శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రిలీజ్ కాబోతున్న సినిమా పెద్దకాపు-1. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్లో డైరక్టరే విలన్ పాత్రలో కనిపించడం ఓ సంచలనంగా మారింది. సినిమా మొత్తం కులరాజకీయాలతో తిరుగుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది.
వెనుకబడిన కులానికి చెందిన కుర్రాడు గ్రామంలో ఉండే వాళ్లపై ఎదురుతిరిగి పోరాటం చేస్తే ఏం అవుతుందని చక్కగా ట్రైలర్లో చూపించారు.

విలన్ పాత్రలో శ్రీకాంత్ అడ్డాల నటించడానికి ఓ కారణం ఉందని ఇటీవల జరిగిన ఓ ఇంటర్వూలో శ్రీకాంత్ తెలిపాడు. విలన్ పాత్ర గురించి మొదటిగా మలయాళ నటుడు శౌబిన్ షహిర్‌ను ఫిక్స్ చేశారు. అతను కూడా విలన్ పాత్ర నటించడానికి ఒప్పుకున్నాడు. కానీ షూటింగ్ స్పాట్‌కి రాలేదు. ఆర్టిస్టులతో సెట్ అన్ని ఏర్పాటు చేశాం.
ఇంకా ఆ సమయంలో శ్రీకాంత్ అసోసియేట్ కిషోర్ వేరే యాక్టర్ ఎందుకు.. నువ్వే ఈ పాత్ర చేయవచ్చు కదా అని అన్నాడు. అయిన శ్రీకాంత్ ఒప్పుకోలేదు. కానీ కిషోర్ బలవంతం చేయగా చివరికి శ్రీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపాడు. సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

ఈ కారణాల వల్లే నటుడిగా మారాను తప్ప నాకు యాక్టింగ్ మీద ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేదని శ్రీకాంత్ తెలిపాడు. కానీ ఈ సినిమాలో బాగా విలన్ క్యారెక్టర్‌కి కూడా ప్రత్యేకత ఉంది. విలన్ క్యారక్టర్‌కి శ్రీకాంత్ అన్ని విధాలుగా సెట్ అయ్యాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో డైరక్టర్‌గా ఉండటంతో పాటు నటుడిగా కూడా బిజీగా ఉంటాడో లేదో చూడాలి.
- మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ చదవండి !



నాగ చైతన్య ఇటీవల నటించిన కస్టడీ మూవీ నిరాశపరిచింది. తరువాత తనకు ప్రేమమ్ మూవీతో హిట్ ఇచ్చిన దర్శకుడు చందూ మొండేటితో సినిమాను ప్రకటించారు. నిర్మాత
సముద్రంలో చేపల్ని వేటాడే బోట్ డ్రైవర్ పాత్రలో నాగ ఛైతన్య నటిస్తున్నారని తెలుస్తోంది. ఇది యదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని సమాచారం. 2018లో గుజరాత్ విరావల్ నుండి చేపల కోసం వేటకు వెళ్ళిన 21 మంది మత్స్యకారులను పాకిస్థాన్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్నాయి. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు జరపడంతో పాక్ చెరనుండి ఆ మత్స్యకారులు బయటబడ్డారు. ప్రస్తుతం ఆ స్టోరీని ఆధారంగా తీసుకునే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
పాక్ కోస్ట్ గార్డ్స్ అదుపులోకి తీసుకున్న మత్స్యకారుల్లో కె మత్స్యలేశంకు చెందిన మత్స్యకారుడు గణగల్ల రామరావు ఒకరు. గుజరాత్ నుండి సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళిన రామరావు పాకిస్తాన్ కోస్ట్ గార్డులకు చిక్కి, పాకిస్థాన్ లో రెండు సంవత్సరాలు జైలు జీవితాన్ని గడిపాడు. అక్కడి నుండి ఎలా బయటికి వచ్చాడు అనే కథ ఆధారంగానే చందూ మొండేటి ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్ళి, మత్స్యకారులతో మూవీ యూనిట్ చర్చించారు. ఆ ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి.
రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన కన్నడ సినిమా సప్త సాగరదాచె ఎల్లో. ఈ మూవీ అందమైన ఎమోషనల్ ప్రేమకథ అని చెప్పవచ్చు. కథ విషయానికి వస్తే, మను (రక్షిత్ శెట్టి) శేఖర్ గౌడ (అవినాష్) అనే బడా వ్యాపారవేత్త దగ్గర కారు డ్రైవర్ గా పనిచేస్తుంటాడు. మను లవర్ ప్రియ (రుక్మిణి వసంత్) గాయని కావాలని ప్రయత్నాలు చేస్తుంటుంది. ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న మను, ప్రియలు వివాహం చేసుకొని కొత్త లైఫ్ ను ప్రారంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే ప్రియకు సొంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక ఉంటుంది.
