సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం గుంటూరు కారం. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో రాధాకృష్ణ(చినబాబు) ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా తెరకెక్కిన హనుమాన్ మూవీ కూడా సంక్రాంతి రేసులో ఉంది.
అయితే ఇప్పుడు మరిన్ని సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ చేస్తున్నటుగా ప్రకటించడం టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం పై సోషల్ మీడియాలో కూడా చర్చకు దారి తీసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహేష్ గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించాయి. ఇటీవల నాగార్జున కూడా తాను నటిస్తున్న నా సామీరంగా మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా చెప్పేశారు. అలా సంక్రాంతి రేస్ లో మూడు సినిమాలు చేరాయి. నాని హీరోగా నటిస్తున్న హాయ్ నాన్న, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సైంధవ్ చిత్రాలు క్రిస్మస్ రిలీజ్ అవుతున్నట్టు ప్రకటించారు.
కానీ అనూహ్యంగా హాయ్ నాన్న,సైంధవ్ సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇవే కాకుండా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ఈగిల్, విజయ్ దేవరకొండ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తునట్లుగా ప్రకటించారు. దీంతో గుంటూరు కారం లాంటి పెద్ద సినిమా సంక్రాంతి బరిలో ఉండగా, ఇన్ని సినిమాలు ఎందుకు పోటీ పడుతున్నాయి అనేది చర్చకు దారి తీసింది. ఇలా ఎందుకు మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇలా చేయడానికి కారణం ప్రభాస్ సలార్ సినిమా అని తెలుస్తోంది.
సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 అని సంవత్సరం క్రితమే ప్రకటించింది. దాంతో చాలా సినిమాలు ఆ డేట్ కు దరిదాపుల్లో రాకుండా ప్లాన్ చేసుకున్నాయి. తీరా ఆ మూవీ విడుదల పోస్ట్ పోన్ కావడంతో షూటింగ్ పూర్తిచేసుకున్న చిత్రాలన్ని డిసెంబర్ నెలలో క్రిస్మస్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాయి. అయితే సలార్ డిసెంబర్ 22న రిలీజ్ అవుతుందని వార్తలు వస్తుండడంతో ఇప్పటికే క్రిస్మస్ కు రిలీజ్ రెడీ అయిన మీడియం బడ్జెట్ చిత్రాలు గందరగోళంలో పడ్డాయి. దాంతో సంక్రాంతికి రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
Also Read: ఇండియా నుండి ఆస్కార్ 2024 అవార్డుకి ఎంట్రీగా ఎంపిక అయ్యింది..! ఏం ఉంది ఈ సినిమాలో..?

2018 (అందరూ హీరోలే) ఈ చిత్రం ఎమోషనల్ సర్వైవల్ స్టోరీ. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2018లో కేరళ చరిత్రలోనే అత్యంత దారుణమైన వరదలు వచ్చాయి. వరదల వల్ల ప్రత్యక్షంగా బాధలు అనుభవించిన ప్రజలు, దాని బారిన పడిన వారు ఇప్పటికీ ఆ గాయాల భరిస్తున్నారు. కొందరు ప్రాణాలు, మరికొందరు ఇళ్లు, మరికొందరు జీవనోపాధి కోల్పోయారు. అయినా మానవత్వంతో అందరూ కలిసి ఈ కష్టం నుండి బయటపడ్డానికి సహాయం చేయడానికి చేతులు కలిపారు.
ఇదే విషయాన్ని దర్శకుడు జూడ్ ఆంథనీ జోసెఫ్, 2018 లో చూపించే ప్రయత్నం చేసారు. ఈ మూవీ కథ అరువిక్కుళం అనే గ్రామంలో మొదలవుతుంది. ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ చూపించి ఆర్మీని వదిలి, దుబాయ్‌కి వెళ్లి బ్రతకలనుకునే పాత్రలో టొవినో థామస్. లాల్, నారాయణ్, ఆసిఫ్‌లతో జాలర్ల కుటుంబం. ఒక గర్భిణీ స్త్రీ, అంగ వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ఒక అంధుడు ఇలా అనేక పాత్రలు ఉన్నాయి. నెమ్మదిగా, రాష్ట్రంలో వర్షాలు కురుస్తుండటం. కొన్ని గంటల్లో పరిస్థితి వర్షాలతో కేరళ రాష్రం వరదలతో ముంచెత్తడం.
