యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రతీ పాత్రకు వేరియేషన్ ఉండేలా చూసుకుంటున్నాడు. ‘లవ్‌స్టోరీ’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో హిట్ ట్రాక్‌లోకి వచ్చాడు అనుకునే లోపు థాంక్యూ ద్వారా మరో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.
ఈ నేపథ్యంలో చైతూ ఇపుడు ఔట్ అండ్ ఔట్ మాస్ పోలీస్ పాత్రలో నటించిన మూవీ ‘కస్టడీ’. ఈ మూవీలో చైతూ సాధారణ పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో నటించారు. కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేసిన ఈ మూవీ బై లింగ్వల్‌గా రబీఫాతోంధి. ఈ సినిమా నాగచైతన్య కెరీర్ 22వ మూవీగా వస్తోంది. ఈ సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించారు.

ఈ మూవీ మే 12 న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ చిత్రానికి ఒక కట్ చెప్పకుండా సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేశారు. ఈ సినిమాలో నాగ చైతన్య, అరవింద్ స్వామి మధ్య వచ్చే సన్నివేశాలు ఈ సినిమాలో కీలకం అంటున్నారు. అదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని సెన్సార్ సభ్యులు వ్యాఖ్యానించినట్టు సమాచారం.

అలాగే కస్టడీ ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 22 కోట్ల వరకు చేసినట్లు సమాచారం. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ ఎనిమిదిన్నర కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. నైజాంలో ఏడు కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు చెబుతోన్నారు. థియేట్రికల్ హక్కుల ద్వారా ఏపీ తెలంగాణలో కలిపి ప్రొడ్యూసర్స్‌కు 18 కోట్లు వచ్చినట్లు చెబుతున్నారు. ఓవరాల్‌గా 22 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.

థియేట్రికల్ రిలీజ్ ద్వారా 23 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది. ‘కస్డడీ’ హిట్ అనేది నాగ చైతన్యకు అత్యంత కీలకం అని చెప్పాలి. ఈ సినిమా సక్సెస్‌తో అక్కినేని ఫ్యామిలీ హీరోల ఫ్లాపుల పరంపరకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అక్కినేని హీరోల సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయడం లేదు. చైతూ ‘థాంక్యూ’ నుంచి మొదలు పెడితే.. ఆ తర్వాత నాగార్జున ‘ఘోస్ట్’తో పాటు.. రీసెంట్గా అఖిల్ హీరోగా వచ్చిన ‘ఏజెంట్’ సినిమాలేవి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్‌గా నిలిచాయి.

ఈ నేపథ్యంలో ‘కస్టడీ’ హిట్ అనేది అటు నాగ చైతన్యతో పాటు అక్కినేని హీరోలకు కీలకం గా మారనుంది. ఈ సినిమాలో అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్‌కుమార్ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. ఈ సినిమాతో హీరోగా నాగచైతన్య తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుండగా…డైరెక్టర్ వెంకట్‌ప్రభు టాలీవుడ్లో అడుగుపెడుతోన్నారు.
Also read: “నాగచైతన్య” నటించిన “కస్టడీ” మూవీ సెన్సార్ టాక్..!! మూవీ ఎలా ఉందంటే..??






























