు ప్రేమించుకున్నామని, హఠాత్తుగా పెళ్లి చేసుకుందామని ఫోర్స్ చేశాడు. అతని ప్రవర్తన మా ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చలేదు. దాంతో అతనితో పెళ్లి వద్దని ఇండస్ట్రీలో కూడా చాలా మంది చెప్పారు. కానీ ప్రేమ గుడ్డిది. రక్తంతో ప్రేమలేఖలు వ్రాసాడు, విషం తాగుతా అని బెదిరించి, పెళ్లికి ఒప్పించాడు. కానీ మా ఇంట్లోవాళ్ళు పెళ్లికి అంగీకరించలేదు. దాంతో వాళ్ళను ఎదురించి డైరెక్టర్ వినోద్ ని పెళ్లి చేసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు నేను సంపాదించిన ఆస్తిని నా పేరెంట్స్ పేరు మీద రాయించుకున్నారు. ఎందుకంటే వినోద్ మీద నమ్మకం లేకపోవడంతో అలా చేశారు.
అయితే పిల్లలు పుట్టిన తరువాత ఇస్తామని చెప్పారు. ఆరోజు వాళ్ళు అలా చేయడం నాకు ఉపయోగపడింది. పెళ్లి అయ్యాక ఇద్దరం 6 మాసాలు కూడా కలిసి లేము. అతను ఆస్తి కోసమే నన్ను వివాహం చేసుకున్నాడని తెలిసింది. నా ఆస్థి కోసం ఎంతగానో వేధించాడు. యాసిడ్ పోస్తానని వేధించేవాడు. అలా మేము సంవత్సరం గడవక ముందే విడిపోయాం. అప్పటి నుండి ప్రేమ కోసం చస్తాం అనేవారిని చూస్తే చిరాకు, కోపం వస్తుంటుంది. ఎందుకంటే ఆ ప్రేమే నా లైఫ్ ని నాశనం చేసిందని జయలలిత వెల్లడించింది. ఆమె చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: “ఏదో ఫ్యామిలీ సినిమా అనుకున్నాం కానీ యాక్షన్ సినిమాలాగా ఉంది ఏంటి..?” అంటూ… “మహేష్ బాబు-త్రివిక్రమ్” సినిమా రిలీజ్ డేట్ పోస్టర్‌పై 15 మీమ్స్..!

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన ‘విక్రమార్కుడు’ చిత్రంలో చిన్న క్యారెక్టర్ ఆది కూడా 5 నిమిషాలు మాత్రమే తెర మీద కనిపించే పాత్రలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నాడు. ఇక ఆ ఒక్క సినిమాలో మాత్రమే రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ కనిపించాడు. అంత మంచి నటుడు ప్రకాశ్ రాజ్ ని రాజమౌళి ఎందుకు తీసుకోరు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. ఈ విషయన్ని రాజమౌళిని ఒక సందర్భంలో అడుగగా ఇలా చెప్పుకోచ్చారు.
ప్రకాశ్ రాజ్ ఇప్పటి దాకా చేయని క్యారెక్టర్ ఏది లేదు. ఆయన ఇప్పటికే దాదాపుగా అన్ని రకాల పాత్రల్లో కనిపించారు. తన చిత్రంలో కూడా మళ్ళీ అలాంటి పాత్రలో నటిస్తే ఆడియెన్స్ కి బోర్ కొడుతుంది. అందువల్ల ఆయనను తీసుకోలేదు.ఇప్పటి దాకా ప్రకాశ్ రాజ్ చేయని క్యారెక్టర్ ఏదైనా వస్తే ఖచ్చితంగా ఆయనతో నా మూవీలో తీసుకుంటానుని రాజమౌళి వెల్లడించారు.
అయితే రాజమౌళి చూపించే ఎలివేషన్స్ లకి ప్రకాశ్ రాజ్ లాంటి నటుడు విలన్ గా చేస్తే చూడాలని చాలా మంది అనుకుంటారు. అలాగే రాజమౌళి చిత్రాల్లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ లో ప్రకాశ్ రాజ్ నటిస్తే బాగుండేదని ఆయన ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇక రాబోయే రాజమౌళి చిత్రాల్లో అయిన ప్రకాశ్ రాజ్ కి నటించే అవకాశం వస్తుందో వేచి చూడాలి.