మను ఓనర్ కుమారుడి నిర్లక్ష్యపు డ్రైవింగ్ వల్ల ఒక వ్యక్తి మరణిస్తాడు. అప్పుడు శేఖర్ గౌడ పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని, త్వరగా జైలు నుంచి విడిపిస్తానని మనుకి హామీ ఇవ్వడంతో, మను యాక్సిడెంట్ తానే చేసినట్టుగా ఒప్పుకుని జైలుకు వెళతాడు. ప్రియ ఎంత వారించినా వినకుండా, వచ్చిన డబ్బుతో తమకోసం ఇల్లు కట్టుకోవచ్చని ప్రియకు చెప్పి జైలుకు వెళ్తాడు. కానీ అతను జైలుకి వెళ్ళాక బెయిల్ దొరకకపోగా, గుండెపోటుతో శేఖర్ గౌడ మరణిస్తాడు.
మను బయటికి వచ్చాడా? మనును జైలు నుంచి విడిపించడానికి ప్రియ ఏం చేసింది? జైలులో మనుపై సోమ గ్యాంగ్ పగను ఎందుకు పెంచుకుంది? అసలు మను జైలు నుండి బయటికి వచ్చాడా? లేదా అనేది మిగిలిన కథ. మూవీ జైలు నేపథ్యంలో సాగుతుంది. చేయని నేరానికి జైలుకి వెళ్ళిన యువకుడు దాని నుండి బయటపడటం కోసమే కాకుండా తన ప్రేయసిని కలవడానికి పడే బాధను దర్శకుడు హృద్యంగా తెరపై చూపించారు.
సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ వికెట్ తీసిన తరువాత పాకిస్థాన్ బౌలర్ హరీస్ రౌఫ్ ఓ రేంజ్ లో ఓవరాక్షన్ చేశాడు. అతను చేసిన ఓవరాక్షన్‌కి విరాట్ కోహ్లీ రియాక్షన్ ఇవ్వాలని ఒక్క ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులందరు కోరుకున్నారు. వారి కోరికను నేరవేర్చదానికి కింగ్ కోహ్లీనే కాకుండా భారత జట్టు అంతా మూకుమ్మడిగా పాక్ బౌలర్లకు మరియు బ్యాటర్లకు ఇచ్చిపడేసారు.
ఓపెనర్లుగా గ్రౌండ్ లోకి వచ్చిన రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఇద్దరు అర్థసెంచరీలు చేయగా, విరాట్ కోహ్లీ 122 పరుగులు చేసి నాటౌట్, కేఎల్ రాహుల్ 111 నాటౌట్ గా నిలిచి, పాక్ బౌలర్లను ఆడుకున్నారు. షాహీన్ అఫ్రిదీ,హరీస్ రౌఫ్, నసీమ్ షా, షబాద్ ఖాన్, ఫహీమ్ అశ్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్ బౌలింగ్ చేసిన ఓవర్లలో పరుగుల వర్షం కురిపించి, వన్డేల్లో పాకిస్తాన్ ఎప్పుడూ చేధించని లక్ష్యాన్ని పాక్ ముందు పెట్టారు.
పాకిస్థాన్ బ్యాటర్లకు కూడా భారత బౌలర్లు చుక్కలు చూపించారు. నేపాల్ పై 151 రన్స్ చేసిన బాబర్ అజామ్ హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పది పరుగులకే అవుట్ అయ్యాడు. ఓపెనర్ గా వచ్చిన ఫఖార్ జమాన్ చేసిన 27 రన్స్ పాకిస్థాన్ బ్యాటర్లు చేసిన అత్యధిక స్కోర్ అంటే భారత బౌలర్లు ఎలా బౌలింగ్ చేశారనేది అర్థం చేసుకోవచ్చు. కుల్దీప్ 5 వికెట్లు తీసి విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే గత మ్యాచ్ లో ఓవరాక్షన్ చేసిన పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ ను సోషల్ మీడియాలో నెటిజెన్లు మీమ్స్ తో ఆడుకుంటున్నారు.
సెప్టెంబర్ 10న చెన్నైలో నిర్వహించిన ‘మరక్కుమా నెంజమ్’ కాన్సర్ట్ లో ఏఆర్ రెహమాన్ పాల్గొన్నారు. సహజంగానే భారీగా జనాలు హాజరవుతారు. ఈ కన్సర్ట్ కూడా భారీ జనసందోహం రావడంతో తొక్కిసలాట జరిగింది. ఇందులో చాలామంది గాయపడ్డారు. మహిళలు మరియు పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారు. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో మాట్లాడుతూ, రెహమాన్ విమర్శలు చేస్తూ, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వేలకు వేలు పెట్టి, టికెట్లు కొనుగోలు చేస్తే లోపలికి కూడా వెళ్లనివ్వలేదని, తొక్కిసలాటలో ఎవరైనా మరణిస్తే ఎవరిది బాధ్యత అంటూ రెహమాన్ పై విరుచుకుపడుతున్నారు. తాజగా తన పై, కన్సర్ట్ పై వస్తోన్న విమర్శల పై రెహమాన్ స్పందించి, క్షమాపణలు చెప్పాడు. అలాగే తన కాన్సర్ట్‌కు చూడలేకపోయిన, రాలేకపోయినా వారందరి డబ్బులు తిరిగి ఇస్తామని ప్రకటించాడు. జరిగిన మిస్టేక్ ను ఎవరో ఒకరి మీద వేయాలని అనుకోవడం లేదని రెహమాన్ చెప్పారు.