నట సార్వభౌమ నందమూరి తారక రామారావు తెలుగు, హిందీ, తమిళం భాషలలో కలిపి సుమారు 400 చిత్రాలలో నటించి గొప్పనటుడుగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఆయన తన కెరిర్ లో నటించిన చాలా చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి, బాక్సాఫీస్ దగ్గర రికార్డులను సృష్టించాయి. ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో ‘పాతాళభైరవి’ మూవీ ఒకటి. ఇప్పటికీ ఈ చిత్రం టీవీలో ప్రసారమైతే చూసేవారు చాలామంది ఉన్నారు.
తాజాగా ఈ చిత్రం గురించి టాలీవుడ్ రైటర్ పరుచూరి గోపాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా జ్ఞాపకం చేసుకున్నారు. ఆయన తన ఛానెల్ పరుచూరి పలుకుల్లో ఈ సినిమా గురించి మాట్లాడుతూ, ఈ మూవీ తరువాత ఎన్టీఆర్ కు ఎంతో మంది ఫ్యాన్స్ గా మారారని చెప్పారు. బి.నాగిరెడ్డి, కేవిరెడ్డి, చక్రపాణి వీరంతా చాలా గొప్పవారని అన్నారు. ఈ సినిమా అప్పట్లో అద్భుతమని అన్నారు. ధైర్యే సాహసే లక్ష్మి అనే పాయింట్ తో దర్శకనిర్మాతలు అప్పట్లో సంచలనం సృష్టించారని చెప్పారు.
ఈ చిత్రానికి ముందు వరకు జానపద చిత్రాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారు గుర్తుకు వచ్చేవారని తెలిపారు. అయితే పాతాళ భైరవి సినిమా విడుదలైన తరువాత జానపదం అంటే ఎన్టీఆర్ అనేంతగా ఆయన ప్రభావం చూపారని వెల్లడించారు. జానపదం, సాంఘికం,చారిత్రకం, పౌరాణికం లాంటి చిత్రాలలో ఎన్టీరామరావుగారు జీవించేవారని చెప్పారు. ఇక పాతాళభైరవి చిత్రాన్ని ఎన్నిసార్లు చూసినప్పటికి, మళ్ళీ చూడాలనిపించేలా ఏదో కొత్తదనం ఈ సినిమాలో కనిపిస్తుందని తెలిపారు.
ఆ మూవీలోని డైలాగ్స్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని, ఆడియెన్స్ ని ఆకట్టుకుంటాయని అన్నారు. యస్.వి. రంగారావుని మాంత్రికుడిగా చూస్తే భయమేసేదని అన్నారు. రీరిలీజ్ చేసినా వంద రోజులు ఆడే చిత్రాల లిస్ట్ లో ఈ చిత్రం ముందు ఉంటుందన్నారు. ఈ చిత్రం ఓటీటీల్లో ఉన్నట్లయితే చూడమని అందరిని పరుచూరి కోరారు.






బాలీవుడ్ లో తానాజీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు ఓంరౌత్ ఆదిపురూష్ సినిమాని రూపొందించాడు. దాంతో ఈ చిత్రం పై అంచనాలు ఏర్పడ్డాయి. అది మాత్రమే కాకుండా ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఆడియెన్స్, అభిమానులు ఈ చిత్రం ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే ఆ మధ్యన రిలీజ్ అయిన మూవీ టీజర్ ఫ్యాన్స్ ను, ఆడియెన్స్ ను నిరాశ పరిచింది. కారణం క్యారెక్టర్స్ లుక్స్, గ్రాఫిక్స్.
మరి ముఖ్యంగా రావణుడు, హానుమాన్ రూపాలను చూడగానే ఆంగ్ల చిత్రాలను చూసినట్టుగా ఉందని విమర్శలు వచ్చాయి. రాముడు, సీత, పాత్రలను అవమానించారంటూ మూవీ యూనిట్ పై విమర్శలు చేశారు. దీంతో మూవీ యూనిట్ సంక్రాంతికి విడుదల అవ్వాల్సిన సినిమాని జూన్ 16కు వాయిదా వేసింది. గ్రాఫిక్స్ విషయంలో దిద్దుబాటు చర్యలు చేపట్టింది. తాజాగా విడుదలైన ట్రైలర్ లో ఆ మార్పు అర్ధం అవుతోంది. ట్రైలర్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ప్రభాస్ ఫ్యాన్స్ సినిమా విజయం సాధించాలని ఆశిస్తున్నారు.
ఇది ఇలా ఉండగా తాజాగా ఒక వార్త సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ కన్నా ముందుగా డైరెక్టర్ ఓంరౌత్ బాలీవుడ్ స్టార్ హీరోను రాముడిగా అనుకున్నారంట. దర్శకుడు ఓం రౌత్ ముందుగా హృతిక్ రోషన్ కథ చెప్పారట, దానికి హృతిక్ ఆలోచించుకోవడానికి సమయం కావాలని చెప్పాడట. చివరకు ప్రభాస్ కు కథ చెప్పడం ఆయన ఒప్పుకోవడం జరిగింది.