ఆయన వంటలలో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఎన్నో అద్బుతమైన వంటకాలను తయారుచేసేవాడు. అలా ఆయన తయారు చేసిన తీపి వంటకమే మైసూర్ పాక్. ఈ మిఠాయికి ఆ పేరు ఎలా వచ్చిందంటే ఆయనను నలపాక అని పిలిచేవారు.దాంతో ఆయన పేరులోని పాక, మైసూర్ ప్యాలెస్ లో తయారుచేశారు కాబట్టి రెండు కలిపి మైసూర్ పాక్ అని పెట్టారు.ఆ పేరు అలాగే ప్రసిద్ధి చెందింది.అప్పటి మైసూర్ పాలకుడు నాలుగవ కృష్ణ రాజ వొడెయార్ మైసూర్ ప్యాలెస్ కు వచ్చే గెస్ట్ ల కోసం మైసూర్ ప్యాలెస్ లో దీన్ని ప్రత్యేకంగా తయారు చేయించేవారని చెబుతారు.
రాజుకు ఈ స్వీట్ అంటే ఎంతో ఇష్టం. దాంతో ఆయన దాని రుచిని ఆ రాజ్య ప్రజలకు కూడా రుచి చూడాలని భావించాడు. అందుకే ప్రధాన చెఫ్ మాదప్పను ప్యాలెస్ ప్రాంగణం బయట ఒక స్వీట్ షాప్ ను తెరవమని చెప్పడంట. అయితే మాదప్ప కూడా తను తయారుచేసిన మైసూర్ పాక్ రుచిని సాధారణ ప్రజలకు కూడా రుచి చూపించాలని కోరుకున్నాడు, అలా అశోకా రోడ్డులో దేశికేంద్ర స్వీట్ మార్ట్‌ను అనేదానిని ప్రారంభించాడని తెలుస్తోంది. ఆ షాప్ ఆ తరువాతఈ కాలంలో ‘గురు స్వీట్ మార్ట్’కి మారి సయ్యాజీ రావు రోడ్ కి మార్చబడింది.
అత్యుత్తమ మైసూర్ పాక్‌ను రుచి కోసం అయితే సయాజీ రావు రోడ్‌లోని గురు స్వీట్ మార్ట్ కి వెళ్ళాల్సిందే. మాదప్ప వారసులు ఈ షాప్ కి యజమానులుగా ఉన్నారు. ఈ గురు స్వీట్ మార్ట్ సుమారు 85 సంవత్సరాలుగా అసలైన వంటకాన్ని వారసత్వంగా పొందిన అన్నదమ్ములు నటరాజ్, కుమార్, శివానంద్ నడుపుతున్నారు. ఈ దుకాణంకు రోజుకు 1000కి పైన కస్టమర్లు వస్తారని సమాచారం. అందులో 40 శాతం మంది పర్యాటకులే.
Also Read:
బాలు తండ్రి హరికథా కళాకారుడు అవడంతో ఆయన సంగీతం పై ఆసక్తిని ఏర్పరుచుకున్నారు. అయితే బాలు తన తల్లీ ఇష్టం మేరకు ఇంజనీరింగ్‌లో చేరారు. అయినప్పటికీ పాటల పోటీలలో పాల్గొనేవారు. 1964లో ఆయన మొదటి అవార్డు అందుకున్నారు. అనంతరం ఇళయరాజాతో కలిసి మ్యూజిక్ బ్యాండ్ ను మొదలుపెట్టారు. అదే ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ఎస్పీ కోదండపాణి బాలసుబ్రమణ్యంకు అవకాశం ఇచ్చారు. పైన కనిపిస్తున్న ఫోటో అప్పుడు తీసినదే.
ఆ సమయంలో వారు ఒక గాన గంధర్వుడుని సంగీత ప్రపంచానికి అందిస్తున్నామని అనుకోని ఉండరేమో. పైన ఫోటోలో బాలుకి షేక్ హ్యాండ్ ఇస్తున్న వ్యక్తి అప్పటి హాస్యనటుడు పద్మనాభం. ఇక బాలుకి ఎడమ వైపు ఉన్నవ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ పి కోదండ పాణి. ఈ ఇద్దరు బాలసుబ్రమణ్యంకు తొలి అవకాశం ఇచ్చారు. పద్మనాభం ప్రొడ్యూసర్ గా మారి నిర్మించిన ‘శ్రీ శ్రీ మర్యాద రామన్న’ సినిమాలో బాలు మొదటి పాటను పాడారు.
