తెలుగు ఇండస్ట్రీలో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్న యంగ్ హీరో నాగ శౌర్య. ఊహలు గుసగుసలాడే చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాగ శౌర్య, ఆ తర్వాత వచ్చిన ఛలో మూవీతో సూపర్ హిట్ అందుకున్నాడు. అప్పటి నుంచి వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా మారాడు.
నాగ శౌర్య ప్రస్తుతం ‘రంగబలి’ అనే మూవీలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఒక అబ్బాయి అమ్మాయిని రవడూ పై ఏడిపిస్తే, అంతలా మీరు స్పందించాల్సిన పని ఏముంది. మీరు అబ్బాయిని కొట్టారా?’ అని అడిగారు. దానికి నాగశౌర్య ఏమని అన్నారో ఇప్పుడు చూద్దాం..
నాగ శౌర్య మాట్లాడుతూ ‘‘ఆ రోజు పనిమీద వెళ్తుండగా, కూకట్‌పల్లిలో రోడ్డు పైన ఓ అమ్మాయిని కొడుతున్న అబ్బాయి కనిపించాడు. దాంతో వెంటనే వారి వద్దకు వెళ్లి, ఆ అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు వెంటనే సారీ చెప్పమని అన్నాను. దానికి ఆ అమ్మాయి నా బాయ్‌ఫ్రెండ్ నన్ను కొడతాడు, చంపుతాడు. మీకెందుకు అని అడిగింది. అమ్మాయి అలా మాట్లాడితే ఏం చేస్తాం.
కానీ నేను మాత్రం ఒకటే చెబుతున్నా, వివాహం చేసుకోవాలనుకునే అమ్మాయిలు, మిమ్మల్ని కొట్టేవాడిని పెళ్లి చేసుకోవద్దు. అది మీకు మరియు మీ కుటుంబానికి కూడా మంచిది కాదు. ఇక ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ లో నేను అబ్బాయిని కొట్టలేదు. మిస్టేక్ అబ్బాయిది కాదు. అమ్మాయిదే అని అన్నారు. మరో రూమర్ కూడా వచ్చింది. పబ్లిసిటీ కోసం అదంతా నేనే చేసినట్టు కొందరు చెప్పారు. అయితే వాళ్లిద్దరూ ఎవరో నాకు తెలియదని వెల్లడించారు.
నాగ శౌర్య హీరోగా నటిస్తున్న ‘రంగబలి’ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి పవన్ బాసమ్శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో నటుడు షైన్ టామ్ చాకో విలన్ గా నటించాడు. ఈ సినిమాకి పవన్ సీహెచ్ సంగీతాన్ని అందించాడు. మురళీ శర్మ, బ్రహ్మాజీ, సప్తగిరి నటించిన ఈ సినిమా జులై 7న రిలీజ్ కానుంది.
Also Read: మొదటి సినిమా రిలీజ్… కానీ అప్పుడే..? అసలు ఏం జరిగిందంటే..?




ప్రముఖ నిర్మాత ఎస్ ఏ శ్రీనివాస్ కుమారుడు సూరజ్ కుమార్. 24ఏళ్ల సూరజ్, ధ్రువన్ గా కన్నడ ఆడియెన్స్ కి పరిచయం అయ్యారు. తారక్, ఐరావత లాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరక్టర్‌గా సూరజ్ పనిచేశారు. అతను హీరోగా చేసిన తొలి ఇనిమా త్వరలోనే విడుదలకు సిద్ధం అయ్యింది. కానీ శనివారం మైసూరు-గుండ్లుపేట్ హైవేపై బైక్‌పై సూరజ్ కుమార్ వెళ్తుండగా, ట్రాక్టర్‌ను ఓవర్టేక్ చేయడం కోసం వేగంగా వెళ్తున్న క్రమంలో కంట్రోల్ తప్పి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే సూరజ్ ను మైసూరు మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదంలో ఆయన కుడికాలు బాగా నుజ్జునుజ్జవడంతో సూరజ్ ను కాపాడటం కోసం డాక్టర్లు ఆయన కుడికాలును తొలగించారని తెలుస్తోంది. 24 సంవత్సరాల సూరజ్ కుమార్, లెజెండరీ యాక్టర్ రాజ్‌కుమార్‌కు దగ్గరి బంధువు. ఆయన భార్యకు సూరజ్ మేనల్లుడు.
యాక్సిడెంట్ జరిగిన విషయాన్ని తెలిసిన వెంటనే శాండిల్‌వుడ్ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్, మరియు ఆయన భార్య మణిపాల్ హాస్పిటల్ కు చేరుకుని సూరజ్‌ను పరామర్శించారు. సూరజ్ హెల్త్ కండిషన్ గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇక ధృవన్ ప్రస్తుతం హీరోగా ‘రథ’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీలో ధృవన్ పక్కన హీరోయిన్ గా ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తున్నారు.














