జబర్దస్త్ వేదిక నుంచి బుల్లి తెరకే కాకుండా వెండి తెరకి కూడా ఎందరో కమెడియన్స్ పరిచయం అయ్యారు. వీరిలో బాగా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్ అప్పారావు కూడ ఒకరు. అయితే జబర్దస్త్ కమెడియన్ అప్పారావు రీసెంట్గా గొప్ప గొప్ప నటులను బతికి ఉండంగానే చంపేస్తున్నారు అని యూట్యూబ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా చెప్పిన డైలాగ్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.
ఇంటర్వ్యూలో పాల్గొన్న అప్పారావు సోషల్ మీడియా గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా చాలా బలంగా ఉందని ,అందులో ఎటువంటి డౌట్ లేదని ఆయన అన్నారు. ఎందరికో మంచిని పంచుతూ తెలియని విషయాలను తెలపడానికి ఉపయోగించాల్సిన సోషల్ మీడియాని కొంతమంది అడ్డదిడ్డంగా వాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బతికి ఉండగానే కొందరు నటులు చనిపోయారు అని సోషల్ మీడియాలో చేస్తున్న ప్రచారంపై అప్పారావు తన బాధను వ్యక్తం చేశారు. ఒక మనిషిని బ్రతికి ఉండగానే చంపే అధికారం ఎవరు మీకు ఇచ్చారు అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే కానీ బతికి ఉండగానే చనిపోయారు అని నోటికి వచ్చినట్లు రాయడం ఎంతవరకు కరెక్టో మీరే చెప్పండి అని అప్పారావు అంటున్నారు.

సోషల్ మీడియా ఆయుధంగా దొరికింది కదా అని దారుణంగా కామెంట్స్ పెట్టి విపరీతంగా ట్రోల్ చేయడమే కాకుండా లేనిపోని వార్తలు రాసి యాక్టర్స్ ను తీవ్రమైన మానసిక శోభకు గురి చేయకండి అని ఈ ఇంటర్వ్యూలో ఆయన నెటిజనులకు విన్నవించుకున్నారు. పెద్దవారి అందరూ తరఫున వాస్తవాలు మాత్రమే రాయమని చనిపోక ముందే చనిపోయినట్లు రాయకండి అని అప్పారావు అందరినీ వేడుకున్నారు. యూట్యూబ్ వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది వినాలి ఎందుకంటే యూట్యూబ్ పై నేను ఒక నాటిక రాద్దామనుకుంటున్నాను…. యూట్యూబ్ నీకు ఒక దండం…అని తన బాధను వెల్లడించారు.
watch video :
ALSO READ : “సూర్యవంశం” సినిమాలో వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి గుర్తున్నాడా..? ఇప్పుడు ఎలా మారిపోయాడో చూశారా..?

ఉపాసన డెలివరీ అనంతరం చాలా త్వరగా డిశ్చార్జ్ అయ్యారు. ఉపాసన హాస్పటల్ లో ఉన్నది 3 రోజులే. అంటే ఆమె కొన్ని గంటలలోనే హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే చాలామంది పుట్టిన బిడ్డ పై ఎక్కువ ఫోకస్ పెట్టారు. కానీ, ఉపాసన తక్కువ సమయంలో ఎలా డిశ్చార్జ్ అయ్యారు అనే విషయన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. ఉపాసన అడ్మిట్ అయింది సొంత హాస్పటల్ లోనే. వారికి వేల కోట్లు ఆస్తులు, ఆమె చుట్టూ ఎందరో డాక్టర్లు ఉంటారు. కాబట్టి త్వరగా డిశ్చార్జ్ అయ్యిందని చాలామంది అనుకున్నారు.
అయితే ఉపాసన అంట త్వరగా డిశ్చార్జ్ కావడానికి కారణం ఆమె ఆహారపు అలవాట్లే అని, వాటి వల్లే ఉపాసన అంత హెల్దీగా ఉందని తెలుస్తోంది. సిజేరియన్ తరువాత ఎలాంటి వారికైనా రికవరీ కావడానికి, కుట్లు మానడానికి 10-15 రోజుల సమయం తీసుకుంటారు. అయితే ఉపాసన పాటించే ఆహారపు అలవాట్లతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంది. అందువల్లే ఆమె డెలివరీ అయిన 2 రోజుల్లోనే డిశ్చార్జ్ అయ్యిందని ప్రముఖ డాక్టర్ రఘు తేజ ఒక వీడియో ద్వారా ఉపాసన తన డైట్ గురించి గతంలో చెప్పిన విషయాలను తెలిపారు.
