సాధారణంగా వేసవి సెలవుల్లో ఎక్కువగా టూర్లకు వెళ్ళడానికి సిధ్ధం అవుతుంటారు. సమ్మర్ లో వచ్చే హాలిడేస్ మరియు సమ్మర్ లో చల్లదనం ఉండే కోసం ప్రదేశాలు వెదుకుతుంటారు. అలాంటి వారు పర్యటించేందుకు కర్ణాటకలోని చల్లని అనువైన ప్రదేశాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. జోగ్ జలపాతం:
షిమోగా జిల్లాలోని జోగ్ ఫాల్స్ 488 మీటర్ల ఎత్తులో ఉండే జలపాతం ఇండియాలోనే ఎత్తైన జలపాతాలలో ఒకటి. ఇది అక్కడ దట్టమైన అడవుల మధ్యలో ఉంటుంది. అక్కడ ఎండకాలంలో కూడా జలపాతాలు ఎంతో ఆకట్టుకుంటాయి. కయాకింగ్, కొరాకిల్ రైడింగ్ దగ్గరలోని అడ్వెంచర్ క్యాంపులలో పాల్గొనే కార్యకలాపాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి.
2.మరవంతే:
ఈ ప్రదేశం చాలా సుందరమైన కొడచాద్రి కొండలకు దగ్గరగా ఉండే తీరప్రాంత గ్రామం. ఈ బీచ్ కి అరేబియా సముద్రం ఒకవైపు, సౌపర్ణికా నది మరోవైపు చక్కగా ఉంటుంది. సముద్రం, నది కలిసే ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చారు. స్థానిక వంటకాలను ఎంతో రుచికరంగా ఉంటాయి.
3.కుద్రేముఖ్
కుద్రేముఖ్ కొండ శ్రేణులు ప్రకృతిని ఆరాధించేవారికి, ట్రెక్కింగ్ చేసేవారికి అద్భుతమైన ప్రదేశం. జీవ వైవిధ్యం, పర్వతాలు, జలపాతాలతో కూడిన కుద్రేముఖ్ వేసవిలో గొప్ప విహారయాత్ర. కలసా టెంపుల్ టౌన్, కుద్రేముఖ్ నేషనల్ పార్క్, కుద్రేముఖ్ పీక్, హనుమాన్ గుండి, లక్యా డ్యామ్ తప్పక చూడవలసిన ప్రదేశాలు.
4.అగుంబే:
దక్షిణ భారతదేశపు చిరపుంజీగా ప్రసిద్ధి చెందిన అగుంబే అడవులు, జలధారలతో నిండి ఉంది. ఫోటోగ్రాఫర్లకు ఈ ప్రదేశం అద్భుతమైన సూర్యాస్తమయాలకు గమ్యస్థానంగా ప్రసిద్ధి చెందింది. కూడ్లు తీర్థ జలపాతం, బర్కానా జలపాతం, జోగిగుండి, ఒనకే అబ్బి జలపాతాలు చల్లని వాతావరణాన్ని అందిస్తాయి.
5. హొన్నెమర్దు:
అడ్వెంచర్ యాత్ర కోసం ఎదురు చూసేవారికి, హొన్నెమర్దు గమ్యస్థానం అని చెప్పవచ్చు. ఇది చిన్న గ్రామం అయినప్పటికి పర్యాటకులకు ఎన్నో వాటర్ గేమ్స్ ను అందిస్తుంది. ఈ గ్రామం శరావతి నది తీరాన ఉంది. ట్రెక్కింగ్, పక్షులను వీక్షించడం, క్యాంపింగ్ వంటివి చేయవచ్చు. ఈ గ్రామం జోగ్ జలపాతం, డబ్బే జలపాతాలకు దగ్గరలో ఉంది.
