కొందరు మూత్ర విసర్జన చేసే సమయంలో మంట, నొప్పితో బాధపడతారు. మూత్ర విసర్జన చేసే సమయంలో మంటగా అనిపించడానికి మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్) కారణం కావచ్చు. వేసవిలో మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.
Sainath Gopi
Sainath Gopi
A Mechanical Engineer turned into an Author. Have 6 years of work experience by working as Web Content Manager for various top telugu websites. Expertise in writing Human angle stories, Unknown Facts and excusive film-based content. Enthusiastic in Lyric and Story Writing.
“ఇలా చేస్తారు అనుకోలేదు..చాలా ఫీల్ అవుతున్నాము”… అంటూ ఓ ఆటోడ్రైవర్ బాధని ఇలా చెప్పుకున్నారు.!
తెలుగు పరిశ్రమలో ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ అంటే ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఆమె ఎక్స్పోజింగ్ చేయదని, సాంప్రదాయం ఉట్టి పడేలా, పక్కింటి అమ్మాయిలా ఉంటుందని ఆమెపై విపరీతమైన అభిమానం పెంచుకున్నారు ప్రేక్షకులు. ప్రేమమ్, అఆ శతమానంభవతి లాంటి చిత్రాలలో ఆమె వేసిన క్యారెక్టర్లు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఏమైందో ఏమో తెలియదు కానీ పాప తన రూటుని మార్చేసింది. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అందాలు ఆరబోస్తూ స్క్రీన్ షో చేయడం, సినిమాల్లో కూడా లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోవటం చేస్తుంది.

అయితే ఇవన్నీ చూసిన అనుపమ పరమేశ్వరన్ డై హార్ట్ ఫ్యాన్స్ కి హార్ట్ లు బ్రేక్ అవుతున్నాయి. ఇన్నాళ్ళు ఆమెని ఒక అభినవ సావిత్రి సౌందర్య లాగా ఊహించుకున్న ప్రేక్షకులు రూటు మార్చుకున్న అనుపమని చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. రౌడీ బాయ్స్ సినిమాలో లిప్ కిస్ సీన్స్ తో రెచ్చిపోయిన అనుపమ రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత అనుపమ ఫాన్స్ హృదయాలు మరింత బద్దలైపోయాయి.
సోషల్ మీడియా వేదికగా తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పలువురు అభిమానులు అనుపమ.. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటూ మెసేజ్‌లు పెడుతున్నారు. అనుపమ పరమేశ్వరన్ కి వీర అభిమాని అయిన ఒక ఆటో డ్రైవర్ తన ఆవేదన ఈ విధంగా వ్యక్తం చేశాడు. అనుపమ గారు నా ఆటోలో మీ ఫోటో ఎందుకు పెట్టుకున్నానో తెలుసా.. ఒకప్పుడు మీరు నటించిన పాత్రలు అలాంటివి. అఆ సినిమాలో మీరు చేసిన పాత్ర ఎలాంటిదో గుర్తుందా..

శతమానం భవతి మిమ్మల్ని చూసి మరదలు అంటే ఇలానే ఉండాలి అనుకున్నాము, ఆ తర్వాత వచ్చిన ఎన్నో చిత్రాలతో మమ్మల్ని అలరించారు. మరి ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాలు ఎలాంటివి? మీ అభిమానులు మీ నుంచి రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకప్పటి సావిత్రి, సౌందర్య గారి లాగా మీరు అనుకున్నాము కానీ ఇప్పుడు మీరు రూట్ మార్చేశారు. ఇది మాకేమాత్రం నచ్చటం లేదు అని ఒక అభిమానిగా చాలా ఫీల్ అవుతున్నాను అంటూ ఒక వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయింది.
#TilluSquare ట్రైలర్ చూసి గుండె పగిలిన @anupamahere అభిమాని, తన బాధ చెప్పుకున్నాడు. pic.twitter.com/Wnc4yRB1oA
— Actual India (@ActualIndia) February 18, 2024
ఏమైనా అంటే ట్రెండ్ అంటున్నారు.? కొంతమంది అమ్మాయిలు ఇలా అవ్వడానికి తల్లితండ్రులే కారణమా..?
ఇటీవల కాలంలో సినిమాల ప్రభావం సమాజం పైన ఉంటుందనే విషయం తెలిసిందే. అందులోనూ సినిమా ప్రభావం ముఖ్యంగా యువత పైన అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆడపిల్లల మీద అయితే సినిమాల ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
సినిమా ప్రభావం అనేది అందరి మీద ఉంటుంది, మొత్తం ప్రపంచం మీద కూడా సినిమాల ప్రభావం ఉంటుంది. ఇక సినిమాల ప్రభావం అమ్మయిల పైన కూడా ఉంటుది. ముఖ్యంగా ఆడపిల్లలంటే హెయిర్ స్టైల్స్, బొట్లు, లిప్ స్టిక్స్, బట్టలు, వేషధారణ ఇలా అన్నింటి పైన సినిమాల ప్రభావం ఉంటుంది.
మరి ముఖ్యంగా అమ్మాయిల ఈమధ్యకాలంలో సినిమాలలో చూపించినట్టుగా ఇంట్లో టి షర్ట్, షార్ట్స్ ఎక్కువగా ధరిస్తున్నారు. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవారి వరకు కూడా టి షర్ట్, షార్ట్స్ వేసుకుని తిరుగుతున్నారు. ఒకప్పుడు హిందీ సినిమాలలో హీరోయిన్లు చిన్న చిన్న టి షర్ట్, షార్ట్స్ వేసుకునేవారు.
ఆ తరువాత కాలంలో తెలుగు సినిమాలలో కూడా ఈ ఫ్యాషన్ వచ్చింది. వాటిని చూసిన అమ్మాయిలు అలానే పడుకునే సమయంలో లేదా ఇంట్లో ఉన్నప్పుడు టి షర్ట్, షార్ట్స్ వేసుకుంటున్నారు. అడిగితే ట్రెండ్ కు తగ్గట్టుగా నడుస్తున్నామని అంటున్నారు. కానీ వారు వేసుకునే బట్టలు ఖచ్చితంగా సినిమా ప్రభావమే అని అన్నారు. అమ్మాయిలు ఫ్యాషన్ లో మార్పు వచ్చినపుడు, వారు యాక్సెసరిస్ ఎక్కువగా కోరుకుంటారు. వాటికోసం ఎక్కువగా ఖర్చుపెడుతూ ఉంటారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ప్రతి సినిమాని నియమ నిబంధనలు ఫాలో అవ్వకుండా చూస్తున్నారు. దాంతో యువత కూడా తమ వయసుకి మించిన సినిమాలు చూస్తున్నారు. తెలిసి తెలియని వయసులో వారు ఉంటారు కాబట్టి అందులో హీరో హీరోయిన్లు చేసే విషయాలని వారు ఫాలో అయ్యే అవకాశాలు ఉన్నాయి. అమ్మాయిలు అబ్బాయిలు అనే తేడా లేకుండా సినిమాలు చూసే ప్రతి ఒక్కరు కూడా అందులో ఉన్న లీడ్ రోల్ ఎలాంటి పనులు అయితే చేశారో అలాంటివే చేయాలి అనుకుంటారు.

ఈ మధ్యకాలంలో వచ్చే చాలా సినిమాల్లో హీరో హీరోయిన్స్ కూడా కరెక్ట్ గా ఉండరు అని చూపిస్తున్నారు. కాబట్టి ఈ ప్రభావం యువతపై పడుతుంది. వస్త్రధారణ విషయంలో కూడా కొన్ని సినిమాల్లో ఇలా చూపిస్తున్నారు. వారు ఎలాంటి ఉద్దేశంతో చూపించినా కూడా వయసు అలాంటిది కాబట్టి వీరికి తప్పుగా అర్థం అయ్యి అవి ఫాలో అవుతారు.

అందుకే అమ్మాయిలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.ఇలాంటి సమయంలో టీనేజి అమ్మాయిల ప్రవర్తనను తల్లిదండ్రులు అమ్మాయిలను గమనిస్తూ ఉండాలి. వారు ఎలాంటి సినిమాలను చూస్తున్నారు అనే విషయం పైన అవగాహన కలిగి ఉండాలి. ప్రస్తుత కాలంలో అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండడం తల్లులకు అవసరం. సినిమాలు చూసి అమ్మాయిలు అలాంటి డ్రెస్ లను వేసుకుంటున్నారు, కాబట్టి అవి అమ్మాయి తల్లిదండ్రులే దానిని మాన్పించాలి.
ఎందుకు ఇలా చేసావు జడ్డూ..? నీ క్రికెట్ కెరీర్ కోసం ఆయన కష్టపడితే.. నువ్వు మాత్రం..?
భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు రచ్చకెక్కిన విషయం తెలిసిందే. జడేజా తండ్రి అనిరుధ్ సింహ్ తన కుమారుడు జడ్డూ మరియు కోడలు రివాబా పై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.
ఆ తరువాత తండ్రి ఆరోపణలపై రవీంద్ర జడేజా కూడా ఘాటుగా స్పందించిన విషయం తెలిసిందే. ఈ విషయం పై నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. తాజాగా రవీంద్ర జడేజా చేసిన పనికి, నెటిజెన్లు జడ్డూ ఎందుకు ఇలా చేసావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రాజ్‌కోట్ టెస్టు మ్యాచ్ కు ముందు జడేజా , అతని రివాబా పై జడేజా తండ్రి అనిరుద్ సిన్హ ఆరోపణలు చేశాడు. వివాహం అయిన తర్వాత జడేజా మారిపోయాడని అన్నారు. కోడలు రివాబా రాకతో టం ఫ్యామిలీ విఛ్చిన్నం అయ్యిందని, ప్రస్తుతం తాను, జడేజా మాట్లాడుకోవడం లేదని, ఇద్దరం వేరుగా ఉంటున్నామని వెల్లడించాడు. కనీసం మనవరాలిని కూడా ఒక్కసారి చూడనివ్వడం లేదు. తాను కష్టపడి కొడుకుని క్రికెటర్‌ను చేశానని ఆవేదన వ్యక్తం చేశాడు. జడేజా సంపాదన పై భార్య రివాబా, అత్తమామలు పెత్తనం చేస్తున్నారని ఆరోపణలు చేశారు.

అయితే తండ్రి ఆరోపణల పై రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించాడు. తన వైఫ్, బీజేపీ ఎమ్మెల్యే రివాబా పై బురద జల్లడం కోసమే ఇటువంటి పెయిడ్ ఇంటర్వ్యూలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండర్ గా జడేజా అదరగొట్టాడు. గాయం నుండి కోలుకున్న జడ్డూ సొంత మైదానం అయిన ‘రాజ్‌కోట్’ జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించి, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందాడు. తనకు వచ్చిన అవార్డును భార్య రివాబాకు అంకితమిచ్చాడు.

జడ్డూ అవార్డ్ ను అంకితం ఇచ్చి భార్య పై తన ప్రేమను మరోసారి చాటుకున్నాడని ఫ్యాన్స్ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. అయితే కొందరు నెటిజన్లు ‘‘జడ్డూ పనులు అతడి తండ్రి అనిరుధ్ సింహ్ ని ఇంకా బాధపెట్టేవిగా మరియు రెచ్చగొట్టేలా ఉన్నాయని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు జడేజా క్రికెటర్‌గా ఎదగడంలో అతని తండ్రి మరియు సోదరి ముఖ్య పాత్ర పోషించారని అతనే గతంలో చెప్పాడు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: IPL 2024 : CSK కి బ్రాండ్ అంబాసిడర్ గా ఇండియాలోనే టాప్ హీరోయిన్..! ఎవరో తెలుసా..?
దంగల్ నటి “సుహానీ భట్నాగర్” పోస్ట్ మార్టంలో బయటపడ్డ నిజాలు..! 10 రోజుల క్రితమే ఆ వ్యాధి.?
బాలీవుడ్ బాలనటి సుహానీ భట్నాగర్ మరణంతో ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. చిన్న వయసులోనే సుహానీ అరుదైన వ్యాధితో కన్నుమూసింది. ఆమె ఢిల్లీలోని ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ, తుది శ్వాస విడిచింది.
2016లో బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్’ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీని ప్రముఖ కుస్తీవీరుడు మహావీర్ సింగ్ ఫోగాట్ మరియు అతని కుమార్తెల లైఫ్ ఆధారంగా రూపొందించారు. ఈ సినిమాలో బాలనటిగా నటించిన సుహానీ భట్నాగర్ బబిత కుమారి పాత్రలో నటించి, మెప్పించింది.

సుహానీ భట్నాగర్ 19 సంవత్సరాల వయసులో కన్నుమూయడంతో బాలీవుడ్ లో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. సుహానీ భట్నాగర్ అరుదైన వ్యాధికి గురై చనిపోయినట్లు ఆమె తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకున్నారు. 2 నెలల కిందట సుహానీకి అరుదైన ‘డెర్మాటోమయోసిటిస్’ లక్షణాలు కనిపించాయని, అయితే 10 రోజుల క్రితమే ఆ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయినట్లుగా వారు తెలిపారు.

ఈ వ్యాధి లక్షణాలు కనిపించగానే సుహానీని ఫిబ్రవరి 7న ఎయిమ్స్ లో చేర్పించి, చికిత్స అందించినట్లు వెల్లడించారు. పరిస్థితి విషమించడంతో ట్రీట్మెంట్ పొందుతూ ఫిబ్రవరి 16న కన్నుమూసినట్లు చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్ లోని విషయాలను డాక్టర్లు వెల్లడించారు. సుహానీ డెర్మాటోమయోసిటిస్ అనే రేర్ ఇన్ఫ్లమేటరీ డిసీస్ తో బాధపడింది. దీనివల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోయి, లంగ్స్ ఇన్ ఫెక్షన్ కి గురైంది. దీంతో శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ప్రాణాలు విడిచిందని వివరించారు.

ఇప్పటికే సుహానీ చాలా టార్చర్ పడిందని, ఫ్యూచర్ లో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వచ్చేదని వైద్యులు తెలిపారు. ‘డెర్మాటోమయోసిటిస్’ అనేది చాలా అరుదైన వ్యాధి. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బారిన పడేవారు ఆరుగురు లేదా ఏడుగురు మాత్రమే ఉంటారని అన్నారు. అలాగే ఇది ఏ వయసులో అయినా వచ్చే అవకాశం ఉందని అన్నారు.
Also Read: షూటింగ్ పూర్తి అయినా ఇప్పటికీ విడుదల కాని 10 సినిమాలు…ఈ లిస్ట్ ఓ లుక్ వేయండి.!
మేడారం జాతరలో అది నిషిద్ధం అంటూ ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కామెంట్స్..!
తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు రేపటి నుండి ప్రారంభం కానున్నాయి. ఆసియాలోనే అత్యంత గొప్పగా జరిగే గిరిజన జాతర ఇది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో మేడారం దగ్గర జాతరకు సంబంధించిన ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి.
ఈ క్రమంలోసమ్మక్క, సారలమ్మ ప్రధాన పూజారి అయిన సిద్ధబోయిన అరుణ్ హలాల్ విషయంలో కీలకమైన కామెంట్స్ చేశారు. మేడారం జాతరలో హలాల్ నిషిద్ధం అంటూ ఆయన రిలీజ్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

మాఘ శుద్ధ పున్నమి నాడు సమ్మక్క సారలమ్మలు గద్దెలపై కొలువుదీరే సమయం కొన్ని గంటలలో అసన్నమవుతోంది. ప్రస్తుతం అన్ని మార్గాలు మేడారం వైపుకే దారి తీస్తున్నాయి. మేడారం వనం అంతా భక్తులతో నిండిపోతోంది. రేపటి నుండి మేడారం జాతర మొదలు కానుంది. ఇప్పటికే మేడారం జనంతో నిండిపోయింది. భక్త కోటి మొత్తం ఎంతగానో ఎదురు చూస్తున్న మాఘశుద్ధ శుభ ఘడియలు వచ్చేశాయి.

ఆదివాసీల ఆచార సంప్రదాయాలకు, సంస్కృతికి అద్దం పట్టేటువంటి మహా జాతరకు మేడారం అంతా ముస్తాబయింది. ఈ జాతరకు రెండు తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ రాష్ట్రాల నుండి లక్షలాది మంది తరలివస్తారు. టీఎస్ ఆర్టీసీ జాతర కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కేంద్ర రైల్వేశాఖ కూడా వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. భక్తులు జాతరలో సమ్మక్క, సారలమ్మలకు మొక్కిన మెుక్కులు చెల్లించుకుంటారు. భక్తులు ఎత్తుబెల్లం సమర్పిస్తారు.

అలాగే మేకలు, కోళ్లు వంటివాటిని అమ్మవార్లకు బలిస్తారు. అలా బలి ఇచ్చిన తరువాత అక్కడే భోజనాలు చేసి తిరుగు ప్రయాణం అవుతారు. ఈ క్రమంలో అమ్మవార్లకు బలిచ్చే మేకలు, కోళ్లను కొందరు హలాల్ చేయిస్తారు. అయితే మేడారం ప్రధాన పూజారి అయిన సిద్ధబోయిన అరుణ్ హలాల్ విషయంలో కీలక కామెంట్స్ చేశారు. “ఆదివాసీ సంప్రదాయాల్లో హలాల్ అనేది నిషిద్ధం. దయచేసి హలాల్ చేయకండి. అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి మేడారం రావొద్దు. పూజారుల మనోభావాలను, ఆదివాసీ సంప్రదాయాలను దెబ్బతీయెుద్దు” అని కోరుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు.దాంతో ఈ విషయం చర్చకు దారి తీసింది.
పాపులారిటీలో ఆ ముగ్గురు “సుమ”నే వెనక్కి నెట్టేసారుగా.? తెలుగు బుల్లితెర పై ” 5 మోస్ట్ పాపులర్ టీవీ పర్సనాలిటీస్” వీరే..!
సినిమాలలో నటించే నటీనటులకే కాకుండా బుల్లితెర పైన ఎంటర్టైన్ చేసేవారికి కూడా అభిమానులు ఉంటారు. ఇక సీరియల్స్ లో నటించేవారికి ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే అలాంటి వారిలో బెస్ట్ మాత్రం కొందరే ఉంటారు.
అయితే వాళ్ళు ఎవరు అనే విషయం పై ఇటీవల ప్రముఖ సంస్థ ఆర్మాక్స్ మీడియా జనవరి 2024 కి గాను మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్ మరియు మోస్ట్ పాపులర్ ఫిక్షన్ క్యారెక్టర్స్ తెలుగు పై సర్వే నిర్వహించింది. రెండింటిలోనూ టాప్ 5 సెలెబ్స్ జాబితాను రిలీజ్ చేసింది. వారెవరో ఇప్పుడు చూద్దాం..

మోస్ట్ పాపులర్ నాన్ ఫిక్షన్ పర్సనాలిటీస్:
1. యాంకర్ ప్రదీప్:
యాంకర్ ప్రదీప్ ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ డ్యాన్స్ షోకుగాను మొదటిస్థానంలో ఉన్నాడు.

2. సుడిగాలి సుధీర్:
రెండవ స్థానంలో కమెడియన్ సుడిగాలి సుధీర్ ఉన్నాడు. ఢీ షో మరియు జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలతో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటున్నాడు.

3. హైపర్ ఆది:
మూడవ స్థానంలో హైపర్ ఆది ఉన్నాడు. ఢీ, జబర్దస్త్ మరియు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో తనదైన పంచ్ లతో పాపులర్ అయ్యాడు.

4. యాంకర్ సుమ:
నాలుగవ స్థానంలో యాంకర్ సుమ నిలిచింది. తన యాంకరింగ్ తో ప్రతి తెలుగింటికి దగ్గరైన సుమ యాంకరింగ్ ని ఇష్టపడని వారు ఉండరని చెప్పవచ్చు. క్యాష్ షోకి గాను సుమ ఈ లిస్ట్ లో నిలిచింది.

5.చమ్మక్ చంద్ర
ఐదవ స్థానంలో జబర్దస్ట్ ద్వారా ఫేమస్ అయిన కమెడియన్ చమ్మక్ చంద్ర నిలిచాడు. సినిమాల ద్వారా పరిచయం అయినా, జబర్దస్త్ కామెడీ షోతో ప్రతి తెలుగు ఇంటికీ చేరువయ్యాడు.

Also Read: రష్మి నటించిన ఈ సీరియల్ ఏంటో తెలుసా..? అందులో ఎలాంటి పాత్రలో నటించారంటే.?
షూటింగ్ పూర్తి అయినా ఇప్పటికీ విడుదల కాని 10 సినిమాలు…ఈ లిస్ట్ ఓ లుక్ వేయండి.!
ప్రతి వారం పదుల సంఖ్యలో సినిమాలు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. ఒక సినిమాను తీయడానికి దర్శకనిర్మాతలు ఎన్నో కష్టాలు పడుతారు. ఆ చిత్రాన్ని రిలీజ్ చేసి, ఆ మూవీ విజయం సాధిస్తే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది.
అయితే ఒక సినిమాను రూపొందించడం ఎంత కష్టమో, ఆ సినిమాని రిలీజ్ చేయడం మరింత కష్టం. అందువల్లే చాలా చిత్రాలు రిలీజ్ కు నోచుకోకుండా ల్యాబ్స్ లోనే పడుంటున్నాయి. ఇప్పుడంటే ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ ఒకప్పుడు అలాంటివి లేవు. తప్పనిసరిగా థియేటర్లలో విడుదల చేసుకోవాలి. కారణాలు తెలియనప్పటికి ఇప్పటీ రిలీజ్ కానీ సినిమాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

1. శాంతి నివాసం:
చిరంజీవి, మాధవి జంటగా నటించిన సినిమా శాంతి నివాసం. బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ పూర్తి అయినా రిలీజ్ కాలేదు. నిర్మాత మరణం వల్ల ఈ మూవీ రిలీజ్ ఆగిపోయింది.

2. ఇంటింటా అన్నమయ్య :
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఇంటింటా అన్నమయ్య అనే సినిమా 2013-14 లో విడుదల కావాల్సింది. కానీ ఇప్పటి వరకు విడుదలకు నోచుకోలేదు.
3. భీమ :
స్టార్ హీరో విక్రమ్, త్రిష జంటగా నటించిన భీమ మూవీ తెరకెక్కింది.ఈ చిత్రానికి లింగుస్వామి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పటివరకు విడుదల కాలేదు.
4. డీకే బోస్ :
సందీప్ కిషన్ హీరోగా, నిషా అగర్వాల్ హీరోయిన్ గా నటించిన డీకే బోస్ అనే సినిమా 2013-14 సమయంలో విడుదల కావాల్సింది. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.

5. కోతి కొమ్మచ్చి :
రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా 2020లో విడుదల కావాల్సింది. ఇప్పటికీ విడుదల కాలేదు.
6. జాదు :
7 /జి బృందావన కాలనీ మూవీతో సంచలన విజయన్ని అందుకున్న హీరో రవి కృష్ణ. ఆయన హీరోగా నటించిన సినిమా జాదు. ఇందులో తమన్నా, ఇలియానా హీరోయిన్లుగా నటించారు. 2007 లో విడుదల కావాల్సిన ఈ సినిమా తెలుగు వెర్షన్ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
7. దటీజ్ మహాలక్ష్మీ :
స్టార్ హీరోయిన్ తమన్నా లీడ్ రోల్ లో నటించిన దటీజ్ మహాలక్ష్మీ మూవీ 2019 లో రిలీజ్ కావాలి. కానీ ఇంతవరకు రిలీజ్ కాలేదు.

8. అయినా ఇష్టం నువ్వు :
సీనియర్ నటుడు నరేష్ కుమారుడు నవీన్, కీర్తి సురేష్ జంటగా నటించిన అయినా ఇష్టం నువ్వు మూవీ 2016 లో విడుదల కావాల్సింది. ఇది కీర్తి సురేష్ నటించిన తొలి మూవీ. ఈ మూవీ రిలీజ్ కాలేదు.
9. నా పేరు శివ2 :
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి, పా రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన‘మద్రాసి’సినిమాని తెలుగులో ‘నా పేరు శివ 2’ గా విడుదల చేస్తున్నట్టు 2022 మొదట్లో అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు.
10. ధృవ నక్షత్రం :
విక్రమ్,రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ధృవ నక్షత్రం మూవీ 2016 లో విడుదల కావాల్సింది. ఇంకా విడుదల కాలేదు.
Also Read: వాలెంటైన్స్ డే రోజు కాబోయే భర్తకు బ్రేకప్ చెప్పిన జబర్దస్త్ నటి…ఆ పోస్ట్ లో ఏముందంటే.?
ఇక నుండి ఈ రైళ్ళు మొదలయ్యేది చెర్లపల్లి నుండి… “చెర్లపల్లి” నుండి మొదలయ్యే ట్రైన్లు, ఆగే ట్రైన్లు..పూర్తి లిస్ట్.!
చర్లపల్లి నాలుగవ రైల్వే టెర్మినల్ స్టేషన్ గా సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. మార్చి నుండి ఈ సేవలు మొదలు కానున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ మార్చి తొలి వారంలో చర్లపల్లి టెర్మినల్ ను ప్రారంభించి, జాతికి అంకితం చేయనున్నారు.
సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి, స్టేషన్ల పై ఒత్తిడి పెరిగడంతో సౌత్ ఇండియన్ రైల్వే 221 కోట్ల రూపాయలతో చర్లపల్లి రైల్వే స్టేషన్ విస్తరణ చేపట్టింది. నిత్యం దాదాపు యాబై వేల మంది పాసింజర్లు రాకపోకలు సాగించే విధంగా చర్లపల్లి టెర్మినల్‌ను విస్తరింపచేశారు. అంతేకాకుండా సరుకు ట్రాన్స్ పోర్ట్ కు పార్శిల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేశారు.

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రతి రోజుకు 200కు పైగా రైళ్లు రాకపోకలు సాగుతుంటాయి. అయితే అక్కడ ప్రస్తుతం పునరాభివృద్ధి వర్క్ కొనసాగుతున్న క్రమంలో కొన్ని ట్రైన్స్ రాకపోకలను నియంత్రించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చర్లపల్లి టెర్మినల్ విస్తరణ పనులు పూర్తి అవడంతో మార్చి నుండి కొన్ని రైళ్లను ఈ టెర్మినల్ నుండి నడిపేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు చర్లపల్లి టెర్మినల్ నుంచి 25 ట్రైన్స్ ను నడపాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పరిమిషన్స్ ఇవ్వాలంటూ రైల్వేబోర్డుకు లెటర్ రాశారు.

ప్రస్తుతం అయితే 6 ఎక్స్ ప్రెస్ రైళ్లను చర్లపల్లి నుంచి నడిపేందుకు అనుమతులు లభించాయి. ఇంకో 12 రైళ్లను చర్లపల్లిలో ఆపడానికి అనుమతులు లభించాయి. సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ తో సహా ఇతర జోన్లకు సంబంధించిన జనరల్ మేనేజర్లకు కూడా రైల్వే బోర్డు ఆర్డర్స్ జారీ చేసింది. అలాగే ఈ మార్పుల గురించిన సమాచారం కూడా ప్రజలందరు తెలుసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ఆఫీసర్లును ఆదేశించింది. చర్లపల్లిని ఎప్పటినుంచి ఉపయోగించాలనే డిసిషన్ స్థానిక ఆఫీసర్లకే అప్పచెప్పింది.

చర్లపల్లి టెర్మినల్ నుంచి మొదలు కాబోతున్న రైళ్లు..
12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
12604 హైదరాబాద్ – ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
12589/12590 గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ – గోరఖ్ పూర్,
18045 షాలిమార్ – హైదరాబాద్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్,
18046 హైదరాబాద్ – షాలిమార్ ఈస్ట్‌కోస్టు ఎక్స్‌ప్రెస్,
చర్లపల్లిలో ఆగే రైళ్ళు..
17011/17012 హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – హైదరాబాద్ ఎక్స్‌ప్రెస్,
17201/17202 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్,
12713/123714 విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ శాతవాహన ఎక్స్‌ప్రెస్,
12757/12758 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్,
17233/17234 సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్,
12705/12706 గుంటూరు – సికింద్రాబాద్ – గుంటూరు ఎక్స్‌ప్రెస్,
YS RAJAREDDY WEDS PRIYA ATLURI: ఘనంగా “వైఎస్ షర్మిల” కొడుకు పెళ్లి…వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ఒక లుక్ వేయండి.!
వైయస్ షర్మిల, బ్రదర్ అనిల్ కుమారుడి పెళ్లి జోధ్ పూర్ లో వైభవంగా నిర్వహిస్తున్నారు. రాజస్థాన్ జోధ్ పూర్ లోని ప్యాలెస్ లో షర్మిల కుమారుడు వైయస్ రాజారెడ్డి, అట్లూరి ప్రియల వివాహం వేడుకలు చేపట్టారు. ఇరువురి కుటుంబ సభ్యులతోపాటు అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో రాజారెడ్డి, ప్రియ వివాహ బంధంతో ఒకటయ్యారు. 16వ తేదీన సంగీత్, మెహందీ వేడుక నిర్వహించగా 17న సాయంత్రం ఐదున్నర గంటలకు వివాహం జరిగింది.18వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి.

పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలను వైఎస్ షర్మిల సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొత్త దంపతులు షర్మిలను హత్తుకున్న ఫోటో పలువురిని ఆకర్షించింది. రాజస్థాన్ లోని వివాహం అనంతరం హైదరాబాదులో గ్రాండ్ గా రిసెప్షన్ చేయాలని ప్లాన్ చేశారు. హైదరాబాదులోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో ఈ రిసెప్షన్ కు నిర్ణయించారు. రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు విందుకు హాజరుకానున్నారు.

ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్న తర్వాతే రాజకీయ కార్యకలాపాలలో షర్మిల పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వివాహ వేడుకకు సీఎం జగన్ దూరంగా ఉన్నారు. అయితే మేనల్లుడి నిశ్చితార్థం వేడుకలకు సతీ సమేతంగా హాజరైన వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఎన్నికల వేడి పెరుగుతూ ఉండటంతో జగన్ బిజీ బిజీగా గడుపుతున్నారు.సిద్ధం పేరిట సభలను నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఆయన తన మేనల్లుడు వివాహ వేడుకకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే రాజకీయ పరంగా చెల్లెలు తన మీద చేస్తున్న విమర్శలు కూడా ఒక కారణం అంటున్నారు రాజకీయ వర్గాల వారు. అయితే హైదరాబాదులోని శంషాబాద్ ఫోర్ట్ గ్రాండ్ లో నిర్వహించే రాజారెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ కు జగన్ హాజరయ్యే అవకాశం ఉంది. ఈ రిసెప్షన్ కు జగన్ హాజరైతే సరే సరి,లేదంటే అన్నాచెల్లెళ్ల మధ్య దూరం మరింత పెరిగిందని అనుకోవాలి.




