ఏ రంగంలోనైనా సెంటిమెంట్లకు ప్రాధాన్యత ఉంటుందో ఉండదో చెప్పలేం కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రం సెంటిమెంట్లకు ఉండే ప్రాధాన్యత అంతా అంతా కాదు.చాలా మంది డైరెక్టర్లు ఒక సినిమా హిట్ అయిందంటే ఆ సినిమాకు ఫాలో అయిన వాటినే ఇతర సినిమాల్లో కూడా అనుసరించటానికి మొగ్గు చూపుతుంటారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లు కూడా ఇందుకు అతీతం కాదు. టాలీవుడ్ లో ఇప్పుడున్న కొంతమంది దర్శకులు తమ సినిమాలలో కచ్చితంగా ఒక సెంటిమెంటును ఫాలో అవుతున్నారు. కొన్నిసార్లు అవి కో ఇన్సిడెంట్స్ కూడా కావచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
#1 త్రివిక్రమ్
త్రివిక్రమ్ మూవీస్ టైటిల్స్ అన్నీ ఎక్కువగా ‘అ’ తోనే స్టార్ట్ అవుతున్నాయి. తన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన ‘అతడు’ మూవీ నుంచి రీసెంట్ గా వచ్చిన ‘అల వైకుంఠపురం’ వరకు ఈ సెంటిమెంట్ ఫాలో అయ్యారు త్రివిక్రమ్.

#2 రాఘవేంద్ర రావు
ఒక మూవీ చిత్రీకరణ పూర్తి అయ్యాక తిరుపతి కి వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు దర్శకేంద్రుడు. అలాగే ఒక మూవీ పూర్తి అయ్యేవరకు గడ్డం తియ్యరు.

#3 కే విశ్వనాధ్
కళాతపస్వి విశ్వనాధ్ తన సినిమాలన్నిటికీ ఎక్కువగా ‘ఎస్’ అక్షరం తోనే పేరు పెడతారు. అంతే కాకుండా షూటింగ్ ఉన్నంత కాలం కాకి దుస్తులే ధరిస్తారు విశ్వనాధ్. అలాగే ఆయన సినిమాల్లో ఒక్క షాట్ అయినా గోదావరి తీరం లో తీస్తారు.

#4 వంశి
విలక్షణ దర్శకుడు వంశి ఎక్కువగా తన చిత్రాలను విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కిస్తారు. అలాగే ఆయన సినిమాల్లో హీరోయిన్లకు పెద్ద బొట్టుని పెడతారు.

#5 కృష్ణవంశీ
కృష్ణవంశీ చిత్రాల్లో ఎక్కువగా పెద్ద ఉమ్మడి కుటుంబాలే ఉంటాయి.

#6 వి వి వినాయక్
వినాయక్ సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్లకు నందిని అనే పేరు ఉంటుంది.

#7 పూరి జగన్నాథ్
తన సినిమాలకు సంబంధించిన స్టోరీ లు, స్క్రిప్ట్ లు రాయడానికి బ్యాంకాక్ వెళ్తాడు పూరి.

#8 కరుణాకరన్
ఈయన సినిమాల్లో హీరోయిన్ ఎంట్రీ షాట్ లో వైట్ డ్రెస్ వేసుకుంటుంది.

#9 విక్రమ్ కే కుమార్
ఈయన సినిమాలన్నిటిలో హీరోయిన్ పేరు ప్రియా నే..

#10 అనిల్ రావిపూడి
తన ముందు సినిమాలో హీరోయిన్ కి తదుపరి చిత్రం లో ఏదొక రోల్, లేకపోతే స్పెషల్ సాంగ్ అయినా చేయిస్తారు.

#11 కోడి రామకృష్ణ
దర్శకులు కోడి రామకృష్ణ గారు కూడా షూటింగ్ సమయంలో తలకి ఒక క్లాత్ కట్టుకొని కనిపించేవారు. సాధారణంగా కూడా ఆయన చాలాసార్లు అలా తలకి ఒక హెడ్ బాండ్ కట్టుకొని కనిపించారు.

#12 లోకేష్ కనగరాజ్
ఈ టాలెంటెడ్ డైరెక్టర్ మూవీస్ లో ప్రధాన పాత్రల్లో ఒక జంట ఉంటే వారిలో ఒకరు ఖచ్చితంగా చనిపోతారు.

















సూర్య నటిస్తున్న ‘కంగువ’ మూవీ పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పీరియాడిక్ డ్రామాకా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దాదాపు 10 భాషల్లో 2డీ, 3డీ ఫార్మాట్స్ లో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ భామ దిశా పఠానీ నటిస్తోంది.
కంగువ షూటింగ్ విరామం రావడంతో సూర్య ప్రస్తుతం కొడైకెనాల్లో తన కుటుంబంతో కలిసి హాలిడేస్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమకు ఆత్మీయస్వాగతం పలికిన సూర్య, జ్యోతిక దంపతులకు ధన్యవాదాలు తెలుపుతూ స్టంట్ కొరియోగ్రాఫర్ సుప్రీమ్ సుందర్ వారితో కలిసి తీసుకున్న ఫోటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
ఈ ఫోటో సూర్య లుక్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. గతంలో గజిని చిత్రం సమయంలో డిఫరెంట్ లుక్‌లో కనిపించిన సూర్య. మిగతా చిత్రాలలో రెగ్యులర్ లుక్‌లో నటించారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత సూర్య కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే కంగువ మూవీ కోసం కోలీవుడ్ స్టార్ సూర్య బరువు పెరిగినట్లుగా తెలుస్తోంది. పీరియాడిక్ పోర్షన్ చిత్రీకరణ కొడైకెనాల్లో జరుగుతోంది. ఆగస్టు 2023నాటికి షూటింగ్ ను పూర్తిచేయాలని యూనిట్ ప్లాన్ చేసిందని తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం హీరో సూర్య కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుటున్న మూవీ. ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సహ నిర్మాత జ్ఞానవేల్ రాజా. దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఏడాదిలోనే ఈ చిత్రం రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి.