పెదరాయుడు (భాగ్యరాజా) ఆయన భార్య పాపాయి, తమ నలుగురు పిల్లలతో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటాడు. ఆ ఊరిలో పెదరాయుడు చెప్పిందే వేదం. ఫ్యామిలీ జోతిష్యుడు చెప్పినట్టుగానే జాతకం ప్రకారం పెదరాయుడు భార్య చనిపోతుంది. దాంతో పెదరాయుడే తన పిల్లల బాధ్యత తీసుకుంటాడు. పిల్లలు పెరిగి, సిటీలో స్థిరపడతారు. ఆస్తి కోసం కొడుకులు, కూతురు గొడవలు పడి, ఆ ఊరికి రావడం మానేస్తారు.
ఆ ఊరిలో పెదరాయుడి బాగోగులు ఈశ్వర్ (శింబు) చూసుకుంటూ ఉంటాడు. ఇక పెదరాయుడు కోరిక ప్రకారం అతడి పిల్లలను ఈశ్వర్ ఊరికి వచ్చేలా చేస్తాడు. వారి మధ్య ఉన్న గోడవలను తీర్చడానికి ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే రత్నస్వామి పెదరాయుడు ఫ్యామిలీ పై పగపట్టి, కుటుంబం మొత్తాని హత్యమార్చాలని చూస్తుంటాడు. అలాంటి టైం లోనే జోతిష్యుడు పెదరాయుడు కుటుంబంలో ఒకరు మరణిస్తారని హెచ్చరిస్తాడు.
ఇక జోతిష్యుడు చెప్పినట్లుగా జరిగిందా? ఈశ్వర్ పెదరాయుడు ఫ్యామిలీని ఎందుకు కాపాడుతాడు? ఈశ్వర్ కి పెదరాయుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ? ఈశ్వర్ ప్రేమించిన వాసుకి (నందితా శ్వేత) కి దూరమవడానికి కారణం ఏమిటి? ఈశ్వర్ లైఫ్ లోకి వచ్చిన పూజ (నిధి అగర్వాల్)ఎవరు అన్నదే మిగతా కథ.
ఈశ్వరుడు సినిమా రొటీన్ గా వచ్చే ఫ్యామిలీ కథ. రెగ్యులర్ కుటుంబ కథకు ఓ రివేంజ్ డ్రామా, బావమరదళ్ల లవ్ స్టోరిని కలిపి దర్శకుడు సుసీంద్రన్ ఈ మూవీని తెరకెక్కించాడు. మొదటి నుంచే సినిమా ఆర్టిపీషియల్గా సాగుతుంది. లవ్ ట్రాక్ కూడా కథలో బలవంతంగా ఇరికించిన భావన కలుగుతుంది. శింబు ఈశ్వర్‌గా మాస్ పాత్రలో కొత్తగా కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో శింబు ఎక్కువగా చిత్రాలు చేయకపోవడంతో ఈశ్వర్ పాత్రలో ప్రేక్షకులకు ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. కానీ డైరెక్టర్ రొటీన్ టేకింగ్ వల్ల శింబు పడ్డ కష్టం వృథా అయ్యింది.
ఇప్పటివరకు ఎన్నో సినిమాలు రామాయణం ఆధారంగా వచ్చాయి. కానీ ఆదిపురుష్ సినిమా పై వచ్చినన్ని విమర్శలు, వివాదాలు ఏ సినిమా పై రాలేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం మొదటి షో నుండే విమర్శల పాలవుతూ వస్తోంది. ఈమూవీలోని పాత్రల వేషధారణ, హనుమంతుడి డైలాగ్స్, ముఖ్యంగా రావణుడి పాత్ర తీరు పై ఆడియెన్స్ నుండి ప్రముఖుల వరకు విమర్శించారు. కొన్ని సీన్స్ ను రామాయణానికి విరుద్ధంగా తీశారనే విమర్శలు కూడా వచ్చాయి.
దాంతో ఈ మూవీని నిలిపివేయాలని పలువురు కోర్టులో పిటిషన్స్ కూడా దాఖలయ్యాయి. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్‌ని తొలగించాలని అలహాబాద్ హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు కాగా, దానిపై ఈరోజు విచారణ జరిగింది. ఈ విచారణలో హైకోర్టు సెన్సార్ బోర్డుని తప్పు బట్టింది. మూవీని సెన్సార్‌కు పంపించిన టైంలో ఇలాంటి సంభాషణలు ఎందుకు సమర్థించారని సెన్సార్ బోర్డుని ప్రశ్నించింది.
ఇటువంటి సంభాషణలతో భవిష్యతు తరాలకు ఎటువంటి సందేశాలను ఇవ్వాలనుకుంటున్నారని మండిపడింది. ఆదిపురుష్ దర్శకుడు, నిర్మాత విచారణకు కోర్టులో హాజరుకాకపోవడం పై అలహాబాద్ హైకోర్టు అసహనం తెలిపింది. ఈ మూవీలోని కొన్ని డైలాగ్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని విమర్శలు రావడంతో మూవీ యూనిట్ ఆ డైలాగ్స్ ని తొలగించింది.



ప్రభాస్, దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్-కే. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కీలకపాత్రలో నటించబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దాంతో నెట్టింట్లో ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ మూవీలో హీరోగా ప్రభాస్ నటిస్తుండగా, కమల్ హాసన్ విలన్ గా నటించనున్నారని తెలుస్తోంది.
ఈ మూవీలో విలన్ గా నటించడానికి కమల్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారని? కమల్ చేసే క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేశారో? విలన్ గా కమల్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది అని చర్చలు జరుగుతున్నాయి. ఈ మూవీలో కమల్ ఎంట్రీ క్లైమాక్స్ లో ఉంటుందని సమాచారం. ఈ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకూ ఉత్కంఠభరితంగా ఉంటుందని టాక్. ఇక ఈ చిత్రాన్ని రెండు పార్ట్ లుగా రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.
సెకండ్ పార్టు సినిమా పై హైప్ పెంచడం కోసం మొదటి పార్ట్ క్లైమాక్స్ లో కమల్ ఎంట్రీ ఉంటుందని వినిపిస్తోంది. చెప్పాలంటే ‘విక్రమ్’ మూవీలో రోలెక్స్ పాత్రలో సూర్య ఎంట్రీ ఇచ్చినట్లుగా, కమల్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ మొదటి భాగాన్ని 2024 జనవరిలో, రెండవ భాగాన్ని 2025 జనవరిలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తోంది.