సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా శివాజి. ఈ చిత్రంలో శ్రియ శరణ్ హీరోయిన్ గా నటించింది. అప్పటి దాకా దక్షిణాదిలో వచ్చిన సినిమాలన్నిటి కన్నా అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా ‘శివాజి’ రికార్డు సృష్టించింది.
2007లో జూన్ 15న రిలీజ్ అయిన ఈ మూవీ కోలీవుడ్ లో ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది, అయితే టాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీ టీవీలో టెలికాస్ట్ అయితే చూసే ప్రేక్షకులు ఉన్నారు. అంతలా తెలుగు ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది. రజినికాంత్ మేనమామగా నటించిన వివేక్ ఈ మూవీలో ఏం పని చేసేవారో ఇప్పుడు చూద్దాం..
రజినీకాంత్, శ్రియ జంటగా నటించిన మూవీ శివాజి. డైరెక్టర్ శంకర్ తెరక్కేకించిన ఈ మూవీ తమిళంతో పాటు, తెలుగులోను ఏకకాలంలో విడుదల అయ్యింది. అయితే తమిళంలో కన్నా, తెలుగులోనే సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రంలోని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. సౌత్ లో వంద కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా ‘శివాజీ’ అప్పట్లో రికార్డులు క్రియేట్ చేసింది. రజినికాంత్ లుక్సం, డైలాగ్స్, స్టైల్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ఒక ఎన్నారై భారత్ కు వచ్చి, దేశంలో దాచిపెట్టిన బ్లాక్ మనీని ఎలా బయటకు రప్పించాడు. ఆ డబ్బుతో ప్రజలకు ఎలా సాయం చేశాడనే కాన్సెప్ట్ తో ఈ మూవీని శంకర్ తెరకెక్కించారు. సందేశాత్మక కథతో రూపొందిన ఈ మూవీలో రజినికాంత్ ఒక ఎన్నారై పాత్రలో నటించారు.
రజినికాంత్ మేనమామగా పూర్తి నిడివి ఉన్న పాత్రలో వివేక్ నటించారు. అయితే ఈ మూవీని ఇప్పటికే ఎన్నోసార్లు చూసినా కానీ, వివేక్ ఏం జాబ్ చేసేవాడేనే విషయాన్ని ప్రేక్షకులు గమనించలేదు. అయితే ఈ మూవీలో వివేక్ లాయర్ గా నటించాడు. ఈ విషయం తెలిసిన నెటిజెన్లు ఇన్ని సార్లు చూసాం కాని వివేక్ ఏం చేస్తారు అనే విషయం గమనించలేదే అని కామెంట్స్ పెడుతున్నారు.
Also Read: స్కంద ట్రైలర్లో రామ్, శ్రీకాంత్ తో పాటు కనిపించిన… ఈ హీరో ఎవరో తెలుసా..?



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తూన్న మూవీ ఓజి. ఈ మూవీని దర్శకుడు సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ప్రియాంకా అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ ముఖ్యపాత్రలలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే పురస్కరించుకుని ఈ మూవీ నుండి ఈరోజు 100 సెకండ్ల నిడివి ఉన్న టీజర్ ను రిలీజ్ చేశారు. ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే రేంజ్లో ‘హంగ్రీ చీతా’ అంటూ రిలీజ్ చేసిన టీజర్ సోషల్‌మీడియాను షేక్ చేస్తోంది. ముందుగా మేకర్స్ చెప్పినట్టుగానే ఈ టీజర్ లో పవన్ కళ్యాణ్ లుక్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, వైలైన్స్ ఊహించని రేంజ్లో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి.
అర్జున్ దాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ తో ఉన్న ఈ వీడియో అంతా ఎలివేషన్లతో నిండిపోయింది. అయితే ఈ టీజర్ ఫ్లోనెస్ మధ్యలోనే ఆపేసినట్టు ఉందని, చివరి 5 సెకన్లు పర్వాలేదనిపించింది అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లైటింగ్ విజువల్స్ ఇంకా క్వాలిటీగా ఉంటే బాగుండేదని అంటున్నారు.