రీసెంట్ గా ‘బిహైండ్ వుడ్స్’ అవార్డ్స్ వేడుక జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో సినీ సెలబ్రిటీలు హాజరు అయ్యారు. ఇక ఈ వేడుకకు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారు. ఈ అవార్డ్స్ ప్రధానంలో భాగంగా ‘గోల్డెన్ ఐకాన్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అవార్డ్ కు అల్లు అర్జున్ ఎంపిక కాగా, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఈ అవార్డ్ ను బన్నీకి అందచేశారు. అవార్డ్ తీసుకున్న తరువాత అల్లు అర్జున్ మాట్లాడుతుండగా వేదిక పైకి తన చిన్ననాటి స్కూల్ టీచర్ రావడంతో అల్లు అర్జున్ ఆశ్చర్యపోయారు. అలాగే టీచర్ కి పాదాలకి నమస్కరించారు.
బన్నీ తన టీచర్ గురించి మాట్లాడుతూ “ఆమె పేరు అంబికా కృష్ణన్, 3వ తరగతిలో క్లాస్ టీచర్ అని, ఆమె తనకు చాలా విషయాలను నేర్పించారని తెలిపారు. మా తరగతిలో నేనే లాస్ట్ ర్యాంకర్ ను, అయినప్పటికీ తన టీచర్ ఎప్పుడు తనని ఏమి అనలేదని, లైఫ్ అంటే చదువు ఒక్కటే కాదని, జీవితం ప్రతి ఒక్కరికీ వరమని, దాన్ని అర్థం చేసుకుంటే తప్పకుండా నువ్వు గొప్ప స్థానానికి వెళ్తావని చెప్పేవారని” అన్నారు. తన టీచర్ ను ఇలా ఇక్కడ కలవడం చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు.
తనకు చిన్నతనం నుండి స్ఫూర్తి నింపే విధంగా చిన్న చిన్న కోట్స్ రాసే అలవాటు ఉంది. తాను రాసిన కోట్స్ లో ‘only kindness is remembered forever’ కోట్ రాయడానికి స్ఫూర్తి నా టీచరే అని వెల్లడించారు. అల్లు అర్జున్ తన టీచర్ గురించి మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారింది.
పవన్ కల్యాణ్ పేరు వింటేనే ఆయన ఫ్యాన్స్ ఊగిపోతుంటారు. తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ కు ఉన్న క్రేజ్ అందరికి తెలిసిందే. ఇక దర్శకుడు హరీష్ శంకర్ కూడా పవన్ కల్యాణ్ కు వీరాభిమాని. ఒక ఫ్యాన్ తమ అభిమాన హీరోతో మూవీ తీస్తే ఎలా ఉంటుందో ‘గబ్బర్ సింగ్’ తో హరీష్ శంకర్ నిరూపించాడు. ఇప్పుడు అదే విషయాన్ని ఇంకా గట్టిగా చెప్పేందుకు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తో రానున్నాడు.
సరిగ్గా 11 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రం తెరకెక్కుతుంది. గబ్బర్ సింగ్ మూవీ విడుదల అయ్యి నిన్నటికి (మే 11 ) పదకొండు ఏళ్లు పూర్తి అవుతున్న సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ గ్లింప్స్ మూవీ యూనిట్ విడుదల చేసింది. హరీష్ శంకర్ తన అభిమాన హీరోని వెండితెర పై ఆవిష్కరించిన విధానానికి ఈ గ్లింప్స్ స్మాల్ టచ్ అని, మూవీ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తుంది.
ఈ గ్లింప్స్ మాస్ పోలీస్ ఆఫీసర్‌గా పవన్ కనిపిస్తున్నారు. “ఈసారి పెర్ఫార్మన్స్ బద్దలైపోతుంది” అని పవర్ స్టార్ చెప్పే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దాంతో సోషల్ మీడియా వేదికగా అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ఇటు టాలీవుడ్ సెలెబ్రెటీలు హరీష్ శంకర్ కు అభినందనలు తెలుపుతున్నారు.
అయితే రవితేజ పేరు ఉన్న ట్విట్టర్ ఖాతా నుండి ఒక యూజర్ “హరీష్ ఈసారి గబ్బర్ సింగ్ కంటే పెద్దగా ప్లాన్ చేస్తున్నావు. గుడ్ లక్” అని పోస్ట్ పెట్టారు. ఆ ఖాతాకి బ్లూ టిక్ ఉండడంతో హీరో మాస్ మహారాజ రవితేజ పోస్ట్ అనుకున్న హరీష్ శంకర్ ఎమోషనల్ గా, “అన్నయ్యా ఈ మొక్క నువ్వు నాటిన మొక్క.. ఎన్నిసార్లయినా చెప్తా ఇదే ముక్క” అని రిప్లై ఇచ్చారు. అయితే అది హీరో రవితేజ అకౌంట్ కాకపోవడంతో ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూసుకోవాలి కదా అన్నా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.