కన్సర్ట్ కి 46 వేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేశారని, దానికి అనుగుణంగానే సీటింగ్ ఏర్పాటు చేశారని వెల్లడించారు. అయితే ఆ సీటింగ్ నిండిపోయిందని, ఆ తరువాత ప్రోగ్రాం ప్రారంభించామని తెలిపారు. స్టేజ్ పైన పాటలు పాడుతున్నానని, వెలుపల ఏం జరుగుతుందో తెలియలేదని అన్నారు. ఇక పై ఇటువంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తపడతానని, ముఖ్యంగా పిల్లల, మహిళల సేఫ్టీ పై మరింత దృష్టి పెడతాము అని రెహమాన్ వెల్లడించాడు.
యాంకర్ రష్మీ గౌతమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్ట్ యాంకర్ గా పాపులర్ అయిన రష్మి, పలు సినిమాలలో నటించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రష్మి, పలు సందర్భాల్లో సొసైటీ పరిస్థితుల మీద స్పందిస్తూ ఉండడం తెలిసిందే. తాజాగా పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి, హిందూ దేవుళ్లను దూషించడం ఎక్కువైందని, అలా దూషించడం తప్పని చెప్పిన మాటలను రష్మీ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. అప్పటి నుండి ఆమెను ట్రోల్ చేయడం ప్రారంభించారు.
రష్మి తన పై జరుగుతున్న ట్రోలింగ్ పై స్పందించింది. తాను ఈ పోస్ట్ చేయగానే టార్గెట్ చేస్తున్నారని, తాను తన నమ్మకాలు, ఇష్టాల గురించి చెబితే, ఎందుకు ఇలా ట్రోల్ చేస్తున్నారని, దేవుళ్లను మీరు ఎందుకు నమ్మరని అడిగానా? అంటూ ప్రశ్నించింది. తాను దేవుడ్నినమ్మితే మీరేందుకు అడుగుతున్నారు.
పాతబస్తీలో ఉండే లియాఖత్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఆదివారం రాత్రి బిర్యానీ తినడానికి పంజాగుట్ట చౌరస్తాలో ఉన్న మెరిడియన్ హోటల్‌కు వచ్చాడు. రెండు బిర్యానీలు ఆర్డర్ చేసి, తింటూ ఎక్స్ట్రా రైతా కోసం వెయిటర్‌ను అడిగారు. ఆ వెయిటర్ ఎన్నిసార్లు చెప్పినా తీసుకురాలేదు. దాంతో గట్టిగా అడిగారు. అలా అరిచినందుకు హోటల్ సిబ్బంది లియాఖత్ ను చితకబాదారు. అతని ఫ్రెండ్స్ 100కు కాల్ చేయగా, పోలీసులు వచ్చి, వారిని బయటకు తీసుకొచ్చారు. కానీ హోటల్ సిబ్బంది పోలీసుల ముందే మరోసారి లియాఖత్ మరియు అతని ఫ్రెండ్స్ పై దాడి చేశారు.
ఆ తరువాత పోలీసులు లియాఖత్‌తో పాటుగా మెరిడియన్ హోటల్ సిబ్బందిని కూడా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అయితే సిబ్బంది చేతిలో గాయపడిన లియాఖత్ ఆయాసం వస్తోందని, తనని ఆసుపత్రికి తీసుకెళ్లాలని కోరాడు. కానీ పోలీసులు పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. స్టేషన్ లో లియాఖత్ మాట్లాడుతూనే కుప్ప కూలిపోయాడు. హాస్పటల్ కి తరలించగా, అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు.
సమాచారం తెలిసిన లియాఖత్ ఫ్యామిలీ మెంబర్స్ హాస్పటల్ కు వెళ్ళి ఆందోళన చేశారు. దాడి జరిగిన వెంటనే పోలీసులు లియాఖత్ హాస్పిటల్‌కు తీసుకెళ్లకపోవడం వల్లే మరణించాడని అతని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఈ ఘటన పై హత్యనేరం కింద ఆ హోటల్ సిబ్బంది పై కేసు రిజిస్టర్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఎస్సై శివశంకర్ మరియు హెడ్ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు.