Also Read:
దర్శకుడు వంశీ ఈ సినిమాలో హీరోగా జగపతి బాబుని తీసుకోవాలని భావించారు. అప్పటికే ఫ్యామిలీ హీరోగా పాపులర్ అయిన జగపతి బాబు దగ్గరికి వెళ్ళి స్టోరీ చెప్పారంట. కథ విన్న జగపతి బాబు కారణం ఏమిటో కానీ, ఈ సినిమాలో నటించడానికి అంగీకరించలేదు.
ఆ తరువాత వంశీ రవితేజకు కథ చెప్పి, ఒప్పించారు. హీరోయిన్ గా కళ్యాణిని తీసుకున్నారు. అలా తెరకెక్కిన సినిమా సూపర్ హిట్ గా నిలిచి, డైరెక్టర్ వంశీని తిరిగి సినిమాలు చేయడానికి ఆయనకి నమ్మకాన్ని ఇచ్చింది. వంశీ తాను రాసుకున్న కథని అలాగే స్క్రీన్ మీద చూపించి అందరి చేత ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ చిత్రం తరువాత ఆయన డైరెక్షన్ చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో మెప్పించలేదనే చెప్పవచ్చు. అలా ఆయన సినిమాలను చేయడం మెల్లిగా తగ్గించారు.
Also Read:
దాదాపు అప్పటి అగ్ర హీరోలందరికి హీరోయిన్ గా నటించి ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరావు, సీనియర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణంరాజు లాంటి అగ్ర హీరోల సరసన నటించారు. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్నసమయంలోనే పెద్ద వ్యాపావేత్తను వివాహం చేసుకుని, సెటిలయ్యారు. పెళ్లి తరువాత ఆమె మహారాణి వంటి జీవితాన్ని గడిపారు. ఆమె భర్త వేల కోట్ల ఆస్తులు సంపాదించారని, ఆమెకు అప్పట్లోనే సొంత హెలికాప్టర్ కూడా ఉండేది.
దానిని కేఆర్ విజయ భర్తే నడిపేవారట. ఆమెకి ఎక్కడ మూవీ షూటింగ్స్ ఉన్నా తన సొంత హెలికాప్టర్లోనే వెళ్ళి వచ్చేవారంట. అయితే ఆరోజుల్లో స్టార్ హీరోలకు సైతం సొంత హెలికాప్టర్ లేవు. ఇక ఆమె భర్తకు ఎన్నో రకాలు వ్యాపారాలు ఉండేవని, దాంతో మద్రాస్ దగ్గరలో 67 ఎకరాల తోట కొన్నారు. అంతేకాకుండా కేఆర్ విజయ రాజభవనం వంటి ఖరీదైన ఇంటిని నిర్మించుకున్నారట. ఆ ఇంటి పై భాగంలోహెలికాప్టర్ ఆగేదంట.
విజయ వైభోగం గురించి సినీ పరిశ్రమలో అంతా చెప్పుకునేవారంట. ఆమె ఇంటిలో స్విమ్మింగ్ పూల్ వంటి ఆధునిక వసతులు ఉండేవట. అవన్నీ చూసి అప్పట్లో అగ్ర హీరోలు ఎంతో ఆశ్చర్యపోయేవారట.కేఆర్ విజయ భర్త మరణాంతరం కుమార్తెతో కలిసి చెన్నైలో జీవిస్తోంది. అయితే ఆమె గతంలో ఒక యూట్యూబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయలన్నీటిని ఆమె స్వయంగా చెప్పింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Also Read:
సినిమా ప్రమోషన్స్ లో బాలీవుడ్ మీడియా మీ పై వస్తున్నట్రోల్స్ గురించి మీ రియాక్షన్ ఏమిటి అని అడగడంతో కీర్తి ఇలా సమాధానం ఇచ్చింది. సోషల్ మీడియాలో తన పై వచ్చే ట్రోల్స్ ను మరియు నెగిటివ్ కామెంట్స్ తాను పట్టించుకోను అని తెలిపింది. మహానటి చిత్రంలో నటించడానికి అంగీకరించినందుకు తన పై దారుణమైన ట్రోల్స్ చేశారని కీర్తి సురేశ్ చెప్పారు.
సావిత్రి క్యారెక్టర్ చేయడానికి మొదట తాను చాలా భయపడ్డానని, అందుకే ఆ సినిమాకి మొదట నో చెప్పానని అన్నారు. అయితే డైరెక్టర్ నాగ్ అశ్విన్ నువ్వు చేయగలవు అని ప్రోత్సహించడంతో ఆ మూవీ చేయగలిగానని తెలిపింది. ఈ పాత్ర చేయడం నీకే సాధ్యం అని డైరెక్టర్ చెప్పడంతో ఆయనకి అంత నమ్మకం ఉండడంతో మహానటి సినిమాలో నటించానని కీర్తి సురేష్ వెల్లడించింది. ఇక ఈ సినిమా ఆమె కెరీర్ లో మైలురాయిగా నిలిచింది. ఇంకా చెప్పాలంటే కీర్తి సురేష్ కెరీర్ మహానటి తరువాత ఒక్కసారిగా మారిపోయింది. ఆమెకు మహానటి చిత్రం అంత పాపులారిటీని తీసుకొచ్చింది.
Also Read:
ఈ విధంగా 3 వేర్వేరు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో పది మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఒకే ఒక సౌత్ హీరో మహేష్ బాబు కావడం విశేషం. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఈ రికార్డ్ మహేష్ బాబుకు మాత్రమే ఉండడంతో ఆయన అభిమానులు చాలా ఆనందిస్తున్నారు. మహేష్ 29వ సినిమా రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం పై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. మహేష్ బాబు రాజమౌళి కాంబోలో రాబోయే మూవీ వచ్చే సంవత్సరం ప్రారంభం కానుంది.
ఈ చిత్రం గురించి రోజుకో కొత్త వార్త వినిపిస్తూనే ఉంది. ఈ మూవీ కోసం మహేష్ బాబు ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవాలి అని వినిపిస్తోంది. ఈ సినిమాని జక్కన్న పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నారని సమాచారం. అంతే కాకుండా రాజమౌళి గత చిత్రాల కన్నా రెట్టింపు బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారని వినిపిస్తోంది. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు. ఆ కారణంగానే మహేష్ బాబు అరుదైన రికార్డును నమోదు చేశారని ఆయన అభిమానులు చెబుతున్నారు. రాజమౌళి మూవీతో మహేష్ బాబు 100 కోట్ల పారితోషికం తీసుకునే సెలబ్రిటీల లిస్ట్ లో చేరనున్నారు.
Also Read:
సాధారణంగా ఉగాది, దీపావళి వంటి పండుగల రోజున నూనెతో స్నానం చేయడం అనేది హిందూవులకి ఆచారంగా వస్తోంది. అయితే నూనె స్నానం ఆచరించడం వల్ల ఉపయోగం ఏమిటో? నూనె స్నానం ఉగాది రోజున ఎందుకు చేస్తారో ఇప్పుడు చూద్దాం..
ప్రతి రోజూ స్నానం చేస్తుంటాం. కానీ ఉగాది రోజున ప్రత్యేకంగా నూనెతో స్నానం చేస్తారు. నూనె చర్మానికి రాసుకుని స్నానం చేసినట్లయితే వారిలో ఆధ్యాత్మిక స్పృహ కలుగుతుందని చెప్తారు. అంతే కాకుండా తేజస్సు పెరుగుతుంది.
ప్రతికూలతను పోగొడుతుంది. నూనె స్నానం చేయడం వల్ల ఆ వ్యక్తి శరీరంలోని నెగెటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. తద్వారా సానుకూల అనుభూతిని కలుగుతుంది. నూనె రాసుకున్న తరువాత వేడి నీటితో స్నానం చేయడం ద్వారా చర్మం పై రక్షణ పొర ఏర్పడుతుందంట.
నూనె స్నానం సమయంలో, శరీరంలోకి దైవిక ప్రవాహం ఆకర్షించబడుతుందని, శరీరంలో ఆ తరంగాలు ఉత్పన్నమవుతాయని నమ్ముతారు. నూనె స్నానం వల్ల జీవశక్తి శరీరంలో పెరుగుతుంది. దాంతో మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు.
ఎందుకు ఉపవాసాలు ఉంటారు..
ఈ మాసంలో భక్తులు తమలో ఉన్న చెడు, ద్వేషాన్ని పోగొట్టుకుందుకు ప్రయత్నిస్తారు. ఖురాన్ పఠనం, అల్లా ఆరాధన, నమాజ్, చేస్తారు.ఈ నెలలో మంచి కార్యాలు, దానాలు చేసి పుణ్యం పొందేందుకు పోటీ పడతారు. తమ కోరికలకు కళ్లెం వేసి ఆత్మను శుభ్రం చేసుకుంటారు. అలా చేయడం వల్ల ఏడాది అంతా చేసిన పాపాలను అల్లా క్షమిస్తాడని నమ్ముతారు.
ఎప్పుడు ప్రారంభమయ్యాయి..
Also Read: