ది కాశ్మీర్ ఫైల్స్ తో గత ఏడాది సెన్సేషనల్ హిట్ సాధించిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి తాజాగా ‘ది వ్యా-క్సి-న్ వార్’ తో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో నానా పాటేకర్ లీడ్ రోల్ లో నటించారు.
కరోనా సమయంలో జరిగిన వాస్తవ పరిస్థితుల ఆధారంగా ‘ది వ్యా-క్సి-న్ వార్’ మూవీని తెరకెక్కించాడు. ఈ మూవీని ప్రభాస్ సలార్ పోటీగా ఈ మూవీ రిలీజ్ ప్రకటించారు. కానీ సలార్ రిలీజ్ వాయిదా పడింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
‘ది కాశ్మీర్ ఫైల్స్’ మూవీతో దేశవ్యాప్తంగా చర్చించుకునేలా చేసిన డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. బాలీవుడ్లో పలు చిత్రాలకు దర్శకత్వం చేసినా, రాని గుర్తింపు ఈ మూవీతో వివేక్ అగ్నిహోత్రికి వచ్చింది. తాజాగా రిలీజ్ అయిన ది వ్యా-క్సి-న్ వార్ మూవీలో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా, పల్లవి జోషి, అనుపమ్ ఖేర్, రైమా సేన్, సప్తమి గౌడ గిరిజా ఓక్ కీలక పాత్రలలో నటించారు.
ఈ మూవీ కథ విషయానికి వస్తే, ఇండియన్ కౌన్సిల్ అఫ్ మెడికల్ రీసెర్చ్ కి డైరెక్టర్ గా డాక్టర్ భార్గవ(నానా పాటేకర్) పని చేస్తుంటారు. ఆయన తన టీమ్ తో కలిసి న్యుమోనియా అరికట్టడానికి వ్యా-క్సి-న్ కనిపెట్టడానికి వర్క్ చేస్తుంటాడు. ఆ సమయంలోనే కరోనా ప్రపంచం అంతటా విరుచుకుపడుతుంది. మీడియాలో వచ్చే కరోనా వార్తలతో ప్రజలందరూ భయపడుతుంటారు.
కరోనా సోకి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారు. ఇలాంటి క్లిష్ట సమయంలో నేషనల్ వైరాలజి ఇన్స్టిట్యూట్ హెడ్ డాక్టర్ అబ్రహం (పల్లవి జోషి) కోవిడ్ కు వ్యా-క్సి-న్ కనిపెట్టేందుకు భార్గవ టీమ్ తో కలిసి వర్క్ చేయడానికి ముందుకు వస్తుంది. మగవాళ్లే భయపడి ముందుకు రాని టైమ్ లో మహిళా సైంటిస్టులు ముందుకు వస్తారు. డాక్టర్ భార్గవ, డాక్టర్ అబ్రహం టీమ్స్ వ్యా-క్సి-న్ తయారీలో ఎలా విజయం సాధించారు? ఆ క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు? అనేది మిగిలిన కథ.
Also Read: హీరో అవుతాడనుకున్న ఆ యాక్టర్ కొడుకు.. మంచానికే పరిమితం అయ్యాడు..! అసలు ఏం జరిగిందంటే..?





మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించిన సినిమా స్కంద. తాజాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. బోయపాటి మూవీ అంటేనే భారీ యాక్షన్, అదిరిపోయే మాస్ డైలాగులు, ఎమోషన్, గాలిలోకి ఎగిరే ఫైట్స్ ఉంటాయి.
ఇక ఈ మూవీ ఊరమాస్ గా తెరకెక్కించారు. లవర్ బాయ్ గుర్తింపు ఉన్న రామ్ స్కందలో ఊరమాస్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ సినిమాలో ముందుగా హీరోగా బోయపాటి రామ్ ను అనుకోలేదట. తెలుగు స్టార్ హీరోను ఊహించుకుని స్కంద కథను రాశారట. ఆ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు అని టాక్ నడుస్తోంది. స్కంద స్టోరీ మొత్తం చెప్పాక మహేష్ ఈ మూవీ చేయలేనని చెప్పారట.