6.గోకర్ణం:
ప్రశాంతమైన ప్రదేశాలకు విహారయాత్ర వెళ్లాలనుకునే వారు కర్ణాటకలో ఉండే గోకర్ణంకు వెళ్లవచ్చు. పచ్చదనంతో నిండిన గోకర్ణం ప్రశాంతతకు మారో పేరుగా చెబుతారు. ఇది బీచ్‌లు, రిసార్ట్‌లతో కూడిన అందమైన పట్టణం. దేశంలోని అత్యంత ప్రసిద్ది చెందిన బీచ్‌లలో ఓం బీచ్ ఒకటి. ఈ ప్రదేశం హిందూ ఆధ్యాత్మిక చిహ్నంను పోలిన ఆకారంలో ఉంటుంది. పురాతన శివుడు, వినాయక దేవాలయాలు గోకర్ణంలో ఉన్నాయి.
Also Read: “స్వాతంత్రం” రాకముందు హైదరాబాద్ లో ఉన్న… “పరిస్థితులని” తెలిపే 15 ఫోటోలు..! అప్పట్లో హైదరాబాద్ ఎలా ఉండేది అంటే..?

ఈ మధ్య కాలంలో కొందరు సెలబ్రిటీలు ఎంతో ఆడంబరంగా పెళ్లి చేసుకుంటున్నారు. అయితే కొందరు రహస్యంగా, సింపుల్‌గా పెళ్లి చేసుకుంటున్నారు.పెళ్లి తరువాత ఆ ఫొటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నారు. తాజాగా తెలుగు బుల్లి తెర హీరోయిన్ ప్రియాంక నల్కారి సీక్రెట్‌గా వివాహం చేసుకుని అందరికి షాకిచ్చింది. పెళ్లి ఇక్కడ కాకుండా విదేశాల్లో చేసుకుంది. ప్రస్తుతం ప్రియాంక పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
ప్రియాంక నల్కారి తెలుగు టెలివిజన్ ఆడియెన్స్ కి సుపరిచితామే. బాలనటిగా కూడా చాలా సీరియల్స్ లో నటించింది. ఆ తర్వాత కొన్నింటిలో ముఖ్యమైన పాత్రల్లో నటించి గుర్తింపు సంపాదించుకుంది. కొన్ని టెలివిజన్ ప్రోగ్రామ్స్ కి యాంకర్‌గా చేసింది. అయితే ఆ ప్రోగ్రామ్ అంతగా క్లిక్ కాకపోవడంతో ప్రియాంకకు యాంకర్ గా గుర్తింపు రాలేదు. తెలుగులో ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ సరైన ఆఫర్స్ లేకపోవడంతో ప్రియాంక తమిళ ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడ ఆమె నటిస్తోన్న రోజా సీరియల్ తమిళంలో టాప్ రేటింగ్‌తో రన్ అవుతోంది. దాంతో అక్కడ ప్రియాంకకు పాపులారిటీ విపరీతంగా వచ్చింది.
ఈ క్రమంలో మార్చి 23న ప్రియాంక పెళ్లి చేసుకుంది. అది కూడా ప్రేమించి వ్యక్తితో ఆడంబరాలకు పోకుండా ఎంతో సింపుల్‌గా దేవాలయంలో పెళ్లి చేసుకుంది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్ కి షాకిచ్చింది. ఆ ఫొటోలను చూసిన ఆమె ఫాలోవర్లు అందరు సడెన్‌గా, సీక్రెట్‌గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని అంటూనే శుభాకాంక్షలు చెప్తున్నారు. ప్రియాంక తన ఫ్యామిలీ మెంబర్స్ కి తెలియకుండా ఈ పెళ్లి చేసుకున్నట్లు సమాచారం.