ఆ క్రమంలో వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి రెస్క్యూ టీమ్ తో పాటు మత్స్యకారులు సాయం చేయడం, స్థానికులు అందించిన సహాయం, హెలికాప్టర్ రెస్క్యూ, దాదాపు ప్రతిదీ, అప్పటి పరిస్థితులను కళ్ళ ముందుకు తెస్తుంది. ఈ చిత్రంలో టోవినో థామస్, లాల్, ఆసిఫ్ అలీ, ఇంద్రన్స్, నరేన్, కుంచకో బోబన్, అపర్ణ బాలమురళి వంటి స్టార్స్ నటించారు. వారి నటన పై ప్రశంసలు కురుస్తున్నాయి.
మే 5 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మల్టీప్లెక్స్‌లలో తక్కువగా, చిన్న స్క్రీన్లలో సినిమా మొదటి షో నుండి ప్రదర్శించడం ప్రారంభమైంది. అయితే మౌత్ టాక్ తో సాయంత్రానికి మల్టీప్లెక్స్‌లు అన్నిట్లోనూ ఈ మూవీ వేశారు. టిక్కెట్లు దొరక్క తిరిగొచ్చిన వారు కూడా చాలా మంది ఉన్నారు. దీనితో కేరళ అంతటా అదనపు షోలు కూడా వేశారు.
దేశ వ్యాప్తంగా హైప్ ఉన్న చిత్రాలలో లియో ఒకటి. ఈ మూవీ కోసం విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సడెన్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కాన్సిల్ చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. అయితే లియో యూనిట్ దీనిపై వివరణ ఇస్తూ, ఈవెంట్ పాస్ లకు విపరీతమైన డిమాండ్ ఉండడం వల్ల వాటిని అందుకోలేకపోతున్నట్టు, ఆడియెన్స్ ఎక్కువగా వస్తారనే అంచనతో కంట్రోల్ చేయడం కష్టంగా అనిపిస్తోందని, అందువల్లే ఈవెంట్ ను క్యాన్సిల్ చేస్తున్నట్టు చెప్పారు.
ఫ్యాన్స్ కోరిక మేరకు అప్డేట్లు ఇస్తూనే ఉంటాం. అందరూ ఊహిస్తున్నట్టుగా మా పై ఏ పార్టీ ఒత్తిడీ లేదు. అని వివరణ ఇచ్చింది. ఈ వివరణ పై నెట్టింట్లో ట్రోల్స్ మొదలైపోయింది. ఈ రిజన్స్ ఫ్యాన్స్ కోపాన్ని చల్లార్చడం లేదు. ఈవెంట్ సడెన్ గా క్యాన్సిల్ కావడంతో పలు సందేహాలు ఉన్నాయని మండిపడుతున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు హీరో ఉదయనిధికి చెందిన రెడ్ జాయింట్ కు లియో పంపిణి రైట్స్ ఇవ్వకపోవడం వల్లే ఉద్దేశపూర్వకంగా పర్మిషన్స్ రాకుండా చేశారని టాక్. ప్రతీ మూవీలోషేర్, లేదా ప్రధానమైన ఏరియా రైట్స్ ను అడుగుతున్నారట. తమ కంపెనీకి రైట్స్ ఇవ్వని చిత్రాలను ఏదో విధంగా వేధింపులకు గురి చేస్తున్నాడని చర్చించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా హైప్ ఉన్న ‘లియో’ మూవీకి కేరళలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది.
రిలీజ్ కు ముందే కేరళ వాసులు, ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఫ్యాన్స్ ‘ లియో ‘ మూవీని బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు. దీనికి కారణం ఏమిటంటే, గతంలో వచ్చిన ‘జిల్లా’ మూవీలో విజయ్ దళపతి, మోహన్‌లాల్ కలిసి నటించారు. ఈ మూవీ రిలీజ్ అయిన తరువాత మూవీలో మోహన్‌లాల్ యాక్టింగ్ ను కొందరు విజయ్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు విజయ్ ‘లియో’ మూవీని కేరళలో రిలీజ్ చేయనివ్వమని మోహన్ లాల్ ఫ్యాన్స్ అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ ఫ్యాన్స్ కి, మోహన్ లాల్ ఫ్యాన్స్ నెట్టింట్లో వాగ్వాదానికి దిగారు.





















మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈ మూవీ ముందువరకు అగ్రెసివ్ యంగ్ హీరోగా, లవర్ బాయ్ లా కనిపించారు. కానీ ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ విశ్వక్ సేన్ కనిపిస్తాడు. ఫలక్‌నుమా దాస్, రాజా వారు రాణి గారు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన విద్యాసాగర్ చింత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన నటీ నటుల నటన ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి.
ఈ మూవీలో ఫోటోగ్రాఫర్ గా నటించిన యాక్టర్ పేరు రాజ్‌కుమార్ కసిరెడ్డి. పలు తెలుగు సినిమాలలో నటించారు. రాజ్‌కుమార్ 1992లో జనవరి 12న జన్మించారు. నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కెరీర్ 2019 లో రాజా వారు రాణి గారు మూవీతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో చౌదరి క్యారెక్టర్ లో నటించి, గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్ లో నటించారు.