ఆనంద్ వర్ధన్ మూడున్నర సంవత్సరాలకే బాలరామాయణం చిత్రం ద్వారా బాలనటుడిగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రంలో ఆనంద్ వర్ధన్ వాల్మీకి మరియు బాలాంజనేయుడిగా రెండు క్యారెక్టర్లలో నటించాడు. ఆ తరువాత ప్రియరాగాలు మూవీలో బోర్ అనిపించగానే ఎవరో ఒకరి బర్త్ డే డేట్ ను ఫోన్ నెంబర్ గా డయల్ చేసి ఫోన్ ఎత్తినవారిని ఆటపట్టించే అబ్బాయిగా నటించాడు. ప్రియరాగాలు మూవీలో నటనకుగానూ ఆనంద్ వర్ధన్ నంది అవార్డు అందుకున్నాడు.
మనసంతా నువ్వే సినిమాలో చిన్నప్పటి ఉదయ్ కిరణ్ గా నటించాడు. తూనీగా తూనీగా పాటలో అలరించాడు. వెంకటేశ్ తో సూర్యవంశం, యాక్షన్ కింగ్ అర్జున్ తో శ్రీ మంజునాధ సినిమాలో బాలనటుడిగా నటించాడు. ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘నిదురించు జహాపన’. రీసెంట్ గా నిర్వహించిన మూవీ ప్రెస్ మీట్లో హీరో ఆనంద్ వర్ధన్ మాట్లాడారు.
‘బాలనటుడుగా ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులు ఇప్పుడు హీరోగా కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. సినిమాలే నాకు ప్రాణం. జీవితాంతం వరకు నటిస్తూనే ఉంటా’ అని అన్నారు. ఈ మూవీ సముద్రం నేపథ్యంలో సాగే స్టోరీ అని దర్శకుడు ప్రసన్న కుమార్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ లో అనూప్ రూబెన్స్, హీరోయిన్స్ రోషిణి, నవమి పాల్గొన్నారు.
కోరాలో “ఆదిపురుష్ సినిమా flop అవ్వడానికి ఒక్క సీన్ చెప్పండి” అని అడిగిన ప్రశ్నకు సంతోష్ కుమార్. కె అనే యూజర్ ఈ విధంగా సమాధానం ఇచ్చారు. “లాస్ట్ ఆదివారం మా అబ్బాయి, వాళ్ళ పెద నాన్న మరియు వాళ్ళ పిల్లలతో కలసి ఆదిపురుష్ సినిమాకు ఐనాక్స్ కి వెళ్లారు. మా అబ్బాయి వయస్సు 8 ఏళ్ళు. మూవీ చూసి వచ్చిన తరువాత సినిమా ఎలా ఉంది అని అడిగితే, మా అబ్బాయి ఏం బాలేదు డాడి, విలన్ హీరోయిన్ ని ఎత్తుకెళ్తాడు. హీరో వెళ్ళి విలన్ ని చంపి, హీరోయిన్ ని కాపాడుతాడు. అతనికి కోతులు, చింపాజీలు సహాయం చేస్తాయి.
మా ఆవిడ బాబుకి ఆ మూవీ రామాయణ కథ అని చెప్పడానికి ప్రయత్నిస్తే వద్దని వారించాను. వాడిని అదే ఆలోచనతో నే ఆ మూవీని చూడనీ లేదంటే అదే రామాయణం అని పొరపాటు పడే ఛాన్స్ ఉంటుందని చెప్పాను. దాదాపు అదే వయసులో ఉన్నప్పుడు మేము చూసిన రామాయణ సినిమాలు ఇప్పటికి కళ్ళ ముందు ఉన్నాయి. ఆ మూవీ చూసి వచ్చిన తరువాత మా నానమ్మను ప్రశ్నలతో విసిగించేవాళ్ళం, బాగా ఆకట్టుకున్న మూవీ మాత్రం సీతా కళ్యాణం” అని సమాధానం ఇచ్చారు.

మహేష్ నటిస్తున్న తాజా చిత్రం గుంటూరు కారం. గత ఏడాది ప్రకటించిన ఈ చిత్రం షూటింగ్ రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. అయితే త్రివిక్రమ్ మళ్ళీ స్క్రిప్ట్ మార్చేశారని తెలుస్తోంది. మళ్ళీ ఫ్రెష్ స్టొరీతో షూటింగ్ మొదలు పెట్టారట. మొదట అనుకున్న మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే ను ఈ మూవీ నుండి తప్పించేశారు. దీనిపై గత కొన్ని రోజుల నుండి నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఈ సినిమా నుండి పూజాహెగ్డే తప్పుకున్నారని ఆ వార్తల సారాంశం.
మహేష్ బాబుతో గతంలో మహర్షి చిత్రంలో పూజాహెగ్డే నటించింది. మరి ఈ సినిమా నుంచి ఎందుకు తప్పుకుంది. దానికి కారణం ఏమిటని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ చిత్రం నుండి పూజా హెగ్డేని తొలగించారని తెలుస్తోంది. పూజాహెగ్డే ప్రవర్తన పై మహేష్ బాబు మరియు గుంటూరు కారం చిత్ర బృందం విసిగిపోయిందని తెలుస్తోంది.