ఈ స్టోరీ తనకు సెట్ అవ్వదని, సున్నితంగా రిజెక్ట్ చేసారంట. ఇంత ఊర మాస్ గా ఫ్యాన్స్ తనను చూడలేరని చెప్పారట. అలా మహేష్ బాబు స్కందను సున్నితంగా తిరస్కరించారని టాక్. మరొక టాక్ ప్రకారం బోయపాటి స్కంద రాసింది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కోసం అని, అల్లు అర్జున్ ఈ మూవీని రిజెక్ట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.
2017లో రిలీజ్ ఈ మూవీకి తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం ఉంది. బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. విజయ్ దేవరకొండకు ఈ సినిమాతో స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన మూవీలో రౌడీ హీరో యాక్టింగ్ కు, యాటిట్యూడ్‌కు యువత ఫిదా అయ్యారు.
ఈ మూవీకి ఉత్తమ తెలుగు చిత్రం మరియు ఉత్తమ తెలుగు దర్శకుడు, ఉత్తమ తెలుగు నటుడు కేటగిరీలో పలు అవార్డ్స్ వచ్చాయి. ఈ మూవీ హిందీలో కబీర్ సింగ్, తమిళంలో ఆదిత్య వర్మ, వర్మ 2 సార్లు రీమేక్ చేయబడింది. ఈ మూవీని పలు వివాదాలు కూడా చుట్టుముట్టాయి. విమర్శలు చేశారు. అయినప్పటికీ ఈ మూవీ సంచలన విజయాన్ని సాధించింది.
అయితే ఈ మూవీ సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో షికారు చేస్తోంది. మినీ_.బస్ అనే ఇన్ స్టా ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు. అందులో విజయ్ దేవరకొండ షాప్ లో ఒక బ్యాట్ ను కొని, షాలిని పాండేతో బైక్ పై కాలేజీకి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక, బ్యాట్ పక్కన పడేసి అమిత్ ని చెయ్యితో కొడ్తాడు.
ఒక సాధారణ అమ్మాయిని కూడా స్టార్ సెలబ్రిటీగా చేయగల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని చెప్పవచ్చు. సినిమాలలో నటించడం వల్ల అమ్మాయిలు సెలబ్రిటీలుగా మారతారు. అయితే రామ్ గోపాల్ వర్మ దృష్టిలో పడిన అమ్మాయి నటించ ముందే సెలబ్రిటీగా మారుతుంది. ఇప్పటికే అలా సెలబ్రిటీ అయినవారు ఉన్నారు. అయితే తాజాగా ఒక అమ్మాయి ఆర్జీవి దృష్టిలో పడింది.
తాజాగా ఆ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్ ఐడీని తెలుసుకున్న వర్మ ఫ్యాన్స్ కు పరిచయం చేశాడు. ఆ అమ్మాయి పేరు శ్రీలక్ష్మీ సతీష్. ఆమె ఇన్స్టాగ్రామ్ ఐడీని పోస్ట్ చేస్తూ “ఇంత వరకు చాలా మంది చీరలోని అందం గురించి చెప్పారు. కానీ నేను ఈ వీడియో చూసే వరకు నేను ఎప్పుడూ నమ్మలేదు, కానీ ఆమెను చూశాకా అర్థమైంది” అంటూ ఒక పోస్ట్ చేసి, ఆమె రీల్ వీడియోను కూడా షేర్ చేశాడు. అందులో శ్రీలక్ష్మీ సతీష్ తో శారీ (చీర) మూవీ తీస్తాను అంటూ ప్రకటించాడు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా అవుతోంది.
ప్రస్తుతం ఈ దర్శకుడి దృష్టి శ్రీలక్ష్మి పైనే ఉందని టాక్. శ్రీలక్ష్మీ సతీష్ కూడా సినిమా అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది. ఆమె ఇన్ స్టా ఖాతాలో రీల్ వీడియోలను చూస్తుంటే, ఆమెకు హీరోయిన్ కావాలనే కోరిక ఉన్నట్టుగా కనిపిస్తోందని అంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ఆమె గురించి ట్వీట్ చేయకముందు ఆమెకు 20 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే వర్మ ట్వీట్ చేశాక, ఆమె ఫాలోవర్లు 50 వేలకు చేరారు.
