‘కార్తికేయ-2’ మూవీ పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ అవడంతో నిఖిల్ సిద్దార్థకి పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ ఏర్పడింది. టాలీవుడ్ యంగ్ హీరోలలో నిఖిల్ దూసుకెళ్తున్నాడు. అతడి లైనప్ కూడా మామలుగా లేదు. వరుసగా పాన్ ఇండియా సినిమాలను ఒకదాని తరువాత మరొకటి లైన్ లో పెట్టాడు.
ఆ చిత్రాల నిఖిల్, కాన్వాస్, మార్కెట్ వేరే లెవెల్ లో కనిపించేలా ఉన్నాయి. ఇటీవల రిలీజైన ‘స్పై’ టీజర్ వేరే రేంజ్ సినిమాలా కనిపించింది. ఆ తరువాత వచ్చిన ‘ది ఇండియా హౌస్’ కూడా భారీ సినిమానే. ఇక నిఖిల్ పుట్టినరోజున ప్రకటించిన ‘స్వయంభు’ పోస్టర్ లో నిఖిల్ వీరుడి కనిపించి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశాడు. మరి దాని వెనుక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వరుస పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తున్నాడు. అతని పుట్టిన రోజున కొత్త ఇంకా పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ ‘స్వయంభు’ ప్రకటన. ఈ పోస్టర్ నిఖిల్ యుద్ధ వీరుడిగా కనిపించి అందరిని సర్ప్రైజ్ చేశాడు. ఈ సినిమా ఆడియన్స్ లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మూవీ చారిత్రక సాగే స్టోరీ అని తెలుస్తోంది. భరత్ కృష్ణమాచారి అనే కొత్త డైరెక్టర్ ‘స్వయంభు’ మూవీతో టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
భరత్ కోలీవుడ్ రచయిత, దర్శకుడిగా అతనికి స్వయంభు మొదటి చిత్రం. అతను కోలీవుడ్ లో కొన్ని చిత్రాలకు రచయితగా పని చేశాడు. అయితే భరత్ కృష్ణమాచారి చోళుల బ్యాక్ డ్రాప్లో ఒక ఇంట్రెస్టింగ్ వారియర్ కథను సిద్ధం చేసుకుని ప్రొడ్యూసర్ ఠాగూర్ మధుకు వినిపించాడు. మధు దగ్గర ఆల్రెడీ హీరో నిఖిల్ డేట్లు ఉన్నా, కార్తికేయ-2తో వచ్చిన ఇమేజ్‌కి తో ఈ సినిమా చేయడానికి ఒకే అన్నారట.
అయితే ఈ స్టోరీలో ఎక్కువ తమిళ ఫ్లేవర్ ఉండటం, చోళుల బ్యాక్ డ్రాప్ లో ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రం రిలీజ్ అవడంతో బింబిసార రైటర్ వాసుదేవ్ సహకారంతో ఈ కథ పై వర్క్ చేసిన డైరెక్టర్ చోళుల కనెక్షన్ తొలగించి, ఒక ఫిక్షనల్ కథగా మార్చినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ మొత్తం సిద్ధం అయిన తరువాత ఈ చిత్రాన్ని ప్రకటించారు. ఈ సినిమా ఆగస్టులో షూటింగ్ మొదలవునుంది.
Also Read: “ఆదిపురుష్” మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటును ఖాళీగా వదిలేస్తారా..? ఎందుకో తెలుసా.?




యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం జూన్ 16 న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నేడు (జూన్ 6) ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహిస్తోంది. ఈ వేడుక ఈ రోజు సాయంత్రం జరగనుంది. ఈవెంట్ కోసం గ్రాండ్‌గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి ముఖ్య అతిథిగా వస్తుండడం విశేషం.
ఎక్కడ రామాయాణ పారాయణం జరిగినా, ఎక్కడ శ్రీరామ కథను ప్రదర్శించినా అక్కడ ఒక ఆసనాన్ని వేస్తుంటారు. అలా వేయడానికి కారణం శ్రీరామ కథను వీక్షించేందుకు ఆ స్థలానికి ఆంజనేయుడు వస్తాడని భక్తుల నమ్మకం. ఆ కారణంగానే మూవీ యూనిట్ కూడా ఆంజనేయుడి కోసం ఒక సీటును ప్రత్యేకంగా కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో తెలిపింది.










