అల్లరి నరేశ్ కామెడీ సినిమాలు చేసి ఎంత పాపులర్ అయ్యాడో, అవే రొటీన్ కామెడీ కంటెంట్‌తో అంతే ఫెయిల్యూర్‌ను చూశాడు. ఇక కామెడీ సినిమాలను పక్కనబెట్టి సీరియస్ పాత్రలు చేస్తూ తన కెరీర్ ను ముందుకు తీసుకెళ్తున్న ఈ యంగ్ హీరో.. నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాల్లో నటించి మంచి విజయాలను అందుకున్నాడు.
ఇప్పుడు ఇదే కోవలో మరో సీరియస్ కంటెంట్ మూవీతో మన ముందుకు రాబోతున్నాడు ఈ హీరో. ‘ఉగ్రం’ అనే పవర్ఫుల్ కాప్ డ్రామా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైన అల్లరి నరేశ్, ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్.. ‘ఉగ్రం’ సినిమాపై మంచి అంచనాలను క్రియేట్ చేశాయి.

నాంది’ సినిమాను తెరకెక్కించిన విజయ్ కనకమేడల ఉగ్రం మూవీని కూడా తెరకెక్కిస్తుండటంతో మరోసారి ఈ కాంబినేషన్ హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకులు కూడా ఆశిస్తున్నారు. ఈ మూవీ మే 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటం తో ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది టీం.

తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు యూ/ఏ సర్టిఫికెట్‌ను జారీ చేసారు. సీరియస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా రన్‌టైమ్ 2 గంటల 2 నిమిషాలకు ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. మరో వైపు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ మూవీ లో అల్లరి నరేష్ ఇంటెన్స్ నటన తో అబ్బుర పరిచాడని తెలుస్తోంది.
అలాగే తన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడని కూడా ప్రశంసలు వస్తున్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానేర్ పై హరీష్ పెడ్డి, సాహు గారపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అందాల భామ మిర్నా హీరోయిన్గా నటిస్తోండగా శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందిస్తున్నాడు.
Also read: అల్లరి నరేష్ “ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం” సినిమా… ఆ “ఫేమస్” సినిమాని చూసి రీమేక్ చేశారా..?




















నాగచైతన్య ప్రస్తుతం ‘కస్టడీ’ మూవీ ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. సీనియర్ నటుడు అరవింద్ స్వామి ఈ మూవీలో విలన్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. యాక్షన్ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కిన ఈ మూవీలో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం మే 12 రిలీజ్ కానుంది. ఈ క్రమంలో మూవీ ప్రమోషన్స్ ను కోలీవుడ్ లోనూ జోరుగా చేస్తున్నారు. తమిళ యూట్యూబర్ ఇర్ఫాన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగచైతన్య కెరీర్ మరియు వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు.
ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఆడిన ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో రిలేషన్ షిప్ లో ఎప్పుడైనా తిరస్కరించబడ్డారా? అని నాగచైతన్య యాంకర్ ఇర్ఫాన్ ను అడిగారు. అతను దానికి సమాధానం చెప్తూ రెండున్నర సంవత్సరాల క్రితం ప్రేమించిన అమ్మాయి రిజెక్ట్ చేసిందని అన్నారు. అయితే మనం మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుదామని చెప్పిందని వెల్లడించాడు. అది వినగానే నాగచైతన్య ఒక్కసారి తిరస్కరించిన వారితో మళ్ళీ ఫ్రెండ్ షిప్ అంటేనే తనకు చిరాగ్గా అనిపిస్తుందని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
అలాగే ఇంటర్వ్యూలో యాంకర్ జీవితంలో ఏమైనా రిగ్రెట్స్ ఉన్నాయా అన్న ప్రశ్నకి, తనకు ఎటువంటి రిగ్రెట్స్ లేవని చైతన్య తెలిపారు. జీవితంలో ఎదురైన ప్రతి సంఘటనను పాఠంగా భావిస్తానని తెలిపాడు. దీనిపై కొంచెం వివరంగా చెబుతారా అంటే తన కెరీర్ లో నటించిన రెండు మూడు చిత్రాల విషయంలో తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేకపోయానని వెల్లడించాడు.









సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఏజెంట్ మూవీ రీసెంట్ గా విడుదల అయ్యింది. ఈ చిత్రంలో మమ్ముట్టి ముఖ్యమైన పాత్ర పోషించగా, హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఈ చిత్రం కోసం అఖిల్ తన లుక్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ డే నుండే నెగెటివ్ టాక్ తెచ్చుకుని, డిజాస్టర్ గా నిలిచింది. ఈ చిత్ర దర్శక నిర్మాతల పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఈ ఒక వార్త వైరల్ అయ్యింది. ఈ చిత్రానికి మొదటి ఛాయిస్ అఖిల్ కాదని, టాలీవుడ్ స్టార్ హీరో అని వినిపిస్తోంది.
ఈ చిత్ర డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ మూవీ స్టోరీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు వినిపించాడంట. కథ నచ్చినా, చరణ్ కి ఇతర చిత్రాల కమిట్మెంట్స్ వల్ల ఈ చిత్రాన్ని సున్నితంగా రిజెక్ట్ చేశాడంట. ఇక ఈ విషయాన్ని ఆ మధ్య రామ్ చరణ్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. చరణ్ రిజెక్ట్ చేయడంతో సురేందర్ రెడ్డి అఖిల్ కి చెప్పడం, అతనికి కథ నచ్చడంతో ఈ చిత్రం తెరకెక్కింది. కానీ ఈ మూవీ మొదటి షోకే ఫ్లాప్ టాక్ వచ్చింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో డినో మోరియా విలన్ గా నటించాడు. ఇక ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందించారు.





