షూటింగ్ కి పూజా అందుబాటులో లేకపోవడం, ఆమె ప్రవర్తన వల్ల గుంటూరు కారం మూవీ యూనిట్ విసిగిపోవడం వల్ల పూజాహెగ్డేను ఈ సినిమా నుండి తొలగించారని తెలుస్తోంది. ఈ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక మెయిన్ హీరోయిన్ గా శ్రీలీలను, సెకండ్ హీరోయిన్ గా మాజీ మిస్ ఇండియా మీనాక్షి చౌదరిని తీసుకున్నట్లుగా టాక్.
‘బాహుబలి’ సినిమాలతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. వరుసగా డీఫెరెంట్ సినిమాల్ని చేస్తున్నాడు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ముడు వైవిధ్యమైన సినిమాలే. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించినా, హిట్ కాలేదని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమా పై వస్తున్న విమర్శలు, వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రిలీజ్ అయ్యి పది రోజులు కావొస్తున్న ఏమాత్రం తగ్గడం లేదు.
సినీ, రాజకీయ ప్రముఖుల నుండి కూడా విమర్శలు వస్తున్నాయి. తాజాగా వీరంద్ర సెహ్వాగ్ కూడా ఈ మూవీ పై కామెంట్ చేశారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీలో నటించిన వారెవరూ బయట కనిపించడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్ తీస్తున్నారనే అనే వార్త బయటికి వచ్చింది. ఒక వైపు ఓంరౌత్ ను నెట్టింట్లో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
మరో వైపు బ్యాన్ చేయాలనే నిరసనలు వినిపిస్తున్నాయి. ఓంరౌత్ కు జరిగేది కనిపిస్తున్నా, హీరో ప్రభాస్ ను ఆదిపురుష్ సీక్వెల్ ప్రతిపాదనతో సంప్రదించాడంట. అయితే ప్రభాస్ సున్నితంగా రిజెక్ట్ చేశాడని తెలుస్తోంది. ఈ విషయం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా పై ఇన్ని విమర్శలు, వివాదాలు వచ్చాయి. ఇక సీక్వెల్ చేస్తే ఎన్ని సమస్యలు ఎదురవుతాయో అని ప్రభాస్ తిరస్కరించి ఉండవచ్చు అని అంటున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ ప్రతిష్టాత్మక రూపొందిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం వరకు చిత్రీకరణ పూర్టి చేసుకుందని సమాచారం. ఈ సినిమా పై ఆడియెన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రంలో నటించేవారి రెమ్యూనరేషన్ హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పాత్రలు పోషిస్తున్న యాక్టర్ల పారితోషికమే రూ. 200 కోట్లు అని తెలుస్తోంది.
1. ప్రభాస్:
2. దీపికా పదుకొణె:
3. అమితాబ్ బచ్చన్:
4. కమల్ హాసన్:
5. దిశా పటానీ:
ఈ చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.
హైదరాబాద్ లోని ప్రముఖ మల్టీప్లెక్స్ లలో ఏఎంబీ సినిమాస్ ఒకటి. ఏఎంబీ మల్టీప్లెక్స్ కు ఆడియెన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మల్టీప్లెక్స్ లో రిలీజ్ అయిన సినిమాలకు బుకింగ్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. మహేష్ ఇమేజ్ ఈ మల్టీప్లెక్స్ కు ప్లస్ గా మారింది. ఏఎంబీ మల్టీప్లెక్స్ లో చాలా ప్రత్యేకతలు ఉండటంతో కొత్త సినిమాల ప్రీమియర్ షోలు కూడా ప్రదర్శిస్తున్నారు. అలాగే చిత్రాలకు సంబంధించిన చిన్నచిన్న వేడుకలను కూడా ఏఎంబీ మల్టీప్లెక్స్ లో నిర్వహిస్తున్నారు.
ఇటీవల అమీర్ పేట్ లో అల్లు అర్జున్ ‘ఎఎఎ’ సినిమాస్ ప్రారంభించారు. అత్యాధునిక హంగులతో ఎఎఎ మల్టిప్లెక్స్ ను నిర్మించారు. కొత్తగా నిర్మించిన ఎఎఎ సినిమాస్ ను ఏఎంబీ సినిమాస్ తో పోలుస్తూ సోషల్ మీడియాలో నెటిజెన్లు తమ అభిప్రాయాలను చెప్తున్నారు. ఎఎఎ మల్టీప్లెక్స్ బాగానే ఉన్నప్పటికీ, ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ఓ మెట్టు పైనే ఉందని ఈ రెండు మల్టీప్లెక్స్ లలో మూవీస్ చూసిన వారు కామెంట్లు చేస్తున్నారు.
ఎఎఎ సినిమాస్ మల్టీప్లెక్స్ లో ఉన్న ఎల్ఈడీ లైట్ల వెలుగు కళ్ళకు ఇబ్బంది కలిగేలా ఉందని అంటున్నారు. ఇందులో ఉన్న చిన్నచిన్న లోపాలను సరిదిద్దితే ఎఎఎ సినిమాస్ కు ఎదురు ఉండదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్ అమీర్ పేట్ లో నిర్మించడం ప్లస్ గా మారింది.