ఒరిస్సాలో జరిగిన కోరమండల్ రైలు ప్రమాదం దేశం మొత్తాన్ని ఒక్కసారిగా విషాదంలో ముంచేసింది. ఈ ప్రమాదం లో 280కి పైగా మరణించగా, 1000కి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని భారత దేశ రైల్వే హిస్టరీలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా అనుకుంటున్నారు. నలబై సంవత్సరాల క్రితం హార్‌లోని సహస్ర దగ్గర ఒక ప్యాసింజర్ రైలు ప్రమాదంలో 500 మంది మరణించారు.
ఇదే ఇప్పటివరకు అత్యంత ఘోరమైన ప్రమాదం. ఇప్పుడు జరిగిన ప్రమాదంలో 280 మందికి పైగా చనిపోయారు. ఈ ప్రమాదానికి గల కారణాల పై భిన్నామైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా కొందరు ఈ ప్రమాదం ఇటీవల రిలీజ్ అయిన “విడుదల పార్ట్ 1” సినిమాలో జరిగినట్లే ఉంది అని అంటున్నారు. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్ తెరకెక్కించాడు. ఆయన చిత్రాలు ఎక్కువగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతాయి.
ఈ చిత్రం రిలీజ్ అయినపుడు కూడా ఈ మూవీలో కొన్ని సీన్స్, కొందరు వ్యక్తులు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని టాక్ వినిపించింది. విడుదల పార్ట్ 1 సినిమా రైలు ప్రమాద సన్నివేశంతో మొదలవుతుంది. అయితే ఈ సినిమాలో ఇక ట్రైన్ ను బాంబుతో పేల్చే స్తారు. అయితే ప్రమాదం మాత్రం అచ్చం ఒడిశాలో కోరమాండల్ సూపర్ ఫాస్ట్ రైలు ప్రమాదం లాగే ఉండడంతో సేమ్ టు సేమ్, ఆ సినిమాలోని సీన్ రిపీట్ అయిందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.











1997లో ప్రేమించుకుందాం రా సినిమాతో దర్శకుడిగా జయంత్ సి పరాన్జీ, ఆమూవీ హిట్ తో వరుస అవకాశాలు అందుకుని, టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితోనూ సినిమాలను చేశారు. ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రిష హీరోహీరోయిన్లుగా ‘తీన్ మార్’ అనే సినిమాని చేశారు. ఈ చిత్రం 2011 లో రిలీజ్ అయ్యి ప్లాప్ గా నిలిచింది. ఇక ఆ మూవీ తరువాత జయంత్ తెలుగు ఇండస్ట్రీకి దూరం అయ్యారు.
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ జయంత్ ‘తీన్మార్’ ప్లాప్ కావడం పై స్పందించారు. జయంత్ మాట్లాడుతూ ‘ తీన్మార్ సినిమా నాకు ఇప్పటికీ, ప్రెష్ ప్రేమకథగానే అనిపిస్తుంది. ఈ మూవీ ప్లాప్ అవడానికి కారణాలు అయితే చెప్పలేను. కానీ ఈ సినిమా వల్ల కొందరు పవన్ ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
అన్నిటికన్నా ముఖ్యంగా హీరోయిన్ త్రిషకు సోనూసూద్‌తో పెళ్లి కావడం, ఆ తర్వాత త్రిష మళ్ళీ పవన్ కల్యాణ్ వద్దకు రావడం వంటి సన్నివేశాలు ఆడియెన్స్ కి నచ్చలేదు. పవర్ స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ని ఫ్యాన్స్ ఈ సినిమాలో చూడలేక పోయారు. ఇదే సినిమాని ఆ సమయంలోని యంగ్ హీరోతో తెరకెక్కించి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది కావచ్చు” అని అన్నారు.