17 సంవత్సరాల క్రితం తెలుగు, తమిళ ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్న మూవీ చంద్రముఖి. ఈ మూవీ ఆ తర్వాత అనేక భాషలలో రీమేక్ అయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత చంద్రముఖి సినిమాకు సీక్వెల్ తీశారు డైరెక్టర్ పి వాసు. చంద్రముఖి 2 గా తెరకెక్కిన ఈ సీక్వెల్ లో రజినీకాంత్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించారు. ఇక రజినికాంత్ పోషించిన రాజు పాత్రలో నటుడు శత్రు నటించారు.
శత్రు స్క్రీన్ నేమ్, అసలు పేరు ఎం రామకృష్ణ. శత్రు ఒడిశాలోని బార్‌ఘర్ జిల్లాలో సర్లా గ్రామంలో 1984లో తెలుగు మాట్లాడే కుటుంబంలో ఆగస్టు 6న జన్మించారు.రావెన్షా విశ్వవిద్యాలయంలో మైక్రోబయాలజీలో డిగ్రీని చేశాడు. రామకృష్ణ నటన పై ఉన్న ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లారు. 2010లో శేఖర్ కమ్ముల తీసిన లీడర్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత పలు సినిమాలలో చిన్న, చిన్న పాత్రలలో నటించాడు. 2016లో కృష్ణ గాడి వీర ప్రేమ గాధ మూవీలో హీరోయిన్ అన్నయ్య రామరాజు పాత్రలో నటనకు మంచి గుర్తింపు వచ్చింది.
మిస్టర్, రంగస్థలం, బాహుబలి 2 లో పిండారీ గిరిజన నాయకుడుగా, అల్లు అర్జున్ హీరోగా నటించిన’పుష్ప – ది రైజ్’లో టాస్క్‌ఫోర్స్ డిఎస్పీ గోబిందప్పగా, సీతారామం మూవీలో లెఫ్టినెంట్ వికాస్ గా నటించాడు. 2022 లో వచ్చిన కొరమీను అనే మూవీలో ఐపీఎస్ ఆఫీసర్ మీసాల రాజుగా కీలక పాత్రలో నటించాడు. టాలీవుడ్ లో పలు చిత్రాలలో నటించడమే కాకుండా, తమిళంలోను కొన్ని సినిమాలలో నటించి, గుర్తింపు పొందాడు. ఆ క్రమంలోనే లేటెస్ట్ గా రిలీజ్ అయిన చంద్రముఖి 2 లో వేటయ్య రాజు పాత్రలో నటించాడు.
నాజర్ అసలు పేరు మహమ్మద్ హనీఫ్. విలక్షణ నటుడు నాజర్ గురించి, ఆయన నటన గురించి ఎంత మాట్లాడుకున్న అది తక్కువే అవుతుంది. నాజర్ తమిళనాడులో మేలేరిపాక్కంలో మెహబూబ్ బాషా,ముంతాజ్‌లకు 1958లో మార్చి 5న జన్మించాడు. ఇండస్ట్రీకి రాకముందు నాజర్ భారత వైమానిక దళంలో పనిచేశాడు. ఆ తరువాత నటనలో శిక్షణ పొందాడు. 1985లో నాజర్ నటుడిగా కెరీర్ మొదలుపెట్టారు. అప్పటి నుండి ఇప్పటివరకు తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి దాదాపు 600 పైగా సినిమాలలో నటించారు.