ఆ తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా రాజ్‌కుమార్ బ్లడీమేరీ, రంగరంగ వైభవంగా, స్టాండప్ రాహుల్, అర్జున ఫల్గుణ, సీతా రామం, చిత్తం మహారాణి, బెదురులంక 2012, రంగబలి వంటి సినిమాలలో నటించి, అలరించారు. సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ కామెడీ నటుడు కేటగిరీలో రాజ్‌కుమార్ కసిరెడ్డి అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి నామినేట్ అయ్యారు. దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ మూవీలో కూడా నటిస్తున్నారు.
బాహుబలి సినిమా అంతర్జాతీయంగా పలు దేశాలలో సంచలన విజయాన్ని అందుకుంది. రాజమౌళి దర్శకత్వం వహించగా, నిర్మాత శోభు యార్లగడ్డ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాలో విలన్ గా రానా దగ్గుబాటి నటించారు. హీరోయిన్లుగా అనుష్క, తమన్నా నటించారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని అందుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన అన్ని భాషల్లో కూడా సెన్సేషనల్ హిట్ సాధించింది. దాదాపు 1500 కోట్ల కలెక్షన్లు వసూలు చేసి సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది.
ఈ మూవీతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యారు. ఈ మూవీకి వచ్చిన క్రేజ్ ను దృష్టిలో ఉంచుకుని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే తాజాగా మైసూర్ లోని ఒక మ్యూజియంలో ఏర్పాటు చేసిన ‘బాహుబలి’ మైనపు బొమ్మకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఈ ‘బాహుబలి’ విగ్రహంలో ప్రభాస్ పొలికలు లేకపోవడంతో ఫ్యాన్స్, నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
ట్రోలింగ్ నేపథ్యంలో ఈ విగ్రహం పై నిర్మాత శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. అందులో “ఇది అధికారికంగా లైసెన్స్ తీసుకుని చేసిన పని కాదు. మా అనుమతి లేకుండా చేశారు. దీన్ని తొలగించేందుకు వెంటనే చర్యలు తీసుకుంటాం” అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది.
ప్రస్తుత కాలంలో ఎవరు, ఎప్పుడు సెలెబ్రెటీగా మారుతారో చెప్పలేము. సోషల్ మీడియా ప్రస్తుతం పాపులర్ అవ్వడానికి ఒక మార్గంగా మారిందని చెప్పవచ్చు. ఫేమస్ అవడానికి చిన్న,పెద్ద అనే తేడా లేకుండా రకరకాల వీడియోలు తీస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఎవరికి కున్న ప్రతిభను వారు వీడియోల ద్వారా వెలుగులోకి తీసుకొస్తున్నారు. కొందరు ఫ్రెండ్స్ తో కలిసి ఫన్నీ వీడియోలు, కొందరు, వంటల వీడియోలు, పాటలు పాడినావి, డ్యాన్స్ వీడివలు పెడుతున్నారు.
కొందరు వారి వీడియోలను ట్రోల్ చేయడం వల్ల కూడా ఫేమస్ అవుతున్నారు. మరికొందరు వేరే వారు పాడుతుండగా వీడియో తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు. అలా షేర్ చేయడంతో చాలామంది పాపులర్ అవుతున్నారు. రైల్వే స్టేషన్లో పాట పాడే రాను మోండల్ పాటలు పాడుతూ జీవిస్తున్న ఆమె వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది వైరల్ గా మారడంతో ఓవర్ నైట్ లో ఫేమస్ అయ్యి, సెలబ్రిటీగా మారింది. బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హిమేష్ రేష్మియాతో కలిసి పని చేసే అవకాశం పొందింది.
తాజాగా ఒక క్లాసికల్ డ్యాన్స్ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ వీడియోలో నృత్యం చేసిన డ్యాన్సర్ అభినయానికి, డ్యాన్స్ కి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు. లెజెండ్స్_స్టూడియో అనే ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో క్లాసికల్ డ్యాన్సర్ శ్రియా హనుమంతు హవభావాలు, నృత్యం అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమె నిష్రింకలా డ్యాన్స్ అకాడమీలో క్లాసికల్ డ్యాన్స్ లో శిక్షణ పొందింది. శ్రియా హనుమంతు ఈ ఏడాది ఏప్రిల్ 30న తొలిసారి అధికారిక సోలో ప్రదర్శనను ఇచ్చారు. ఇన్ స్టాగ్రామ్ లో ఆమె నాట్యాన్ని అభినందిస్తూ నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.