రాజ్ బి శెట్టి కన్నడ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ యాక్టర్ గా రాణిస్తున్నారు. ఆయన యాక్టర్ మాత్రమే కాదు దర్శకుడు మరియు రచయిత. పలు కన్నడ చిత్రాలకు దర్శకుడిగా, రచయితగా పనిచేశారు. ఈ ఏడాది టోబి అనే సినిమాలో లీడ్ రోల్ లో నటించి, మెప్పించారు. గరుడ గమన వృషభ వాహన సినిమాతో పాపులర్ అయిన రాజ్ బి శెట్టి మొదటిసారి లీడ్ క్యారెక్టర్ పోషించిన మూవీ ‘ఒందు మొట్టేయ కథె’. 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ 30 లక్షలు బడ్జెట్ తో తెరకెక్కి, రూ. 2.5 కోట్లు కలెక్షన్స్ సాధించి కమర్షియల్‌గా విజయం సాధించింది. ఉత్తమ సినిమాగా అవార్డ్ అందుకుంది.
రొమాంటిక్ కామెడీమూవీగా తెరక్కేకిన ఈ మూవీ కథ విషయానికి వస్తే, 28 ఏళ్ల జనార్ధన్( రాజ్ బి శెట్టి) వృత్తిరీత్యా కన్నడ లెక్చరర్. బట్టతల మరియు సన్నగా ఉండడంవల్ల పెళ్లి సంబంధాలనని తప్పిపోతుంటాయి. జనార్ధన్ జాతకం ప్రకారం, 29 ఏళ్లలోపు అంటే ఏడాది లోపు వివాహం కాకపోతే, అతడు సన్యాసం తీసుకోవాల్సి వస్తుందని జ్యోతిష్యుడు హెచ్చరిస్తాడు. దాంతో జనార్ధన్ లవ్ మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటాడు.
ఆ క్రమంలో సహోద్యోగి అయిన ఎకనామిక్స్ లెక్చరర్ ను లవ్ లో పడేయడానికి ట్రై చేసి ఫెయిల్ అవుతాడు.
అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల సరళ జనార్థన్ ని లవ్ చేస్తుంది. జానార్థన్‌కు నచ్చకపోయినా సరళతో ఎంగేజ్మెంట్ జరుగుతుంది. కానీ అందమైన అమ్మాయినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జనార్థన్ లావుగా ఉన్న సరళను పెళ్లి చేసుకున్నాడా? లేదంటే ఆమెతో పెళ్లి రద్దు చేసుకొని అందంగా ఉండే అమ్మాయి కోసం వెతకడం మొదలుపెడతాడా? అనేది మిగిలిన స్టోరీ.





రామ్ పోతినేని, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటిస్తూన్న మూవీ స్కంద. ఈ మూవీని బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చితాన్ని సెప్టెంబర్ 15న రిలీజ్ చేయనున్నారు. మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరు అయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
ట్రైలర్ ఆద్యంతం బోయపాటి మార్క్ మాస్ హీరోయిజం, మాస్ డైలాగ్స్ తో నిండిపోయింది. అయితే ఈట్రైలర్ లో రామ్, శ్రీకాంత్ లతో పాటుగా ఒకప్పటి హీరో కనిపించారు. ఆయన పేరు దగ్గుబాటి రాజా. హీరోగా తెలుగు మరియు తమిళ భాషలలో పలు సినిమాలలో నటించి, మెప్పించారు. దగ్గుబాటి రామానాయుడు అన్న కుమారుడే దగ్గుబాటి రాజా. అప్పట్లో దగ్గుబాటి రాజా అందమైన హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండేది.
తెలుగులో కన్నా కోలీవుడ్ లోనే ఎక్కువ సినిమాలలో నటించాడు. స్టార్ హీరో అవుతాడు అని భావించారు. కానీ రాజాకు హఠాత్తుగా సినిమాలలో అవకాశాలు తగ్గడంతో ఇండస్ట్రీని వదిలి, తమ ఫ్యామిలీ వ్యాపారం అయిన గ్రానైట్ బిజినెస్ లో కొనసాగాడు. ఆ మధ్యన వచ్చిన ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించాడు. ఇందులో ఎన్టీఆర్ తమ్ముడి పాత్రలో నటించారు. మళ్ళీ స్కంద సినిమాలో కనిపించారు.