మంచు మనోజ్ షేర్ చేసిన వీడియో కొద్దిసేపటికే వైరల్ గా మారింది. ఈ వీడియోలో మంచు విష్ణును ఇద్దరు మనుషులు ఆపుతున్నారు. విష్ణు కోపంతో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. అయితే ఈ వీడియోను మనోజ్ ఫేస్ బుక్ లో షేర్ చేశారు. కానీ ఆ తరవాత ఎందుకో డిలీట్ చేశాడు. అయితే గతంలోనే వీరి మధ్య గొడవలు ఉండేవని, మనోజ్ భూమా మౌనికారెడ్డిని వివాహం చేసుకోవడం వల్ల విభేదాలు తారాస్థాయికి వెళ్లాయని తెలుగు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో మంచు మనోజ్, విష్ణు సొంత అన్నదమ్ములు కారు అనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోహన్ బాబు ఫస్ట్ వైఫ్ విద్యాదేవి పిల్లలు మంచు విష్ణు, మంచు లక్ష్మి. పిల్లలు చిన్న వయసులోనే విద్యాదేవి మరణించడంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లి నిర్మలాదేవిని రెండవ పెళ్లి చేసుకున్నారు. నిర్మలాదేవి కుమారుడే మనోజ్. ఇక మనోజ్ కు మంచు లక్ష్మీతో పాటు విష్ణుతో కూడా విభేదాలు ఉన్నాయని వినిపిస్తోంది. అయితే మనోజ్ పెళ్లిని అక్క లక్ష్మీనే దగ్గరుండి మరి తల్లిలా జరిపించారు.
Also Read:
ఉపాసన అందించిన సేవలకు ఈ ఘనత లభించినట్లుగా ఎకనామిక్ టైమ్స్ ప్రకటించింది. ఇందుకు గాను ఉపాసన కృతజ్ఞతలు చెప్తూ ట్వీట్ చేసింది. పర్సనల్ జీవితాన్ని మరియు ఫ్యామిలీ లైఫ్ ని సరిగ్గా నిర్వహిస్తున్న వారిలో ఉపాసన ఒకరని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఉపాసన తల్లి కాబోతున్న విషయం అందరికి తెలిసిందే. వీటన్నిటితో మెగా కుటుంబంలో సంతోషాలు నిండాయని అభిమానులు ఆనందపడుతున్నారు.
ఉపాసన తరచుగా సామజిక కార్యక్రమాలలో పాల్గొంటూ సమాజ సేవ కూడా చేస్తోంది. ఆమె ఇప్పుడు అపోలో ఛారిటీకి వైస్ ప్రెసిడెంట్‌గా పని చేస్తోంది. అంతే కాకుండా ఎడిటర్‌గా ‘బి పాజిటివ్’ హెల్త్ మ్యాగజైన్‌కు వ్యవహరిస్తున్నారు. ఆమె చిన్నతనం నుండే బిజినెస్ మెలకువలను నేర్చుకుంటున్నారు. ఆమె ‘యు ఎక్స్చేంజ్’ సంస్థ స్థాపించి, పాత స్కూల్ బుక్స్ ను సేకరించి, వాటిని పేదవారి పిల్లలకు అందచేసేవారు. అలాగే మురికివాడల్లో అనారోగ్యంతో ఉన్న పిల్లలకు తమ అపోలో హెల్త్ సిటీలో ఉచితంగా చికిత్స చేయించేవారు.
Also Read:
ఆ నటి పేరు వడివుక్కరసి. ఆమె కోలీవుడ్ లో పాపులర్ యాక్టర్. ఆమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు. తెలుగులో కూడా తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె తన వయసు కన్నా ఎక్కువ వయసు పాత్రలలో మెప్పించింది. వడివుక్కరసి సుమారు 350 పైగా సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.
అయితే ఆమె తొలిసారి తెలుగు ఆడియెన్స్ కి కనిపించింది అరుణాచలం సినిమాతోనే. ఈ మూవీలో వడివుక్కరసి క్యారెక్టర్ కీలకమైనది. ఈ చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్స్ ఆడియెన్స్ కి బాగా గుర్తుండిపోయాయి. ఈ మూవీలో బామ్మగా, వంగిన నడుముతో గూని ఉన్నట్టుగా కష్టపడుతూ కూడా షూటింగ్ అంతా సింగిల్ షాట్ లోనే చేసిందట.
ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసు అయినా కూడా ఆమె బామ్మ పాత్రలో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్ చూసి, రజనీకాంత్ వడివుక్కరసి గట్టిగా హత్తుకున్నారట. అంతే కాకుండా నువ్వు ఎంతో ప్రతిభ ఉన్న నటివి అని ఎంకరేజ్ చేశారంట. ఈ విషయాన్ని వడివుక్కరసి ఎప్పటికీ మర్చిపోలేను అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె రజినీకాంత్ తో శివాజీ సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది.