కెరీర్ పరంగా ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లతో అలరించిన నాజర్ కి ముగ్గురు ముగ్గురు కుమారులు. మొదటి కుమారుడు అబ్దుల్ ఫైజల్ హస్సన్, రెండో కుమారుడు లూత్ఫుద్దీన్ మరియు మూడవ కుమారుడు అబి హస్సన్. లూత్ఫుద్దీన్ కోలీవుడ్ లో యాక్టర్ గా కొనసాగుతున్నారు. ముఖ్యంగా విజయ్ దళపతి చిత్రాలలో ఎక్కువగా కనిపిస్తారు. అయితే పెద్ద అబ్బాయి ఫైజల్ 2014 లో మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఆ ప్రమాదంలో ఫైజల్ కుటుంబాన్ని పూర్తిగా మర్చిపోయాడు. అయితే అభిమాన హీరో అయిన విజయ్ దళపతి మాత్రమే అతనికి గుర్తున్నాడు.
టీవిలో విజయ్ దళపతి సినిమాలు గాని, పాటలు గాని వచ్చినపుడు ఫైజల్ సంతోషంగా డ్యాన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడట. ఎక్సయిట్మెంట్ తో విజయ్ సినిమాలు చూస్తుంటాడట. ఇటీవల జరిగిన ఫైజల్ బర్త్ డేకు విజయ్ హాజరై ఫైజల్ ను సర్ప్రైజ్ చేసాడు. నాజర్ ఫైజల్ యాక్సిడెంట్ గురి కావడానికి కొద్ది రోజుల ముందు అతను హీరోగా ఒక సినిమాకి సన్నాహాలు చేసుకున్నారు. కానీ యాక్సిడెంట్ జరగడంతో గత తొమ్మిదేళ్లుగా బెడ్ పై, వీల్ చైర్ సాయంతో కొడుకు జీవిచడం నాజర్ ని వేదనకు గురిచేస్తోంది.







‘కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ లో నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటించగా, కార్తీక దీపం ఫేమ్ నిరుపమ్ పరిటాల, సీనియర్ హీరోయిన్ గౌతమి, నరేష్, అలనాటి నటి తాళ్ళూరి రామేశ్వరి, తిరువీర్,బాబూ మోహన్, ప్రేమ్ సాగర్ కీలకపాత్రలలో నటించారు. గోమఠేష్ ఉపాధ్యాయ ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఏడు ఎపిసోడ్లతో రూపొందిన ఈ సిరీస్ కు యాక్టర్, దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాటలు, స్క్రీన్ ప్లే సమకూర్చారు.
ఇక కథ విషయానికి వస్తే, కుమారి శ్రీమతికి 30 ఏళ్లు వచ్చినా పెళ్లి చేసుకోలేదు. ఆమె తల్లి పెళ్లి చేసుకోమని చెప్తూ, ఉంటుంది. అయితే తాత ఇచ్చిన ఆస్తిని ఆమె బాబాయ్ లాగేసుకుని, శ్రీమతి ఫ్యామిలిని బయటకు తోసేస్తాడు. శ్రీమతి కోర్టు వెళ్తుంది. ఆ ఇంటిని తిరిగి పొందేవరకు తాను పెళ్లి చేసుకోనని శ్రీమతి తల్లికి చెబుతుంది. కోర్టు ఆరు నెలల లోపు 38 లక్షల రూపాయలు ఇచ్చి ఆ ఇంటిని కొనుక్కోవచ్చని తీర్పు చెబుతుంది.
అయితే శ్రీమతి జీతం నెలకు రూ.13 వేలు. ఆరునెలల్లో రూ.38 లక్షలు సంపాదించడం కోసం బాగా ఆలోచించిన శ్రీమతి ఎవరు ఊహించని నిర్ణయం తీసుకుంటుంది. బార్ పెట్టాలని నిర్ణయించుకుంటుంది. బార్ పెట్టి, ఊర్లో వాళ్ళను అందర్నీ బాగా తాగించి, 38 లక్షల రూపాయలు సంపాదించడానికి చాలా ఇబ్బందులు పడుతుంది. శ్రీమతి ఆ డబ్బును సంపాదించిందా? ఇంటిని దక్కించుకుందా? ఆఖరికి పెళ్లి చేసుకుందా? లేదా అనేది మిగిలిన కథ. ఎప్పటిలానే నిత్యా మీనన్ కుమారి శ్రీమతిగా అద్భుతంగా నటించింది.