గీత గోవిందం ఆ మూవీ పేరు చెబితేనే ఓ ట్రాన్సలోకి వెళ్ళిపోతారు చాలామంది. అప్పటివరకు రౌడీ బాయ్ ఇమేజ్ లో ఉన్న విజయ్ దేవరకొండకు ఓ మంచి ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ లో పాపులర్ చేసిన మూవీ ఇది. మరోపక్క రష్మిక మందన్నా కు హీరోయిన్గా మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది ఈ మూవీ. 2018 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం విపరీతమైన స్పందన అందుకుంది.
అయితే ఈ మూవీలో హీరోయిన్గా మొదట రష్మిక అని అనుకోలేదట. మొదట ఈ క్యారెక్టర్ కి డైరెక్టర్ ఛా యిస్ మెగా కోడలు లావణ్య త్రిపాఠి. అయితే ఈ చిత్రం కాన్సెప్ట్ అంతా నచ్చినప్పటికీ.. లిప్ లాక్ సీన్స్ ఉండడంతో లావణ్య నిర్వాహమాటంగా ఈ మూవీకి నో చెప్పిందట. దీంతో ఈ మూవీ ఫైనల్ గా రష్మిక ఖాతాలు పడింది. అలా రష్మిక కు నేషనల్ క్రష్ అయ్యే ఛాన్స్ ని లావణ్య తెలియకుండానే ఇచ్చేసింది.

అందాల రాక్షసి మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లావణ్య త్రిపాఠి తన అందమైన నటనతో అందరిని ఆకట్టుకుంది. సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ ముందుకు వెళ్తున్న ఈ హీరోయిన్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో తన ప్రేమ వ్యవహారాన్ని గుట్టుగా ఉంచింది.. అందరికీ సడన్ షాక్ ఇస్తూ ఈ జంట తమ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు. ఆ తర్వాత తమ ప్రేమకు పునాది వేసిన ఇటలీలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. వరుణ్ కి బాగా కమిటెడ్ గా ఉండడంతోటే లావణ్య పెళ్లికి ముందు నుంచి ఏ సినిమాలో కూడా లిప్ లాక్ సీన్స్ చేయలేదు. మంచి ఆఫర్లు వచ్చినా.. బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా వదులుకోవడానికి ఆమె ఏమాత్రం వెనుకాడ లేదు. దీనికి గీతాగోవిందం మూవీ ఒక ఎగ్జాంపుల్ అంటున్నారు నెటిజన్స్.




అతడు, ఖలేజా సినిమాల తరువాత, మహేష్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా గుంటూరు కారం. ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షీ చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంక్రాంతికి రిలీజ్ కానుండటంతో, ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో రెండు పాటలు రిలీజ్ చేయగా, మొదటి పాటకు మంచి రెస్పాన్స్ రాగా, రెండవ పాట ట్రోలింగ్ బారిన పడింది.తాజాగా కుర్చీ మడతపెట్టి అనే సాంగ్ ప్రోమోను రిలీజ్ చేశారు. పూర్తి పాటను ఈ రోజు 4 గంటలకు రిలీజ్ చేయనున్నారు. ఈ సాంగ్ ప్రోమో నెట్టింట్లో వైరల్ అయ్యింది. ఈ పాట పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఈ డైలాగ్ తో పాపులర్ అయిన తాత వార్తల్లో నిలిచాడు. వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ తాత పేరు షేక్ అహ్మద్ పాషా. ఆయన మాట్లాడుతూ తన డైలాగ్ సినిమాలో వాడినందుకు తమన్ లక్షరూపాయలు ఇచ్చినట్టు తెలిపారు. మహేష్ బాబు లాంటి పెద్ద హీరో మూవీలో తన డైలాగ్ ను సాంగ్ గా వాడుకోవడం ఆనందంగా ఉందని తెలిపాడు.