Also Read:
పాపులర్ జ్యువెలరీ డిజైనర్ అయిన నీతు లుల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని వసుంధర జ్యువెలర్స్ శాకుంతలం చిత్రం కోసం ప్రత్యేకంగా ఏడు నెలలు కష్టపడి ఈ బంగారు నగలను తయారు చేశారని వెల్లడించారు. శాకుంతలం చిత్రంలో హీరోయిన్ సమంత పదిహేను కిలోల బంగారు నగలను ధరించారని చెప్పారు. వాటిలో దాదాపు పద్నాలుగు రకాల నగలను సమంత వేసుకుందని దర్శకుడు గుణశేఖర్ తెలియచేశారు. దుష్యంతుడి క్యారెక్టర్ చేసిన నటుడు దేవ్ మోహన్ ధరించడానికి 8-10 కిలోల స్వర్ణాభరణాలను డిజైన్ చేయించామని తెలిపారు.
మేనక పాత్రలో నటించిన సీనియర్ హీరోయిన్ మధుబాల దాదాపు 6 కోట్లు ఖరీదు చేసే వజ్రాలతో డిజైన్ చేసిన దుస్తులు ధరించారని వెల్లడించారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న రిలీజ్ కాబోతున్న సందర్భంగా శాకుంతలం సినిమాలో శకుంతల మరియు దుష్యంతుడు ధరించిన బంగారు నగలను వసుంధర జ్యువెలర్స్ లో ప్రదర్శించారు. ఈ విధంగా శాకుంతలం చిత్రంలో 14 కోట్ల ఖరీదు చేసేటువంటి బంగారు మరియు వజ్రాభరణాలను ఉపయోగించారని డైరెక్టర్ గుణశేఖర్ వెల్లడించారు. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read:
అలా ప్రస్తుతం యంగ్ హీరో అక్కినేని అఖిల్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది అఖిల చిన్ననాటి ఫోటో. అందులో తల పై హ్యట్, చేతితో గన్ పట్టుకుని కౌబాయ్ గెటప్ లో ఉన్న చిన్నారి అఖిల్ ఫోటో నెట్టింట్లో ప్రత్యక్షమైంది. అక్కినేని ఫ్యాన్స్ ఆ ఫోటోను షేర్ చేస్తూ ఇదిగో మా ఫేవరెట్ హీరో చిన్ననాటి ఫోటో అని కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ ఫోటో 2002లో టక్కరి దొంగ సెట్ లో తీసిన ఫోటో.
మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ అనే కౌబాయ్ సినిమా చేశారు. ఆ మూవీ షూటింగ్ సమయంలో ఆకక్డికి వెళ్ళిన అఖిల్ కు కౌ బాయ్ గెటప్ వేయడం జరిగింది. ఆ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. అఖిల్ హీరోగా ఇప్పటి వరకు నాలుగు చిత్రాలు చేసినా మంచి హిట్ అయితే రాలేదు. అఖిల్ ఇప్పుఉ ఏజెంట్ సినిమా పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఈ సినిమాను ఈ ఏడాదిలైన్ విడుదల చేయాలని మూవీ యూనిట్ అనుకుంటున్నారు. ఈసారైనా అఖిల్ మంచి హిట్ రావాలని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో కోరుకుంటున్నారు.
Also Read:
ఈ మధ్యకాలంలో మధుమేహం అనేది సర్వసాధారణ విషయంగా మారింది. కొందరికి చిన్న వయసులోనే మధుమేహం వస్తోంది. ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి క్రమంగా శరీరంలోని మిగిలిన భాగాలను దెబ్బతీస్తుంది. అయితే మధుమేహం నియంత్రించుకొవడం అనేది చాలా ముఖ్యం. దీని కోసం సహజమైన పద్ధతులనుపాటించవచ్చు. నేరేడు పండు గింజల పొడి డయాబీటీస్ కంట్రోల్ చేయడంలో ప్రభావవంతంగా పని చేస్తుందని ఆయుష్ అధికారులు సూచించారు.
నేరేడు ఉపయోగాలు:
అనుకున్నదే తడవుగా ఇండియాలోని తీర్థయాత్రలకు మాత్రమే కాకుండా, వేరే దేశాలలోని తీర్థయాత్రలకు కూడా రత్నమ్మ తీసుకెళ్తూ ఆమె కోరికను నెరవేరుస్తున్నాడు. ఇక అమ్మ కోరిక నెరవేర్చడం కోసం కృష్ణకుమార్ ఇంతవరకు వివాహం కూడా చేసుకోలేదు. 2018లో తల్లిని స్కూటర్ పై తీసుకొని ప్రయాణం మొదలు పెట్టిన కృష్ణ కుమార్, ఇప్పటి దాకా రత్నమ్మ కు ఎన్నో పుణ్య క్షేత్రాలను, ప్రాంతాలను కూడా చూపించాడు.
అయితే 2020లో కరోనా కారణంగా వీరి తీర్థయాత్రలకు బ్రేక్ వచ్చింది. కరోనా తగ్గడంతో 6 నెలల నుండి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తున్నారు. కృష్ణకుమార్ అమ్మకి గైడ్ గా మారి పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ ఆమెను ఆనంద పెడుతున్నాడు. అలా ఇప్పటివరకు స్కూటర్ పై దాదాపు 66 వేల కిలోమీటర్ల వరకు ప్రయాణం చేశారు.
కర్ణాటక ఒడిశా, తమిళనాడు, ఏపీ, చత్తీస్ గడ్, అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్ మాత్రమే కాకుండా బూటాన్, నేపాల్, మయన్మార్ దేశాలలోని పుణ్య క్షేత్రాలను కూడా సందర్శించారు. తాజాగా తెలంగాణాలోని బాసర సరస్వతి పుణ్య క్షేత్రాన్ని కూడా దర్శించుకున్నారు. ఈ సందర్భంలో కృష్ణ కుమార్ మాట్లాడుతూ తన తల్లి కలను నెరవర్చడం కోసం తీసుకున్న నిర్ణయం చాలా సంతోషాన్ని కలిగించిందని తెలిపారు.
Also Read:
1594లో 4వ ఖలీఫా హజరత్, హైదర్ అలీ పేరిట ఈ నగరంను నిర్మించాడు. ఉద్యాన వనాలు, సరస్సులకు హైదరాబాద్ పేరు గాంచింది. భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందే హైదరాబాద్ అన్ని రకాల వసతులు ఉన్న రాజదాని. అప్పటికే శాసనసభా భవనం, ఉస్మానియా ఆస్పత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటి అనేక సౌకర్యాలు ఏర్పడి ఉన్నాయి.
1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినపుడు, హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారిగా, తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్ర ప్రదేశ్‌లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో విలీనం చేశారు.అల ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరబాద్ ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర రాజధానిగా మారింది. అయితే భారత దేశానికి స్వాతంత్య్రం రాక ముందు హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.అప్పటి హైదరాబాద్ యొక్క అరుదైన ఫోటోలను ఇప్పుడు చూద్దాం..
#3 హైదరాబాద్ నగరానికి ప్రవేశ వంతెన..
#4 నిజాం వ్యక్తిగత ఏనుగు
#5 మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, రాయల్ బాక్స్ నుండి (బహుశా పరేడ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్‌లో) దళాల కవాతు
#6 నిజాం గార్డ్ కట్టు
#7 నిజాం చౌమహేల ప్యాలెస్
#9 చౌమహేల ప్యాలెస్ లోపలి భాగం
#10 మక్కా మసీదు
#11 మోజమ్ జాహీ మార్కెట్‌ప్లేస్ భవనం
#12 హైదరాబాద్ రాజకుటుంబానికి చెందిన ప్యాలెస్
#13 చార్మినార్:

